Thursday, 19 April 2012

ఆకాశంలో సగం


ఆకాశంలో సగం నీవు
అనంత కోటి నక్షత్రాల్లో
సగం నీవు సగం నేను

తూర్పు పవన సంగీతంలో
రాగం నీవు తానం నేను
మనిద్దరం కలిసి
ఉద్యమిస్తే ఉప్పెన
మనిద్దరం కలిసి
విప్లవిస్తే విజయం
ఆకాశంలో సగం నీవు

విప్లవ పథంలో మనిద్దరం
ఒకరినొకరం బాస చేసుకొనేవేళ
విప్లవ పథానికి మనిద్దరం
కలిసి కట్టుగా బాస చేసిన వేళ
త్యాగం మన పేరు
పోరాటం మన ఊరు

ఆకాశంలో సగం నీవు
అనంత కోటి నక్షత్రాల్లో
సగం నీవు సగం నేను
విప్లవాకాశంలో

మావో కవితకు అనువాదం
చేసిన కవి శివసాగర్
http://patrika.teluguwebmedia.in/2010/03/blog-post_2561.html

No comments:

Post a Comment