Monday, 19 December 2011

అరుణతారకు అంతిమ వీడ్కోలు

- జన హృదయనేతకు ఘన నీరాజనం
- తరలివచ్చిన నేతలు, విప్లవ సంఘాల అభిమానులు
-నాలుగు రాష్ట్రాల నుంచి ఉద్యమకారులు స్నేహితులు
- కన్నీళ్ల మధ్య కలిసి కదలిన పెద్దపల్లివాసులు
- నిఘా నేత్రాల మధ్య సాగిన అంతిమయాత్ర
- పోలీసుల హెచ్చరికలు బేఖాతరు
- నాలుగుగంటల యాత్ర తర్వాత అంత్యక్షికియలు
- విప్లవ సంప్రదాయంలోనే దహన సంస్కారం
- తరలివచ్చిన వేలమంది జనం, పార్టీ నాయకులు
- అంతిమయావూతకు ఎంపీ, ఎమ్మెల్యేలు, నేతలు
- హాజరైన వరవరరావు, విమలక్క, గద్దర్, మంద కృష్ణ
ఈటెల, వివేక్, నారదాసు, సీతక్క,
అల్లం నారాయణ తదితరులు
టీన్యూస్, కరీంనగర్ ప్రతినిధిపెద్దపల్లి)
ఉద్యమాలే ఊపిరిగా బతికి... పేదల పెన్నిధిగా ఆదరణ పొందిన ఓ అరుణతార శకం ముగిసింది. విద్యార్థి దశ నుంచే అక్రమాలు, అన్యాయాలపై పిడికిలి బిగించి.. ఎదురొడ్డి.. పోరాడి కోట్లాది మంది గుండెల్లో నిలిచిపోయిన ఉద్యమనేత మావోయిస్టు అగ్ర నేత మల్లోజుల కోటేశ్వర్‌రావు అలియాస్ కిషన్‌జీ భౌతికపోరాట యాత్ర ఆగిపోయింది. అనుకున్న లక్ష్యసాధనకోసం క్రూరమైన నిర్బంధాన్ని, అణచివేతను, తుపాకీ తూటాలను లెక్కచేయకుండా గుండె అడ్డం పెట్టి పోరాటం సల్పిన పోరాటయోధుడు ఈ నేల నుంచి దూరమయ్యాడు. 37 సంవత్సరాల క్రితం ఉద్యమ బాట పట్టి.. అలుపెరగని పోరాటం చేసిన అరుణతార జన్మభూమికి దూరమై.. నింగికెగిసిన సందర్భం. . ఇన్నాళ్లు పేద జనం హృదయాల్లో చీకటిని పారదోలిన ఆయన.. ఇక ముందు నింగిలో చుక్కఅయి తన వారసులకు ఆదర్శంగా నిలువనున్నాడు. పోరాటం అంటే ఇలా ఉండాలని చాటిచెప్పిన జన హృదయనేత భౌతికంగా దూరమైనా.. మా గుండెల్లో దాగి ఉంటారంటూ ఆయన అభిమానులు, పెద్దపల్లివాసులు ఘనమైన అంతిమ వీడ్కోలు పలికారు.

అశ్రునివాళుల మధ్య..
మల్లోజుల అమర్‌హై.. కిషన్ జీ అమర్‌హై అన్న నినాదాల మధ్య మావోయిస్టు నాయకుడు మల్లోజుల కోటేశ్‌‌వ రావు అంతిమయాత్ర కరీంనగర్ జిల్లా పెద్దపల్లి పట్టణంలో ఆదివారం ఘనంగా జరిగింది. అంతిమయాత్ర సుమారు నాలుగు గంటల పాటు కొనసాగింది. ఆదివారం తెల్లవారు జామున ఒంటిగంటన్నరకు వచ్చిన భౌతికకాయాన్ని జనం సందర్శనార్థం పెద్దపల్లి పట్టణం బ్రాహ్మణవీధిలోని మల్లోజుల ఇంటి ముందు పెట్టారు. మల్లోజుల పార్థివదేహం వచ్చిందని తెలుసుకున్న పెద్దపల్లివాసులు రాత్రినుంచే తండోపతండాలుగా రావడం మొదలుపెట్టారు. పెద్దపల్లి పట్టణంలో పుట్టి కేంద్ర కమిటీ నాయకత్వం బాధ్యతలు స్వీకరించిన ఆ నేతను కనులారా చూసుకున్న స్థానికులు కన్నీళ్ల పర్యంతం అయ్యారు. ఆయన చేసిన ఉద్యమాలను, సాధించిన విజయాలను స్మరించుకుంటూనే సంతాపం ప్రకటించారు. వివిధ పార్టీలకు చెందిన నేతలు, వివిధ విప్లవ సంఘాలకు చెందిన నాయకులు తరలివచ్చారు. అరుణతార ఉద్యమాలను కీర్తిస్తూ నివాళులర్పించారు. పోలీసుల హెచ్చరికలను ఖాతరు చేయకుండా, నిర్బంధాలను ధిక్కరించి వచ్చిన అశేష జనం మధ్య మల్లోజుల కోటేశ్వర్‌రావు అంతిమయాత్ర సాగింది. మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, బెంగాల్, ఒడిశా నుంచి కూడా చాలా మంది తరలి వచ్చారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ఆయన ఇంటినుంచి బయలుదేరిన అంతిమయాత్ర.. పెద్దపల్లి పట్టణంలోని అమర్‌నగర్, పాతకోర్టు, ప్రగతినగర్, కమాన్ చౌరస్తా, జెండా చౌరస్తాల మీదుగా మజీద్ చౌరస్తాలనుంచి చందపల్లి రోడ్డులో ఉన్న శశ్మానవాటిక వరకు సాగింది.

యాత్రలో వాడవాడలా జనం నీరాజనాలు పట్టారు. మిద్దెలు, బంగ్లాలపై నిలబడి కడసారి చూసేందుకు ఆరాటపడ్డారు. దారిపొడుగునా పూలు చల్లుతూ కన్నీళ్లు పెడుతూ కడసారి వీడ్కోలు చెప్పారు. విప్ల , ప్రజా సంఘాల కార్యకర్తలు పాడిన పాటలు యాత్రలోని అందరిని కంట తడి పెట్టించాయి. కిషన్ జీ చేసిన ఉద్యమాలను తద్వారా ప్రజలకు చేకూరిన ఫలితాలను వారు వివరించిన తీరు అందరినీ కదిలింపజేశాయి.

పోలీసు పికెట్లు, తనిఖీలు
కిషన్‌జీ మృతదేహాన్ని పశ్చిమబెంగాల్ నుంచి పెద్దపల్లికి తీసుకువస్తున్న సందర్భంగా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. పహారా, నిఘా నేత్రాల మధ్య మావోయిస్టు అగ్రనేత మల్లోజుల కోటేశ్వర్‌రావు అంతిమయాత్ర సాగింది. ఆదివారం అర్ధరాత్రి నుంచే పెద్దపల్లి పట్టణాన్ని పోలీసులు చుట్టుముట్టారు. పెద్దపల్లి పట్టణం నుంచి 30 కిలోమీటర్ల వరకు నలువైపులా రోడ్లపై పోలీసు బలగాలను మోహరించారు. వచ్చిపోయే వాహనాలను తనిఖీలు చేశారు. 13 పికెటింగ్ కేంద్రాలు ఏర్పాటుచేయడంతోపాటు గ్రామాలనుంచి ప్రజలను రాకుండా అడ్డుకున్నట్లు విమర్శలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో అంతిమయాత్ర యావత్తు పోలీసుల కనుసన్నల్లో జరిగింది. మల్లోజుల ఇంటినుంచి బయలుదేరినప్పటి నుంచి మొదలు దహనసంస్కారం వరకు ప్రతి సన్నివేశాన్ని పోలీసులు తమ కెమెరాల్లో బంధించారు. పలుచోట్ల సీసీ కెమెరాలు అమర్చి యాత్రను షూట్ చేయించారు. ఇంకోవైపు మాజీ నక్సలైట్లను రంగంలోకి దించిన పోలీసులు కోటేశ్వర్‌రావు అంత్యక్షికియల కార్యక్షికమంపై దృష్టిపెట్టారు. నక్సలైట్ ఉద్యమంలో గతంలో పనిచేసినవారుగానీ.. లేదా ప్రస్తుతం పనిచేస్తున్నవారుగానీ వస్తే వారిని గుర్తించడానికి వీలుగా మాజీలను వినియోగించారు. ప్రధానంగా మల్లోజుల తమ్ముడు, మావోయిస్టు మరో అగ్ర నేత వేణుగోపాల్‌రావు వస్తాడన్న సమాచారం మేరకు ఆదివారం అర్ధరాత్రి నుంచి ఆ ఇంటిపై పోలీసులు డేగకన్ను వేసి పెట్టారు.

విప్లవ సంప్రదాయంలోనే దహన సంస్కారం
మావోయిస్టు నేత మల్లోజులకు విప్లవ సంప్రదాయంలోనే అంత్యక్షికియలు జరిగాయి. నిజానికి ముందుగా బ్రాహ్మణ పద్ధతిలో దహన సంస్కారం చేయడానికి కుటుంబసభ్యులు నిర్ణయించారు. ఆ మేరకు భౌతికకాయం రాగానే అంతిష్టయజ్ఞం నిర్వహించాలని నిర్ణయించారు. కానీ.. మల్లోజుల అనుసరించిన సిద్ధాంతం మతాలకు వ్యతిరేకం. అందుకు అనుగుణంగానే వ్యవహరించిన ఆయనకు బ్రాహ్మణ సంప్రదాయం పేరుతో దహన సంస్కారం చేయవద్దని పలువురు సూచించారు. కుటుంబసభ్యులు అంగీకరించడంతో ఆ మేరకు విప్లవ సంప్రదాయంలో జననేత దహన సంస్కారాలు నిర్వహించారు. కిషన్‌జీ అన్న ఆంజనేయులు కూతురు దీపతోపాటుగా విరసం నేతలు వరవరరావు, కళ్యాణరావు, విమలక్క, మందకృష్ణ మాదిగ మరికొంతమంది నాయకులు చితిపేర్చి అంటించారు. చితి మంటల సాక్షిగా కోటేశ్వర్‌రావు ఆశయసాధనకోసం కృషిచేద్దామని ప్రకటించారు. అమరవీరుల ఆశయాలను కొనసాగిద్దాం, కిషన్‌జీ అమర్ హై అంటూ నినాదాలు చేశారు. ఈ సమయంలో కుటుంబసభ్యులతోపాటు జనం తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు. కన్నీళ్లు కార్చారు.

తరలివచ్చిన నాయకులు
మావోయిస్టు నాయకుడు మల్లోజుల అంతక్షికియలకు పలువురు నేతలు, విప్లవ సంఘాల నాయకులు తరలివచ్చారు. విరసం నేత వరవరరావు, కళ్యాణ్‌రావు, చలసాని ప్రసాద్, విమలక్క, గద్దర్, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ, టీఆర్‌ఎస్ శాసనభ పక్షనేత ఈటెల రాజేందర్, పెద్దపల్లి ఎంపీ వివేక్, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, టీడీపీ ఎమ్మెల్యే సీతక్క, విజయరమణరావు, ఉద్యోగ సంఘాల జేఏసీ నేత దేవీవూపసాద్, నమస్తే తెలంగాణ ఎడిటర్ అల్లంనారాయణ, బంధు మిత్రుల కమిటీ నేతలు గంటి ప్రసాదం, పద్మకుమారి, హక్కుల నేత చంద్రశేఖర్, వెంకటరమణ, పలు సంఘాల నేతలు అంతిమయాత్రలో పాల్గొని తమ సంతాపాన్ని ప్రకటించారు.
http://www.namasthetelangaana.com/News/Article.asp?category=1&subCategory=2&ContentId=48730

No comments:

Post a Comment