ఆంధ్రదేశాన్ని ఈ అర్ధశతాబ్దిలో మలుపు తిప్పిన కవుల్లో, ఉద్యమకారుల్లో, పోరాట వీరుల్లో అగ్రగామిగా నిలబడినవారు కె.జి.సత్యమూర్తి. ఆయన పోరాట యోధుడు. కవిగా శివసాగర్. కవి అంటే సామాన్య మైన కవి కాదు ఆకాశాన్ని భూమికి దించగలిగిన కవి. పదాల్ని ఈటెలుగా, ఆయుధాలుగా మార్చగలిగిన కవి. సూర్యుణ్ని రాత్రులు ఉదయింపచేయగలిగిన కవి. విప్లవ కవిత్వం అంటే ఏమిటో తెలుగు ప్రజలకు చెప్పిన కవి. సత్యమూర్తి సమాజపు అట్టడుగు లోయల్లో జన్మించారు. సమాజాన్ని తాత్వికంగా అర్ధం చేసుకున్నారు. ఆయనది నిశితమైన దృష్టి, తీక్షణమైన అధ్యయనం. ఆయనది యుద్ధ ప్రయాణం. ఆయన గీతం సమరగీతం. ఆయన శత్రువుని గుర్తించిన యోధుడు. ఏ సందర్భంలోను శత్రువుతో రాజీపడని నాయకుడు. అంతర్గత శత్రువుని కూడా గుర్తించిన మేధావి.
ఆయన యుద్ధం సామ్రాజ్య వాదం పైన, పెట్టుబడిదారీ వ్యవస్థపైన, బ్రాహ్మణవాదం పైన, నిరంకుశ పాలనపైన ఆయుధాన్ని, కలాన్ని అంత పదునుగా వాడినవాడు తెలుగు నేలపైన మరొకరు లేరు. ఆయన ప్రభావం నుండి తప్పుకోవడం తెలుగు నేలలో ఏ విప్లవ రచయితకు సాధ్యం కాలేదు. ఆయన ముద్ర బలమైంది. ఆయన ప్రేమికుడు. విశ్వ ప్రేమికుడు. విశ్వాంతరాళలో ఉండే జీవన సౌందర్యాలని ఆయన సూక్ష్మ చక్షువుతో చూశాడు. ఆయన విప్లవ సాహిత్యాన్ని నరుడో భాస్కరుడో కవితతో జానపద బాణీలోకి ఇమిడ్చాడు. జానపద సంస్కృతిలో ఉన్న కాల్పనిక భావాన్ని విప్లవవెలుగులో తీర్చి దిద్దాడు. ఆయన శ్రీశ్రీ కవిత్వానికి స్ఫూర్తి పొందిన హో-చ్-మెన్ కవిత్వంతో మమేకమయ్యాడు. అప్పటి వరకు విప్లవ కవిత్వంలో వస్తున్న ఆవేశానికి ప్రకృతిని పలుకుబడిని, కాల్పనికతని, సౌందర్యాన్ని సమన్వయించిన మహాకవి.
గురజాడ అప్పారావు పూర్ణమ్మ కథతో స్ఫూర్తి పొందిన చెల్లీ చెంద్రమ్మని ఒక పోరాట యోధురాలుగా తీర్చిదిద్ది చెరిగిపోని చిత్రాన్ని గీసిన మహాశిల్పి. నిజానికి చెల్లీ చెంద్రమ్మా అనే పాట తెలుగు సాహిత్యానికి మకుటగీతం. గురజాడ అప్పారావు పూర్ణమ్మ కథ ఆత్మహత్యతో ముగిస్తే చెల్లీ చెంద్రమ్మ కథ విప్లవ విజయంతో ముగుస్తుంది. అయితే గురజాడ అప్పారావు పాటకు వచ్చినంత ప్రచారం దీనికి రాలేదు. దానితోపాటు మల్లెపూవ్వు వంటి నా చెల్లీ చెంద్రమ్మా అనే ప్రయోగంతో తెలుగు సాహిత్యంలోనే అలంకార శాస్త్రాన్ని తిప్పి రాశాడు. పాత్ర చిత్రీకరణ ఒక్క పది పదాలతోనే మనకు బొమ్మ కట్టించాడు. ఒక కావ్యానికి ఉన్న లక్షణాలన్ని ఒక్క పాటలోనే తీసుకొచ్చాడు. ఒక పాటని ఒక కావ్యంగా తీర్చిదిద్దిన మహాకవి శివసాగర్.
తెలుగు నుడికారంతోనే నాటకీయ ఫక్కీలో దృశ్యీకరిస్తు న్నారు. వాడిని పసిరిగ పాముతో పోల్చడంతో మొత్తం కవి తన చాతుర్యాన్ని చాటుకున్నాడు. కవి సామర్ధ్యం ఇక్కడే ఉంది. పదాలు చిన్నవి దృశ్యం పెద్దది. దృశ్యంలో మళ్ళా నాటకీయత అందుకే శివసాగర్ యుగ కవి అయ్యాడు.
శ్రామికుల్ని చుక్కలుగా పోల్చడంలో కవి మహోన్నత వ్యక్తిత్వం మనకుకనిపిస్తుంది. ఒక యుగ కవిత్వానికి నాయకత్వం వహించగల శక్తి శివసాగర్‌కు ఇక్కడే వచ్చింది. నాజర్ బుర్రకథలోని బీభత్సరస సంఘటనలు ఇక్కడ మన కళ్లకు కట్టనట్లు కనిపిస్తాయి. శివసాగర్ చెప్పిన కవిత్వం తెలుగు సాహిత్యానికే మకుటా యమానం.
నరుడో! భాస్కరుడా! విప్లవ సాహిత్యానికి మాతృగీతం
నిజానికి జానపద సాహిత్యం అది పౌరాణికంగా హిందూ సంస్కృతి ప్రభావంతో ఎన్నో మార్పులకు గురైంది. బ్రాహ్మణవాద ప్రభావం జానపద సాహత్యంపైన పడింది. కానీ శివసాగర్ ప్రత్యామ్నాయ విప్లవ సంస్కృతికి జానపద బాణీని, సాహిత్యాన్ని మలిచారు. ఈ కంట్రీబ్యూషన్‌వైపు పరిశోధన జరగవలసి ఉంది. జానపద సాహిత్యంలో ఆయన ఎన్నో విలువైన అంశాలని స్వీకరించారు.
తెలంగాణలో మెదక్ జిల్లాలో రహస్య జీవితం గడుపుతూ ఉండగా ఒకరోజు గ్రామ ప్రజలు 'నరుడో నారపరెడ్డి అనే పాట పాడుతూ 'ధూల ఆడటం చూసిన నేను ఆ జానపద గీతంలోని రూపాన్ని సొంతం చేసుకొని ఈ గీతం రాశాను. ఈ గీతంలోని భాస్కరుడు డాక్టర్ చాగంటి భాస్కరరావు. గుంటూరు జిల్లా నుండి శ్రీకాకుళం ఉద్యమంలో పాల్గొనటానికి వచ్చి అమరుడైనాడు. దీన్ని శ్రీశ్రీ టైటిల్‌సాంగ్ అన్నాడు. దీన్ని రావిశాస్త్రి ఆల్కహాలిక్ హైమ్ అన్నాడు. (విరసం ఇది విప్లవ సాహిత్యానికి దిశానిర్దేశం చేసింది అన్నది).
విప్లవ కవిత్వానికి ఈ కవిత మాతృగీతం. జననాట్యమండలి నిర్వహణ కర్త గద్దరు పైన ఈ పాట ప్రభావం బలంగా ఉంది. గోరంటి వెంకన్న వంటి జానపద బాణీలో పాటలు, కవిత్వాలు రాస్తున్న వారంతా ఈ పాట నుండి స్ఫూర్తి పొందినవారే.
తాత్విక కవి
శివసాగర్ మార్క్స్‌ను, లెనిన్‌ని, మావోను చదివాడు, హో-చి-మెన్‌ని ఆవహనం చేసుకొన్నాడు, గోధేని అధ్యయనం చేశాడు. తెలుగు సాహిత్యాన్ని చదివాడు. ఈ క్రమంలో నరుడో భాస్కరుడా విలువాడ వంటి పాటల్ని విశ్లేషిస్తే ఒక గ్రంథమే అవుతుంది. ఇంకా శివసాగర్ పాటల మీద రావాల్సినంత సామాజిక, సాహిత్య విశ్లేషణ రాలేదు. ఒక చోట లెనిన్ అన్నట్టు ''తిరుగుబాటును కళగా చూస్తే తప్ప మార్క్సిజంకు విధేయంగా నిలిచి ఉండటం, విప్లవానికి విధేయంగా నిలిచి ఉండడం అసాధ్యం (వి.ఐ.లెనిన్ యేరిన రచనలు మూడవభాగం, పేజి నెం.19). యుద్ధంలోకి పోయినవాడు 'నన్ను కాపాడండి నన్ను కాపాడండి అని ఆక్రందిస్తే అది యుద్ధ నీతికి భిన్నమౌతుంది. శివసాగర్ యుద్ధాన్ని యుద్ధంగానే ప్రకటించాడు. యుద్ధ యోధుడిగానే జీవించాడు. ఆయనకు తిరుగుబాటు తప్ప అభ్యర్థన ఆక్రందన తెలియదు. అందుకే ఆయన కవిత్వంలోని పాత్రలు సజీవమయ్యాయి.
ఆయన అధ్యయనం నుంచే కాకుండా జీవితం నుంచి మాట్లాడుతున్నాడు. లిఖిత సాహిత్యంతోపాటు మౌఖిక జీవన వ్యవస్థల్ని అధ్యయనం చేసిన కవి ఆయన. గురజాడ, శ్రీశ్రీ లిఖిత సాంప్రదాయానికి చెందిన కవులే అవుతారు. కానీ శివసాగర్ లిఖిత మౌఖిక సంస్కృతుల సమ్మేళనం నుండి ఆవిర్భవించిన యుగకవి. ఆయన తాత్వికుడు. తత్వశాస్త్రం రానివాడు యుగ కవిత్వానికి నేతృత్వం వహించలేడు. అందుకే ఆయన గురించి మాట్లాడటానికి చాలామందికి శక్తి చాలటం లేదు. కారణం ప్రజల్లో జీవించి వారి దుఃఖాల నుండి వారి ఆవేశాల నుండి మాట్లాడటం అందరికీ సాధ్యంకాదు. తెలుగులో ఎక్కువ మంది కవులు తమ గురించే మాట్లాడుకుంటారు. అందుకే వారి కవిత్వం తమతోపాటే ముగుస్తుంది. గుర్రం జాషువాలో ఉన్న కరుణ రసార్థ్రత శివసాగర్‌లో కనిపిస్తుంది. రాసిన పద్ధతి వేరు కావచ్చు. పోరాట పంథా వేరు కావచ్చు. సిద్ధాంత అవగాహన కూడా వేరుగావచ్చు. అర్థ్రత మాత్రం ఇద్దరిదీ ఒకటే. కారణం వారిద్దరూ దళితవాడలో పుట్టడమే.
కవిగా సూర్యుడు
ఇక పాట నుండి కవిత్వానికి వస్తే ఆయన కవిత్వం ఒక పాలపుంతకు ఉన్నత విస్తృతి కలిగింది. ప్రపంచ సామ్రాజ్యవాద దిశ నుండి ఆయన కవిత్వం మాట్లాడుతుంది. ఆయన కవిత్వంలో చిక్కదనం ఎక్కువ. ప్రతీకలను సందర్భోచితంగా వాడటంలో ఆయనకు ఆయనే సాటి. ఈ కవికి చంద్రుడు అంటే ఇష్టం. వెన్నెలంటే మరీ ఇష్టం. చంద్రుణ్ని, వెన్నెల్ని మనం చూసినట్టు చూడడు.
దళిత కవిత్వంలో పెద్ద మలుపు
ఆయన దళిత కవిత్వంలోకి రావడం పెద్ద మలుపుకు దారితీసింది. ఒక సూర్యుడు దళిత సాహిత్యంలో ఉదయించినట్ల యింది. ఆయన అంబేడ్కర్‌ని అధ్యయనం చేయడం, అంబేద్కర్ సూర్యుడు రాయడం ఆయన మహాత్మాఫూలేని అధ్యయనం చేయడం ఇవన్నీ తెలుగు నేలలో దళిత ఉద్యమ ఉధృతికి కారణమయ్యాయి. ఒక ఉద్యమాన్ని పటిష్టమైన కవి చూసే పద్ధతి వేరు. శివసాగర్ ఇప్పటి వరకు రాస్తున్న దళిత కవిత్వానికి పదును పెట్టాడు. విప్లవ సాహిత్యంలో ఆయన చేసిన అనేక ప్రయోగాలని దళిత సాహిత్యానికి కూడా అన్వయించాడు.
ఈ పాట మొత్తం దళిత సాహిత్యంలో ఒక కుదుపు తెచ్చింది. ఒక పరిణామానికి దోహదం చేసింది. దళిత సామాజిక ఆధునిక ఉద్యమం కారంచేడు పోరాటంతో ప్రారంభమైంది.
తెలుగు జాతి వైతాళికుడు
ఆంధ్రదేశంలో రెండు ప్రధానమైన ఉద్యమాలు నడుస్తున్నాయి. ఒకటి మార్క్స్ సిద్ధాంతాలను అనుసరించింది. రెండు అంబేడ్కర్ సిద్ధాంతాలను అనుసరించేవి. ప్రతి కవిత్వం తత్వశాస్త్రం నుంచి ఆవిర్భవించాల్సిందే. ఈ రెండు ఉద్యమాలు పరస్పర సంబంధితాలు. సమసమాజాన్ని ఆకాంక్షిస్తున్నవి అందుకోసం కృషి చేస్తున్నవి. ఈ రెండు ఉద్యమాల్లో కీలకమైన భాగస్వామ్యం సత్యమూర్తికి ఉంది. ఆర్థిక సామాజిక వాదం రెండవది సామాజిక ఆర్థికవాదం ఈ రెండు ఉద్యమాలను సమన్వయం ఒక చారిత్రక అవసరం. ఈ చారిత్రక బాధ్యతను నిర్వర్తించగలిగినవాడు కూడా సత్యమూర్తే. సమాజాన్ని మార్చి తత్వశాస్త్రం తప్పకుండా సమకాలీనం కావాలి. స్థల, కాల, నిర్దేశితలు కలిగి అది వర్తించాలి.
కవి ఎంత శక్తివంతుడైనా తత్వశాస్త్రానికి అనుచరుడే. మిత్ర వైరుధ్యం కలిగిన తత్వ శాస్త్రాల్ని సమకాలీనంగా అన్వయించడంలోనే తత్వవేత్త ప్రధాన బాధ్యత ఇమిడి ఉంది. డా. బి.ఆర్.అంబేడ్కర్ తత్వశాస్త్రం ఈనాడు ప్రపంచవేత్తలందరిని తనలో ఇముడ్చుకోగలిగిన సామర్ధ్యం ఉంది. బౌద్ధాన్ని ఒక సాంస్కృతిక విప్లవంగా ఈనాడు కమ్యూనిస్టులు స్వీకరించాల్సిన బాధ్యత ఉంది. ఈ తాత్విక పోరాటాల్ని రెండు శిబిరాలతోటి సమమైన ప్రాతనిధ్యం కలిగిన శివసాగర్ చేస్తూనే ఉన్నారు. ఆయన తెలుగు జాతికి ఒక వైతాళికుడు. శివసాగర్ కవిత్వంలోని తెలుగు పదాలు నిఘంటువుగా రూపొందించి కవిత్వ శిల్పం మీద అలంకార శాస్త్రాన్ని రచించినట్లయితే ఇంకా వేలాది మంది కవులు ఆవిర్భవించే అవకాశం ఉంది. ఈ పనిని తెలుగుజాతి ఎంత త్వరగా చేసుకోగలిగితే తెలుగు భాషకు, సంస్కృతికి, చరిత్రకి, పోరాటానికి అంత త్వరగా సజీవ చేకూరుతుంది. ఆయనది తిరుగులేని ప్రయాణం. అది ఆగదు.
డా. కత్తి పద్మారావు
బుధవారం , ఏప్రిల్ 18 ,2012
http://www.vaartha.com/NewsListandDetails.aspx?hid=2363&cid=1033

Hello, I want to know why KG Satyamurthy took the pen name "SIvasagar".
ReplyDeleteCan you please give me this information, if you know.
Thanks