అవును. శివసాగర్ ఎప్పుడూ రెండు యుద్ధాలను చేశాడు. ఎప్పుడూ యుద్ధాలు చేస్తూనే పోయాడు.
యుద్ధరంగం నుండి-యుద్ధం చేస్తూనే మరో యుద్ధ బరిలోకి తరిమివేయబడ్డాడు. కాదు.కాదు. ఆయనే శత్రువులతో తలపడడానికి తరలి వచ్చాడు.
విజేతలా వచ్చాడు. విజయోత్సాహంతో వచ్చాడు. తాను ఎక్కుపెట్టిన తాత్విక ప్రశ్నలను గురిపెట్టి వచ్చాడు. ఇంకా అవి లక్షలాది మెదళ్ళలో యుద్ధారావాలై, విస్ఫోటిస్తూనే ఉన్నాయి. వర్గంలో కులం దాగి ఉందన్నాడు. ప్రగతిశీల శక్తులు కులాన్ని పక్కన పెడితే ప్రజాయుద్ధానికి దారి లభించదని చెప్పడమే ఒక విప్లవం ఆనాడు!
బలహీనతలతోనో, యుద్ధం చేయజాలకనో యుద్ధరంగం నుండి రాలేదు. యుద్ధానికి పరుగులు నేర్పాలన్నాడు. శ్రమజీవులంతా యుద్ధ వారసులని ప్రకటించాడు. యుద్ధం నుండే కాదు ఈ లోకం నుండి ఆయన వెళ్ళిపోయినా అతని యుద్ధ తాత్వికత వెలుగు ప్రసరిస్తూనే ఉంది దశాబ్దాలు గడిచినా అతని ప్రశ్నలకు ఇంకా పరిపుష్టమైన, జవాబులు ఇవ్వని కారణంగా జరిగిన నష్టాన్ని పూరించుకోవలసి ఉంది.
విప్లవ కవిత్వానికి ‘నరుడో నరుడా’ గేయం గొప్ప ఊపునిచ్చినట్లే ‘నల్లా నల్లాటి సూరీడు’ గేయం దళిత విప్లవానికి, కొత్త భావ విప్లవానికి ఊపునిచ్చింది.
శివసాగర్ మరణం ఇప్పుడు విమర్శకులకు పెద్ద పరీక్ష పెట్టింది. తెలుగు కవిత్వాభిమానులకు మీరేవైపు అన్న ప్రశ్నను సంధించింది. జవాబుకోసం చూడాల్సిందే.
శ్రీశ్రీ ముందూ శ్రీశ్రీ తదుపరి ఎవరు మహాకవి అన్న ఆ మార్క్సిస్టు భావనకు వత్తాసుగా శ్రీశ్రీనే నిలపడానికి అగ్రవర్ణాల ప్రగతిశీలురు చేయని ప్రయత్నం లేదు. చివరకు వ్యక్తి పూజకు కూడా బరితెగించారు. మార్క్సిజానికి సమాధి తోడారు.
మహాకవులను నిలిపే ప్రయత్నంలో శివసాగర్ వాళ్ళకి కనబడలేదు. అవును. వాళ్ళు అంధ సాహిత్య సామ్రాజ్యవాదులు. కుహనా అభ్యుదయ ఛాందసులు. విప్లవ కవిత్వానికి కొత్త వనె్నలు అద్దిన శివసాగర్ వారికి సరిగ్గా కనబడడం లేదు. నవ్య వ్యక్తీకరణ, కవిత్వ సౌందర్య భావనలని సమన్వయించి తాజాదనపు పరిమళాలు అద్దిన శివసాగర్ కనుపించకపోవడం తెలుగుజాతి చేసుకున్న దౌర్భాగ్యం. ఆంగ్ల, ఫ్రెంచి కవిత్వాలను అనువదించిన వాళ్ళు మహాకవులయ్యారు. రష్యన్ ఉద్యమాల ప్రేరణని ఇతివృత్తంగా మలిచినందుకు అవార్డులు పొందారు. సినీ రొంపిలో బతుకంతా గడిపి వందలాదిగా పాటలు రాస్తే దాంట్లో ప్రగతి వాసనలను పీల్చారు.
వీటన్నింటికి దూరంగా గంగలు దాటి, అడవులు దాటి కొండలు దాటి కోనల్లోని సోదరులతో కలిసి యుద్ధం చేసిన శివసాగరుడు దూరపువాడయ్యాడు. విచిత్రం ఏమంటే ఆ యుద్ధాన్ని అభిలషించే వాళ్ళకు కూడా దూరపువాడు కావడానికి కారణం కేవలం అతని మహోజ్వల కవిత్వమే. అతని ఛాయల స్థాయిని కూడా అందుకోనివారు కవులు అయ్యారు. అతని కవిత్వాన్ని కాపీ కొట్టి సాహిత్య అకాడమీ తదితర అవార్డులు సైతం కొందరు పొందారు.
శివసాగర్ కవిత్వం చదివి సాహిత్యలోకం ఎంతో ప్రభావితమైంది. కాని అతడికి తమ కృతజ్ఞతలు తెలుపుకోలేదెవరూ. శివసాగర్, గద్దర్‌ల కవిత్వం లేకపోతే విప్లవ కవిత్వం నినాద కవిత్వం అన్న విమర్శకుల మాట నిజమయ్యేది!
ఒక చేత ఆయుధంతో యుద్ధం, మరో చేత కలంతో యుద్ధం. వర్గపోరాటం చేస్తూ, భావ విప్లవరంగంలో పోరాడుతూ ఒక ప్రజాకవి ఎంతటి అత్యున్నత శిఖరాలు అందుకోగలడో శివసాగరే ఉదాహరణగా నిలుస్తాడు. ఆనాటి పీపుల్స్‌వార్ పార్టీ నుండి బయటకు వచ్చాక ఎంతోమందితో కలిసి పనిచేశాడు. చాలామంది శివసాగర్‌ని ఆసరా చేసుకున్నారు. కానీ శివుడు మాత్రం తొణకలేదు, బెణకలేదు. ఎవరితో ఎంతవరకో అంతే. అంతేకాని ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదు. భావ సంఘర్షణకి లోనయ్యాడన్నది మాత్రం నిజం.
అడుగు వర్గాల ప్రజల చైతన్యానికి అతనొక సంకేతం. వాళ్ళ గుర్తింపుకోసం అహర్నిశలూ తపించాడు. ఎక్కడా ఏనాడూ తన కలాన్ని తప్పుగా వాడలేదు. మనుమలు, మనుమరాళ్ళ మీద కవిత్వాలు రాయలేదు. అవకాశవాదంలోపడి నర్సుల మీద కవితలు రాయలేదు. రాజ్యంతో చెట్టాపట్టాలు వేయలేదు. ఇతరుల్లాగా ద్వంద్వ నీతులు పలికే నాలుకను, కలాన్ని వాడుకోలేదు. రాజ్యంతో చెట్టాపట్టాలు వేస్తూ తాను మాత్రం విప్లవ హీరో కావాలనుకోలేదు.
పార్టీ స్థాపకులు కొందరు తరువాతి కాలంలో మితవాద పక్షం ఆవహించి, బయటికొచ్చాక కులీనులు కొందరు వాళ్ళ పాదాక్రాంతం అయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కాని శివసాగరుడు ఒక అస్పృశ్యుడు! అందుకే కొందరు పెద్దలు సాహిత్యంలో అతని ఆచూకీని మలపాలనుకున్నారు. అతడి మీద నిందలు వేశారు. రాజకీయంగా హత్య చేయాలని చూశారు. కానీ ప్రజలు అతడి పక్షం నిలిచారు. అతని కవిత్వ అభిమానులు ఆరు పుస్తకాలు కలిపి శివసాగర్ కవిత్వం (1956-2008) అనే సమగ్ర కవిత్వ సంకలనం తెచ్చారు. గుర్రం సీతారం, గుడిపాటి, కీర్తిశేషులు డాక్టర్ హరీష్‌ల శ్రమకు గుర్తుగా ఆ సంకలనంలో శివుడు సజీవుడు.
శివుడు విప్లవ దళిత కవిత్వ సౌందర్య శాస్త్ర నిర్మాత. అతని కవిత్వ బీజాలు నిండిన తెలుగునేల ఒక గొప్ప సాంస్కృతిక విప్లవానికోసం ఎదురు చూస్తున్నది. విప్లవం మనుషులకోసం. మానవతా సాగరంలో కవిత్వ నావలను సిద్ధం చేసి ఉంచాడు. తాను మాత్రం తిరిగిరాని లోకాలకెళ్ళినా, తన అక్షరాలను సామాన్య ప్రజల తరపున ఆయుధాలుగా విల్లు రాసి పోయాడు. అతని కవితలు ఒక నవ్య చైతన్య కేతనాలు.
శివసాగర్‌కి అవార్డులు లేవు. శివుడి పేర కవులకి అవార్డులు ఇచ్చేవారు లేరు. అతని సాహిత్యంపై పుంఖాను పుంఖాలుగా రచనలు చేయలేదెవరూ. కాని అతని పేరు ఒక్కటి చాలు. తెలుగు కవిత్వానికి వేల వెలుగు దివ్వెలుగా ప్రకాశింపచేస్తుంది.
ఆ శివసాగరుడికి కన్నీళ్ళ జేజేలు!
వినమ్రంగా తలవంచిన సెల్యూట్
-జయధీర్ తిరుమలరావు 18042012
http://www.andhrabhoomi.net/content/tribute
-- సత్యమూర్తికి నివాళి --

No comments:
Post a Comment