కోల్‌కతా మావోయిస్టు అగ్ర నేత మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్ జీ నమ్మకద్రోహానికి బలైపోయారా మావోయిస్టులకు ఆహారాన్ని అందజేస్తున్న ఒక గ్రామస్తుడు నెల్లాళ్లక్రితం పోలీసులకు చిక్కాడని, అతన్ని ఇన్ఫార్మర్‌గా మార్చుకోవడంలో వారు సఫలీకృతులయ్యారని విశ్వసనీయవర్గాలద్వారా తెలుస్తోంది. అయితే, మావోయిస్టులు ఈ సంగతి పసిగట్టలేకపోయారని, నెలరోజులుగా అతను వారితో సన్నిహితంగానే మెలిగాడని తెలుస్తోంది. కుష్బోనీకి కొందరు నాయకులు వచ్చారని మంగళవారం అతను పోలీసులకు సమాచారం అందించాడంటున్నారు.
వచ్చినవారు పెద్ద నాయకులు అయి ఉండొచ్చని చెప్పడంతో వారిలో కిషన్ జీ ఉండే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేశారు. దాంతో బుధవారం వెయ్యిమంది సిబ్బందితో సీఆర్‌పీఎఫ్ పోలీసు అధికారులు దాడికి దిగారు. ఈ దాడిలో కొందరు తప్పించుకోగా ముగ్గురు అనుమానితులు దొరికారని, వారిని గట్టిగా ప్రశ్నించిన అనంతరం తప్పించుకున్నవారిలో అగ్రనేత కిషన్ జీ, మహిళా నేత సుచిత్రా మహతో ఉన్నారని నిర్ధారించుకున్నామని అధికారులు చెబుతున్నారు. ఆ సమాచారం ఆధారంగా గురువారం గాలింపు జరగ్గా ఎన్‌కౌంటర్ సంభవించి కిషన్ జీ హతుడయ్యాడని వారు అన్నారు. మరోవైపు, సుచిత్రా మహతో గాయాలతో తప్పించుకున్నారని పోలీసులు చెబుతున్న కథనం ఎంతవరకూ సరైనదో వెల్లడికావాల్సి ఉంది.
ఒరిస్సా నుంచి వచ్చిన కిషన్ జీ ఇటీవల కాలంలో ఒరిస్సాలో ఉంటూవస్తున్న కిషన్‌జీ ఈ వారం మొదట్లోనే వెస్ట్ మిడ్నాపూర్ వచ్చారని తెలుస్తోంది. బెంగాల్ మావోయిస్టు కమిటీ కార్యదర్శి ఆకాష్ కు, సుచిత్రా మహతో, బికాస్‌లతో ఉన్న వివాదాన్ని పరిష్కరించడానికి ఆయన ఆ ప్రాంతానికి వచ్చినట్టు సమాచారం.
20 రోజులక్రితం సమాచారం అందింది అరెస్టయిన ఒక వ్యక్తి ద్వారా కిషన్‌జీకి సంబంధించి 20 రోజులక్రితం తమకు సమాచారం అందిందని నక్సల్స్ నిరోధక ప్రత్యేక దళం ఎస్‌పీ మనోజ్‌వర్మ తెలిపారు. బుధవారం తాము అయిదుగుర్ని అరెస్టుచేశామని, వారిచ్చిన సమాచారం ఆధారంగా కిషన్‌జీ అక్కడున్నట్టు నిర్ధారించుకున్నామన్నారు. గ్రామస్తులు కూడా తమకు విలువైన విషయాలు తెలియజేశారని, ధర్మేంద్ర మహతో అనే వ్యక్తి ఇంట్లో దొరికిన పత్రాలు కూడా కిషన్‌జీ ఆచూకీని ధ్రువీకరించాయని వర్మ చెప్పారు. లొంగిపొమ్మని చెప్పినా వినక కిషన్‌జీ 30 రౌండ్ల తూటాలు ప్రయోగించగా ఒక సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ గాయపడ్డాడన్నారు.
కిషన్‌జీ స్థానంలో ఆయన సోదరుడు వేణుకు పగ్గాలు!
బెంగాల్‌లో మావోయిస్టు పార్టీకి కిషన్‌జీ సంస్థాగతంగా పటిష్టమైన పునాది వేశారని, దాన్ని బలహీనపర్చడం అంత సులభం కాదని పోలీసు అధికారి ఒకరు చెప్పారు. ఇక్కడ ప్రజా ఉద్యమాల ద్వారా మాత్రమే మావోయిస్టులు జనానికి చేరువవుతున్నారన్నారు. సరిగ్గా ఈ కారణంగానే మల్లోజుల సోదరుడు వేణుగోపాల్ బెంగాల్ ఉద్యమ నిర్వహణ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని అన్నారు. కిషన్‌జీ తరహా లోనే వేణుగోపాల్ కూడా ప్రజా సమీకరణ, ఉద్యమ నిర్మాణంలో దిట్టని తెలిపారు.
http://www.sakshi.com/main/FullStory.aspx?catid=273973&Categoryid=1&subcatid=32

No comments:
Post a Comment