-దీర్ఘకాలంగా అనారోగ్యం
-పీపుల్స్‌వార్ వ్యవస్థాపక నేత,దళిత విప్లవ వేదిక సారథి,విప్లవ కవితాగాన లహరి శివసాగర్ ఇక లేరు
-కృష్ణా జిల్లా కందులపాడులో నేడు అంత్యక్షికియలు
-విషాదంలో ఉద్యమ శ్రేణులు
-కన్నీరుమున్నీరవుతున్న కలాలు
కడలి కడుపు మీటినవాడు.. కెరటాలపై లేచినవాడు.. జనతను మేల్కొల్పినవాడు.. జగత్తును కంపించినవాడు.. ఇక లేడు! తుపాకి పట్టి జగతి విముక్తికి రహస్యోద్యమాన్ని నిర్మించినవాడు.. కలం పట్టి సాహితీ కదనరంగంలో దుమికినవాడు.. వెళ్లిపోయాడు! ఉద్యమం నెలబాలుడు.. సాహితీలోకంలో ఆజానుబాహుడై.. ఉద్యమాన్ని అనంత బల సంపన్నం చేసి.. ఒరిగి పోయాడు!
ఖడ్గాన్ని మీటి ప్రచండ జన సంగీతాన్ని సృష్టించిన కలం యోధుడు.. సుదీర్ఘవిక్షిశాంతిలోకి వెళ్లిపోయాడు! నా తియ్యని కలలే నిజమై.. నిఖిల లోకమే హసించు..నంటూ ప్రపంచం నుంచి సెలవు తీసుకున్నాడు! ఇప్పపువ్వుల్లో నిప్పు రవ్వల్ని రగిలించి, కొడవళ్లకు తిరుగుబాటు పాఠాలు నేర్పి, నాగేటి చాలులో నక్షవూతాలను కనుగొని..జీవితాన్ని జీవించమని, జీవితాన్ని ప్రేమించమని శాసించి వెళ్లిపోయాడు! గార్ల రైలు దారిలో గుంజుకున్న బల్ రైఫిల్..అందించి.. పోరాటం మధ్యలో అంతులేని కన్నీళ్లకు ఆస్కారం లేదంటూ బాధ్యతలు భుజాన మోపి కనుమరుగైపోయాడు!
పీపుల్స్‌వార్ వ్యవస్థాపకుల్లో ఒకరు, భారత విప్లవోద్యమంలో ధ్రువతార, దళిత ఉద్యమ విప్లవ సారథి కేజీ సత్యమూర్తి కన్నుమూశారు! ప్రముఖ మావోయిస్టు సిద్ధాంత కర్త, పీపుల్స్‌వార్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి, దళిత మహానేత కేజీ సత్యమూర్తి ఇక లేరు. శివసాగర్ పేరుతో సాహితీ ప్రపంచంలో ఓ వెలుగు వెలిగిన ధ్రువతార ఇక సెలవంటూ వెళ్లిపోయింది. తాను నమ్మిన సిద్ధాంతం కోసం రాజీలేని పోరాటం చేసిన విప్లవ యోధుడు సత్యమూర్తి మంగళవారం ఉదయం కృష్ణా జిల్లా జీకొండూరు మండలం కందులపాడులో ఆయన కుమారుడి ఇంట్లో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. కొంతకాలంగా ఆయన పక్షవాతంతో బాధపడుతున్నారు. సత్యమూర్తికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమ్తాలు ఉన్నారు. ఆయన అంత్యక్షికియలు బుధవారం కందులపాడులో జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. కృష్ణాజిల్లా నందివాడ మండలం శంకరంపాడు గ్రామంలో జన్మించిన సత్యమూర్తి వరంగల్‌లోని గాబ్రియేల్ స్కూలులో ఇంగ్లిష్ టీచర్‌గా తన జీవితం మొదలు పెట్టారు.
ఆ సమయంలో ఆయనకు పీడబ్ల్యూజీ వ్యవస్థాపకుల్లో ఒకరైన కొండపల్లి సీతారామయ్యతో 1960లో పరిచయం ఏర్పడింది. ఫాతిమా పాఠశాలలో హిందీ ఉపాధ్యాయునిగా సీతారామయ్య పని చేసేవారు. ప్రధాన స్రవంతి మార్క్సిస్టు పార్టీల వైఖరిపై ఇద్దరూ చర్చించుకునేవారు. ఈ ఇద్దరూ 1970వ దశకంలో నక్సల్ ఉద్యమంలో చేరారు. తమ ఆలోచనకు కార్యాచరణ రూపం ఇచ్చేందుకు ఇద్దరూ కలిసి 190లో పీపుల్స్‌వార్ గ్రూప్‌ను ప్రారంభించారు.
సత్యమూర్తి మంచి కవి, రచయిత. శివసాగర్ పేరుతో ఆయన కవిత్వం రాసేవారు. గ్రామాలకు వెళ్లి దళాలను తయారు చేసేవారు. పీడబ్ల్యూజీ శ్రేణుల్లో ఆయన ఎస్‌ఎంగా పరిచితుడు. పీపుల్స్‌వార్‌క్షిగూప్‌ను రాష్ట్రంలో పటిష్ఠమైన సంస్థగా తయారు చేయడంలో ఆయనది కీలక పాత్ర. దళిత సామాజికవర్గం నుంచి వచ్చిన సత్యమూర్తి కుల తత్వానికి వ్యతిరేకంగా పోరాడారు. సామాజిక న్యాయం కోసం విశేష కృషి జరిపారు.
పీడబ్ల్యూజీలో ఉన్నప్పుడే సీతారామయ్య, ఇతరులతో విభేదాల కారణంగా పార్టీ నుంచి బయటికి వచ్చారు. సత్యమూర్తిని బహిష్కరించామని పీడబ్ల్యూజీ పేర్కొంటే, తానే పీడబ్ల్యూజీని బహిష్కరించానని ప్రకటించారు. పీడబ్ల్యూజీలో అగ్రకుల ఆధిపత్యం కొనసాగుతున్నదని అప్పట్లో ఆయన విమర్శించారు. ఒక దశలో ఆయన తలకు ప్రభుత్వం 25వేల రూపాయలు వెలకట్టింది. ఆయన రాసిన కవిత్వం విప్లవోద్యమానికి పదును పెట్టింది. ఆయన రాసిన ఉద్యమం నెలబాలుడు కవిత విప్లవ కవిత్వానికి ప్రతీకగా ఎప్పటికి నిలిపోయే రచన.
కేజీ సత్యమూర్తి విప్లవోద్యమంలో ఉన్నప్పుడు ఆదిలాబాద్ కేంద్రంగా పని చేశారు. పార్వతీపురం కుట్ర కేసులో అరెస్టయ్యారు. ఆదిలాబాద్‌లో పని చేస్తున్న సమయంలో తెలంగాణ జీవన విధానాన్ని నిశితంగా గమనించిన శివసాగర్.. తన కవితల్లోనూ తెలంగాణ సంస్కృతికి పెద్దపీట వేశారు. ఇక్కడి జానపదబాణీలను గమనించి కవితలు, గీతాలు రాశారు.
అప్పట్లో ఆయన రాసిన నరుడో ఓ భాస్కరుడా అన్న పాట సాహితీ లోకంలో ఎన్నటికీ నిలిచిపోయే మణి. నక్సల్ ఉద్యమం నుంచి బయటికి వచ్చిన తర్వాత భారత సమాజంలో కుల వ్యవస్థను కూకటివేళ్లతో పెకలించేందుకు ఆయన సాహితీ స్రవంతిని ఎంచుకున్నారు. పెద్ద ఎత్తున దళిత ఉద్యమాలు నిర్మించారు. దళితులను చైతన్యవంతం చేసేందుకు సామాజిక విప్లవ వేదికను ఏర్పాటు చేశారు.
దేశంలో ఏ విప్లవం విజయవంతం కావాలన్నా ముందుగా కుల వ్యవస్థ నిర్మూలన జరగాలని ఆయన గట్టిగా నమ్మేవారు. ఆ క్రమంలోనే అంబేద్కర్ తత్వాన్ని, మార్క్సిజంతో మేళవించి రచనలు చేశారు. ఎదురీత, నలుపు వంటి పత్రికలను కూడా ఆయన నడిపారు. బహుజన్ రిపబ్లిక్ పార్టీని ఏర్పాటు చేశారు. ఆయన కవిత్వాన్ని, రచనలను విప్లవ కవి వరవరరావు తర్వాతి కాలంలో పుస్తకాలుగా తీసుకువచ్చారు.
http://www.namasthetelangaana.com/News/article.asp?category=1&subCategory=2&ContentId=96328
No comments:
Post a Comment