"అన్నతో ఉద్యమం' అను..బంధం
అన్నదమ్ములు - 1
అన్నదమ్ముల మధ్య చిన్నతనంలో ఆటలుంటాయి. మాటలుంటాయి. అనురాగ ఆప్యాయతలు ఉంటాయి. పెరిగి పెద్దయ్యే కొద్దీ కుటుంబ పరమైన అనుబంధాలు గాఢమవుతాయి. కానీ... మల్లోజుల సోదరుల మధ్య వీటితోపాటు ఉద్యమ బంధమూ బలపడింది. అన్న కిషన్‌జీ గురించి తమ్ముడు వేణుగోపాలరావు ఆంధ్రజ్యోతికి రాసిన లేఖ ఈ అనుబంధాల చిత్రీకరణతోనే మొదలైంది. ఆ ఇద్దరి బంధం గురించి మావోయిస్టు అగ్రనేతలు ఏమన్నారో ఆ లేఖే చెబుతుంది.
తోడుబుట్టినవాడు
'అన్నతో ఉద్యమం' అను.. బంధం
http://andhrajyothy.com/mainnewsshow.asp?qry=2012/apr/12/main/12main7&more=2012/apr/12/main/main&date=4/12/2012
అన్నదమ్ముల మధ్య చిన్నతనంలో ఆటలుంటాయి. మాటలుంటాయి. అనురాగ ఆప్యాయతలుంటాయి. పెరిగి పెద్దయ్యేకొద్దీ కుటుంబ పరమైన అనుబంధాలు గాఢమవుతాయి. కానీ... 'మల్లోజుల' సోదరుల మధ్య వీటితోపాటు ఉద్యమ బంధమూ బలపడింది. అన్న కిషన్‌జీ గురించి తమ్ముడు వేణుగోపాలరావు 'ఆంధ్రజ్యోతి'కి రాసిన లేఖ ఈ అనుబంధాల చిత్రీకరణతోనే మొదలైంది. ఆ ఇద్దరి బంధం గురించి మావోయిస్టు అగ్రనేతలు ఏమన్నారో ఆ లేఖే చెబుతుంది.
"2011 నవంబర్ 24 నుంచి ఇప్పటి వరకూ కామ్రేడ్ కిషన్‌జీ జ్ఞాపకాలు నిరంతరం నా స్మృతిపథంలో మెదులుతూనే ఉన్నాయి. 54 సంవత్సరాల నా జీవితం ఆయన నుంచి ఒక్క క్షణం కూడా విడదీయరానంతగా అల్లుకు పోయి, గాఢమైన ఆత్మీయ అనుబంధంతో నిండిపోయింది. 'రక్త సంబంధంకన్నా వర్గ సంబంధం మిన్న' అని నమ్మిన సంబంధం వర్గ రాజకీయాలకు లోబడి సాగిన నెత్తుటి బంధంతో నిండిన విప్లవ బంధం మాది.
కిషన్‌జీ అమరత్వం విన్న తర్వాత మా పార్టీ నాయకుడు కామ్రేడ్ జీఎస్ రాసిన మాటల్లో చెప్పాలంటే... 'రామ్‌జీ (కిషన్‌జీ) నీకు సోదరుడే కాదు, అంతకంటే ఎక్కువగా గురువు, సహచరుడు, నాయకుడు. ఈ నష్టం వ్యక్తిగతంగాకంటే పార్టీకి, విప్లవానికి తీరనిదని నీవు దుఃఖిస్తున్నావు కదూ! నీకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను' అని ఆయన రాశారు.
మా పార్టీ మరో నాయకుడు, మధ్య రీజియన్ కార్యదర్శి కామ్రేడ్ ఆనంద్ రాసిన మాటల్లో చెప్పాలంటే... 'వారిది రక్త సంబంధమేగాక, కామ్రేడ్స్ ఇన్ ఆర్మ్స్‌లాగా ఉద్యమంలో పని చేశారు. రాజకీయ మితృత్వాన్ని కోల్పోవడంతో ఆయనకు తీవ్ర మనస్తాపం కలుగుతుంది. ఈ సమయంలో నేను దగ్గరగా లేకపోవడాన్ని దురదృష్టంగా భావిస్తున్నాను' అంటూ రాశారు.
నిజంగా కామ్రేడ్ కిషన్‌జీ నా తోడబుట్టిన వాడు కావడం నాకెంతో గర్వకారణంగా ఉంది. ఆయన నాకు నాయకుడు కావడం నా జీవితానికి ఆదర్శంగా నిలుస్తోంది. ఆయన నన్ను విప్లవోద్యమంలోకి తీసుకురావడానికి, నిలబెట్టడానికి చేసిన కృషి, అందించిన తోడ్పాటు ఏ తోటి కామ్రేడ్‌కు ఇచ్చినదానికన్నా తక్కువ కాదు. నేను విప్లవోద్యమంలో ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాను. బాల్యంనాటి కోటన్న జ్ఞాపకాలు నాపై చాలా బలంగా ముద్రపడిపోయాయి. ఇంట్లో ముగ్గురం అన్నదమ్ములం. నాకు కోటన్నతోనే అనుబంధం ఎక్కువ.
అన్నదమ్ములుగా పావురం (అనుబంధం) ఎక్కువగా పంచుకున్నది ఆయనతోనే. చిన్న పిల్లలుగా కలెబడ్డది ఆయనతోనే. నాకు చదువు చెప్పడానికి, ముఖ్యంగా గణితం చెప్పడానికి చాలా శ్రద్ధ చూపేవాడు. ఎన్నోసార్లు ఆయన చేతిలో దెబ్బలు తిన్నాను! కానీ... దగ్గరికి తీసుకొని, గుండెకద్దుకొని, తలనిమిరి ప్రేమను పంచుకోవడంతో దూదిపింజలా ఆ బాధ మర్చి పోయి నవ్వుతూ పరుగెత్తడం నాకు ఇంకా గుర్తే. ఇంటి వెనుక పెరట్లో కాయగూరల చెట్లకు ఉదయం సాయంత్రం నీళ్లు పోయడం, ఇంట్లో పొయ్యిలోకి కర్రలు కొట్టివ్వడం ఆయన చేస్తుంటే... నేనూ, అమ్మా, అందరం తోడుండేది.
ఈ అనుభవం మధ్య తరగతి కుటుంబాల పిల్లల్లో చాలా సాధారణమైందే. కానీ, మేం పెరుగుతున్న కొద్దీ మా మధ్య రాజకీయ వాతావరణంలో స్నేహం, చర్చలూ పెరగసాగాయి. ఆయన చెప్పిన విప్లవ కార్యక్రమాల్లో నేను నిమగ్నం కావడం పెరిగింది. మా బాపు (నాన్న), అన్న మధ్య రాజకీయ చర్చలు ఎక్కువగా జరిగేవి.
ఆంధ్ర మహాసభ, రజాకార్లు (నిజాం సైన్యాలు) కమ్యూనిస్టుల గురించి వాళ్ల మధ్య జరిగే చర్చ, నిజాయితీ కలిగిన కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల నాయకులు వచ్చి మా ఇంట్లో బాపుతో జరిపే చర్చలు ఆసక్తికరంగా ఉండేవి. అవి కోటన్నలో హేతువాద దృక్పథాన్నీ, ప్రగతిశీల భావాలనూ పెంచాయి. ఖాకీ నిక్కర్ వేసుకొని, కర్ర పట్టుకొని, కాషాయ జెండా వారి శాఖ కార్యక్రమాలకు వెళ్లిన ఆయనలో... ఒక వైపు ఇంట్లో చర్చలు, మరో వైపు 1960ల కల్లోల దశాబ్దం (హంగ్రీ సిక్స్‌టీస్) మౌలిక మార్పులకు పునాదులు వేసింది.
1969లో యువత ప్రత్యేక తెలంగాణ నినాదంతో వీధుల్లోకి వచ్చింది. ఆ సమయంలోనే 'వసంత కాల మేఘ ఘర్జన' మన దేశాన్ని ఒక కుదుపు కుదిపింది. ఒకవైపు ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, మరోవైపు దేశవ్యాప్తంగా నక్సల్బరీ రాజకీయ విప్లవోద్యమం... ఎక్కడికక్కడే యువతను విపరీతంగా ఆకర్షించాయి. ఈ రెండూ తీవ్ర అసమానతల ఫలితంగానే తలెత్తాయి. మొదటిది ప్రాంతాల మధ్య దోపిడీతో తలెత్తిన అసమానతల ఫలితంగా తలెత్తింది.
మరొకటి వర్గాల మధ్య కొనసాగుతున్న ఆర్థిక, రాజకీయ దోపిడీ - అసమానతల మూలంగా అనివార్యమైంది. ప్రాంతాల మధ్య అసమానతలు, ప్రాంతాల విభజనతో పరిసమాప్తి అయ్యేది ఎంత మాత్రం కాదనీ... భారతదేశమే అసమానాభివృద్ధి కలిగి ఉన్న దేశమనీ నక్సల్బరీ విప్లవోద్యమం సుస్పష్టం చేసింది. అయినప్పటికీ, ప్రాంతాల మధ్య అసమానతలు ఏనాటికానాటికి తీవ్రమవుతూండడంతో ముందుకొచ్చిన విభజనోద్యమాలను ప్రజల ఆకాంక్షల నేపథ్యంలో, మార్క్సిస్టు అవగాహనతో నిర్ద్వంద్వంగా, తొలిసారిగా సమర్థించిన విప్లవ పార్టీ... భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు-లెనిస్టు).
కోటన్న క్రియాశీలకంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. కొద్ది రోజులు జైళ్లోనూ గడిపి వచ్చారు. కానీ... ఆ ఉద్యమాన్ని దొరల నాయకత్వం (మర్రి చెన్నారెడ్డి నాయకత్వం వహించిన తెలంగాణ ప్రజాసమితి) నీరు గార్చింది. తెలంగాణ మరోసారి మోసపోయింది. 1946-51 మధ్య వీరోచితంగా సాగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం మూడువేల గ్రామాలను విముక్తి చేసి, పది లక్షల ఎకరాల దొరల భూములను పేద రైతాంగానికి పంపకం చేసి... చివరకు నాయకత్వ ద్రోహానికి బలైంది.
సరిగ్గా అదే కాలంలో దీర్ఘకాల ప్రజాయుద్ధ పంథాలో ప్రాంతాల వారీగా రాజ్యాధికార స్వాధీన వ్యూహంతో సాగిన చైనా విప్లవోద్యమం విజయం సాధించగా... తెలంగాణ విమోచనోద్యమం మాత్రం ద్రోహానికి బలైంది. మళ్లీ అదే రీతిలో 1969 ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం దొరల ద్రోహానికి బలైంది. నిజమైన కార్మికవర్గ విప్లవ పార్టీ నాయకత్వం లేకుండా జాతుల విముక్తి పోరాటాల సైతం విజయం సాధించలేమని టర్కీ కెమెల్‌పాషా తర్వాతి ప్రపంచ పరిణామాల నేపథ్యంలో మార్క్సిజం చాలా ముందుగానే తేటతెల్లం చేసింది.
అందుకే వర్గ యుద్ధాలు, జాతి ఉద్యమాలు నిజమైన విప్లవ కార్మిక వర్గ పార్టీలు లేకుండా తమ లక్ష్యాలను సాధించలేవని తెలిసి వచ్చిన కోటన్న, కోటి రత్నాల వీణ తెలంగాణను దాటి 'ప్రపంచ కార్మికులారా! ఏకం కండి! పోరాడితే పోయేది ఏమీ లేదు, బానిస సంకెళ్లు తప్ప!' అనే చరిత్రాత్మక సత్యంతో మమేకమైనాడు. నక్సల్బరీ, శ్రీకాకుళ పోరాట వారసత్వ జెండాను ఎత్తిపట్టాడు. ఉన్నత విద్య కోసం పుట్టి, పెరిగిన పెద్దపల్లి వదిలి జిల్లా ముఖ్య పట్టణం కరీంనగర్ చేరాడు.
పైచదువులకు కరీంనగర్ వెళ్లిన కోటన్న, అక్కడ ఉన్నత విద్యతో పాటు విప్లవ రాజకీయాల పోరాటాక్షరాలు దిద్దుకోసాగాడు. చదువులో చురుకైనవాడు కావడం, విప్లవ రాజకీయాలతో మమేకం అవుతుండటంతో సహజంగానే తోటి యువకులతో మంచి గుర్తింపు వచ్చింది. 1990 దశకంలో మహారాష్ట్రలోని చంద్రపూర్‌లో న్యాయవాద వృత్తి కొనసాగిస్తూ, విప్లవ రాజకీయాలకు దూరం కాలేక, శత్రువు నిర్బంధానికి తట్టుకోలేక కుటుంబ ఒత్తిళ్ల మధ్య చందుపట్ల కృష్ణారెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు.
కోటన్న రాజకీయాల్లో చేరాక అత్యంత సన్నిహితుడైన వాడు ఈయనే. 1973లో కోటన్న, కృష్ణారెడ్డి కలిసి స్వాతంత్య్ర బూటకాన్ని ఎండగడుతూ నిరసనగా మూడు రంగుల జెండాకు నిప్పుపెట్టారంటే, ఆనాడు ఆ యువకుల్లో నిజమైన స్వాతంత్య్ర సముపార్జన కోసం రగిలిన ఆగ్రహ పరితాపాలను అర్థం చేసుకోగలిగిన వాళ్లు... కోటన్న రామ్‌జీగా, కిషన్‌జీగా ఎదగడాన్ని సవ్యంగానే అర్థం చేసుకోగలుగుతారు.
రాష్ట్రంలో విరసం ఏర్పాటు తర్వాత మొదలైన ఇతర విప్లవ ప్రజాసంఘాల నిర్మాణం లో కోటన్న చురుకైన నాయకత్వ పాత్ర పోషించారు. ఎమర్జెన్సీ చీకటిరోజుల్లో రహస్య జీవి తం గడిపిన విప్లవకారులలో కామ్రేడ్ కోటన్న ఒకరు. ఎలాంటి పరిచయాలనైనా రాజకీయ, విప్లవ సంబంధాలుగా మలచుకోగలగడం ఆయన ప్రత్యేకత అని చెప్పుకోవాలి. ఎక్కడ షెల్టర్ తీసుకున్నా ఆ ఇంటి పిల్లలకు ప్రియమైన మామయ్యగానో, బాబాయ్‌గానో... మహిళలకు ప్రేమను పంచే అన్నగానో, తమ్ముడిగానో, కొడుకుగానో వ్యవహరిస్తూ సొంతిల్లులాగా వ్యవహరించడం ఆయనలోని విప్లవ, మానవీయ సంబంధాల కోణాన్ని ప్రతిబింబిస్తుంది.
ఆయన అమరత్వం తర్వాత ఒక సీనియర్ కామ్రేడ్ నాకు రాసిన ఉత్తరంలోని మాటల్లో చెప్పాలంటే... "నేను దాదా (అన్న)తో లాల్‌గఢ్‌లో తిరిగినపుడు ఏ వూరికి వెళ్లినా పిల్లలంతా పోటీపడి, ఆయన చేయిపట్టుకు నడుస్తూ ఊరి ముచ్చట్లు పంచుకుంటుంటే.. వీధి మహిళలు తమ ఇంట్లోకి ఆహ్వానించిన దృశ్యాలు నేను మరువలేకపోతున్నాను'' అంటూ ఆ ప్రజా నాయకుడికి, ప్రజలతో అల్లుకుపోయిన అనుబంధాలను తన మాటల్లో వ్యక్తం చేశారు. ప్రజలతో అంతటి ఘనీభవించిన సంబంధాలు పెంచుకోలేని వాళ్లు విప్లవోద్యమంలో రహస్య జీవితాన్ని గడపలేరు.
ఆ జన జీవన స్రవంతికి దూరమైన వాళ్లు ఏనాటికైనా ఖాకీల మురికి కూపంలో కలువాల్సిందే. కోటన్న ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో తన ఇంటికన్నా ఎక్కువగా బంధువుల ఇళ్లనూ, మిత్రుల ఇళ్లనూ, వారి మిత్రుల ఇళ్లనూ తనకూ, తన తోటి రహస్య పార్టీ కార్యకర్తలకూ షెల్టర్‌గానే కాకుండా.... వారి దైనందిన ఖర్చుల కోసం 'చంద్రునికో నూలు పోగు'లా ఆర్థిక సహాయం కూడా పొందడంలో ఆయన ఎంత సమర్థవంతుడైన ఆర్గనైజరో వేములవాడ స్వాతంత్య్ర సమరయోధుడైన గుమ్మి పుల్లయ్య, రుక్కమ్మ మాటల ద్వారానే తెలుసుకోవాలి. 'కోటన్న మరణం మా సొంత కొడుకును కోల్పోయినంత బాధగా ఉంది' అని వారు అన్నారు.
గని, వని, కర్మాగారం, కారాగారం... ఎక్కడున్నా ఉద్యమ గీతికలే! కోటన్నకు ఈ ప్రపంచమే విప్లవ పాఠశాల. జీవితంలో ఒకే ఒకసారి అరెస్టయిన కిషన్‌జీ... ఎలా బయటపడ్డారు? ఎమర్జెన్సీ అనంతర రైతాంగ పోరాటంలో ఆయన ఎలాంటి పాత్ర పోషించారు?
రేపటి సంచికలో!

No comments:
Post a Comment