అమ్మను వదిలి..అడవికి కదిలి!
అన్న..దమ్ములు-2
'ఏడ్వకమ్మా-ఏడ్వకు, నీ కొడుకూ ఎటూ పోలే. పేదోళ్ల గుండెల్లో పదిలంగా ఉండు, ఏడ్వకమ్మా- ఏడ్వకు, అందరిలో ఆఖరోడు, గోధుమ రంగు చిన్నోడు, చస్తే అగ్గి పెట్టెటోడు, పెళ్లి కాని పడుసోడు, వనవాసం పోయిండని విలపిస్తున్నావా! ఏడ్వకమ్మ- ఏడ్వకు!'.. అని ఎవ్వరు ఎంతగా సముదాయించినా తల్లి మనసు కుదుట పడదు! తొలి ముగ్గురు తనకు దక్కకుండా కన్నుమూశారు. తర్వాత పుట్టిన వారిలో ఇద్దరు మల్లోజుల కోటేశ్వరరావు, మల్లోజుల వేణుగోపాలరావు అమ్మను వదిలి అడవికి వెళ్లారు. కోటన్న అడవికి కదిలినప్పుడు ఆ తల్లి గుండె ఎంతగా తల్లడిల్లిందో! తమ్ముడు వేణుగోపాల రావు అక్షరాల్లో తడే ఆ సంగతి చెబుతుంది.
అతివాద పంథా నుంచి పార్టీని విప్లవ పంథాలోకి తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విప్లవ పార్టీ నాయకత్వం అంతటి ఎమర్జెన్సీ పరిస్థితుల్లోనే చేసిన ప్రయత్నాల్లో భాగంగా 1976 చివర్లో నాగపూర్‌లో జరిగిన తెలంగాణ ప్రాంతీయ కాన్ఫరెన్స్ ఒక మలుపులాంటిది. ఆ కాన్ఫరెన్స్‌కు హాజరైన అతికొద్దిమంది పార్టీ కార్యకర్తల్లో కోటన్న ఒకరు. ఆ కాన్ఫరెన్స్ ఆమోదించిన 'విప్లవానికి బాట' (వ్యూహం - ఎత్తుగడలు) డాక్యుమెంట్ యావత్తు పార్టీ కార్యకర్తల్లో బోల్షివిక్ స్ఫూర్తిని నింపింది.
ఆ మోటివేషన్‌తో జిల్లా రైతాంగంలో పని చేయడానికి అమరుడు కామ్రేడ్ కంది లచ్చిరెడ్డి (కాచాపురం), కోటన్నలు సిరిసిల్ల ప్రాంతానికే వెళ్లారు. ఒకరు నిమ్మపల్లి ప్రాంతాన్నీ, మరొకరు మరిగడ్డ ప్రాంతాన్నీ కేంద్రంగా చేసుకొని విప్లవ కార్యకలాపాలు ప్రారంభించారు. కానీ, కోటన్న అతి తక్కువ కాలంలోనే పోలీసులకు పట్టుబడ్డాడు. ఆయన అరెస్టూ, ఎమర్జెన్సీ వెత్తివేత ఏకకాలంలో జరిగి... ఆయనకు ప్రాణపాయం తప్పింది. వరంగల్ కేంద్ర కారాగారంలో ఆయన దాదాపు మూడు మాసాలు గడిపి వచ్చేసరికి, బయటి వాతావరణంలో పెద్ద మార్పులే చోటు చేసుకున్నాయి.
జైళ్లోనూ బందీల హక్కుల కోసం పెద్ద పోరాటమే జరింది. జైళ్లో కామ్రేడ్ ముప్పాళ లక్ష్మణ రావు, కోటేశ్వర్లు, మల్లా రాజిరెడ్డి సహా మరెందరో కామ్రేడ్స్ జైలు పోరాటాలకు నాయకత్వం వహించి, తమ న్యాయమైన డిమాండ్స్ సాధించుకున్నారు. ఈ పరంపర ఈనాటికీ ఆంధ్రప్రదేశ్ జైళ్లలో కొనసాగుతోంది. జైళ్లను కూడా విప్లవ పాఠశాలలుగా మలచాలని లెనిన్ చెప్పిన విషయాన్ని కోటన్న అక్షరాలా ఆచరించి, తన విడుదల అనంతరం జైలులో బందీలైన తన సహచరులకు ఆ విషయం నిరంతరం తెలిపే వారు.
జైలు నుంచి విడుదలైన కోటన్న మారిన దేశ పరిస్థితులలో మరింత ఉన్నతమైన బాధ్యతలతో జిల్లావ్యాప్త విప్లవ కార్యక్రమాలలో పూర్తిగా మునిగి పోయాడు. కంది లచ్చిరెడ్డి 1978లో ఒక బస్సు దుర్ఘటనలో మరణించగా... ఆయన వెంట ప్రయాణిస్తున్న కోటన్న సహచరుడి శవాన్ని ఆయన స్వగ్రామం కాసాపురం తరలించి విప్లవ సంప్రదాయాలతో అంత్యక్రియలు పూర్తి చేశాడు.
అలా జరపడం తెలంగాణ సాయుధ పోరాటం తర్వాత జిల్లాలో బహుశా తొలి ఘటన అయి ఉంటుంది. ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత క్రమంగా జగిత్యాల ప్రాంతంలో రైతాంగ ఉద్యమం ఊపందుకుంది. జిల్లా వ్యాప్తంగా రైతాంగం సంఘటితం కాసాగింది. ఆ సంఘటిత రైతాంగం ఉప్పెనవలె తరలివచ్చి జరుపుకొన్నదే జగిత్యాల జైత్రయాత్ర. జిల్లా పార్టీ నాయకత్వం ముందుండి ఆ సభను నడిపించింది. అప్పటికీ జన నాట్యమండలి సాంస్కృతిక కార్యక్రమాలలో వీధి భాగోతం మంచి గుర్తింపు పొందింది. పాముల రాంచందర్, అల్లం నారాయణ పట్వారీ వేషం కడితే మల్లా రాజిరెడ్డి భూస్వామి పాత్ర పోషిస్తే ఆ కార్యక్రమం ఎంతో రక్తి కట్టేది.
ఆ తర్వాత (జగిత్యాల జైత్రయాత్ర) కరీంనగర్-ఆదిలాబాద్ జిల్లాల్లో రైతాంగ ఉద్యమాలు మరింత ఊపందుకున్నాయి. ఆదిలాబాద్‌లో పొరకల సార్లుగా పార్టీ కార్యకర్తలు గుర్తింపు పొందితే, కరీంనగర్ జిల్లాలో అన్నలుగా, సార్లుగా గుర్తింపు పొందారు. పల్లె పల్లెన రైతాంగ పోరాటాలు పల్లె దొరలకు అగ్గి-నీళ్లు బందన్నాయి. పల్లె మంట పది పల్లెలకు అంటింది. 1978లో ప్రారంభమైన 'గ్రామాలకు తరలండి' విద్యార్థుల వేసవి క్యాంపెయిన్‌లకు ఆ రైతాంగం పెద్ద ప్రేరణ, ప్రాణ వాయువులా పని చేశాయి. ఆనాటి విద్యార్థి యువజనులకు సాయిని ప్రభాకర్, కోటన్నలు పెద్ద ఆకర్షణ.
జిల్లాలో పెంపొందుతున్న రైతాంగ ఉద్యమానికి మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా విప్లవ మేధావులు, ప్రజాస్వామికవాదులు, రచయితలు, కళాకారులు, వకీళ్లు చెప్పుకోతగిన పాత్ర పోషించారు. పెద్దపల్లి ప్రెస్‌లో మూడొంతుల అచ్చు పనులు విప్లవ సాహిత్యానికి చెందినవై, కోటన్న ఆధ్వర్యంలో సాగాయనడం ఆయనలోని వనరుల అన్వేషణా తపనను తెలియజేస్తుంది.
1980లో ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన సీపీఐ (ఎమ్ఎల్) (పీపుల్స్‌వార్)కు కోటన్న తొలి కార్యదర్శిగా 26 సంవత్సరముల వయసులోనే ఎన్నికకావడం విశేషం. ఆ గౌరవాన్ని తెచ్చిపెట్టింది కరీంనగర్-ఆదిలాబాద్ జిల్లాల రైతాంగ ఉద్యమమేనన్నది ఆయనకు తెలుసు. ఆయనను ఎన్నుకున్నవాళ్లకూ తెలుసు. ఆ ఉద్యమాన్ని స్థాయి ఉద్యమంగా, మరో మాటలో గెరిల్లా జోన్ స్థాయికి అభివృద్ధి చేయాలనీ అప్పుడే ఆ మహాసభలోనే నిర్ణయమైంది.
తెలంగాణ పల్లె భూస్వామ్యంతో తలపడిన పార్టీ, తుపాకులు వదలకుండానే సాయుధ పోరాట 'విరమణ' ప్రకటించి ఉన్న (1977 ఆగస్టు తీర్మానం) పార్టీ రాజ్యంతో తలపడడానికి తయారవ్వాలి. ఇదివినా భారత నూతన ప్రజాతంత్ర విప్లవ పురోగమనానికీ మరో దగ్గరి దారి ఏదీ లేకుండింది. రాజ్యంతో తలపడాలంటే దండకారణ్యానికి దండుగట్టాలని నిర్ణయమైంది. నిర్ణయం అమలులో భాగంగా ఒక సెక్షన్ కామ్రేడ్స్ తమ అసమర్థతను నిజాయితీగానే ప్రకటిస్తూ క్రియాశీల విప్లవోద్యమానికి దూరమయ్యారు. నేను అప్పటికి ఒకరకంగా అవుట్ సైడర్‌గానే ఉండి కోటన్న ద్వారా, ఆయన సహచరుల ద్వారా వింటూ ఉండిన రిపోర్టులవి.
1977-80 మధ్య కిషన్‌జీ (అప్పుడప్పుడే ప్రహ్లాదుడయ్యాడు) చాలా కాలం లీగల్‌గా, మరికొంత కాలం సెమీ-లీగల్‌గా, చివరికి రహస్య జీవితంలో ఉన్నాడు. ఆ సమయంలో రహస్య పార్టీ కార్యకర్తలతో ఇల్లంతా సందడిగా ఉండేది. బాపు (నాన్న)లో హేతువాద, నాస్తిక భావాలే అధికం. కాకపోతే... ఆర్థిక, రాజకీయ, కుటుంబ ఒత్తిళ్ల ఫలితంగా ఆయన 60వ వడిలో మొక్కుబడిగా సంధ్య వార్చడం మొదలు పెట్టారు. అమ్మ పిల్లల బాగు కోసం రాళ్లకు మొక్కినా, మొక్కలను పూజించినా, విగ్రహాలను ఆరాధించినా, ముడుపులు కట్టినా, కట్టిన ముడుపులు చించుకున్నా నవ్వుతూ చూసే వాడే తప్ప అడ్డు చెప్పేవాడు కాదు బాపు.
అవి వాళ్ల సుదీర్ఘ దాంపత్య జీవితంలో ఒకరికొకరు అర్థం చేసుకున్న కుటుంబ సర్దుబాటు వ్యవహారాలుగానే వాళ్ల పిల్లలుగా మేం తెలుసుకున్నాం. కోటన్న తనకిష్టమైన ఏ పని చేసుకున్నా తనకు నచ్చిన ఏ పిల్లతో పెళ్లి (కుల ప్రస్తావన లేకుండానే) చేసుకొన్నా, ఇంటి పట్టునే ఉండి పోవాలనీ అమ్మ మధురమ్మ ఎన్నెన్ని దేవుళ్లకు ఎంతని మొక్కుతుందో ఆమే చెప్పాలి. తన కడుపున పుట్టిన తొలి ముగ్గురు తనకు దక్కకుండా కన్నుమూశాక... మిగిలిన ముగ్గురు పిల్లలైనా తనతోనే ఉండాలనీ ఆ తల్లి పేగు ఎంతో ఆరాట పడేది.
కానీ... కోటన్నను ఏ దేవుడూ ఆపలేకపోయాడు. 'ఏడ్వకమ్మా-ఏడ్వకు, నీ కొడుకూ ఎటూ పోలే. పేదోళ్ల గుండెల్లో పదిలంగా ఉండు, ఏడ్వకమ్మా- ఏడ్వకు, అందరిలో ఆఖరోడు, గోధుమ రంగు చిన్నోడు, చస్తే అగ్గి పెట్టెటోడు, పెళ్లి కాని పడుసోడు, వనవాసం పోయిండని విలపిస్తున్నావా! ఏడ్వకమ్మ- ఏడ్వకు' అంటూ నేను, అల్లం వీరయ్య పాటను ఇంట్లో పాడుతుంటే అమ్మ తట్టుకోలేక పోయేది.
కోటన్న నావైపు చూసి ముసిగా నవ్వుతూ అమ్మ ఏడ్వడాన్ని తట్టుకోలేక తల అడ్డంగా నన్ను వాదించడం.... ఆయన శవంపై పడి 85 సంవత్సరాల అమ్మ గుండె పగిలిపోయేలా రోధిస్తుంటే ఎన్నెన్ని సార్లు గుర్తొస్తుందో! అమ్మ దగ్గర నేనులేని లోటు నా చిన్ననాటి సహచరులు, విప్లవాభిమానులు, విప్లవ ప్రజాసంఘాల కార్యకర్తలు, బంధు మిత్రులు, వాడకట్టు వాళ్లు, అందరికన్నా మేము నమ్ముకున్న జనాలు అమ్మను ఓదారుస్తుంటే తన కొడుకు మరణం హిమాలయాలకన్నా ఉన్నతమైందనీ చెప్పకుండా ఉండలేకపోతున్నాను. నేను చివరి వరకూ విప్లవోద్యమంలో ఉండి మీ రుణం తీర్చుకుంటాననీ హామీ యిస్తున్నాను.
చిద్రమైన కన్ను, తెరుచుకున్న నోరు, నుజ్జు నుజ్జయిన మస్తిష్కం, కాలిన పాదాలు, విరిగిన చూపుడు వేలు, తూటాల గాయాలు, ఒంటి మీద బాయ్‌నెట్‌తో తొలచిన రంధ్రాలు మించి నాకు ఆ శవపేటికలో కోటన్న 'నేను మృత్యువులో సైతం శత్రువును ఓడించానని' గర్వంగా ముసి నవ్వుతో నా కనుకొనుకుల నుంచి ఉబికి వస్తున్న కన్నీటి ధారలని ప్రేమగా తడుస్తూ, మళ్లీ నన్ను ఏడ్వద్దు అంటూ వారిస్తున్నట్టే ఉన్నాడు.
శత్రువు క్రౌర్యానికీ, భీభత్సానికీ భయానక చిహ్నంగా మిగిలిన ఆ మృతజీవి శరీరాన్ని వేలాదిమంది ఆయన అభిమానుల మధ్య పిచ్చిగ చూస్తున్న ఖాకీలకు, జన జీవన స్రవంతికి నిజమైన అర్థం తెలిసే ఉంటుంది. నేను అమ్మకు ఒక మాట చెప్పాల్సి ఉంది. కోటన్న నాకు రాసిన చివరి ఉత్తరం (2011 మే 10) ఇలా రాశాడు. 'అమ్మ కోసం ఉత్తరం రాశా. పూర్తి కావడం లేదు. ఎడిట్రీరైట్ వీలైతే చేయి. బాగా లేదనుకుంటే నీవు మరోటి తప్పకరాయి.
ఇది రాయడం వెనుక అమ్మే కాదు, తెలుగు అమ్మలకు విప్లవ నాడి అందించాలనే తపనతో ఈ రూపం ప్రారంభించా. ఎంత మేరకు ఉపయోగమైనా మంచిదే. ఈ ఒరవడి కొనసాగించాలి.'' కోటన్న అప్పగించి వెళ్లిన బాధ్యతను పూర్తి చేయడానికి 'అమ్మ, అన్నలాంటి వాళ్లే మనకు నిరంతరం స్ఫూర్తి' అంటూ కామ్రేడ్ మాసే దీదీ రాసినట్లు నేను ఆ స్ఫూర్తితో తప్పక ప్రయత్నిస్తాను.
http://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2012/apr/13/main/13main8&more=2012/apr/13/main/main&date=4/13/2012

No comments:
Post a Comment