సత్యమూర్తి అలియాస్ శివసాగర్ తన మరణం గురించి రాస్తానని చెప్పాడు. ఆయన చేత ఆత్మ కథ రాయించడానికి నేను చాలానే ప్రయత్నించాను. కానీ అప్పుడు నేను ఆ పని చేయలేక పోయాను. ఆ తర్వాత ఆయన అది రాసినట్టు తెలుసు. కానీ ఆ ప్రతి అందలేదు.ఎక్కడో పత్రికల చుట్టూ తిరిగి అది అచ్చు కాకుండానే ఉండి పోయినట్టు మిత్రులు చెప్పారు. తన మర ణం గురించి రాస్తానని చెప్పి రాయకుండానే వెళ్ళిపోయాడాయన.
విప్లవ భావుకుడిగా అతను జీవితం ఎత్తుపల్లాలను చూశాడు.నెత్తుటి ధారలను, కన్నీటిని చూశాడు. మూ డు దశాబ్దాల కిందట పీపుల్స్‌వార్ గ్రూప్ వ్యవస్థాపక సభ్యుడిగా విప్లవ సాధన కోసం ఎన్నో ప్రయోగాలు చేశాడు. మిగిలింది నిరాశా నిస్పృహలే. శివసాగర్‌గా జనం గుండెల్లో స్థిరపడిన కె.జి.సత్యమూర్తి అక్కడ ఇమడలేక బయటకు వచ్చాడు.అయితే తన లక్ష్యసాధనకు అవసరమైన దృష్టిని కోల్పోలేదు. జీవితం ఆయనకు ప్రేరణ. మానవ విముక్తి ఆయనను ముందుకు నడిపిస్తుంది.‘నేనునా మరణం గురించి కూడా రాయా లనుకుంటున్నాను. నేను మరణాన్ని గొప్ప జుబిలియేషన్‌తో, రింగింగ్ బెల్స్‌తో, బీటింగ్ డ్రమ్స్‌తో ఆహ్వానిస్తాను అని శివసాగర్ ఒకసారి నాతో అన్నాడు. రివల్యూషనరీ రొమాంటిక్ లేబుల్‌తో సంతృప్తి చెందుతున్నారా అని అడిగితే ‘ప్రాథమికంగా అదే లక్షణం నాలో కొనసాగుతోంది. నా కవిత్వం ప్రధానంగా నాకు సంబంధించిన రివల్యూషనరీ సైకాలజీ కళాత్మక పరిశోధన అన్నాడు. రివల్యూషనరీ పెర్సెప్షన్‌లో మార్పేమైనా వచ్చిందా అని అడిగితే ‘నా కవిత్వం విప్లవ ప్రస్థానం. అది దానంతటదే విప్లవంతో పెనవేసుకుపోయింది. నా అభివూపాయంలో నిజమైన విప్లవం జీవితంలోని రాజకీయ, సామాజిక, సాంస్కతికరంగాల అన్ని పార్శాల తలుపులు తడుతుంది.
విప్లవం కానీ, విప్లవ కవిత్వం కానీ రాజకీయ రంగం ఒక్కదానికే పరిమితం కాదు అని శివసాగర్ అన్నారు. పీపుల్స్‌వార్ నుంచి బీఎస్పీ వరకు, ఆ తరువాత బహుజన రిపబ్లికన్ పార్టీ... మిగిలిందంతా నిరాశానే అని అడిగితే, నాకు అపాయింట్‌మెంట్స్ మాత్రమే ఉన్నాయి, డిస పాయింట్‌మెంట్స్ లేవు అంటూ నవ్వాడు. ‘విప్లవం ఇప్పటికీ ప్రయోగ దశలోనే ఉన్నది. సాయుధ పోరాటంగా మలుపు తిప్పేందుకు రాజకీయ ఘర్షణ అవసరం అని ఆయన అభివూపాయపడ్డారు. కవిగా తన స్థానం గురించి అడిగినప్పుడు-‘విప్లవ దళితుడిగా విప్లవ కవిత్వం రాశాను. దళిత విప్లవకారుడిగా దళిత కవిత్వం రాశాను. ఇప్పుడు దళిత, స్త్రీవాద, విప్లవ కవిత్వాన్ని సింథసైజ్ చేయాలనుకుంటున్నాను.నాకు సం బంధించినంత వరకు కవిత్వం మెంటల్, ఇమోషనల్ ఫోటోక్షిగఫీ’ అన్నారు శివసాగర్. మీకు ఇష్టమైన కవు లు ఎవరని అడిగితే ‘ఆధునిక కవుల్లో కృష్ణశాస్త్రి, ప్రగతి శీల కవుల్లో శ్రీశ్రీ, విప్లవకవుల్లో చెరబండరాజు, గద్దర్, దళిత కవుల్లో మద్దూరి నాగేష్ బాబు, పైడి తైరేష్ బాబు నాకు ఇష్టం’ అన్నారాయన. కవిగా మీకు న్న ఫాంటసీలేమిటని అడినప్పుడు- ‘జీవితం, విప్లవ ఎగుడుదిగుడులు.విప్లవం నిరాశాజనకంగా ఉన్నప్పు డు కవిత్వం రాశాను. శ్రీకాకుళ పోరాటం విఫలమైన తరువాత ఉద్యమం నెలబాలుడు రాశాను’ అన్నారు.
-కాసుల ప్రతాప్‌రెడ్డి, 94956375
http://www.namasthetelangaana.com/Editpage/article.asp?category=1&subCategory=7&ContentId=96127

No comments:
Post a Comment