ఉల్ఫాతో విబేదాలే కిషన్‌జీని పట్టించాయా
వ్యక్తిగత కారణాలతో బెంగాల్ నుంచి పంపివేత
అసోం టాస్క్‌లో ఉండగానే పట్టివేత
జంగల్‌మహల్ తీసుకొచ్చి కాల్చివేత
బలగాలకు ఉల్ఫా ఉప్పు.. పోటీ అవుతున్నారనేదే కార ణం
అసోంలో పాగాకు మావోయిస్టుల వ్యూహం
బారువాతో చర్చలు... అవి విఫలం కాండంతో సొంత ప్రయత్నాలు
మూడేళ్లుగా విస్తరణ కార్యక్రమాలు..జోరుగా నియామకాలు
అసోం-అరుణాచల్ సరిహద్దుల్లో శిక్షణా శిబిరాలు
అప్రమత్తమైన బలగాలు.. సహకరించిన ఉల్ఫా
నిఘా వర్గాలు, సానుభూతిపరుల కథనం
కోల్‌కతా, నవంబర్ 25 మావోయిస్టు అగ్రనేత మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్‌జీ ఎన్‌కౌంటర్‌కు, అసోం వేర్పాటువాద సంస్థ ఉల్ఫాకు సంబంధం ఏదైనా ఉందా అసోంలో మావోయిస్టు కార్యకలాపాలను బలోపేతం చేయటానికి ప్రయత్నిస్తున్న ఆయన కదిలికలపై ఉల్ఫా అధినేత పరేశ్ బారువా సహచరులే ఉప్పందించారా ఉల్ఫా, మావోయిస్టుల మధ్య తలెత్తిన విభేదాలే కిషన్‌జీని భద్రతా బలగాలకు పట్టించాయా గత రెండు నెలలుగా ఈశాన్య భారతంలో జరుగుతున్న సంఘటనలు, వివిధ పత్రికల్లో వస్తున్న వార్తలను పరిశీలిస్తే, అవునేమోననిపిస్తోంది.
దక్షిణ, ఉత్తర భారతాన్నంతా ఏదో మేరకు ప్రభావితం చేయగలుగుతున్న మావోయిస్టు పార్టీకి 'ఈశాన్యం' కొరకరాని కొయ్యగా మారింది. అసోంలో పాగా వేసేందుకు గత పది, పదిహేనేళ్లుగా ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. బెంగాల్ సరిహద్దుల్లో ఉండటం, భద్రతా బలగాల దాడుల తాకిడి తక్కువగా ఉండి షెల్టర్‌కు అనువుగా ఉండటం వల్ల కూడా అసోంపై కన్నేశారు. దీనికోసం ఉల్ఫాతో చాలాకాలంగా చర్చలు జరుపుతున్నారు. ఉల్ఫా డిమాండ్ చేస్తున్న స్వయం పాలనకు మద్దతు ఇస్తూనే.. అసోమేతరులపై దాడులు జరపరాదని మావోయిస్టులు షరతు పెట్టారు.
అందుకు బారువా ససేమిరా అనడంతో పీటముడి పడింది. ఈ చర్చల కోసం 2008లో కిషన్‌జీ బంగ్లాదేశ్ వెళ్లి బారువాను కలుసుకున్నారు. మావోయిస్టులకు అవసరమైన మౌలికమైన వనరులకు సంబంధించిన మద్దతు ఇవ్వటానికి అంగీకరిస్తూనే.. 'దాడుల' ప్రతిపాదనను మాత్రం తోసిపుచ్చారు. దీంతో ఇకపై ఉల్ఫాతో చర్చలకు వెళ్లరాదని మావోయిస్టులు నిర్ణయించారు. అసోంలో స్వయంగానే ఎదిగే ప్రయత్నం చేశారు. అప్పర్ అసోం లీడింగ్ కమిటీ (యూఏఎల్‌సీ) అనే సంఘం పెట్టి.. విస్తరణ వ్యూహాలను అమలు చేశారు.
రిక్రూట్‌మెంట్, విరాళాల సేకరణపై దృష్టి సారించారు. ప్రస్తుతం వంద మందికిపైగా అసోమీలు మావోయిస్టు పార్టీలో చేరినట్టు తెలుస్తోంది. అసోం-అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లోని దట్టమైన అడవుల్లో మావోయిస్టుల శిక్షణా శిబిరాలు ఉన్నాయి. సాదియా, తిన్‌సూకియా జిల్లాలో వారి ప్రాబల్యం ఎక్కువగా ఉంది. ఒక్కప్పుడు ఇవి ఉల్ఫాకు పెట్టని కోటలు. తమ ప్రాంతంలోకి మావోయిస్టులు రావటంపై స్థానిక ఉల్ఫా కార్యకర్తలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు'' అని ఇటీవల ఒక సీనియర్ సైనికాధికారి చేసిన వ్యాఖ్యలు ఇక్కడ గమనార్హం.
అయితే, ఒక్క ఉల్ఫాయే కాదు, పోలీసులు, సైన్యం కూడా 'మావోయిస్టు' ప్రమాదాన్ని గుర్తించాయి. నిఘాను పెంచి గాలింపు ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో మావోయిస్టులు దొరకలేదు గానీ, ఉల్ఫాకు చెందిన కార్యకర్తలు మరణించారు. ఈ అంశం కూడా బారువాను ఇబ్బంది పెట్టింది. మావోయిస్టులు తమ వెంట నిర్బంధాన్నీ తీసుకురావడంపై బారువా కలవరపడ్డారు.
ఈ నేపథ్యంలో మావోయిస్టులను అసోం నుంచి తరిమేయాలని నెల క్రితం ఆయన తన కేడర్‌కు ఆదేశాలు జారీ చేశారని, దీని కోసం ఉల్ఫా కొన్ని దళాలను కూడా ఏర్పాటు చేసిందని నిఘా వర్గాలు చెబుతున్నాయి. మావోయిస్టులకు సైన్యానికి మధ్య జరుగుతున్న పోరులో ఉల్ఫా కార్యకర్తలు సమిధలు అవుతున్నారని మా అధినేత భావిస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే మా సంస్థ ఉనికికే ప్రమాదం వస్తుందని ఆయన భావిస్తున్నారు'' అని ఓ కమాండర్ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
ఈ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తే ఒక పక్క సైన్యానికి, మరో వైపు ఉల్ఫా దళాల మధ్య మావోయిస్టులు చిక్కుకుపోయారని అర్థమవుతుంది. పార్టీలో ట్రబుల్ షూటర్‌గా పేరున్న కిషన్‌జీ ఈ దశలోనే అసోంలో అడుగుపెట్టారని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. బెంగాల్‌లో మూడు దశాబ్దాల కమ్యూనిస్టు కోటను కూల్చివేయడంతో కీలక భూమిక పోషించిన ఆయనకు..'అసోం' టాస్క్ అప్పగించారని ఈ వర్గాలు భావిస్తున్నాయి.
మావోయిస్టు పార్టీ ఈ నిర్ణయం తీసుకోవడానికి మరికొన్ని కారణాలూ జత కలిశాయని విశ్లేషిస్తున్నాయి. బెంగాల్‌లో కిషన్‌జీ విలువైన విజయాలనే అందించినా, వ్యక్తిగతంగా ఆయన వ్యవహార శైలిపై పార్టీ కేంద్ర కమిటీ తీవ్ర అసంతృప్తితో ఉందనే వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ సమయంలోనే ఆయనను అసోంకు కేటాయించారనే కథనాలు వచ్చాయి. 'నెలబాలుడు'లా ఉన్న అసోం ఉద్యమాన్ని పైకి తీసుకురావడం కిషన్‌జీకే సాధ్యమనే వాదనా లేకపోలేదు. బీహార్, జార్ఖండ్, బెంగాల్‌ల్లో ప్రాథమిక స్థాయిలో ఉన్న పార్టీకి ఆయన ఊపు తీసుకొచ్చిన క్రమాన్నీ గుర్తు చేసుకోవాలి.
వ్యక్తిగత విమర్శలతో పాటు, ఆయనకున్న అమేయమైన అనుభవం రీత్యా అసోం బాధ్యతలు అప్పగించి ఉండవచ్చునని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. అలా అసోం వెళ్లిపోయాడనుకున్న కిషన్‌జీ గురువారం బెంగాల్‌లోని జంగల్‌మహల్‌లో శవమై కనిపించడం చర్చనీయాంశంగా మారింది. అసోంలోనే పట్టుకొని, బెంగాల్‌లో కాల్చి చంపి ఉంటారన్న అనుమానాన్ని సానుభూతిపరులు వ్యక్తం చేస్తున్నారు.
కుమ్ములాటలతోనే..!
కిషన్‌జీ ఎన్‌కౌంటర్‌లో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. బెంగాల్ కమిటీలో కిషన్‌జీ తీరు నచ్చని నేతలే బలగాలకు ఉప్పందించారని అధికార వర్గాలు చెబుతున్నాయి. అసంతృప్త నేతల నుంచి కిషన్‌జీ ఆనుపానులను భద్రతా బలగాలు తెలుసుకున్నాయి. పక్కా సమాచారంతో ఉచ్చు బిగించి, కిషన్‌జీని ఎన్‌కౌంటర్‌లో అంతం చేశాయి'' అని ఈ వర్గాలు వివరిస్తున్నాయి.
పార్టీలోకి వస్తున్న మహిళలను అగ్రనేతలు తమ లైంగిక అవసరాలకు వాడుకుంటున్నారనే విమర్శ చాలా కాలంగానే ఉందని, కిషన్‌జీ ఎన్‌కౌంటర్‌తో అది నిజమని తేలిపోయిందని అధికార వర్గాలు వాదిస్తున్నాయి. ఎన్‌కౌంటర్‌లో మరణించిన బెంగాల్ రాష్ట్ర కమిటీ సభ్యుని సహచరి సుచిత్రా మహతోతో కిషన్‌జీ ఏడాదిగా కలిసి ఉండటంపై శ్రేణులు కుతకుతలాడిపోతున్నాయని, ఈ పరిస్థితిని భద్రతా బలగాలు చక్కగా వాడుకొన్నాయని వివరిస్తున్నాయి.
https://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2011/nov/26/main/26main5&more=2011/nov/26/main/main&date=11/26/2011

No comments:
Post a Comment