శివసాగర్ భావుకుడైన ఉద్యమ కవి, గెరిల్లా యోధుడు. విప్లవ పార్టీల్లో, దళిత బహుజన పార్టీల్లో గొప్ప వ్యూహకర్త. నడిచిన, నడుస్తున్న చరివూతకు నిలు పత్రిబింబం. గిడసబారిన సంప్రదాయవాదుల కళ్లపైకి లేచిన ఒక ఇసుక తుపా ను. అతని కవిత్వాక్షరాలు అగ్నిని కురిపిస్తాయి, ఎగజిమ్ముతాయి.
‘పట్టపగలు నడివీధిలో బేఫికర్‌గా
హత్యచేయవలసిన కుష్ఠుసంఘంతో
నడిరాత్రి కక్కుర్తి రతి జరిపే వీళ్లు
ఆయుధాలు పట్టలేరు, బారికేడ్లు కట్టలేరు
గ్రెనేడ్లు విసరలేరు, గీతంలో జ్వలించలేరు’
1970లో శివసాగర్ రాసిన విప్లవ కవిత్వమిది. ఏ మాత్రం రాజీపడని యోధుడే ఇలాంటి కవిత్వం రాయగలడు. శివసాగర్ లాంటి విప్లవకవి ఏ తాత్విక నేపథ్యంలోంచి పుట్టుకురాగలడు ఆయనను తీవ్రంగా ప్రభావితం చేసిన నాటి పరిస్థితులేవి నవ యవ్వనంలో శివసాగర్‌ను కదిపి కుదిపిన ఆ మహాశక్తులేవి
శ్రీకాకుళ కుగ్రామాల్లో వెంపటావు సత్యం వెలిగించిన చైతన్యదీప్తుల భావోత్తేజం, చారుమజుందార్‌తో గుత్తికొండ బిలంలో జరిగిన రహస్య సమావేశం శివసాగర్ అనబడే విప్లవ కాగడాగా వెలిగింది. ఆ వెలుగుల్లోంచే శివసాగర్ ప్రజాకవిత్వం రాశాడు. విప్లవ కవిత్వంలో ని మొనాటనిని చావుదెబ్బతీసి, ప్రజల హృదయాలకు చేరువయ్యే దేశీ కవిత్వం రాశా డు. 1970-5ల మధ్య ఆంధ్రవూపదేశ్‌లో ని నక్సల్బరీ పోరాట చరివూతను సూక్ష్మదృష్టితో రికార్డ్ చేసిన ఘనత శివసాగర్ పాటలకే దక్కుతుంది.
‘గార్ల రైలు దాడిలోన-గుంజుకున్న బల్ రైఫిల్ నీకిస్త తమ్ము డా! నీకిస్తా తమ్ముడా’
పాటలోని పాదాల గూర్చి చెబుతూ... ‘ఖమ్మం, హైదరాబా ద్ మధ్య గల ‘గార్ల’ రైల్వేస్టేషన్ వద్ద పీపుల్స్‌వార్ దాడి చేసి ఆయుధాలు ఎత్తుకెళ్లింది. సికింవూదాబాద్ కుట్ర కేసులో కె.జి. సత్యమూర్తి, కొండపల్లి సీతారామయ్య కలిసి ‘గార్ల’వద్ద జరిగిన దాడిలో పాల్గొన్న దళానికి నాయకత్వం వహించారని రుజువు చేయడానికి ఈ పాటను కుట్రకేసులో డాక్యుమెంటరీ ఎవిడెన్స్‌గా ప్రాసిక్యూషన్ కోర్టులో దాఖలు చేసిందని, శివసాగర్ ‘ఈనాటి ఏకలవ్వ’ పత్రికా ఆఫీసులో తన్మయంగా నాతో చెప్పారు. ఈ విషయాలన్నీ ‘శివసాగర్ కవి త్వం (1968-2008)’ పుస్తకంలో వాస్తవికంగా రికార్డ్ చేశా రు.
శివసాగర్ కవిత్వం, ఆయన రాసిన మహోన్నతమైన పాటల నేపథ్యం తెలుసుకోవాలంటే, ఆయనతో సాన్నిహిత్యం ఉండాల్సిందే. 1990ల తర్వాత వచ్చిన దళిత సాహిత్యోద్య మం శివసాగర్‌తో మాకు సాన్నిహిత్యాన్ని పెంచింది.
1990ల తర్వాత దళిత సాహిత్యోద్యమ తొలి రోజుల్లో మా తరానికి శివసాగర్ ఎవర్‌క్షిగీన్ హీరో. 1995లో వెలువడిన ‘చిక్కనవుతున్న పాట’ దళిత కవిత్వ సంకలనంలో నా కవిత కు పేరు రావడంతో శివసాగర్‌తో నాకు పరిచయం పెరిగింది. రాంనగర్‌లోని ఒక ఇంట్లో ‘ఈనాటి ఏకలవ్య’ పత్రిక నడుపుతూ, బహుజన పార్టీలో పనిచేస్తూ, దళిత ఉద్యమానికి బాసటగా నిలబడ్డారు శివసాగర్. అంబటి సురేంవూదరాజు, గోరటి వెంకన్న, జె. గౌతమ్, లెల్లే సురేష్, గుడిపాటి, కె. శ్రీనివాస్, సుంకిడ్డి నారాయణడ్డి, ఒమ్మి రమేష్‌బాబు, పైడి తైరేష్‌బాబు, మద్దూరి, మద్దెల శాంతయ్య, సిద్ధార్థ, నేను-ఇంకా చాలామంది మిత్రులం పాటలతో, కవిత్వంతో ఎన్నో రాత్రులను శివసాగర్ ఇంట్లో వెలిగించాం. మాసాహిత్య ప్రస్థానం లో ఆ ఆనవాళ్లు కనిపిస్తాయి.
విప్లవ పార్టీలో కె.జి. సత్యమూర్తిగా, నక్సల్బరీ అజ్ఞాత జీవితంలోంచి ఎదిగొచ్చిన విప్లవకవి శివసాగర్‌గా- రెండు రూపాల్లోనూ ఆయనవ్యక్తిత్వం మహోన్నతంగా వికసించింది. ఆయ న కవిత్వం,పాట తెలంగాణనేలలో అల్లుకుపోయింది. ఉత్తరాంధ్ర అటవీప్రాంతాలలో తుడుమై మోగింది.
‘బపూక చెట్టు కింద నరుడో భాస్కరుడా!బందూకు పడితివయ్య నరుడో భాస్కరుడా!’ అని చాగంటి భాస్కర్‌ను ఉద్దేశించి ఆయన రాసిన పాట నాటి విప్లవోద్యమాన్ని గంగ శ్రీశ్రీ, రావిశాస్త్రి, చలసాని ప్రసాద్, వరవరరావు, ఎన్.కె. మొదలైన విప్లవ సాహితీమూర్తులంతా ఆ పాట పాడుకుంటూ విప్లవ సాంస్కృతిక ఉద్యమంలో కార్యాచరణకు దిగారు. తెలుగునాట విప్లవోద్యమ సాహిత్యాన్ని వికసింప జేశారు. వియత్నాం పోరాటకవి హోచిమన్‌తో పోల్చదగిన ఉద్యమకవి శివసాగర్. ఒకచేత పెన్ను, మరోచేత గన్ పట్టిన యోధుడు.
‘నేను నిప్పును, నీరును
రణరంగంలో పోరాడే లక్షలాది సైనికుల్లో
నేనొక సైనికుణ్ణి!
సైనికుణ్ణి నేనే! ర్రణ ర్రంగాన్నీ నేనే!’
అంటూ, తత్వవేత్త హెగల్‌ను తలచుకుంటూ, వేడినెత్తుటి ధారలు ప్రవహింపజేసే కవిత్వం రాయడం శివసాగర్‌కే సాధ్యం.
విప్లవోద్యమం లోంచి, విరసంలోంచి బయటికొచ్చాక శివసాగర్, విప్లవ సాహితీ సంస్థలపై విరుచుకుపడ్డాడు. 1996 జనవరిలో జరిగిన విరసం ఇరవై ఐదేళ్ల మహాసభలకు ముందు-‘విరసం మరణించిం ది, దానికి పోస్ట్‌మార్టమ్ నిర్వహించాలి’ అని సంచలనాత్మక స్టేట్‌మెంట్‌నిచ్చాడు. దాన్ని విరసం జీర్ణించుకోలేకపోయింది.
విరసం వ్యవస్థాప సభ్యుడు కె.వి. రమణాడ్డి ‘శివసాగర్ అన్నట్టుగా విరసం మరణించలేదని విప్లవకారుడిగా శివసాగరే మరణించాడని’ (1996 జనవరి 13, విరసం సభలకు పంపిన సందేశం) అన్నారు. కాని నాటి, నేటి చరివూతను పరిశీలిస్తే, విప్లవకారుడిగా, విప్లవకవిగా, దళిత ఉద్యమ నాయకుడిగా, దళిత కవిగా శివసాగర్ ప్రజల మనస్సులో ఎప్పు డూ సజీవంగా ఉన్నాడు.
విప్లవ, దళిత కవిత్వాలకు శివసాగర్ నిలు మొగురం. ఆ సాహిత్య మొగురం నేడు భౌతికంగా కూలిపోయినా, ఆయనిచ్చిన స్ఫూర్తి గుండెల్లో ఎర్రజెండాలా, ఆ తర్వాత నీలిజెండాలా రెపపలాడుతూనే ఉంటుంది.
‘చెప్పులు పారేసుకొని
నెత్తుటి మడుగు దాటుతోన్న కాలానికి
కత్తి, ఆరె తీసుకుని
కన్నీళ్ళతో చెప్పులు కుట్టిన’
దళిత తాత్విక మహాకవి శివసాగర్. శ్రీశ్రీలను, దిగంబరులను, వచనకవులను దాటి ఎదిగిన తాత్విక అవగాహన శివసాగర్‌ది. అట్టడుగు కులం నుంచి, అంతర్జాతీయ విప్లవోద్య మ అవగాహనాశీలిగా ఎదగడం శివసాగర్ ప్రత్యేకత. చివరిదాకా ఆలోచనలలో, ఆచరణలో ప్రజలవైపు నిలబడ్డాడు. శివసాగర్. అందుకే అన్ని శిబిరాల్లోని కవులకు శివసాగర్ అంటే అభిమానం.
పాట రాసినా, కవిత్వం రాసినా శివసాగర్ శైలి ప్రత్యేకమైం ది. ఆయన ముద్ర పడిన కవిత్వం ప్రజల గుండెల్లోకి సూటిగా దిగాల్సిందే!
‘నడిరేతిరి పత్తికాయ
పగిలిన ధ్వని వినిపించినావు
కొండలలో చెలరేగిన
సుడిగాలిని చూపినావు’
అమ్మా నన్ను కన్నందుకు విప్లవాభివందనాలు
అనే శక్తివంతమైన కవిత్వం శివసాగర్ తప్ప ఎవరు రాయగలరు
దళిత ఉద్యమపు తొలి రోజుల్లో ‘నడుస్తున్న చరిత్ర’ కవితలో మనువాదం మీద, అగ్రకులాల దొంగ విలువల మీద విరుచుకు పడ్డాడు శివసాగర్.
‘శంభూకుడు పెదాల మీద చిరునవ్వుతో
రాముణ్ణి వధిస్తున్నాడు
ఏకలవ్యుడు ద్రోణుని బొటన వేలును
గొడ్డలితో నరుకుతున్నాడు’
అంటూ, తిరగబడ్డ చరిత్ర రూపాన్ని చిత్రిక పట్టాడు శివసాగర్.
ఎంత వయసొచ్చినా పసి మనస్తత్వం శివసాగర్‌ది. మనిషిని అమాంతం ఆలింగనం చేసుకొని తప్ప మాట్లాడేవాడు కాదు. ఉద్యమం నెలబాలుడైన శివసాగర్ మా తరానికి ఒక గొప్ప లెజెండ్.
శివసాగర్ మరణించాడన్న వార్త జీర్ణం చేసుకోలేనిది. ఆయన కవిత్వానికి, భావాలకు మరణం లేదు. విప్లవ, దళిత ఉద్యమాల నిలు నిలువుటద్దం పలిగిపోయింది. తెలంగా ణ ఉద్యమం నమ్మదగ్గ ఒక పోరాట యోధుని, కోల్పోయిం ది. శివసాగర్ ఆలపించిన గీతం రమణీయంగా ఎందరో పోరాటవాదుల గుండెల్లో మార్మోగుతూనే ఉంటుంది. ఆయన పాట అమరత్వం పొందింది.
శివసాగర్ మాటల్లోనే చెప్పాలంటే...,
‘అమరత్వం రమణీయమైంది
ఆది కాలాన్ని కౌగిలించుకొని,
మరో ప్రపంచాన్ని వాగ్దానం చేసింది’
‘శివసాగర్ కవిత్వం (1968-2008 ) పుస్తకాన్ని గుడిపాటి అచ్చువేసినప్పుడు, నేను అందులో పాలుపంచుకున్నా ను. బషీర్‌బాగ్ ప్రెస్‌కబ్ల్‌లో ఈ పుస్తకం రిలీజ్ ఫంక్షన్‌లో నేను తీసిన ఫోటోలు తీపి జ్ఞాపకాలు. 77 ఏండ్ల నిత్య యవ్వనున్ని అని చెప్పుకునే శివసాగర్ మాతో కలిసినడిచారు. నేటి తెలంగాణ దళిత, బీసీ, మైనారిటీ ఉద్యమాలలో శివసాగర్ ఇచ్చిన స్ఫూర్తి అంతర్లయలాగా కొనసాగుతూనే ఉంటుంది. ప్రతి ఉద్యమంలోనూ రెపపలాడే జెండాల్లో ఆయన వికసిత మోము మాకు స్ఫూర్తిదాయకంగా ముందు నడుస్తుంది.
అమరుడైన శివసాగర్ అనే పోరాట వీరుడికి తలవంచి శాల్యూట్ చేయడంతోపాటు, ఆ స్ఫూర్తిని మిగిలించుకొని ముందుకు సాగడమే నేటి తరాలు ఆయనకిచ్చే నివాళి.
విశ్రాంత యోధుడు
అడవి వెన్నెలకు నెరిసిన శిరస్సు
తుపాకీ మెరుపులాంటి చిరునవ్వు
చూపులోంచి విచ్చుకున్న గరిక పువ్వు
నిలిచిపోయిన అలలా నిర్మలమైన మనస్సు
మట్టిలో పుట్టి చెట్లలో పెరిగి
కడలితో కరచాలనం చేసి
స్వప్న సంకల్పం కోసం
యుద్ధ ఖడ్గాన్ని ముద్దాడిన వాడా
వణుకుతున్న వయస్సులోనూ
విప్లవాన్ని కలగంటున్న స్వాప్నికుడా
గాయాల నెత్తురు స్రవిస్తున్న పథికుడా
ఉద్యమాల నెలబాల్యం నుంచి నెలవంక దాకా
ఉరికంబం మీంచి మరో జగత్ వీక్షించి
ఊహల ఉయ్యాలలో ఊసులాడి
నర్రెంగ కింది బందూక్ అందుకున్న భాస్కరా
చిరుగాలి సితారా సంగీతాన్ని మీటిన వాడా!
స్వప్నం కోసం అలలు అలలుగా కలగన్నావు
ఘనీభవించిన అ కలల హోరును
తిరిగి తిరిగి ఆవిష్కరిస్తున్న విశ్రాంత యోధుడవు
(2004లో శివసాగర్‌ను కల్సినంక)
-అన్నవరం దేవేందర్
- డాక్టర్ పగడాల నాగేందర్
http://www.namasthetelangaana.com/Editpage/article.asp?Category=1&subCategory=7&ContentId=98676

No comments:
Post a Comment