కసితో స్వార్థం శిరస్సు గండ్రగొడ్డలితో
నరకగలిగినవాడే నేటి హీరో
ప్రజల గుండెల కొండల్లో మాటుగాసి
ట్రిగర్ నొక్కగలిగినవాడే స్రష్ట
ప్రజను సాయుధం చేస్తున్న
రెవల్యూషనరీ నేడు కవి
ఈ ఆఖరి చరణమే వరంగల్ నుంచి పెండ్యాల కిషన్‌రావు సంపాదకత్వంలో వెలువడిన 'విప్లవకవులు' కవితా సంకలనం 'మార్చ్'కు మకుటం. ఈ కవిత్వంలో మనకు కనిపించే కొంచెం దిగంబర కవుల వాసన, స్పష్టమైన విప్లవ అవగాహన, కవితా 'ప్రభంజనం' తిరుగుబడు కవులు కలిసి జులై 4, 1970న ఏర్పడిందే విప్లవ రచయితల సంఘం. ఆనాటి నుంచి ఈనాటి వరకు సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో విరసం ఆశయం, లక్ష్యాలకు ఇదే మార్గనిర్దేశం.
'ఆకులందున అణగిమణగి కవితకోకిల పలకవలెనోయ్' అన్నాడు గురజాడ. 'కదిలేది కదిలించేది, పెనునిద్దర వదిలించేది, మునుముందుకు నడిపించేది కావాలోయ్ నవకవనానికి' అన్నాడు శ్రీశ్రీ. కాని నక్సల్బరి, శ్రీకాకుళోద్యమ దశకు విప్లవోద్యమ దశకు ఎటువంటి కవిత్వం కావాలో దిశానిర్దేశం చేసినవాడు మాత్రం పాణిగ్రాహి అడుగుజాడల్లో వచ్చిన శివుడు, శివసాగర్. 1974 నా 'ఊరేగింపు' కవితాసంకలనాన్ని మార్క్సిస్టు లెనినిస్టు నాయకులు కామ్రేడ్ కెజి. సత్యమూర్తికి అంకితం చేసాను.
'To find heroes in the grand manner we must look rather in the present' అని మావోసేటుంగ్‌ను ఉదహరిస్తూ ఈ పై కవితా చరణాలను నేను ఉటంకించాను. అంతకుముందు 68లో నా మొదటి కవితాసంకలనం 'చలినెగళ్లు' గుడిపాటి వెంకటచలానికి అంకితమిచ్చాను. దీన్నిబట్టే నాపై చలం తర్వాత అప్పటికి శివసాగర్ ఫ్రభావం ఎంత ప్రగాఢమైందో ఎవరైనా ఊహించుకోవచ్చును.
1966లో 'ఆధునిక సాహిత్య వేదిక'గా ప్రగతిశీల భావాలు, శాస్త్రీయదృక్పథం, ప్రయోగం కొరకు ప్రారంభమైన సృజన 67 నాటికి రక్తచలన సంగీతశృతి''ని వ్యక్తావ్యక్తంగా వినడం, విని హృదయంలోకి ఇంకించుకోవడం ప్రారంభమైంది. ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే అది చైనా శ్రామికవర్గ సాంస్కృతిక విప్లవ గాలుల ప్రభావం అని అర్థమవుతంది. ఆ రోజుల్లో నేను జడ్చర్లలో పనిచేస్తున్నాను. కాని 1966-68 మధ్యన వరంగల్ మిత్రమండలి సమావేశాల్లో కవిమిత్రుడు లోచన్‌తో కవిత్వం వింటు న్నాం, మంచి చెడ్డలు మాట్లాడుకుంటున్నాం కాని దిశానిర్దేశం చేయలేకపోతున్నాం అని మధనపడుతుండేవాళ్లం.
గాబ్రియెల్‌స్కూళ్లో కెజి. సత్యమూర్తి అనే టీచర్ ఉన్నాడని, ఆయన అయ్యర్‌గారి టీచర్స్‌గిల్డ్‌లో పనిచేస్తున్నాడని, ఆయన నాటకాలు రాసి ప్రదర్శింపచేస్తున్నాడని, ఆయనకు తీవ్రమైన అభ్యుదయభావాలున్నాయని తన ఇంప్రెషన్‌గా లోచన్ చెప్పేవాడు. ఒకసారి మిత్రమండలిలో విల్సన్ అనే కవిమిత్రుడ్ని సత్యమూర్తిగారు మీ కొలీగా అని అడిగాను. ఆయన ఉలికిపడి ఆయనా, ఆయన స్టాలినండీ'' అన్నాడు. బహుశా అప్పటికే ఆయన బ్రహ్మానందరెడ్డి కాలంలోని ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల సమ్మెలో పాల్గొని, స్కూళ్లో ఉపాధ్యాయ సంఘ నిర్మాణం చేయబోయి సస్పెండయి ఉన్నాడు.
కాని, నేను ప్రత్యక్షంగా సత్యమూర్తిని కలిసింది మాత్రం హైదరాబాద్ రెడ్డి మహిళా కళాశాల ఎదురుగా సందులో ఒక చిన్న ఇంట్లో ఉంటున్న సృజన సాహితీమిత్రుడు శ్రీపతి ఇంట్లో. తెల్లటి ధోవతి, మీద జుబ్బా, ఉంగరాల జుట్టు, కళ్లలో వెలుగు, చిరునవ్వు. అచ్చం కవికుమారిడి లాగా ఉన్నాడు. శ్రీపతి పరిచయం చేసాడు. సృజన ద్వారా నేనూ ఆయనకు పరోక్షపరిచయమే. ఆయన రాజకీయ విశ్వాసాల గురించి విని ఉన్నాను. బహుశా అప్పటికే ఆయన ముందస్తు నిర్భంధంలో భాగంగా జైలుకు కూడా వెళ్లివచ్చి పూర్తికాలపు రాజకీయ కార్యకర్తగా పనిచేస్తున్నాడు. ఆయన చేతిలో 'లెనిన్ నా లెనిన్' అని రాసిన ఆయన దీర్ఘకవిత కాగితాలున్నాయి.
అది లెనిన్ శతజయంతి జరుగుతున్న సంవత్సరం. ప్రపంచవ్యాప్తంగా రివిజనిస్టులు మొదలు విప్లవకారుల వరకు బూర్జువా ప్రభుత్వాలు కూడా లెనిన్ శతజయంతి జరుపుకుంటున్నాయి. శివసాగర్ మాటల్లోనే చెప్పాలంటే ఆయననొక బాబాను చేసి, ఆయన కాళ్లకు మేజోళ్లు తొడిగి, ఆయననొక విగ్రహాన్ని చేసి ఆరాధనా ఉత్సవాలు జరుపుతున్నారు. లెనిన్ విప్లవాచరణలో ఉన్నాడని తీవ్రమైన ఉత్తేజంతో రాసిన కవిత అది. ఆ సాయం త్రం కృష్ణదేవరాయాంధ్ర భాషానిలయంలో లెనిన్ శతజయంతి సందర్భంగా ఒక కవిసమ్మేళనం ఉందట. అక్కడ ఈ కవిత చదివించాలి'' అని ప్రతిపాదించాడు. ఆ ఏర్పాటు ఏదో చేసినట్టు న్నాం.
ఎట్లాగూ ఒక సంచలనం ప్రారంభమైంది. లెనిన్ పుట్టినరోజయిన 69 ఏప్రిల్ 22న ప్రపంచవ్యాప్తంగా మార్క్సిస్టు లెనినిస్టు పార్టీలు ఏర్పడ్డాయి. నక్సల్బరీ, శ్రీకాకుళోద్యమాల వెలుగులో ఆ ఉద్యమాలకు ఒక నిర్మాణరూపం ఇవ్వడానికి మనదేశంలో చారుమజుందార్ కార్యదర్శిగా మార్కిస్టు లెనినిస్టుపార్టీ ఏర్పడింది.
మేడే రోజు కలకత్తా షహీద్‌మినార్ మైదాన్‌లో కానూసన్యాల్ ఆ పార్టీ ఆవిర్భావ ప్రకటన చేసాడు. ఆ తర్వాత గుంటూరులో నక్సల్బరీ సంఘీభావ కమిటీని ఏర్పాటు చేసిన డాక్టర్ చాగంటి భాస్కరరావు, శ్రీకాకుళోద్యమ జిల్లా నాయకుడు పంచాది కృష్టమూర్తి మొదలయినవారు చారుమజుందార్‌ను తెలుగునేలకు తీసుకొనివచ్చి గుత్తికొండబిలంలో రాష్ట్ర పార్టీని ఏర్పాటుచేసారు. ఆ సమావేశానికి కొండపల్లి సీతారామయ్య, కెజి. సత్యమూర్తిలను రాష్ట్రకమిటీలోకి తీసుకున్నారు.
అయితే 1969 నుంచి 85 దాకా కెజి.సత్యమూర్తితో సృజనకైనా, విరసంకైనా గాఢమైన అనుబంధం 'శివసాగర్' తోనే. కెజి. సత్యమూర్తిగా లేదా ఆయన అజ్ఞాతజీవితం లోని పార్టీ పేర్లతో ఆయన నిర్వహించిన పాత్ర గురించి సాధికారికంగా చెప్పగలిగేది ఆ పార్టీ నిర్మాణమే. లెనిన్ కవిత మొదలుకొని 85 దాకా అంటే సృజన నిర్వహించబడినంత కాలం ఆయన ఏ కవిత రాసినా సిరా తడి ఆరకముందే అది సృజనకే పంపించేవాడు. అచ్చయి వచ్చేలోగా మళ్లీ ఎన్నిసార్లు ఆ కవితకు ఆయన నుంచి సవరణలు వచ్చేవో, ఆయనంతటి కవితాశిల్పి. ఆయన పర్‌ఫెక్షనిస్ట్. కవిత్వంలో కానిది పలకడాన్ని ఆయన సహించేవాడు కాదు.
అట్లే ఆయన ఎన్నో పాటలు రాసాడు. ఆ పాటలన్నీ సృజనలోనే వచ్చినవి. 69 నుంచి 79 దాకా అజ్ఞాత జీవితంలోనో, జైళ్లలోనో ఉన్నందువల్ల ఆ పాటలకు స్వరకల్పన (ట్యూన్) ఎన్‌కె (రామారావు) చేసేవాడు, చెయ్యాలని ఎస్ఎమ్ కోరుకునేవాడు కూడా. 'చెల్లీ చెంద్రమ్మా' 'తోటా రాముడు, 'జాలరన్న' వంటి పాటలన్నీ ఎన్‌కె ట్యూన్ కట్టి పాడినవే విస్తృత ప్రచారాన్ని పొందినవి.
పాట అన్నప్పుడు ముఖ్యంగా చెప్పవలసిం ది ఆయన 'నరుడో భాస్కరుడా'. డాక్టర్ చాగంటి భాస్కరరావును ఎన్‌కౌంటర్లో చంపివేసిన తర్వాత భాస్కరుడు నామవాచకం కాదు, అనే చిన్న వివరణతో తెలంగాణ ప్రాంతంలో పీరీలు నీళ్లల్లో పడినతర్వాత మొహర్రం ఆఖరి రోజున తిరిగివస్తూ పాడుకునే జానపద గీతం శైలిలో ఆయన నరుడో భాస్కరుడా పాట రాసాడు. ఈ పాటయే విరసం పాట, మౌఖిక కళారూపాల ద్వారానే విప్లవభావ ప్రచారం చేయాలనే దానికి ప్రాతిపదిక అయింది.
ఖమ్మం సుబ్బారావు పాణిగ్రాహినగర్‌లో జరిగిన విరసం ప్రథమ మహాసభలకు విరసం ప్రథమ కవితాసంకలనం 'ఝంఝ'ను స్వయంగా అచ్చువేయించుకొని వచ్చిన శ్రీశ్రీ ఈ పాట పాడుతూనే ట్రైయిన్ దిగాడని సభలు జరిగిన రెండ్రోజులూ ఈ పాట పాడుతూనే ఉన్నాడని, ఈ పాట రాసిన శివుడెవరో అప్పటికి ఆయనకు తెలియదని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. నగ్నముని తన 'తూర్పుగాలి' కవితాసంకలనాన్ని ఈ నరుడూ భాస్కరుడికే అంకితం చేసాడు. ఈ పాటతో పాటు ఝంఝలో 70 జులై 10న ఎన్‌కౌంటర్లో అమరులయిన వెంపటాపుసత్యం, ఆదిభట్ల కైలాసంల స్మృతిలో రాసిన 'సత్యం చావదు' (డు) అనే కవిత కూడా అచ్చయింది.
'మార్చ్' కవితాసంకలనంలో ప్రారంభంలో పేర్కోన్న కవితతో పాటు లెనిన్‌పై రాసిన దీర్ఘకవిత కూడా ఉంది. ఇతర కవితలను విడిగా ఒకచోట అచ్చువేసిన బుక్‌లెట్‌ను నిషేధానికి వెరవకుండా గుంటూరు విరసం మహాసభల్లో పంచిన ధూళిపాళ మోహన్ ఇప్పటికీ నాకు కళ్లల్లో ఆడుతున్నాడు. ఈ నాలుగు కవితలు ఎస్ఎమ్ శివుడు అనే పేరుతోనే రాసాడు. ఆ తర్వాత ఆయన సృజనకు రాసిన కవితకూ కవితా వస్తువును బట్టి ఎక్కువగా సాహితీమిత్రులే శివసంబంధమైన పేర్లు పెట్టేవాళ్లు. శివసాగర్, నటరాజ్ (ఉద్యమం నెలబాలుడు), పార్వతి (మాతృఘోష) ఇట్లా.
ప్రపంచకార్మికులంతా ఒకేతల్లి బిడ్డలురా, ప్రపంచ శ్రామికులంతా ఒకే కొమ్మ పువ్వులురా అని రాసిన పాటకు మాత్రం ఆజాద్ అని పేరు పెట్టాం. సృజన ప్రచురణగా వెలువడిన గెరిల్లా విప్లవగీతాలకు ముందుమాటలో అందుకే ఇందులో వివిధ కవుల కవితలు ఉన్నాయి గాని వీటన్నింటిలో విప్లవ సత్యమూర్తిత్వం ఆవిష్కరింపబడింది అని ప్రస్తావించడం జరిగింది. కవిత్వంలో, కవిత్వం ద్వారా ఆయన ఇవ్వాల్టి కవికి నిర్వచనాన్ని, కవితారూపాన్ని నిర్దేశించినట్లుగానే విప్లవ కాల్పనికవాదాన్ని విప్లవ ఆశావాదాన్ని ప్రవేశపెట్టాడు. ఆయన కవిత్వంపై ఏకకాలంలో గురజాడ, కృష్ణశాస్త్రి, శ్రీశ్రీల ప్రభావాన్ని చూడవచ్చు.
వీటితోపాటు తనదైన కవి సమయాలను, కవితా రూపాలను, శిల్పాన్ని, వినూత్న ప్రయోగాలను కూడా ప్రవేశపెట్టాడు. ముఖ్యంగా సమకాలీన విప్లవపరిభాషతో, కవితా వస్తువులతో, కవిసమయాలతో కవిత్వాన్ని సుసంపన్నం చేసాడు. తెలుగు వచన కవితపై, ముఖ్యంగా విప్లవ కవిత్వంపై శ్రీశ్రీ తర్వాత బలమైన ముద్ర శివసాగర్. మరొక ప్రత్యేకత ఏమంటే నరుడో భాస్కరుడా పాట నుంచి గంగ దాటెలిపోకే చెల్లెమ్మా దాకా ఆయన ప్రతి పాటా, కవితా ద్వారా శ్రీకాకుళోద్యమం మొదలు జగిత్యాల జైత్రయాత్ర దాకా విప్లవోద్యమ చరిత్ర నిర్మాణం చేసి చూపవచ్చు.
ముఖ్యంగా శ్రీకాకుళోద్యమ చరిత్రను, ఆయన కవిత్వం లో రక్తమాంసాలతో కూడిన చరిత్రగా పునర్లిఖించవచ్చు. ఆయన కవిత్వంలో చెరబండరాజు కవిత్వంలో వలెనే పోలమికల్ అంశాలు కూడా చాలా ఉంటాయి. ఏ కవితా సందర్భం లేకుండా అనిర్దిష్టంగా ఉండదు. 'లెనిన్' గ్రేట్ డిబేట్ ముగిసి మార్క్సిస్టు లెనినిస్టు విప్లవాలు పెల్లుబికిన కాలం. 'నరుడో భాస్కరుడా' ఎన్‌కౌంటర్ హత్యలు ప్రారంభమైన కాలం. అంతే కాదు, నీ బాటనే నడు స్తాం అని విప్లవభాస్కరునికి హామీపడిన సందర్భం. జాలరన్న పాట సత్యం, కైలాసాల అమరత్వం సందర్భంగా తెలంగాణలో మాత్రమే నాయకత్వం మిగిలినపుడు కెఎస్‌ను ఉద్దేశించి రాసిన కవిత్వం. తెరచాప చిరిగినా, పడవ మునకేసినా, కొందరప్పటికే దిగజారి తెడ్డు నదిలో విసిరేసినా చుక్కాని దిక్సూచిగా పనిచేసినంతకాలం ఈ ఎదురీత కొనసాగుతుందని చెప్పిన పాట.
ఉద్యమం నెలబాలుడు శ్రీకాకుళోద్యమ నాయకత్వమే రివిజనిస్టు మార్గాన్ని జైల్లో ఉండి ప్రతిపాదించినపుడు ఆగ్రహంతో రాసిన గీతం. ఇట్లా ఉద్యమం నెలబాలుడు సంపుటిలోని ప్రతి కవితకు ఒక నిర్దిష్టమైన సందర్భాన్ని చెప్పవచ్చు. ఎస్ఎమ్ 73లో ఖమ్మంలో అరెస్టయ్యాడు. ఒక ద్రోహి కారణంగానే అరెస్టయ్యానని హోచిమిన్ వలెనే చందమామను ఉద్దేశిస్తూ జైలు నుంచి కవిత పంపాడు. ఖైదీగీతం పేరుతో 74 జనవరిలో అది చిన్నకవితా సంకలనంగా వెలవడింది. గెరిల్లా విప్లవ గీతాలు, ఖైదీ గీతం ఆ తర్వాత రాసిన కవితలు అన్నీ కలిపి అప్పటికి ఒక సమగ్ర సంపుటంగా ఉద్యమం నెలబాలుడు వెలువడింది.
ఈ కాలంమంతా ఆయన కొండపల్లి సీతారామయ్యతో కలిసి పార్టీ కార్యకలాపాల్లో కూడా పాల్గోంటూనే ఉన్నాడు. ఆదిలాబాదు, వరంగల్, భోనగిరి, హైదరాబాదు మొదలైన ప్రాంతాల్లో పనిచేస్తూనే ఉన్నాడు. రాష్ట్రకమిటీ నాయకత్వంలో ఉండి విరసంతో గాని, ఇతర ప్రజాసంఘాలతో గాని సంబంధాల్లోనే ఉన్నాడు. ఈ క్రమమంతా ఆయన దృష్టి ప్రధానంగా సాహిత్య సాంస్కృతిక భాషా రంగాల మీద ఉండేది, ఆయన ప్రభావమూ ఈ రంగాల మీద ఉండేది.
ఆదిలాబాదు అడవుల్లో తిరిగినపుడు వెంట ఉన్న నర్సిరెడ్డి అనే సహచరుడితో ఆ అడవుల్లో చెట్ల, పిట్టల పేర్లు అడిగి తెలుసుకొని రాసుకొని ఆ తర్వాత కాలంలో వాటిని తోటరాముడు పాటలో అద్భుతంగా ఉపయోగించుకున్నాడు. ఆ తోటరాముడు భూమయ్య కిష్టాగౌడ్‌లోని కిష్టాగౌడ్. సత్యమూర్తి ఎమర్జెన్సీలో జైల్లో ఆ ఇద్దరి పక్కన గంజ్‌లో ఉన్నాడు. వాళ్లకు సన్నిహితుడయ్యాడు. కిష్టాగౌడ్ తొడలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కాలంలో దూరిన బుల్లెట్‌ను చూసి ఆయన 'తోటరాముని తొడకు కాటా తగిలిందాట' అని పాట రాసాడు. భూమయ్య కిష్టాగౌడ్ ఉరిశిక్షల మీదనే 'ఉరిపాట' రాసాడు. ఉరికంబం మీద నిలిచి ఉజ్వలగీతం పాడెద అని సృజనలో రాసాడు. అది నిషేధానికి గురయింది. 1972లో తరచుగా సృజన సంచికలు నిషేధానికి గురయినాయి.
ఎక్కువగా శివసాగర్ కవిత ల కోసమే. ఇంటిలిజెన్స్ వాళ్లు (మూడు ఎమ్ఏలు చేసిన గోపాల్‌రావనే ఇంటిలిజెన్స్ ఇన్స్‌స్పెక్టర్ ఈ సాకుతో ఆ రోజుల్లో కవిత్వాన్ని అనువాదం చేసేవాడు) చేసే ఆ ఇంగ్లీష్ అనువాదాలు నిషేధపు ఉత్తర్వులు ప్రచురించే సాకుతో సృజనలో అచ్చేసేవాళ్లం. సృజన సంచికల నిషేధం గురించి విని ఆవేదనతో శివసాగర్ 'అల లు' కవిత రాసాడు. అలల పైన నిఘా. అలల కనే కలల పైన నిఘా అనే అద్భుతమైన కవిత అది. సృజనతో ఆయనకున్న అనుబంధం అటువంటింది. 1974 చార్రితాత్మకమైన రైల్వే సమ్మె అప్పుడు ఆయన రాసిన 'రెడ్‌కార్నర్' కవిత నిర్మాణం, భాష, పదబంధాలు, కవిసమయాలు మొదలయిన మొత్తం నిర్మాణరూపంవల్ల గద్దర్ గ్యాంగోళ్లమండీ, వంగపండు యంత్రమెట్లా నడుస్తున్నదంటే పాటలతో పోల్చదగిన కవిత.
అజ్ఞాత జీవితంలోనూ జైల్లోనూ కలిపి మొత్తం ఈయన 69 నుంచి 79 దాకా బహిరంగ జీవితంలో లేడు. పార్వతీపురం, సికింద్రాబాద్ కుట్రకేసుల్లో ముద్దాయిగా అదే క్రమంలో ఎమర్జెన్సీలో కూడా 73 నుంచి జైల్లోనే ఉన్నాడు. 78లో బెయిల్ మీద విడుదలయి 79 జనవరిలో మహాసభల్లోనే ఆయనకు విరసం గౌరవ సభ్యత్వమిచ్చింది. బహూశా అటువంటి అరుదయిన గౌరవం ముందూ వెనుకా ఎవరికీ లేదు. బహూశా గుంటూరు విరసం మహసభలకు ఆయన ఆఖరిసారి వచ్చాడు. ఆ తర్వాత మండల్ కమిషన్‌కు అనుకూలంగా రిజర్వేషన్‌కు అనుకూలం గా వెలవరించిన కవితాసంకలనం సందర్భంగా విరసం ఆయనతో కలిసి పనిచేసింది. గద్దర్ మీద హత్యాప్రయత్నం సందర్భంలోనైతే ఆయన నాయకత్వంలో పనిచేసింది.
80లో సిపిఐఎమ్ఎల్ పీపుల్స్‌వార్ ఏర్పడిన తరువాత ఆయన విరసంను గైడ్‌చేయడం నాకు జ్ఞాపకం ఉంది. మాచర్ల విరసం మహాసభలకు ముందు ఆయన శ్రీశ్రీ గురించి ప్రస్తావిస్తూ ఆయన విప్లవ శిబిరంలో చనిపోవాలని, ఆయనకు ఎర్రజెండా కప్పాలని, విప్లవం విజయవంతమయిన తర్వాత ఆయ న విగ్రహాన్ని విశాఖ సముద్రతీరాన యేరాడకొండపై పెట్టాలని మా ముందు ఒక స్వప్నాన్ని ఆవిష్కరించాడు.
1979నుంచి 82 దాక కొంత బహిరంగ జీవితంలోనూ, కొంత అజ్ఞాతంలోనూ ఆయన తరచూ కలుస్తుండేవాడు. విరసం మిత్రులతో మాట్లాడుతుండేవాడు. రాజకీయ నిర్దేశకత్వంకన్నా ఎక్కువగా సాహి త్యం గురించి, కవిత్వం గురించి మాట్లాడుతుండేవాడు. శ్రీశ్రీ తర్వాత తెలుగు కవిత్వంలో ఆయనదే స్థానం అని, 70ల విప్లవ కవిత్వానికి పాణిగ్రాహి తర్వాత ఆయనే మార్గదర్శకుడని, అందుకే శివసాగర్‌కు మరణం లేదని చిత్తశుద్ధిగా ఆయనతో అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నాను.
-వరవరరావు
http://andhrajyothy.com/vividhaNewsShow.asp?qry=2012/apr/23/vividha/23vividha2&more=2012/apr/23/vividha/vividhamain&date=4/23/2012

No comments:
Post a Comment