Thursday, 19 April 2012

నా మల్లియ రాలెను


నా మల్లియ రాలెను! నీ మొగిలి కూడా రాలెను
నా మల్లియ, నీ మొగిలి ఆకాశం చేరెను!
అమరత్వం వెదకబోయి
శిక్షితుడైన ఉకాంగ్
అమరుల దప్పిక తీర్చను
మధు పాత్రల నందించును

చందమామ లోకంలో
ఛాంగ్ ఓ ఏకాంత దేవి
సహృదయులు అమరులకై
పసందుగ నాట్యం చేయును

దోపిడి రక్కసి సర్పం
మట్టి కరచువేళ
అమరుల ఆనందాశ్రులు
జడివానగ కురియును

నా మల్లియ రాలెను! నీ మొగిలి కూడా రాలెను
నా మల్లియ, నీ మొగిలి ఆకాశం చేరెను!

(పోరాటంలో చనిపోయిన తన మిత్రుని భార్య కోసం 1949లో చైనాలో విప్లవం విజయం పొందిన సందర్భాన మావో జెడాంగ్ వ్రాసిన కవిత ఇది)

(మావో జెడాంగ్ కవితకు శివసాగర్ అనువాదం)

http://patrika.teluguwebmedia.in/2009/12/blog-post_7869.html

No comments:

Post a Comment