చిన్న ఆరుట్ల అనే చిన్న చెంచుగూడెం ఆరేళ్ల కిందట చరిత్రను కన్నది. ఈ ఆరేళ్లలో ఆ చిన్న గూడెం పక్కనుంచే అప్పుడు ఒరుసుకుని పారిన వాగులోంచి ప్రవాహాలు అనేకం దిగువకు పారి ఉంటాయి. ఇట్లాంటి వాగులను, వంకలను, కొండలను, పొడి పీఠభూమి అడవిని గర్భంలో దాచుకున్న నల్లమల మళ్లీ వార్తల్లోకెక్కింది.
అయితే ఈసారి మళ్లీ ఒక చరిత్రకు మూలమైన మనుషుల మరణం వల్ల. ఇదే చరిత్రకు మరొకందుకు మూల కారకుడైన వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి కూడా ఇదే నల్లమలలో చనిపొ య్యి కూడా ఆర్నెళ్లు గడిచింది. ఆంధ్రప్రదేశ్‌ను నల్లమల వెంటాడుతున్నది. అసలు లేనే లేదనుకుంటున్న మావోయిస్టు ఉద్యమం ఈ రాష్ట్రాన్ని ఇంకా వెంటాడుతూనే ఉన్నది. బహుశా.. పదేపదే చచ్చిబతికే గడ్డి విత్తనం లక్షణమేదో ఆ ఉద్యమానికి ఉన్నట్టున్నది.
వద్దనుకున్నా అది తెలుగు ప్రజల జీవితాల్లో భాగమౌతూనే ఉంటున్నది. మీరు మావోయిస్టులను అంగీకరిస్తారా లేదా చిదంబరం గారు సెలవిచ్చినట్టు వాళ్లు జిహాదీల కన్నా ప్రమాదకరమైన వాళ్లేనా వాళ్లు ప్రాసంగికత కోల్పోయారా అన్న విషయాలట్లా పక్కన బెడితే మావోయిస్టుల మాట లేకుండా జీవించేకాలం తెలుగునాట ఉండబోదన్నదీ సత్యమే.
ఒక చరిత్రకు ఆరేళ్ల కిందట నేనూ, నాతో పాటు వందమంది జర్నలిస్టులం సాక్షులం. అప్పుడు చర్చల కోసం ఆ పొరలుతున్న వాగుదాటి కటకిట కిల్నర్ చప్పుళ్లతో, లోహం మోగినప్పుడు వచ్చే శబ్దంతో ఏకే47 తుపాకులను భుజం నుంచి భుజం మార్చుకున్నప్పుడు, అప్పటి రాష్ట్ర కమిటీ కార్యదర్శి రామకృష్ణ (అక్కిరాజు హరగోపాల్) తన ఏకే 47ను తీసి శాఖమూరి అప్పారావుకు అప్పగించిన దృశ్యాన్ని మేమంతా కెమెరాల్లో బంధించాం.
అప్పుడదొక సంచలన వార్త కూడా. శాఖమూరి ఇప్పుడు నల్లమలలో.. పుల్లల చెరువు ప్రాం తంలో నిర్జీవిగా నెత్తుటి మడుగులో పడి ఉన్నాడు.. తొమ్మిదేళ్ల కిందట చంచల్‌గూడ జైలు నుంచి శాఖమూరి అప్పారావు విడుదలయినప్పుడూ సంచలనమే. ఆయనని పోలీసులు మళ్లీ లిఫ్ట్ చేస్తారని ప్రజాసంఘాలవారు న్యాయవాదులు గద్దర్, వరవరరావు, నాకు తెలిసి అసదుద్దీన్ ఒవైసీ కూడా జైలునుంచి తప్పించి జనంలోకి తీసుకువెళ్లారు.
జైలులో ఉన్నప్పుడూ అప్పారావు వార్తగానే జీవించాడు. ఇంద్రారెడ్డి హోమ్‌మంత్రిగా ఉన్నప్పుడు.. ఖైదీ ల హక్కులకోసం ఆయన చాలాకాలం నిరాహారదీక్ష చేసి జైలునుంచీ పోరాట సందేశాన్ని పంపి ప్రసిద్ధుడయ్యారు. ఆ రకంగా మావోయిస్టు ఉద్యమంతోపాటు జనానికి నోళ్లలోనానే ... జర్నలిస్టులకు నాలుకలమీద నడయాడే పేరుగా ఖాఖమూరి అప్పారావు తెలుసు.
ఆయన ఇప్పుడు హఠాత్తుగా నల్లమలలో రాజకీ య కార్యకలాపాలకోసం వచ్చి ఉంటాడని గానీ, ఒంటరిగా ఒక ఏకే47 చేతబూని, జానపద కథానాయకుని మాదిరిగా సంచరిస్తుంటే పోలీసులు గమనించి ఆయనను లొంగిపొమ్మని హెచ్చరించి ఉంటారని, ఆయన కాల్పులు జరిపితే, తక్షణమే పోలీసులు ఎదురుకాల్పులు జరిపి ఉంటారని, ఆ ఎదురుకాల్పుల్లో శాఖమూరి అప్పారావు మరణించారని చెబితే.. బహుశా పోలీసులు కూడా నమ్మలేని కథ. కానీ మావోయిస్టు ఉద్యమంపై అణచివేత ప్రారంభం అయినప్పటినుంచీ ఈ కథలు వినీవినీ తెలుగు ప్రజ లు చాలా అనుభవం గడించారు.
ఇక్కడ సమస్య అది కాదు. సోలిపేట కొండల్‌రెడ్డి. మెదక్ జిల్లాలో సోలిపేట ఇంటిపేరుకు ఒక ప్రతిష్ట ఉంది. అతని రెండు దశాబ్దాల ప్రజాజీవితం వరంగల్ జిల్లా తాడ్వాయిలో అంతమయింది. ఒక మనిషి ప్రజా జీవితం లో ఇంతకాలం ఇట్లా కొనసాగడం ఎట్లా సాధ్యమవుతుంది.
ఒక్క శాఖమూరి అప్పారావే కాదు. అదే నల్లమల అడవి మింగిన అనేకమంది నక్సలైట్లు. మట్టా రవికుమార్ ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజీలో చదువు విడిచిన తర్వాత మళ్లీ ఆయన కనబడలేదు. అట్లని ప్రజలకు కాదు. ఆయన కుటుంబసభ్యులకు, సన్నిహితుల కు, పోలీసులకు కనబడలేదు. రెండు దశాబ్దాల పాటు ఆయన సామాన్య మానవులతో కలిసి, వాళ్లకోసం జీవించాడు.
అట్లాగే-పటేల్ సుధాకర్‌రెడ్డి. ఆయనది మూడు దశాబ్దాల జీవితం. ఉస్మానియా నుంచి వెళ్లిన ఆయన ఎందరిని ప్రభావితం చేశాడో.. చివరికి విద్యార్థి ఉద్యమం రోజుల్లో పూర్తి బద్ధశత్రువులుగా ఉన్న ఏబీవీపీ నాయకుడొకరు ఆ మధ్య పటేల్ విశిష్ట వ్యక్తిత్వాన్ని గురించి ఒక పత్రికలో రాశాడు. ఆర్‌కే ఫోటో ఒకటి నల్లమల అడవుల్లో తీసిన ఫోటోగ్రాఫర్‌గా అంతర్జాతీయ ప్రసిద్ధుడు రవీందర్‌రెడ్డి, అప్పుడు అడవికెళ్లిన ప్రముఖ జర్నలిస్టులు పట్‌ల్ సుధాకర్‌రెడ్డి గురించీ, ఆయన ల్యాప్‌ట్యాప్ గురించీ కథలు కథలుగా చెప్పా రు. సందె రాజమౌళి అంతే అర్థాంతరంగా మన సరిహద్దుల్లో అంతమయ్యాడు.
కరీంనగర్ ఓదెల మండలం గూడెం నుంచి ఎదిగివచ్చి మావోయిస్టు ఉద్యమంలో కీలకమైన పేరు, ప్రతిష్టలు పొంది ఎన్‌కౌంటరయ్యాడు. వడ్కాపూర్ చంద్రమౌళి. ఎక్కడో ఏజెన్సీగా చెప్పుకునే ప్రాంతాల్లో అలనాడు అల్లూరి సీతారామరాజు తిరుగాడిన నేలమీద పాతికేళ్లు తిరిగాడు. భార్యతో సహా ఏదో ఒక సమావేశానికి వెళ్లివస్తూ.. అదే అడవుల్లో కాలివేళ్లు కట్టేసి చాపలో చుట్టి న శవమయ్యాడు.
అతనిది కరీంనగర్ జిల్లా పెద్దపల్లి దగ్గరి వడ్కాపూర్ అనే చిన్నగ్రామం. కొయ్యూరులో ఎన్‌కౌంటర్ అయిన ఆదిరెడ్డి, ఆర్ట్స్ కాలేజీ కార్యదర్శి సంతోష్‌రెడ్డి, శీలం నరేష్‌లు ఎంత అద్భుత శక్తివంతులో ఎంత గొప్ప నాయకులో పత్రికల్లోనే కథనాలు అనేకం వచ్చాయి. ఇదే నల్లమల అడవుల్లో దుర్బేధ్యమైన ప్రాంతాల్లో ఎన్‌కౌంటరై, చివరికి మృతదేహం కూడా కుళ్లిన స్థితిలో దక్కిన బుర్ర చిన్నయ్యగౌడ్ (మాధవ్) పాతికేళ్ల ఉద్యమ జీవితం.
ఆయనదీ పెద్దపల్లి దగ్గరి మంగపేటే. తెలంగాణకు చెందిన వీళ్లను.. తమది కాని ప్రాంతాల్లోకి, తమవారు కాని జనాల్లోకి.. విశాల, విస్తృత ప్రపంచాల్లోకి, గహనాటవుల్లోకి నడిపించిన శక్తి ఏమిటి దశాబ్దాలపాటు వీరిని నడిపించిందేమి టి ఈ మనుషులు, సాదాసీదా, గొప్ప కుటుంబాల నుంచీ వచ్చినవాళ్లు.. అన్ని కులాల నుంచీ వచ్చినవాళ్లు. (సందర్భవశాత్తూ ప్రస్తావన వచ్చింది కనుక శాఖమూరి అప్పారావు కమ్మ. అగ్రవ ర్ణం.) అన్ని తరగతుల నుంచీ వచ్చినవాళ్లు. చదువుల సారం నేర్చినవాళ్లు.
అర్థం చేసుకుని, అవగాహన చేసుకున్నవాళ్లుఎవరి కోస మో ప్రాణాలను తృణప్రాయంగా ఎందుకు ఎంచుకున్నారు. ఒక సంవత్సరమో.. రెండు సంవత్సరాలో విప్లవకారుడుగా ఉండడం సులభమే. అరెస్టయ్యేదాకానో, జైలుకు వెళ్లేదాకానో, చిత్రహింస లు భరించేదాకనో, చిక్కులు ఏర్పడేదాకనో, ప్రాణం మీదకు వచ్చేదాకనో విప్లవకారుడుగా ఉండడం సులభమే.
రాజ్యం కన్ను, కత్తి నీడ పడకుండా ఎన్ని కబుర్లు చెప్పడమైనా సులభమే. కానీ చిత్రహింసలు భరించి, జైళ్లు భరించి, కుటుంబాలు వదిలి, పిల్లాజెల్ల ను వదిలి, ఏడ్వావద్దు.. ఎదురు చూడావద్దు అని తమ అర్ధభాగాలకు వీడ్కోలు చెప్పి కత్తుల కోలాటంలోకి కదిలివెళ్లిన వాళ్లను ఏ నమ్మకం నడిపించి ఉంటుంది. మావోయిస్టులను వ్యతిరేకిస్తా మా సమర్థిస్తామా వాళ్ల వల్ల విప్లవం వస్తుందా రాదా వాళ్లు కేవలం నెత్తుటి పిపాసులేనా నరహంతకులేనా విచక్షణారహితంగా హింసకు పాల్పడి మొండాల నుంచి తలలు వేరు చేసేవారేనా అన్న విషయాలు ఎవరికి వారు అనుకోవడానికి వీలైనవే.
అవి అభిప్రాయాల ఘర్షణ. కానీ.. మనుషులు ఇట్లా ఎందుకు తయారవుతారు. పందొమ్మిది వందలా డెబ్భైవ దశకంలోని ఒక తరం. ప్రత్యేకంగా తెలంగాణ ఉద్యమానంతర తరంలో ఇలాంటి మనుషులు తయారయ్యారు. వీళ్లని మీరు కాదన్నా.. వారి ఉన్నతమైన ప్రవర్తనతో వారు మీ మనసు మూలాల్లో చొరబడతారు. వారిని మీరు క్రూరులన్నా.. ఉన్నత మానవీయ విలువలతో వారు మిమ్మల్ని కలవరపెడతారు.
ఇట్లాంటి తరం గురించి చెప్పడానికే ఇదంతా.. ఈ తరాన్ని కోల్పోతూండడం ఎవరికైనా.. ఏ ప్రాంతానికైనా ఒక లోటే. మనం వాళ్లతో విభేదించొచ్చు. వాళ్లను హంతకులు అనొచ్చు. వాళ్లని జిహాద్‌లను మించిన దుర్మార్గులనవచ్చు. కానీ.. ప్రజల కోసం వాళ్లకున్న విశ్వాసాన్ని.. ప్రజల పట్ల వాళ్లకున్న ప్రేమను.. ప్రజల్లో వాళ్లు మమేకం చేసుకున్న విలువల ను.. నమ్మిన సిద్ధాంతాల కోసం కట్టుబాటును.. నిబద్ధతను ప్రశ్నించలేము.
అధవా ప్రశ్నించాల్సివస్తే.. మనల్ని మనం.. మన రాజకీయ ప్రధాన స్రవంతిని మనం.. ఒకపరి తేరిపార చూసుకోవడం అవసరం. తెలంగాణలో అటైనా ఇటైనా..విలువైన మనుషులు. అన్ని రకాలా ఎదిగివచ్చిన తరాలు.. అన్ని రకాల సుసంపన్నులైన ఉన్నత మానవులు.. నాయకులు.. ఏటా కనీసం వెయ్యి మంది చనిపోతుంటారని ఒక పోలీసు అధికారి ఇటీవలే ఎక్కడో అని బాధపడ్డారని విన్నాను.
నిజమే. ఈనేల మీద పూచిన అద్భుతమైన పువ్వులు రాలిపోవడం.. ఎంత విషాదం. కనీసం తెలుగు దీపక్‌లాగా (వెంకటేశ్వర్‌రెడ్డి) శాఖమూరి అప్పారావును, రెండు దశాబ్దాల పాటు ఉద్యమంలో మమేకమై తాడ్వాయి అడవుల్లో శవంగా తేలిన సోలిపేట కొండల్‌రెడ్డిలను కోర్టులో ప్రవేశపెట్టినా న్యాయం ఒకటి నాలుగుపాదాలా నడుస్తుందని నమ్మే వాళ్లం.. చరిత్రను నిర్మించేవాళ్లు.. చరిత్రలో కలిసిపోవడమే ఇప్పటి విషాదం
- అల్లం నారాయణ
http://www.andhrajyothy.com/EditorialShow.asp?qry=2010/mar/13/edit/13edit3&more=2010/mar/13/edit/editpagemain

No comments:
Post a Comment