ఈ రాత్రి
ఉరికంబం భయంతో ఒణికింది
ఉరితియ్యబడ్డ శిరస్సు
సగర్వంగా చదివిన
మానవుని ప్రోగ్రెస్ రిపోర్ట్ విని
ఈ రాత్రి
ఉరికంబం గజ గజా ఒణికింది
ఉరితియ్యబడ్డ శిరస్సు పెదాల పై
చెదరని చిరునవ్వును చూసి
ఈ రాత్రి
ఉరితియ్యబడ్డ శిరస్సు
ఉరినే ఉరితీసింది
(భూమయ్య, కిష్టాగౌడ్ లని ఉరితీసిన సమయంలో శివసాగర్ వ్రాసిన కవిత)
http://patrika.teluguwebmedia.in/2009/12/blog-post_31.html
No comments:
Post a Comment