Thursday, 19 April 2012

ఉపాధ్యాయుడి నుంచి ఉద్యమకారుడిగా..



ఆర్‌ఈసీని విప్లవ కళాశాలగా మార్చడంలో కీలకపాత్ర ఎకశిలా నగరమంటే ఎనలేని ప్రేమ విప్లవాల ఖిల్లాలో సత్యమూర్తి మజిలీలు అనేకం ఓరుగల్లును పోరుగల్లుగా మార్చడంలో కేజీ సత్యమూర్తిది ప్రత్యేక ప్రస్థానం. ‘నేను నిప్పును, నీరును రణంలో పోరాడే లక్షలాది సైనికుల్లో నేనొకడిని. నేనే రణ రంగాన్ని నేనే’ అని ప్రకటించుకున్న సత్యమూర్తి అలియాస్ శివసాగర్‌కు ఉద్యమ ఓనమాలు నేర్పింది ఓరుగల్లే . పుట్టింది ఆంధ్రావూపాంతంలో అయినప్పటికీ ఆయన జీవితమంతా తెలంగాణతో పెనవేసుకుంది. తెలంగాణ ఉద్యమాన్ని విప్లవాత్మక మార్గంలో నడిపిస్తేనే స్వరాష్ట్ర సాధన (విప్లవ మార్గం అంటే సాయుధ మార్గం కాదన్నది జీవితానుభవంగా 2009లో ప్రత్యేకంగా ప్రస్తావించారు) సాధ్యం అవుతుందని స్పష్టం చేశారు.

తొలినాళ్లలో 1960లో కాజీపేట సేయింట్ గ్యాబ్రియల్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిశారు. పీపుల్స్‌వార్ ఉద్యమ రూపకల్పనలో ఫాతిమా స్కూల్‌లో పనిచేసిన కొండపల్లి సీతారామయ్య (కేఎస్)తో కేజీ సత్యమూర్తి చేసిన ప్రయత్నాన్ని అప్పటి తరం కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. కమ్యూనిస్టు పార్టీ విడిపోయి సీపీఎంగా ఏర్పడినప్పుడు వీరిద్దరు ఆ పార్టీ సభ్యులుగానే కమ్యూనిస్టుభావాలతో జిల్లాలో కాలుమోపారని ప్రచారంలో ఉంది.

తెలంగాణలోని భూస్వామ్య, పెత్తందారీ వ్యవస్థను రూపుమాపేందుకు నక్సల్బరీ పోరాట స్ఫూర్తిని రగిలించడంలో సత్యమూర్తి పాత్ర అనిర్వచనీయం. కాజీపేటలోని ఆర్‌ఇసీని పస్తుత నిట్)ను విప్లవ పాఠశాలగా మార్చడానికి కేజీ, కేఎస్‌లు శ్రమించారు. కేఎస్ సిద్ధాంతకర్తగా, వ్యూహకర్తగా ఉంటే కేజీ భావోద్వేగాలను రగిలిస్తూ యువతరాన్ని విప్లవొద్యమంలోకి తీసుకొచ్చారు. అప్పటి ఆర్‌ఇసీ విద్యార్థుల్లో సూరపనేని జనార్దన్‌రావు, ఆనందరావు, సుధాకర్, ఆజాద్ వంటి వాళ్లు ఎందరినో విప్లవోద్యమంవైపు ఆకర్షించారు.

మేం ఎర్రదొంగలం!
నర్మెట్ల మండలంలోని అనుమంతాపూర్‌లోని ఓ షావుకారు ఇంట్లోకి చొరబడిన ఘటనను ఆ కాలం వారు ఇప్పటికీ గుర్తుచేసుకుంటారు. 1971, 72 ప్రాంతాల్లో జరిగిన ఆ సంఘటనల్లో కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తి తాము ఎర్రదొంగలం(విప్లవ కారులు) అని ప్రటకించుకున్నారట. తలుపుల్ని పగులగొట్టి ఇంట్లో ఉన్న విలువైన వస్తువులను వదిలేసి ఆహార పదార్థాలను మాత్రమే దొంగింలించేవారట. ఓసారి వస్తువులను పట్టుకెళ్తూ రఘునాథపల్లి సమీపంలో స్నానం చేసేందుకు దిగిగా పోలీసులు వీరిని అరెస్టు చేసినప్పుడు ఎర్రదొంగలమని చెప్పారట.

పోలీసులు వారిని కోర్టులో జడ్జి ఎదుట ప్రవేశపెట్టిన బలమైన వాగ్ధాటితో అప్పటి సమస్యలపై వాదించారు. సమస్యలపై వారికున్న అవగాహనపై అప్పటి జడ్జి మంత్రముగ్ధుడయ్యారట. కొద్దిసేపటికి తమతో వచ్చిన పోలీసులను జడ్జి పిలుస్తున్నాడని చెప్పి, అక్కడి నుంచి తప్పించుకుపోయారని ఇప్పటికీ కథలుగా చెప్పుకుంటారు.

కేజీ సత్యమూర్తి పీపుల్స్‌వార్ కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఎదిగినా ఏకశిలా నగరంపై ప్రత్యేకమైన అభిమానాన్ని చాటుకున్నారని ఆయన సాహిత్యం స్పష్టం చేస్తోంది. ‘గార్ల రైలు దాడిలోన గుంజుకున్న బల్ రైఫిల్ నీకిస్తా తమ్ముడా..నీకిస్తా చెల్లెలా’ అంటూ రాసిన పాటే నిదర్శనం. పీపుల్స్‌వార్ నుంచి వైదొలిగిన తర్వాత ఆయన చేపట్టిన, నిర్మించిన అనేక ప్రజాఉద్యమాలు వరంగల్‌లో చేపట్టారు. ఈ ప్రాంతాన్ని ఎప్పటికీ మరచిపోలేనని ఓసారి జిల్లా పర్యటనలో పేర్కొన్నారు.
http://www.namasthetelangaana.com/News/article.asp?category=1&subCategory=2&ContentId=96315


No comments:

Post a Comment