- గొండు తండాల్లో సామాన్యుడిగా జీవనం
- ఆదివాసీల మధ్యే ఖననం చేయాలని చివరి కోరిక
- ఇంద్ర పొలిమేరల్లో భార్య స్తూపం
- ఆదిలాబాద్‌తో విడదీయరాని అనుబంధం
- రాంజీగోండ్ చరివూతను వెలికితీసిన ఘనత సత్యమూర్తిదే
oldppటీన్యూస్ కోల్‌బెల్ట్ ప్రతినిధిఉట్నూర్పీపుల్స్‌వార్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన కేజీ సత్యమూర్తి అలియాస్ శివసాగర్‌కు ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీలతో ఎనలేని అనుబంధం ఉంది. కేజీ సత్యమూర్తి దంపతులు చివరి వరకు ఆదివాసీల కోసమే పరితపించారు. తాను మరణిస్తే ఆదివాసుల మధ్యనే సమాధి చేయాలని ఆయన కోరుకున్నారు. ఆయన భార్య పార్వతమ్మ చివరి కోరిక ప్రకారమే ఇంద్ర సమాధి చేశారు. ఇంద్ర అమరవీరుల స్తూపానికి కొద్ది దూరంలో పార్వతమ్మ స్తూపాన్ని ఏర్పాటు చేశారు. జోడేఘాట్ కొండల్లో గోండు వీరుడు కొమురంభీం చెంతన సమాధి ఏర్పాటు చేయాలనేది కేజీ సత్యమూర్తి చివరి కోరిక పీపుల్స్‌వార్ నాయకుడిగా, బహుజన్ సమాజ్‌పార్టీ, బహుజన్ రిపబ్లికన్ పార్టీ నాయకుడిగా కేజీ సత్యమూర్తి జిల్లాలో అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించారు. తెలంగాణ ఉద్యమాలు ఆరంభం కాకముందే ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణవాణిని వినిపించిన ఘనత సత్యమూర్తిదే. కనుమరుగైన రాంజీగోండ్ చరివూతను బయటకు తీసీ రాంజీగోండ్ వర్ధంతి సభను ఆయన ఆధ్వర్యంలో మొదటి సారిగా నిర్మల్‌లో నిర్వహించారు.
199 ప్రాంతంలో తిర్యాణి మండలం దంపూర్‌లో గుస్సాడి పండుగ చేసుకుంటున్న ఆదివాసుల ఇళ్లలోకి బూటుకాళ్లతో ప్రవేశించి చితకబాదిన పోలీసుల దమనకాండపై సత్యమూర్తి నాయకత్వంలో నిరసన కార్యక్షికమాలు నిర్వహించారు. పోలీసులు క్షమాపణలు చెప్పే వరకు పోరాటం ఆపలేదు. ప్రత్యేక తెలంగాణ బహుజన పోరాట సమితిని ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. కేజీ సత్యమూర్తి అభిమానులు, కలిసి పనిచేసిన వాళ్లు జిల్లాలో చాలా మంది ఉన్నారు. ఇప్పటికీ ఆయన పోరాటాలను నెమరువేసుకుంటూ ఉంటారు. బీఆర్పీ ఏర్పాటు చేసినప్పుడు ఆదివాసీ నాయకుడు సిడాం అర్జు, బోడ విజయ్‌కుమార్‌లు ఆయనకు కుడి ఎడమలుగా ఉన్నారు. ఆయన బోడ విజయ్‌కుమార్ ఇంట్లో ఎక్కువగా ఆశ్రయం పొందేవారు. బీఆర్పీ ఆధ్వర్యంలో ఆదివాసుల భూములకు పట్టాలు ఇవ్వాలని పెద్ద ఎత్తున ఉద్యమాలను లేవదీశారు.
సింగరేణి కార్మిక సమాఖ్య ఏర్పడటంలో సత్యమూర్తి కీలకపాత్ర వహించారనే పేరుంది. ‘నపూంగ చెట్టు నరుడో భాస్కరుడా..బందూకు పడితివా’, ‘గంగ దాటి ఎల్లిపోయే చెల్లెమ్మ’ అనే పాటలను ఈ జిల్లాలో ఉన్నప్పుడే రాశారని సమాచారం. 1992లో బహుజన సమాజ్ పార్టీలో సత్యమూర్తి చేరిన తర్వాత భార్య పార్వతి మరణించింది. ఉట్నూర్‌లోనే ఆమెకు సమాధి చేశారు. 1995 తర్వాత బీఎస్పీ నుంచి బయటకు వచ్చి బహుజన రిపబ్లిక్ పార్టీని ఏర్పాటు చేశారు. ప్రస్తుత చెన్నూర్ ఎమ్మెల్యే నల్లాల ఒదెలు, చలపతి ఇళ్లలో తరచూ భోజనాలు చేసేవారు. ఒక్కసారి లక్షెట్టిపేటలో అరెస్టయిన వారిలో కొండపల్లి సీతారామయ్యతోపాటు సత్యమూర్తి కూడా ఉన్నారు. వీరంతా పోలీసుస్టేషన్ నుంచి చాకచక్యంగా తప్పించుకున్నారని ప్రచారంలో ఉంది. చివరిసారిగా 2000లో ఆయన జిల్లాకు వచ్చి వెళ్లారు.
ఆదివాసుల కోసమే బతికారు బోడ విజయ్‌కుమార్, అనుచరుడు ఆదిలాబాద్ జిల్లాలో సత్యమూర్తి ఆదివాసుల సమస్యలపైనే దృష్టిసారించారు. ప్రజా ఉద్యమాల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రజలను సమీకరించి ఉద్యమాలు నిర్వహించారు. బీఎస్పీ, బీఆర్పీ నాయకుడిగా జిల్లాలోని అన్నివూపాంతాల్లో ప్రజలను సమీకరించి ఉద్యమాలకు నాయకత్వం వహించారు. పోరాటాల ద్వారానే తెలంగాణ రాష్ట్రం సాధించుకోవచ్చని ప్రత్యేక తెలంగాణ బహుజన పోరాట సమితిని ఏర్పాటుచేశారు. ఆదిలాబాద్ అడవుల్లో తెలంగాణ కోసం తుడుం మోగించారు. కనుమరుగైన రాంజీగోండ్‌చరివూతను బయటకు తీసి రాంజీగోండ్ వర్ధంతి కార్యక్షికమాలకు శ్రీకారం చుట్టారు. మేము ఆయనతో కలిసి పనిచేసిన రోజులు మరువలేం.
శివసాగర్ కృషిని మరువలేం సిడాం అర్జు, గిరిజన నాయకుడు జిల్లాలోని దళిత గిరిజనులను చైతన్య వంతులు చేయడంలో శివసాగర్ చేసిన కృషిని మరువలేం. ఆయన స్థాపించిన బీఆర్పీ నుంచి నేను ఆదిలాబాద్ పార్లమెంటు స్థానానికి పోటీ చేశాను. ఆదివాసీల సమస్యలే ప్రధాన ఎజెండాగా ఎన్నికల బరిలో దిగాను. సత్యమూర్తి పోరాట తత్వం ఆదివాసీలను తట్టిలేపింది. ఆయన పోరాటాలను జిల్లా ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు.
http://www.namasthetelangaana.com/News/article.asp?category=1&subCategory=2&ContentId=96314
No comments:
Post a Comment