Tuesday, 24 April 2012

జార్జి రెడ్డివారసత్వం

రాత్రి పన్నెండు కావస్తున్నది. మహానది బ్లాక్, సెల్ నెంబర్-1. కటకటాల వెనక నుంచి జార్జిడ్డి పలకరించాడు. 40 ఏళ్ల క్రితం హిందూమత దురహంకార, కాంగ్రెస్, సోషలిస్టు ముసుగులోని గూండాల మిలాఖత్ పరిణామంగా.. ఏర్పడ్డ ముఠా, ఉస్మానియా ఇంజనీరింగ్‌కాలేజీ వెనకాల హాస్టల్ గది తలుపు తట్టి, జార్జి తలుపులు తెరవగానే కత్తులతో పొడిచి 14 ఏప్రిల్, 1972న దారుణంగా హతమార్చారు. ఆ జార్జి మూడు నాలుగు రోజులనుంచీ నన్నెందుకు పలకరిస్తున్నాడు...

ఇదే అడిగితే...‘చాలా నిజాలు ప్రపంచానికి తెలియజేయాలి. మాజీ తహశీల్దార్ గురువాడ్డి బంగ్లా గేటు బయట సిమెంట్ గద్దె మీద కూర్చొని హైదరాబాద్ మహానగరాన్ని, స్మాల్‌టౌన్‌లో పుట్టి పెరిగిన నీవు బిత్తరి కండ్లతో మొదటిసారి చూస్తున్నప్పుడు నిన్ను మొదటిసారి చూశాను. సిరిల్‌ను ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్ యూనియన్ ఎన్నికల్లో నిలబెట్టిన, గెలిపించిన’ అన్నాడు. ఐదడుగుల నాలుగు అంగులాల ఎత్తు, గోధుమఛాయ యువకుడు జార్జి. ‘తుషార్ నువ్వప్పు డు సిటీ కొచ్చి కొన్ని రోజులే అయింది. గురువాడ్డి పెద్ద కొడుకు సతీష్ అతని మిత్రమండలిలో ఒకడైన దిలీప్(బూర్గుల దిలీప్) నీతో స్నేహం పెంచుకున్నారు. ధనవంతురాలైన తల్లి గారాబాల కొడుకుల్లో ఒకడు. ఆ కాలంలో హైదరాబాద్‌లో ఇంప్టోడ్ టూ-వీలర్-ఫైబర్ బాడీ హోండా బైక్‌తో తిరుగుతాడు. నీతో నా హత్యకు కొన్నిరోజుల తరువాత నన్నుగుర్తు చేసుకుంటూ ఒకసారి ఇలా అన్నాడు. గుర్తుందా

‘యార్ జార్జ్, అగర్ ఝోప్‌డీ మే రహనే వాలీ తేరీ జనతా, తెరెకు బులానేకు ఆయే ..,కి మున్సిపాల్టీ వాలే హమారే ఝోప్‌డోంకో ఆగ్ లగారై.. జార్జ్ అన్నా తుమె హమారే సాథ్ చలో’ అదే సమయంలో నీ తల్లి లీలాడ్డి (వర్గీస్) బీమారై నిన్ను పిలుస్తూ ఉంటే నువ్వెటుపోతావు అని ప్రశ్నవేసినప్పుడు జార్జ్, నిర్మొహమాటంగా ఒక్క క్షణంపాటు ఆలోచించకుండా నీవిచ్చిన సమాధానం నా చెవుల్లో ఇప్పటికీ మోగుతున్నది. ‘బే శక్ మై అడిక్‌మెట్ కీ ఝోపిడీ బస్తీ వాలోంకే సాథ్ జావుంగా..!’‘కైకూ జార్జ్, వో దేక్ హమారా తేరీ అమ్మీనే భీ పఢ్ కర్ కబ్ హోగయే రే’ అని అలీ నిలదీస్తే నీవన్న మాటలు మరువలేనివి.

‘నా తల్లి మధ్యతరగతి మహిళ. ప్రభుత్వం మాఅమ్మకు చెల్లిస్తున్న జీతం ఆ పేద ప్రజల శ్రమ నుంచి వచ్చిన అదనపు విలువలో ఒక చిన్న భాగం. కావున నేను, నా తల్లి, సమస్త మధ్య తరగతి ప్రజలూ అందరం ఆ శ్రామిక ప్రజలకు రుణపడి ఉన్నాం. నాలేమిలో (నేను లేకున్నా)మా అమ్మ ఆస్పత్రి ఖర్చులు భరించి కోలుకుంటుంది. కానీ వారి బస్తీ నేలమట్టం కాకుండా కాపాడటంలో నావంతు ప్రయ త్నం చేయటమే ఆ క్షణంలో నా ప్రజల పక్షాన నిలవటమే నా కర్తవ్యం అవుతుంది అన్నావు నీవు. బద్రీ, ఏబీవీపీ,కాంగ్రెస్ కూటమి నిన్ను చంపే కుట్ర పన్నటానికి నీ సుస్పష్టమైన ఈ వర్గ దృక్పథం నీకు ఉండటం ఒక కారణమైతే, వారు స్వయానా దొరల కొడుకులు కావటం ఇంకొక ప్రత్యక్ష కారణం. మతదురహంకారం, భూమి పై జాగీర్లపై ఆజమాయిషీ అధికారం నిలుపుకోవటం వారి తక్షణ అవసరం.

తెలంగాణ సాయుధ పోరాటం తర్వాత మఖ్దూంమోహియొద్దీన్ ప్రభావం పోయి ఉస్మానియా క్యాంపస్‌లో ఆర్ట్స్‌కాలేజీ, లా కాలేజీలు కేంద్రంగా దొరల, రెడ్ల ఏక ఛత్రాధిపత్యం నడుస్తున్నది. ఆ ఆధిపత్యాన్ని ఎదిరించి ఇంజనీరింగ్, సైన్స్ కాలేజీలు కేంద్రాలుగా జార్జి నాయకత్వంలో విప్లవ భావాలతో కొత్త తరం ముందుకు వచ్చింది. పాత కాంగ్రెస్ సోషలిస్టుల సంబంధాలతో తెగతెంపులు చేసుకుని నీవు విప్లవ పార్టీ అన్వేషణ కోసం క్యాంపస్ టూ క్యాంపస్, ఉస్మానియా టూ వరంగల్ ఆర్‌ఈసీ సైకిల్ ర్యాలీ ఆర్గనైజ్ చేసినప్పుడు మేం అమాయకులం. దారి లో యాదగిరిగుట్టల వైపు చూపుతూ క్యూబాలో చే-గువేరా ఇలాంటి కొండలనుంచి విముక్తియుద్ధం మొదలు పెట్టిండని ఉత్తేజపరిచినవ్.ఆ రోజు రాత్రి మేమం తా అలిసిపోయి నిద్రపోతుంటే.. నీవు మాత్రం సూరపనేని జనార్దన్‌తో సిద్ధాంతాల పై చర్చించి పార్టీ సంబంధాలు కావాలని కోరావు.అండర్‌గ్రౌండ్ పార్టీ కాంటాక్ట్ అంత సులభం కాదన్న సూరపనేని మాటలు విని నీవు నిరాశ పడలేదు.

దురదృష్టవశాత్తు 1972 ఏప్రిల్ 14న భౌతికంగా నీవు మాకు దూరం అయ్యా వు. కానీ నీ హత్య యావత్ ఆంధ్రవూపదేశ్ విద్యార్థిలోకంలో విప్లవ వెల్లువనే సృష్టిస్తుందని పాలకవర్గాలు ఊహించలేదు. ధరలకు వ్యతిరేకంగా జరిగిన 1973 ఉద్యమంలో సోషలిస్టు యూత్‌ఫోరం, డెమొక్షికటిక్ స్టూడెంట్స్‌ల నుంచి బయటికి వచ్చి, నీ హత్య తరువాత మేము చేసిన మొట్టమొదటి ప్రజా ఉద్యమం. పదివేల మందితో సెక్రటేరియట్ వరకు ఊరేగింపుగా వెళ్లినం. నీ హత్యకు నిరసనగా క్యాంపస్‌లో పోలీసుల ప్రవేశాన్ని అడ్డుకున్నం.

తెలంగాణ విషయంపై విప్లవపంథాపై విభేదించిన నీ అనుచరులు కొందరు మహిపాల్‌డ్డి, జంపాలప్రసాద్‌ల నాయకత్వాన నీలంరాంచంవూదయ్య ప్రత్యక్ష పర్యవేక్షణలో మితవాద ప్రతిఘటన పంథాలో పయనించారు. మొదటి నుంచి రహస్యంగా ఉంటూ తుషార్, గోపు లింగాడ్డి (అప్పుడు విరసం సిటీ యూనిట్ కన్వీనర్)ల నాయకత్వంలో 1974 పీడీఎస్ పట్టణ మహాసభలో (నగర మహాసభ)పాల్గొని 40 శాతం ఎగ్జిక్యూటివ్ పదవులు దక్కించుకున్నారు. దీంతో బెంబేపూ త్తి అక్టోబర్ రాష్ట్ర మహాసభల సమయానికి నక్సల్‌బరీ నినాదం సాకుగా విద్యార్థి సంఘం ఐక్యతకు తూట్లు పొడిచారు. అప్పటికే ఓయూ గాక, కాకతీయ మెడికల్ కాలేజీ, ఆర్‌ఈసీ (వరంగల్), కరీంనగర్ (ఎస్‌ఆర్‌ఆర్, జమ్మికుంట, జగిత్యాల)లాంటి తెలంగాణ కేంద్రాల్లోనే గాక, ఏయూ (విశాఖ), గుంటూరు మెడికల్ కాలేజీ, ఎస్‌వీయూ (తిరుపతి), అనంతపురం తదితర కేంద్రాల్లో హైదరాబాద్‌లో 1973 లోనే ప్రొగ్రెసివ్ డెమొక్షికటిక్ స్టూడెంట్స్ యూనియన్ స్థాపించాలని ఏర్పాట్లు పూర్తిచేశారు.

ఆ పేరుతో కరపవూతాలు అచ్చువేసి పెట్టుకున్న సూరపనేని వంటి ముఖ్యమైన నేతల వ్యతిరేకత వల్ల దానిని వాయిదా వేశారు. అక్టోబర్ 1974 చీలిక చివరికి మావో అన్నట్లు ‘టర్న్ ఎ బ్యాడ్ థింగ్ ఇన్ టూ ఎ గుడ్ థింగ్’గా మారింది. ఇది మంచి పరిణామంగానే పరిణమించింది. 1974 ఏప్రిల్ నాడు నీఫోటోతో పుస్తకం అచ్చేసి సరోజినీదేవీ హాల్ ప్రాంగణంలో జననాట్యమండలి కలిసిరాగా భవిష్యత్ కార్యక్షికమం, నీ రెండవ వర్ధంతి జరుపుకున్నాం. నేడు వేళ్లూనుకొని లక్షల కొమ్మల మహావృక్షమై విప్లవోద్యమం లాల్‌గఢ్ దాటి మధ్యభారతంలో ప్రజలకు విప్లవ ప్రత్యామ్నాయంగా వికసించింది. ఈ సుదీర్ఘ యాత్రలో జార్జ్‌ను ఒక్క క్షణం మరువలేదు. మరువబోము. మితవాదం ఓడిపోయింది. దండకారణ్యంనిలిచిం ది. లాల్‌సలాం జార్జ్.
తుషార్
http://www.namasthetelangaana.com/Editpage/article.asp?category=1&subCategory=7&ContentId=97570

No comments:

Post a Comment