కుక్షింభర తత్వం
- బ్రూస్ ఇ.లెవినె
https://www.andhrajyothy.com/editorial.asp?qry=dailyupdates/editpagemain
అయాన్ రాండ్ 'తాత్వికత' తన నీతిబాహ్యతలో దాదాపుగా పరిపూర్ణమైనది. మన సమాజంలో మనం ఒక ఆసక్తికరమైన కొత్త దశలోకి ప్రవేశిస్తున్న తరుణంలో ఆమె 'తాత్వికత'కు పెరుగుతున్న ఆదరణ శుభపరిణామం కాదు. అత్యాశ, అహంకారంను సమర్థించి, కొనియాడటం అనైతికమేకాక దుర్మార్గమని కూడా నాకు అనిపిస్తుంది.
- గోర్ విడాల్
అమెరికా చరిత్రలో సాహిత్యవేత్తలు అరుదుగా మాత్రమే తమ ప్రజలను ఇతరుల సంక్షేమం పట్ల మరింత బాధ్యతగా లేదా తక్కువ శ్రద్ధతో వ్యవహరించే జాతిగా పరిణమింప చేశారు. 1850ల్లో అమెరికా మరింత మానవీయ జాతిగా రూపొందేలా చేయడంలో హారియెట్ బీచర్ స్టోవ్ (1811-96) ఒక శక్తిమంతమైన పాత్ర నిర్వహించారు. బానిసత్వంలో మగ్గుతున్న ఆఫ్రికన్ అమెరికన్లను స్వేచ్ఛా పౌరులను చేసింది స్టోవ్ ప్రభావిత అమెరికా.
ఒక శతాబ్దం అనంతరం అయాన్ రాండ్ (1905-82), పారిశ్రామిక ప్రపంచంలో తోటి పౌరుల శ్రేయస్సుపట్ల అత్యంత బాధ్యతారహితంగా వ్యవహరించే ప్రజలుగా అమెరికన్లు మారిపోవడానికి, దోహదం చేశారు. ఇదొక సరికొత్త డికెన్సియన్ సమాజం. ఇందులో అన్ని వ్యయాలను భరించగలవారికే ఆరోగ్యభద్రత; విద్యాభ్యాసానికై పెద్ద ఎత్తున రుణాలు తీసుకొనేలా యువజనులను బలవంతపెడుతున్న వ్యవస్థ ఇది. రాండ్ ప్రభావం విస్తృతమైనది, ప్రగాఢమైనది. అమెరికా సమాజాన్ని తీర్చిదిద్దిన రాజకీయ ప్రముఖులు పలువురిపై ఆమె ప్రభావం ఉంది.
1950ల్లో 'కలెక్టివ్'గా ప్రసిద్ధికెక్కిన తన ఆంతరంగిక యువ మిత్ర మండలిలో చదివి విన్పించిన చిత్తుప్రతులే తదనంతర కాలంలో 'అట్లాస్ ష్రగ్‌డ్' రూపం దాల్చాయి. ఆ యువ మిత్రులలో, 1987 నుంచి 2006 దాకా ఫెడరల్ రిజర్వ్ బోర్డు చైర్మన్‌గా ఉన్న, అలన్ గ్రీన్‌స్పాన్ ఒకరు. 1996లో రోనాల్డ్ రీగన్‌లో ఒక వ్యక్తిగత లేఖలో 'తాను అయాన్ ర్యాండ్ అభిమాని'నని రాశారు. తను రాజకీయాలలోకి ప్రవేశించడానికి 'అట్లాస్ ష్రగ్‌డ్' స్ఫూర్తినిచ్చిందని ప్రతినిధుల సభలో రిపబ్లికన్ పౌల్ ర్యాన్ అన్నారు.
అట్లాస్ ష్రగ్‌డ్ తన ఆలోచనలకు ప్రాతిపదిక గ్రంథమని సెనేటర్ రాన్ తన బాగే గాని ఇతరుల బాగు గురించి ఏ మాత్రం పట్టించుకోనవసరం లేదని ఉపదేశించే రాండ్ తాత్విక చింతననే ఆమె వ్యక్తిగత జీవితమూ అనుసరించింది. ఆమె రోజుకు రెండు సిగరెట్ ప్యాకెట్లను ఖాళీ చేసేవారు. ధూమపానం ప్రమాదాలను గురించి ప్రశ్నించినప్పుడు ఆమె చాలా తేలిగ్గా తీసుకొనేవారు. అంతేగాక 'గణాంక సాక్ష్యాల అశాస్త్రీయతను, హేతువిరుద్ధ స్వభావాన్ని ఎందుకు అంత సీరియస్‌గా తీసుకుంటారని' ఆమె తన యువ మిత్రులను కోప్పడేవారు. ఒక వైద్య పరీక్షలో ఆమె ఊపిరితిత్తులకు కేన్సర్ సోకినట్లు వెల్లడయింది. రాండ్ ధూమపానాన్ని నిలిపివేశారు.
శస్త్ర చికిత్స చేయించుకున్నారు. 'కలెక్టివ్'లోని యువ సహచరులు కొంత మంది ఒకసారి ఆమెతో ఇలా వాదించారు 'మీ భావాల మీద గౌరవంతో, మీ మాటమీద పూర్తి నమ్మకంతోనే సమాజంలో ఎంతో మంది ధూమపానాన్ని కొనసాగిస్తున్నారు. కనుక ఇప్పుడు మీరు ధూమపానం గురించి నిజం చెప్పాలి. అయితే లంగ్ కేన్సర్ గురించి ప్రస్తావించవలసిన అవసరం లేదు. కొత్త శాస్త్ర రుజువులను దృష్టిలో ఉంచుకొని ధూమ పానాన్ని నిలిపివేయాలని ప్రజలకు చెప్పాలని కోరారు. అయాన్ రాండ్ నిర్ద్వంద్వంగా తిరస్కరించారు.
నేను చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు కామిక్స్ బుక్స్‌తో పాటు రాండ్ గ్రంథాలు 'ది ఫౌంటైన్‌హెడ్', 'అట్లాస్ ష్రగ్‌డ్' మొదలైన వాటిని కూడా చదివాను. కథానాయకుల సరళత పరంగా కామిక్ పుస్తకాలకి, ర్యాండ్ గ్రంథాలకు మధ్య పెద్ద తేడా లేదు బేధమల్లా సూపర్ మ్యాన్, బ్యాట్ మన్ వలేకాకుండా రాండ్ నవల్లో స్వార్థం ఒక వీరోచిత గుణంగా అభివర్ణితమయింది. ఇతరుల గురించి పట్టించుకోవడం, పట్టించుకున్న వాడి బలహీనతలకు తార్కాణం.
రాండ్ ఇలా అన్నారు 'పెట్టుబడిదారీతనం, పరోపకార వాదం పరస్సర విరుద్ధమైనవి. మనం దేనిని అనుసరించాలనేది స్పష్టమే. స్వేచ్ఛ, న్యాయం, ప్రగతి, భూమిపై మనుగడ మొదలైన వాటిపై ప్రభావం చూపే సహేతుకమైన స్వప్రయోజనపు నూతన నైతికత లేదా పరోపకారవాద ఆదిమ నీతి. ఈ ఆదిమ నీతిని మనం అనసరిస్తే దాని పర్యవసనాలు బానిసత్వం, పశుప్రాయత, స్తబ్ధత, భీతి, అంతులేని బాధలు''. తనను గురించి పట్టించుకోవడమే ముఖ్యమని, వేరెవ్వరిని పట్టించుకోనవసరం లేదని, ఇలా వ్యవహరించడం 'నైతిక'మేనన్న రాండ్ భావాలకు యువజనులు విశేషంగా ఆకర్షితులయ్యారు.
వాటి ప్రాతిపదికనే తమ 'జీవిత భావన'ను రూపొందించుకున్నారు. అయా న్ రాండ్ భావాలతో స్ఫూర్తి పొంది, జీవితంలో ఒక దశలో ఆ అభిప్రాయాలను మార్చుకున్న పలువురి గురించి నాకు తెలుసు. వారంతా నాకు వృత్తి లేదా సామాజిక జీవితంలో పరిచయస్తులే. రాండ్ తత్వం పట్ల భ్రమలు కోల్పోయిన తరువాత వారు చెప్పిన విషయాల సారాంశాన్ని ఇలా చెప్పవచ్చు 'రాండ్ గ్రంథాలు చదవకముందు నా భర్త చాలా మంచి వ్యక్తిగా మెలిగేవారు. రాండ్‌ను చదివిన తరువాత అతనిలో చాలా మార్పు వచ్చింది. తనను గురించి మినహా మా గురించి పట్టించుకోవడం మాని వేశాడు. ఇప్పుడు పిల్లలు సైతం విసిగిపోయి అతనితో మాట్లాడడం లేదు'.
తన యువ అభిమానులకు రాండ్ తరచు ఒక విషయాన్ని చెబుతుండేవారు. ఒకసారి ఒక పుస్తక విక్రేత తనను ఒక కాలి మీద నుంచొని తన తాత్విక చింతనను క్లుప్తంగా, సమగ్రంగా వివరించమని సవాల్ చేశాడట. అందుకు ఆమె ఇలా సమాధానమిచ్చింది అధిభౌతిక చింతన- వస్తుగత యథార్థం; జ్ఞాన మీమాంస-హేతువు; నైతిక విశ్వాసం- స్వప్రయోజనం; రాజనీతి- పెట్టుబడిదారీ విధానం. ఈ తాత్విక చింతన యువ మనస్సులను ఎలా స్వాధీనం చేసుకొంది
అధిభౌతిక భావాలు 'వస్తుగత యథార్థం' ఒకటి ఉందని రాండ్ విశ్వసించారు. అదేమిటో కూడా ఆమెకు నిశ్చితంగా తెలుసు. అందులో ఆకాశ హర్మ్యాలు, పరిశ్రమలు, రైల్‌రోడ్లు, భావాలు-కనీసం ఆమె భావాలు ఉంటాయి. ఆమె విశ్వసించే వస్తుగత యథార్థంలో విచారానికి, ఆదుర్దాకు తావే లేదు. హాస్యానికి అసలే స్థానం లేదు. కనీసం ఒకరు తనపై తాను చేసుకునే పరిహాసాస్పద వ్యాఖ్యలకు సైతం అందులో చోటు లేదు. తాను విశ్వసించే యథార్థతలో బీథోవెన్, రెంబ్రాండ్ట్, షేక్స్‌పియర్ వాస్తవికతలకు స్థానం అసలే లేదు.
అవి ఉదాసీనమైనవి, విషాదాత్మకమైనవి. మిస్కే స్పిల్లన్ రచనలను ఆమె అభిమానించేవారు. జీవితం చరమ దశలో 'ఛార్లెస్ ఏంజెల్స్' వైపు ఆకర్షితులయ్యారు. జ్ఞాన మీమాంస రాండ్ 'హేతువు' విశ్వాన్ని నియంత్రించేది. ప్లేటో అంటే ఆమెకు ఇష్టం లేదు. ఆ తాత్వికుడిని తిరస్కరించమని 'కలెక్టివ్'లోని తన యువ మిత్రులకు ఆమె చెబుతుండేవారు. సత్యావిష్కరణకై కచ్చితమైన నిర్వచనాలను అన్వేషించేందుకు, తర్కం ప్రాతిపాదికన ఖచ్చితమైన, స్పష్టమైన ఆలోచనా విధానాన్ని రూపొందించుకునేందుకు ఉపయోగించే 'సోక్రటిక్ పద్ధతి' హేతుబద్ధమైనది కాదని ఆమె విమర్శిస్తుండే వారు.
అయితే తన యువ మిత్రులతో చర్చించేటప్పుడు ఆమె ఆ తాత్విక పద్ధతినే అనుసరించే వారు! డాస్టోవస్కీ లాంటి రచయితలను అభిమానించేలా ఆమె తన యువ మిత్రులను ప్రోత్సహించే వారు. అటువంటి ఆలోచనా ధోరణికి అలవాటు పడిన వారు ఎటువంటి అధికారాన్ని ప్రశ్నించలేరు కదా. యువ జనులలో స్పష్టమైన ఆలోచనా విధానం వికసించకుండా చూడడమే అయాన్ రాండ్ లక్ష్యం.
నైతిక విశ్వాసం రాండ్ దృష్టిలో పరోపకారవాదులందరూ అవినీతిపరులే. వ్యవస్థలను తమ స్వప్రయోజనాలకు ఉపయోగించుకొనేవారే. ఆమె విశ్వసించే స్వప్రయోజనం నైతికతకు ప్రాతనిధ్యం వహించేదికాదని ఆమె అభిమానులే భావించారు. ఆమె సృష్టించిన ఆర్కిటెక్ట్ పాత్ర హోవార్డ్ రోవార్క్ ఒక కమిషన్‌ను తీసుకోవడానికి తిరస్కరిస్తుంది. ఎందుకంటే ఆ పనిని తనదైన రీతిలో తాను సరిగ్గా నిర్వర్తించలేననే అనుమానంతో. రాండ్ అభిమానుల దృష్టిలో స్వప్రయోజనమంటే ఇదే. ఇతరులకు మనస్తాపం కల్గించకుండా తన స్వప్రయోజనాలను నెరేవర్చుకోవాలన్న నైతికాంశాన్ని ఆమె పట్టించుకోలేదు. రాజనీతి సోవియట్ కమ్యూనిస్టు వ్యవస్థను రాండ్ తిరస్కరించారు.
అయితే కార్పొరేట్ నియంతృత్వ సాముదాయక వ్యవస్థలు కూడా సోవియట్ కమ్యూనిజం మాదిరిగా వ్యక్తి స్వేచ్ఛకు, వ్యక్తిగత చొరవకు ప్రాధాన్యమివ్వవన్న సత్యాన్ని గుర్తించడానికి ఆమె నిరాకరించారు. ఇది ఆమె ద్వంద్వనీతికి తార్కాణం. కార్పొరేట్ అమెరికాలో కేవలం సంప్రదాయాలకు అనుగుణంగా నడుచుకోవడం, పై వారు చెప్పినట్టు చేయడం వల్లే పెద్దగా డబ్బు ఆర్జించలేమన్న సత్యం ఆమెకు తెలుసు. అందుకే 'అమెరికాలో వేధింపులకు గురవుతున్న మైనార్టీ వర్గం గుత్త వ్యాపారులు' ఇత్యాది అంశాలపై ఆమె ప్రసంగాలు చేసేవారు.
పాలకుల నుంచి, పెట్టుబడిదారుల నుంచి ఎటువంటి సమస్యలు ఉండనటువంటి 'రాడికల్ పెట్టుబడిదారీ విధానాన్ని' ఆమె ప్రవచించారు. ఇటీవలి సంవత్సరాలలో ప్రముఖ రాజకీయవేత్తలందరూ అయాన్ రాండ్ భావాలను బహిరంగంగా ఆమోదిస్తున్నారు. క్రైస్తవ మత విలువలను ఆమె తీవ్రంగా విమర్శించారన్న విషయం తెలిసి కూడా ఆమె రాజకీయ, ఆర్థిక భావాలను అ ంగీకరిస్తున్నారు. ఇందుకు భిన్నంగా రాండ్ జీవితకాలంలో స్వప్రయోజనం అనే భావన సంపన్న వర్గాలవారి ఆమోదం పొందినప్పటికీ ఆమె మత భావాల విషయంలో ఇబ్బంది పడేవారు. తమ స్వార్థపరత్వం నైతికతపై ఆమె గ్రంథాల ఆధారంగా వారు తమను తాము అభినందించుకునేవారు.
మతం, భగవంతుడు అనే భావనల విషయంలో రాండ్‌ను దూరంగా ఉంచేవారు. ఒక సారి ఆమె ఇలా చెప్పారు 'నేను దేవుడికి వ్యతిరేకిని. మతాన్ని నేను అంగీకరించను. అది మానసిక బలహీనతకు రుజువు. దానిని నేను ఒక పాపంగా భావిస్తాను'. నిజానికి ఆమె సునిశ్చిత విశ్వాసానికి ఇది పూర్తిగా భిన్నమైనది. తనకు భగవంతుడు ఉన్నాడని రాండ్ చెప్పారు. ఆ దేవుడు ఆమే! రాండ్ ఇలా అన్నారు
నేను 'మనము' అనే పదాన్ని త్యజించాను. అది బానిసత్వం, దోపిడీ, దయనీయత, అసత్యం, సిగ్గును సూచించేది. ఇప్పుడు నేను భగవంతుడిని చూస్తున్నాను. ఆ దేవుడిని భూమిపైకి తీసుకొచ్చాను. మానవులు ఉనికిలోకి వచ్చినప్పటినుంచీ ఆ భగవంతుడి కోసం అన్వేషిస్తున్నారు. వారు కోరుకొనే ఆనందాన్ని, శాంతిని ఆయన ప్రసాదిస్తాడు. ఈ భగవంతుడే 'నేను'. ఈ పదాన్నే నేను అంగీకరిస్తాను''.
ఆఫ్రికన్ అమెరికన్ల దయనీయ బతుకులు, బానిసత్వం ఒక నాగరిక దేశానికి ఎంత లజ్జాకరమో హారియెట్ బీచర్ స్టోవ్ అమెరికాకు తెలుపగా, ఎల్లవేళలా స్వార్థపూరితంగా వ్యవహరిస్తూ, ఎవరి బాగోగులను పట్టించుకోకపోవడంపై అమెరికన్ల అపరాధ భావాన్ని అయాన్ రాండ్ తొలగించారు. పన్నులలో తమ వంతు వాటాను సంపన్నులు సక్రమంగా చెల్లించక పోవడాన్ని 'నైతికం' చేయడమే కాక తమ సొంత బిడ్డలతో సహా ఇతరుల బాధలను పట్టించుకొనే బాధ్యత నుంచి లక్షలాది అమెరికన్లను రాండ్ విముక్తం చేశారు. తమ జీవితాలకు రాండ్ తత్వశాస్త్రం చేసిన హానిని గుర్తించి తమ మనస్సుల నుంచి దానిని తుడిచి వేయడానికి ఆమె మాజీ అభిమానులు పూనుకుంటున్నారు. ఒక జాతిగా అమెరికా కూడా అటువంటి పని చేస్తుందా
- బ్రూస్ ఇ.లెవినె
(ఆల్టెర్‌నెట్ సౌజన్యంతో)

No comments:
Post a Comment