విజయవాడ, ఏప్రిల్ 18 కుల, వర్గ రహిత సమాజం కోసం ఆయుధంతోపాటు కలంతోనూ విప్లవ పోరాటాన్ని సాగించిన పీపుల్స్ వార్ ఉద్యమ నేత కె.జి.సత్యమూర్తికి సహచరులు, శిష్యులు, ఉద్యమకారులు కన్నీటి వీడ్కోలు పలికారు. కృష్ణా జిల్లా జి.కొండూరు మండలం కందులపాడులో మంగళవారం తుది శ్వాస విడిచిన సత్యమూర్తికి విజయవాడలోని స్వర్గపురిలో బుధవారం అంత్యక్రియలు ఘనంగా జరిగాయి. ఎలక్ట్రికల్ క్రిమిటోరియం పని చేయకపోవటంతో సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలను నిర్వహించారు.
ఆయన పెద్ద కుమారుడు సిద్ధార్థ తన తండ్రి చితికి నిప్పంటించారు. తెలుగు సాహిత్యంలో తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్న సత్యమూర్తి భౌతికకాయాన్ని ఉద్యమకారులు, కవులు, కళాకారులు, సహచరుల సందర్శనార్థం విజయవాడలోని స్వాతంత్య్ర సమరయోధుల భవనంలో ఉంచారు.
విప్లవ రచయితల సంఘం అగ్రనేత కల్యాణరావు, ప్రజా గాయకుడు గోరటి వెంకన్న, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్, దళిత ఉద్యమ నేత బొజ్జా తారకం, సత్యమూర్తి సహచరులు వై.కోటేశ్వరరావు, చిరంజీవి, శిష్యుడు మందా కృష్ణ మాదిగ, సమతా పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు వి.వి.కృష్ణారావు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు దేవినేని ఉమామహేశ్వరరావు, తంగిరాల ప్రభాకర్, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ తదితరులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. కె.జి. సత్యమార్తి అభిమానులు, శిష్యులు, విప్లవ సానుభూతిపరులు, కుటుంబ సభ్యులు విశేష సంఖ్యలో స్వాతంత్య్ర సమరయోధుల భవనానికి తరలివచ్చి అక్కడినుంచి తమ అభిమాన విప్లవ నేత భౌతికకాయానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.
మధ్యాహ్నం 12 గంటల నుంచి మూడు గంటల వరకు సంతాప సభ నిర్వహించారు. అణగారిన దళిత వర్గాలను ఐక్యం చేసేందుకు అవిరళంగా శ్రమించిన సత్యమూర్తి ఆశయాల సాధన కోసం అందరూ కలిసి ముందుకు సాగాలని సంతాప సభలో పలువురు పిలుపునిచ్చారు. అణగారిన వర్గాలకు రాజ్యాధికారం దక్కాలంటే అంబేద్కర్, మార్క్స్ సూచించిన బాటలో పయనించాలని అన్నారు. అటు అంబేద్కర్‌ను, ఇటు మార్క్స్‌ను అధ్యయనం చేసిన ఏకైక నాయకుడు సత్యమూర్తి అని పలువురు పేర్కొన్నారు. అలాంటి మహా ఉద్యమ నేత మృతి తీరని లోటన్నారు.
విప్లవ గీతాలతో సాగిన అంతిమయాత్ర ఉద్యమాలలో భాగంగా సత్యమూర్తితో పరిచయం ఉన్న అనేకమంది ఉద్యమకారులు, కళాకారులు, కవులు, రచయితలు, ప్రజా గాయకులు, అభిమానులు అనేకమంది ఆయన అంతిమయాత్రకు తరలివచ్చారు. సత్యమూర్తి భౌతికకాయానికి ఎర్రజెండా కప్పి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోధుల భవనం నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర కృష్ణలంక జాతీయ రహదారి, పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్ మీదుగా స్వర్గపురికి చేరింది.
విద్యార్థి దశ నుంచే విప్లవాల బాట పట్టిన ఆయన అంతిమయాత్ర విప్లవ గీతాలతోనే కొనసాగింది. అస్తమించని నల్ల సూర్యుడు సత్యమూర్తి, నెల బాలుడు శివసాగర్ అమర్ రహే అంటూ వేలాది మంది అభిమానులు ఆయనకు అంతమ వీడ్కోలు పలికారు. అంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీనివాస్, ఆంధ్రజ్యోతి ఫీచర్స్ ఎడిటర్ వసంతలక్ష్మీ, కె.సుధ, మంద కృష్ణ మాదిగ విరసం అగ్రనేత కల్యాణరావు, సత్యమూర్తి సహచరుడు వై.కోటేశ్వరరావు తదితరులు అంతిమయాత్రలో అగ్రభాగాన నిలిచారు.
http://andhrajyothy.com/mainnewsshow1.asp?qry=2012/apr/18/latest/18new68

No comments:
Post a Comment