Tuesday, 24 April 2012

దళిత ఉద్యమానికి తీరనిలోటు

కె.జి.సత్యమూర్తి మృతికి సామినేని సంతాపం
కందులపాడు (జి.కొండూరు), న్యూస్‌లైన్ ఉద్యమ నెలబాలుడు కె.జి.సత్యమూర్తి మరణం దళిత ఉద్యమానికి తీరని లోటని వైఎ స్సార్ సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను నివాళులర్పించారు. వామపక్ష భావజాలంతో విప్లవ ఉద్యమంవైపు మళ్లినా దళితుల అభ్యున్నతికి తాపత్రయపడ్డారని కొనియాడా రు. తన కవితల ద్వారా దళిత జాతిని మేల్కొల్పేందుకు సత్యమూర్తి చేసిన ప్రయత్నం హర్షణీయమన్నారు. తాను నమ్ముకున్న సిద్ధాంతం కోసం నిబద్ధతతో పనిచేసిన ఆయన ఆశయాలు ఆదర్శం కావాలన్నారు. సత్యమూర్తి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు.

ఆయనతో కలిసి పనిచేశా..
సత్యమూర్తితో కలిసి 1969లో సాయుధ పోరాట దళంలో పనిచేశా. ఎప్పుడూ ఉద్యమ స్ఫూర్తితోనే సమస్య పరిష్కారమవుతుందని చెబుతుండేవారు. ఉద్యమాలకు సంబంధించి మాపై కేసులు నమోదవడంతో విశాఖ సెంట్రల్ జైలులో ఐదు సంవత్సరాల పాటు జైలుశిక్ష అనుభవించాం.
- కళ్యాణకృష్ణ,
సీపీఐఎంఎల్ నాయకుడు

ఆయన
పోరాటపటిమ అమోఘం
ఒకవైపు ఆయుధం, మరోవైపు కలంతో ఉద్యమ పోరాటాలు చేసిన ఘనత కేవలం సత్యమూర్తికే దక్కుతుంది. విప్లవ సాహిత్యంతో రచనలు చేస్తూ మరోవైపు సాయుధ దళంతో పోరాటం చేస్తూ ప్రజా సమస్యలపై ఆయన చేసిన పోరాటపటిమ ఎప్పటికీ మరచిపోలేనిది.
-వై.కోటేశ్వరరావు,
సత్యమూర్తి సహచరుడు

యువతకు స్ఫూర్తి
సత్యమూర్తి పోరాటాలు
సత్యమూర్తిది మా స్వగ్రామం పోలుకొండ శివారు శంకరంపాడు కావడం నా అదృష్టం. అణగారిన ప్రజల కోసం ఆయన చేసిన ఉద్యమాలు, పోరాట స్ఫూర్తి నేటి యువతకు అదర్శం. రాష్ట్ర విభజనతోనే అభివృద్ధి సాధ్యమని ఆయన నాతో అనేవారు.
- సుంకర కృష్ణమూర్తి,
జైఆంధ్ర ఉద్యమ నాయకుడు

సమాజాన్ని ప్రభావితం చేసిన రచనలు
సత్యమూర్తి విప్లవ రచనలు, గేయాలు సమాజాన్ని ఎంతగానో ప్రభావితం చేశాయి. పీడిత ప్రజలు, దళితుల పక్షాన నిలబడి వారికి దశ, దిశ నిర్దేశం చేశారు. అయన మృతి విప్లవ కవిత్వానికి తీరని లోటు.
- వల్లభనేని వంశీ,
తెలుగుదేశం పార్టీ అర్బన్ అధ్యక్షుడు

కార్మిక సంఘాల ఏర్పాటుకు కృషి
1970 నుంచి 82 వరకు సత్యమూర్తితో కలిసి వివిధ పోరాట ఉద్యమాల్లో పాల్గొన్నాను. విప్లవ పార్టీ నిర్మాణంలో ప్రత్యేక నక్సల్స్‌ను అణచివేస్తున్న సందర్భంలో కూడా రైతు సంఘాలు, ప్రజా ఉద్యమ సంఘాలు ఏర్పాటు చేయడంలో సత్యమూర్తి విశేష కృషి చేశారు.
- వీవీ కృష్ణారావు,

సమతా పార్టీ మాజీ అధ్యక్షుడు
ఆదర్శప్రాయుడు సత్యమూర్తి
అణగారిన వర్గాలకు న్యాయం జరగాలన్న లక్ష్యంతో ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడారు. సీపీఐ(ఎంఎల్) ప్రధాన కార్యదర్శి పదవిలో ఉండి కూడా సాధారణ వ్యక్తిగా మారుమూల గ్రామంలో నిర్జీవంగా మారడం విచారకరం. ఈతరం నాయకులకు సత్యమూర్తి ఆదర్శప్రాయుడు.
- దేవిరెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి, న్యాయవాది
http://www.sakshi.com/main/FullStory.aspx?catid=359389&Categoryid=3&subcatid=18

No comments:

Post a Comment