Thursday, 12 April 2012

కోటి జ్ఞాపకాలతో..

కోటి జ్ఞాపకాలతో..
అమరుడైన అన్నకు తమ్ముడి అక్షర నివాళి
కిషన్‌జీ విప్లవ ప్రస్థానంపై సుదీర్ఘ లేఖ
ఆంధ్రజ్యోతికి ప్రత్యేకం
ఆయన అన్న.. అడవిలో అన్న...
ఎందరికో అన్న.. అందరితోపాటు...
సొంత తమ్ముడికీ అన్న!
ఒకే తల్లి కడుపున పుట్టి ఉద్యమాల తల్లి ఒడిలో ఒదిగి, ఎదిగి.. ఒకరికి ఒకరుగా, ఆయుధమే తోడుగా కలిసి మెలిసి సాగించిన ప్రస్థానంలో అన్న అడుగులు ఆగిపోయాయి. ఇప్పుడు తమ్ముడికి అన్న జ్ఞాపకాలే మిగిలాయి. అవి కళ్లముందే  సుడులై తిరుగుతున్నాయి. ఆ అన్న... మల్లోజుల వేణుగోపాలరావు. కరీంనగర్ జిల్లా పెద్దపల్లి బిడ్డల్లో మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్‌జీ పోలీసు తూటాలకు నేలకు ఒరిగిపోయారు. గత ఏడాది నవంబర్ 24న ఆయన కన్నుమూశారు. అడవిలోనే ఉన్న మల్లోజుల వేణుగోపాల్ ఇప్పుడు కోటన్న జ్ఞాపకాలను తల్చుకుంటున్నారు. వాటికి అక్షర రూపం ఇచ్చారు.కోటి జ్ఞాపకాలలో కోటన్న పేరిట 12 పేజీల సుదీర్ఘ లేఖను ప్రత్యేకంగా ఆంధ్రజ్యోతికి పంపారు.  ఆయన ఒక మావోయిస్టు! విప్లవ మానవీయ సంబంధాలకు నిలువెత్తు రూపం! సమర్థమైన కమ్యూనిస్టు ఆర్గనైజర్!... ఇవి అన్న గురించి ఆ తమ్ముడు చెప్పిన విశేషణాల్లో ఇవి కొన్ని. ఈ లేఖ అన్నదమ్ముల అనుబంధాన్ని మాత్రమే కాదు. కోటన్న ఉద్యమ ప్రస్థానాన్ని, ఆయన ఆలోచనా సరళిని మన కళ్లముందు నిలుపుతుంది. పెద్దపల్లి కోటన్నగా మొదలైన ప్రస్థానం లాల్ గఢ్ దాదాగా ఎదిగిన వైనాన్ని కళ్లకు కడుతుంది. గతంలో.. సంక్రాంతి సందర్భంగా మల్లోజుల సోదరులు ఊరిలోని తమ తల్లిని, ఊరును పలకరిస్తూ రాసిన లేఖను ఆంధ్రజ్యోతి ప్రచురించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఒంటరి వేణుగోపాల్ అక్షరబద్ధం చేసిన అన్న స్మృతుల సారాన్ని ఆంధ్రజ్యోతి అందిస్తోంది.
రేపటినుంచి వరుసగా...
11-04-2012
ఆంధ్రజ్యోతి

No comments:

Post a Comment