- విజయవాడలో సత్యమూర్తి అంత్యక్రియలు
- తరలివచ్చిన ఉద్యమ నేతలు, రచయితలు
- చితికి నిప్పంటించిన కేజీ పెద్ద కుమారుడు సిద్ధార్థ
- కేజీ స్ఫూర్తితోనే దళిత ఆత్మగౌరవ పోరాటం చేపట్టా
ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ
- సత్యమూర్తి దళితుల కోసం పోరాడారుజూపూడి ప్రభాకర్
- ప్రజలను మేల్కొల్పిన విలక్షణ కవి కేజీ గోరటి వెంకన్న
- కేజీ విప్లవ రచనలతో ప్రజల్లో చైతన్యం నింపారు
విరసం నేత కళ్యాణరావు
- ముగిసిన కేజీ సత్యమూర్తి అంత్యక్షికియలు
- తరలివచ్చిన ఉద్యమనేతలు, రచయితలు
- కేజీ స్ఫూర్తితోనే దళిత ఆత్మగౌరవ పోరాటం చేపట్టా మందకృష్ణ మాదిగ
-- విరసం నేత కళ్యాణరావు
విజయవాడ, ఏప్రిల్ 1 (టీ న్యూస్) విప్లవోద్యమ రథ సారథి, దళిత ఉద్యమానికి చుక్కాని, తెలుగు సాహిత్యరంగానికి విశేష సేవలందించిన కంభం జ్ఞాన సత్యమూర్తి అంత్యక్షికియలు బుధవారం విజయవాడలో జరిగాయి. మంగళవారం జీ కొండూరు మండలం కందులపాడులోని తన కుమారుడు సిద్ధార్థ ఇంటిలో తుదిశ్వాస విడిచిన శివసాగర్ అలియాస్ సత్యమూర్తికి దళిత ఉద్యమ నేతలు, విరసం నాయకులు, రచయితలు, సహచరులు, శిష్యులు కన్నీటి వీడ్కోలు పలికారు. ఎలక్ట్రికల్ క్రిమిటోరియం పనిచేయకపోవడంతో సంప్రదాయ పద్ధతిలో అంత్యక్షికియలు నిర్వహించారు. కేజీ పెద్ద కుమారుడు సిద్ధార్థ ఆయన చితికి నిప్పంటించారు. అంతకుముందు సత్యమూర్తి పార్ధివదేహాన్ని కందులపాడు నుంచి విజయవాడ నగరానికి తరలించి స్వాతంత్య్ర సమరయోధుల భవనం వద్ద ప్రజలు, కవులు, కళాకారులు, ఉద్యమకారుల సందర్శనార్థం ఉంచారు.
అభిమానులు, శిష్యులు విశేష సంఖ్యలో హాజరై విప్లవ నేత భౌతికకాయానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అక్కడి నుంచి భారీ ర్యాలీతో సున్నంబట్టీ సెంటర్‌లోని హిందూ శ్మశానవాటిక(స్వర్గపురి)కు తరలించి దహన సంస్కారాలు నిర్వహించారు. అంతకుముందు మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు సంతాప సభ నిర్వహించారు. దళితులను ఐక్యం చేసేందుకు కృషి చేసిన కేజీ బాటలో అందరూ నడుచుకోవాలని ఈ సభలో పలువురు వక్తలు పిలుపునిచ్చారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ కుటుంబ సమేతంగా అంత్యక్షికియలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను విప్లవ అక్షరాలు దిద్ది, ఉద్యమ బాట పట్టింది కేజీ సత్యమూర్తి మార్గదర్శకత్వంలోనే అన్నారు. దళిత ఆత్మగౌరవ పోరాటాన్ని ఆయన ఇచ్చిన స్ఫూర్తితోనే ప్రారంభించినట్లు తెలిపారు. వర్గ, కుల రహిత సమాజం కోసం కేజీ చేసిన కృషి మరువలేనిదని ఆయన కొనియాడారు.
మాలమహానాడు నేత, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ మాట్లాడుతూ.. కేజీ రాష్ట్రంలోనే కాక, దేశవ్యాప్తంగా కూడా దళిత ఉద్యమంలో కీలక పాత్ర పోషించారన్నారు. ప్రముఖ కవి, ప్రజా గాయకుడు గోరెటి వెంకన్న మాట్లాడుతూ.. ఒకవైపు శ్రీశ్రీ, మరోవైపు సత్యమూర్తి సాహిత్యం ద్వారా ప్రజల్లో చైతన్య స్ఫూర్తిని రగిలించారన్నారు. విస్తృత అధ్యయనం ద్వారానే రచలను చేసి ప్రజలను మేల్కొల్పిన విలక్షణ కవి కేజీ అని ప్రశంసించారు. ఆయన రచనల స్ఫూర్తితో మనం ముందుకు సాగాలన్నారు. విరసం నేత కళ్యాణరావు మాట్లాడుతూ.. విప్లవ రచనల ద్వారా కేజీ సత్యమూర్తి పేద, బడుగు, బలహీనవర్గాల ప్రజల్లో చైతన్యం నింపారని పేర్కొన్నారు.
మహనీయుడి అంత్యక్షికియల్లో విరసం నేతలు చలసాని ప్రసాద్, అరస కృష్ణ, రుక్మిణి, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కే శ్రీనివాస్, దళిత ఉద్యమ నేత బొజ్జా తారకం, సత్యమూర్తి సహచరులు వై కోటేశ్వర్‌రావు, చిరంజీవి, సమతా పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు వీవీ కృష్ణారావు, రచయితలు ఇంద్ర రమేష్, వైకే గౌతమ్, ఉ. సాంబశివరావు, టీడీపీ నేతలు దేవినేని ఉమమహేశ్వరరావు, తంగిరాల ప్రభాకర్, వల్లభనేని వంశీ, మట్టిమనిషి వేనేపల్లి పాండురంగరావు, జై ఆంధ్ర బహుజన జేఏసీ అధ్యక్షుడు జయబాబు తదితరులు పాల్గొన్నారు.
విప్లవ గీతాలతో అంతిమ యాత్ర
కేజీ సత్యమూర్తి అంత్యక్షికియలకు కళాకారులు, ఉద్యమకారులు, కవులు, రచయితలు, ప్రజా గాయకులు, అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. కేజీ భౌతికకాయంపై ఎర్రజెండా కప్పి ఘనంగా నివాళులర్పించారు. విద్యార్థి దశ నుంచి విప్లవాల బాటపట్టిన ఆయన అంతిమయాత్ర ఆద్యంతం విప్లవ గీతాలాపనతో కొనసాగింది. అస్తమించని సూర్యుడు సత్యమూర్తి, నెలబాలుడు శివసాగర్ అమర్ రహే అంటూ అభిమానులు ఆయనకు వీడ్కోలు పలికారు.
http://www.namasthetelangaana.com/News/article.asp?category=1&subCategory=2&ContentId=96658

No comments:
Post a Comment