vvకోల్‌కతా భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావో యిస్ట్ అగ్రనేత కిషన్‌జీ మృతదేహాన్ని శనివారం ఆంధ్రప్రదేశ్‌లోని అతని స్వగ్రా మానికి తరలించారు. నేడు అంత్యక్రియలు నిర్వహిస్తారు. అంతకు ముందు.. కిషన్‌జీ మృతదేహాన్ని 150 కిలోమీటర్ల దూరం నుంచి ఓ పైలట్ కారు వెంట రాగా, అంబులెన్స్‌లో ఇక్కడికి తీసుకొచ్చారు. మిడ్నపూర్ మెడికల్ కాలేజీ ఆస్ప త్రిలో కిషన్‌జీ దేహానికి పోస్ట్ మార్టం జరిగింది. పోస్టుమార్టమ్ నివేదికలో కిష న్‌జీ ఎన్‌కౌంటర్‌లోనే మృతి చెందినట్లు ధృవీకరించారు. మావోయిస్టు అగ్రనేత మృతదేహాన్ని తమ ఖర్చుతో స్వస్థలానికి తీసుకెడతామని ఆయన మేనకోడలు దీపారావు, విప్లవకవి వరవరరావు, ఎపిడిఆర్ కార్యకర్తలు చేసిన డిమాండ్‌ను పోలీసులు తిరస్కరించారు.
మృతదేహాన్ని ఆంధ్రప్రదేశ్ కరీంనగర్ జిల్లా పెద్ద పల్లిలో కిషన్‌జీ ఇంటికి పంపాలని పశ్చిమబెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది. అంతకుముందు దీపారావు మిడ్నపూర్ ఆస్పత్రి మార్చురీలో కిషన్‌జీని గుర్తిం చారు. తనకు నాలుగు సంవత్సరాల వయసున్నప్పుడు దీపారావు చివరిసారిగా కిషన్ జీని చూశారు.
మావోయిస్ట్ అగ్రనేత కిషన్‌జీ హత్యపై దర్యాప్తు చేసే బాధ్యతను రాష్ట్రప్రభుత్వం సిఐడికి వప్పగించిందని అధికార వర్గాలు తెలిపాయి. కిషన్‌జీ హత్యకు నిరసనగా మావోయిస్టులు ఇచ్చిన రెండు రోజుల బంద్ పిలుపునకు పశ్చిమబెంగాల్‌లో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన పశ్చిమ మిడ్నపూర్, పురూలియా, బంకూరా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తప్ప మిగతా చోట్ల స్పందన లేదని ఆ వర్గాలు తెలిపాయి.
ఇదిలా ఉండగా కిషన్‌జీ హత్యకు నిరసనగా తీవ్రవాదులు ఇచ్చిన రెండు రోజుల బంద్‌కు పాక్షికంగానే స్పందన వచ్చింది. మిడ్నపూర్ నుంచి వచ్చిన కిషన్‌జీ మృతదేహం ఉన్న పేటికను నేతాజీ సుభాష్ చంద్రబోస్ (ఎన్‌ఎస్‌బి) అంతర్జాతీయ విమానాశ్రయంలో విఐపీల కుద్దేశించిన గేట్ నంబర్ 7 ద్వారా లోపలికి చేర్చి, కార్గో విమానంలో ఉంచారు. విమానాశ్రయంలో దేశీయ టెర్మినల్ వద్ద ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ కోసం హక్కుల సంఘం ప్రదర్శన జరపడంతో ఈ చర్య తీసు కున్నారు.
అమానవీయంగా ప్రవర్తించారు
మిడ్నాపూర్ మృతిచెందిన మావోయిస్టు నేత కిషన్‌జీ మృతదేహాన్ని ఆయన మేనకోడలు దీపారావు మిడ్నాపూర్ కాలేజ్ ఆసుపత్రి మార్చురీలో చూసి తన మేనమామగా గుర్తించారు. కిషన్‌జీ పట్ల అమానవీయంగా ప్రవర్తించారని పేర్కొంటూ మృతదేహాన్ని తన సెల్‌ఫోన్‌తో ఫొటో తీశారు. ‘ఆయన పట్ల అమా నవీయంగా ప్రవర్తించారన్నదానికి ఆయన శరీరంపై ఉన్న గుర్తులను చూడ వచ్చు. ఆయన చెంపలు తీవ్రంగా గాయపడ్డాయి’ అని దీప విలేకరులతో అన్నారు. మావోయిస్టుల సానుభూతిపరుడు, తెలుగు కవి వరవరరావు దీపతో పాటు కిషన్‌జీ మృతదేహాన్ని శుక్రవారం సందర్శించారు. కిషన్‌జీని నకిలీ ఎన్ కౌంటర్‌లో చంపటానికి ముందు క్రూరంగా హింసించారని ఆయన అన్నారు.
‘ మృతదేహం ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన తర్వాత ప్రజలు మృతదేహంపై ఉన్న గుర్తులను చూడవచ్చు. పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ఆదేశాల మేరకు నకిలీ ఎన్‌కౌంటర్‌లో కిషన్‌జీని హతమార్చారని’ ఆయన అన్నారు. మావోయిస్టు నేత ఆకాశ్ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంతో శాంతి చర్చలకోసం నెలరోజుల పాటు కాల్పుల విరమణకు సిద్ధపడిన నేపథ్యంలో ఈ నకిలీ ఎన్‌కౌంటర్ జరిపి మమత ప్రభుత్వం చర్చల ప్రక్రియకు విఘాతం కలిగించిందని వరవరరావు విమర్శించారు. ‘మమత చెప్పేదొకటిి చేసేది మరోకటి’ అని ఆరోపించారు. జంగల్‌మహల్ అడవుల్లో గత రెండు సంవత్సరాలుగా మావోయిస్టులు 400 మంది వ్యక్తులను చంపారు కదా అని విలేకరులు ప్రశ్నించగా, రావు నిశ్శబ్దంగా ఉండిపోయారు.
http://www.suryaa.com/main/showNews.asp?cat=1&subCat=3&ContentId=58469

No comments:
Post a Comment