జనం ఊపిరితో విప్లవ కవిత్వంలోకి వచ్చినవాడు శివసాగర్. విరసం తొలినాళ్లలో ఆయన మాకు 'నరుడో భాస్కరుడా'గా ఉత్తేజాన్ని నింపినవాడు. తెలుగు జానపద బాణీలను - నుడికారాన్ని విప్లవ కవిత్వంగా మలచిన కవి. ఒక భావుకుడిగా, విప్లవ రొమాంటిసిజమ్‌తో తన స్వాప్నిక వ్యక్తీకరణతో విశిష్టమైన శైలిని సాధించగలిగాడు- గేయం కావొచ్చు లేదా వచన కవిత కావొచ్చు. కె.జి.సత్యమూర్తి దళిత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వివాదాస్పదమైన వ్యాఖ్యలతో ఉద్యమానికి దూరమైన దశ ఒక విషాదం. నేనూ మిత్రులు జ్వాలాముఖి మొదటిసారి సత్యమూర్తిని విశాఖ జైలులోని ప్రత్యేక న్యాయస్థానంలో కలుసుకున్నాము. ఆ తర్వాత రాజకీయ అంశాల్లో ఆయనతో విభేదించినా, ఆయా సందర్భాలలో సంభాషణ సాగిపోయేది. చివరి దశలో ఆయన ఒంటరిగా మిగిలిపోయినా, తెలుగు విప్లవ కవిత్వంలో ఒక అగ్రగామి కవిగా, విప్లవ స్వాప్నికుడిగా సుస్థిర స్థానాన్ని పొందగలిగారు. శివసాగర్ స్మృతికి నా విప్లవ జోహార్లు.
- నిఖిలేశ్వర్
శివనేత్రం మూతపడింది
వొక నిప్పు వాగు ఆగిపోయింది. వొక మల్లియ రాలిపోయింది. వొక శివనేత్రం మూతపడింది. వొక చంద్రహారం తెగిపోయిం ది. శివసాగర్! అడవి లోం చి వచ్చీ రాగానే నువ్వు నా బుగ్గ మీద పెట్టిన ముద్దు చెమ్మ ఇంకా తడిగానే వుంది. నీ కలల రెమ్మ ఇంకా మా వూహల గాలి లో వూగుతూనే వుంది. శివసాగర్! ఎక్కడ వున్నా నువ్వు హోరెత్తుతూనే వుంటావ్.
- అఫ్సర్
వాటా అడక్కుండానే వెళ్ళిపోయాడు
విప్లవోద్యమంలో- విప్లవోద్యమ సంస్కృతిలో సైతం 'అంటరానితనాన్ని' ఎదుర్కొన్న ఒంటరై విప్లవ వేదిక మీద తన వంతు పనిని పూర్తి చేసేసినా, తన వాటా అడక్కుండానే వెళ్లిపోయిన 'ఉద్యమ నెల బాలు డు'... అంబేద్కర్ తత్వాన్ని మార్క్సిజానికి తాపడం చేసి చూపించి, సైద్ధాంతిక రాద్దాంతాలకు ముందుగా కుల రాద్దాంతాల్ని నిర్మూలించమని, కవిత్వంతో దళితులకు మార్గ దర్శకత్వం వహించిన కె.జి.సత్యమూర్తి ఆత్మ శాంతిని కోరుతూ...
- తుల్లిమల్లి విల్సన్ సుధాకర్
ఉద్యమాల చిరుగాలి సితార
భారత విప్లవోద్యమ అజెండాలో కులం అజెండా చేర్చకుండా ఎర్రజండా ముందడుగు వేయలేదని పీడిత, తాడిత, దళిత ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలిచి పోరాడుతూ- ఉమ్మడి కమ్యూనిస్టు ఉద్యమాల నుండి నేటిదాకా పోరాడుతూ అనేక ఉద్యమాల చిరుగాలి సితార ధ్వని వినిపిస్తూనే వెళ్లిపోయిన సత్యమూర్తికి జోహార్లు. శివసాగర్ ఆశయాలను కొనసాగిద్దాం. - అరుణోదయ రామారావు
సంస్మరణ సంచికకు రచనలకు ఆహ్వానం
ఉపాధ్యాయుడుగా, కార్మిక నాయకుడుగా, పాత్రికేయునిగా, విప్లవ, దళిత ఉద్యమ నేతగా అన్నింటికీ మించి ప్రజాకవిగా కె.జి.సత్యమూర్తి, సమకాలీన సామాజిక సాంస్కృతిక రాజకీయ సాహిత్య ఉద్యమాలను బలంగా ప్రభావితం చేయడమే గాకుండా, వాటికి స్పష్టమైన తాత్విక దిశా, నిర్దేశం చేశాడు. త్యాగభరితమైన ఆయన జీవిత ఉద్యమ ఉత్తేజాన్ని నెమరువేసుకుంటూ మునుముందుకు సాగటం చారిత్రక అవసరం. అందుకే సత్యమూర్తి సంస్మరణ సంచికను ప్రచురిస్తున్నాం. బహుముఖీన శివసాగర్ ప్రస్థానాలపై రచనలను ఈ నెల 26లోగా పల్నాటి శ్రీరాము లుకు- bahujanakeratalu@gmail.com పేర మెయిల్ చేయాలి. ఫోన్ 9849944170
- సంపాదకవర్గం, బహుజన కెరటాలు
శివసాగర్ సంస్మరణ సభ
భారత విప్లవోద్యమ నిర్మాణం లో అగ్రజుడు, దళిత బహుజనోద్యమ స్ఫూర్తి ప్రదాత, కులవర్గ సామాజిక విప్లవ మహాకవి కె.జి.సత్యమూర్తి (శివసాగర్) సంస్కరణ సభ ఏప్రిల్ 24, సా.5గం.లకు సుందరయ్య విజ్ఞానకేం ద్రం, హైదరాబాద్‌లో జరుగనుంది. ప్రముఖులంతా పాల్గొం టారు. ఉద్యమ - సాహితీ మిత్రులందరూ నివాళులర్పించడానికి రావలసిందిగా ఆహ్వానిస్తున్నాం.
- సత్యమూర్తి
(శివసాగర్) ఉద్యమ, సాహితీ మిత్రులు
http://andhrajyothy.com/vividhaNewsShow.asp?qry=2012/apr/23/vividha/23vividha6&more=2012/apr/23/vividha/vividhamain&date=4/23/2012

No comments:
Post a Comment