-వసంత కన్నబిరాన్
https://www.andhrajyothy.com/EditorialShow.asp?qry=2011/jan/5/edit/5edit5&more=2011/jan/5/edit/editpagemain1&date=1/5/2011
కన్నబిరాన్ డిసెంబర్ 30న వెళ్ళిపోయారు. మేము ముందే మాట్లాడుకున్న మాటలపై ఆధారపడి, ఆయన కోరిక మేరకు, ఆయన అంతిమ సంస్కారాలు నిరాడంబరంగా, త్వరితంగా, లౌకిక పద్ధతిలో జరుగుతాయని తెలియజే శాం. లౌకికింగా జరగటానికి ఏ అభ్యంతరాలు లేవు. ఏ పేచీ లేదు. పూలు, దీపాలు, మంత్రాలు, ఇతర తంతులేమీ లేవు. కానీ 'అభ్యుదయ సంప్రదాయా లు' తీవ్రంగా ఇబ్బంది పెట్టడం నేను గమనించాను. మతపరమైన ఛాందసా న్ని వదిలించుకుని మనం వేరే విధమైన ఛాందసాన్ని కొని తెచ్చుకుంటున్నామనిపించింది.
కాలధర్మం చెందిన మనిషికి చివరిసారి గౌరవం తప్పనిసరిగా తెలుపుకోవాల్సిందే (పువ్వులు, నినాదా ల రూపంలో). చివరి దర్శనం చేసుకోవాలి దేనిని 51 సంవత్సరాలు కన్నబిరాన్ భార్యగా ఉన్న నేనే ఆయన చివరకు మిగిల్చి వెళ్ళిన శరీరాన్ని కన్నబిరాన్ అనుకోలేకపోయాను. నా బాధ, విచారం అంతా నిరంతరం అలుపెరగకుండా ఆయన చేసిన పోరాటం గరించి, ఆయన చిరునవ్వుల గురించి, సున్నిత హృద యం గురించి. అవి ఈ భౌతికకాయంలోంచి వెళ్ళిపోయాయి.
మేమిద్దరం చాలాకాలం క్రితమే మాలో ఎవరం చనిపోయినా భౌతికకాయాన్ని ఎవరి కోసమూ, మా ఒక్క అబ్బాయి అరవింద్ కోసం కూడా వేచి ఉంచకూడదనుకున్నాం. కన్నబిరాన్ ప్రజల మనిషి. ఆయన ను ప్రేమించే ప్రజలకే చెందిన మనిషి. ఇందులో ఎలాంటి సందేహమూ లేదు. కానీ దాని అర్థం ఆ ప్రజలు -నిజానికి ప్రజలు కాదు- ఆ ప్రజలకు ప్రతినిధులుగా తమను తాము నియమించుకున్న వారికి, పరస్పరం ఘర్షణపడే అనేక గ్రూపులకు చెందిన వారి కి ఆయన శరీరాన్ని ముక్కలు చేసి తలొక దిక్కుకీ తీసుకెళ్ళే హక్కు కావాలా
మనకు సంకేతాలు తప్ప సారాంశం అక్కర్లేదు. దానికి తోడు కొంత మన గురించి మనకో ధైర్యం, హామీ దొరకాలి. మనం ఎంత పెద్దగా స్పష్టంగా నినాదాలిచ్చినా కణ్ణా కు అవి వినపడతాయా అవి సంప్రదా య మంత్రాల వలె ఆయన ఆత్మను స్వర్గానికి తీసి కెళ్తాయా ఎవరికి మనం ధైర్యం చెప్తున్నాం మనకు మౌనం అంటే భయం దేనికి
మన రాడికల్ ఛాందసత్వాలను తిరోగామి ఛాందసత్వాలకంటే మరింత కరకుగా అర్థరహితంగా చేస్తున్నాం. రియాక్షనరీ ఏది రాడికల్ ఏది మనం ప్రేమించే వ్యక్తులకు స్మృతి చిహ్నాలు కట్టడానికి అంత ఆత్రం దేనికి కన్నబిరాన్ ప్రజల హృదయాల్లో జీవించకపోతే నివాళులు, స్మృతి చిహ్నాలు ఆయనను సజీవంగా నిలప గలుగుతాయా
నిజమేమిటంటే చనిపోయిన వారికి ఇవేమీ పట్టవని మనకు తెలుసు. మనం ఆ కీర్తిశేషుల పక్కన కనిపించాలనే తహ తహే అసలు విషయం. ప్రజల ముం దు మన ముండాలనేదే అసలు సంగతి. ఆ టివి కెమెరాలు మన విషాదాన్ని మన గొప్పదనాన్ని మన మన గ్రూపుల ప్రజలకు ప్రసారం చేసి చూపటం మీదే మన ఆసక్తి. ఇవాళ మీడియానే పరిపాలిస్తోంది.
వాళ్ళ దగ్గరున్న ఫైల్ ఫోటోలు, అర్థవంతమైన ఇంటర్వ్యూలను బైటికి తీసి చూపించే బదులు కెమెరాల్ని మృత శరీరం మీదా, ముక్కుల్లో ఉంచిన దూది మీదా ఏడ్చే వాళ్ళ విషాదం మీదా ఫోకస్ చేసి 'పబ్లిక్' ముందుంచుతారు. టెక్నాలజీని పరిణతి లేకుండా అర్థరహితంగా వాడే రియాలిటీ షోల కొనసాగింపే ఇది.
మరణించే వ్యక్తిని ఆయనను ప్రేమించేప్రజల ముందు సజీవం చేయకుండా ఆ వ్యక్తి దహనకర్మల వివరాలతో నింపుతారు. ఎంతమంది వచ్చారు ఎన్ని బ్యానర్లు, ఎన్ని ప్లకార్డులు, ఎన్ని సంస్థలు ఎంత మం ది విఐపిలు మరణించిన మనిషి గౌరవార్ధం వచ్చారనే లెక్కలు. మరణించిన వ్యక్తికి గౌరవం ఇవ్వటానికి మొదటి గుర్తు గన్‌మెన్‌లను, సెక్యూరిటిగార్డులను దూరంగా ఉంచి రాగలగటం. కె.జి.కన్నబిరాన్ దగ్గరకు పక్కన గన్‌మెన్‌లతో రావడమంటే ఆయన భావాలకు అవమానం మరొకటుందా
ఆయన పట్ల అంతకంటే మొరటుదనంగా వ్యవహరించటం ఊహించగలమా మనం మన తుప్పుని, బూజుని ఒదిలించుకు ని ఆలోచించగలగాలి. మౌనానికున్న విలువను గ్రహించాలి. ఈ మొత్తమంతటిలో దీనివల్ల నాకేం వస్తుంది, నా ఆర్గనైజేషన్‌కేం ఒస్తుందనే ఆలోచన మర్చిపోవాలి.
మన ప్రవర్తన గురించి, దృక్పథం గురించి ఆలోచించకుండా సంతాప వ్యాసాలు రాసి, సంతాప సభ లు పెట్టి ప్రయోజనం లేదు. చనిపోయిన వ్యక్తికి పురుత్థానం అవసరం లేదు. ప్రజల 'గొంతుల'కు 'ప్రాతినిధ్యానికి' పునరుత్థానం కావాలి. కన్నబిరాన్ పేద ప్రజల గొంతు. బిగ్గరగా, ధైర్యంగా, స్పష్టంగా లేచిన గొంతు. ఆయన తనను తాను ఎన్నడూ ప్రదర్శించుకోలేదు. ఆ అవసరం ఆయనకు లేదు. కన్నబిరాన్ లా ఉండటం తేలికకాదు. దానికో జీవితకాలం కావాలి. ఆయన్ని పొగుడుతూ అరవడం తేలిక. ఆ అరుపు ఒక క్షణంలో అణిగిపోతుంది.

No comments:
Post a Comment