ఛత్తీస్‌గఢ్, లాల్‌గఢ్‌లో ఆదివాసులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను మావోయిస్టు ఉద్యమం వెలుగులోకి తెచ్చింది. కరీంనగర్ దళితులు, బడుగు, బలహీన వర్గాల పక్షాన పోరాడిన కిషన్‌జీ, బయటి వ్యక్తులను చూసి పారిపోయే ఆదివాసులకు సర్కార్‌పై తిరగబడే చైతన్యాన్ని ఇవ్వడంలో మార్గదర్శకంగా నిలిచారు. వారికి హక్కులు నేర్పి, ‘జల్-జంగల్-జమీన్’పై అధికారం మీదేనంటూ ఏకం చేశారు. లాల్‌గఢ్‌లోనూ ఆదివాసులపై అటవీ సిబ్బంది, పోలీసులు, అధికారుల దౌర్జన్యాలపై పోరును జాతీయస్థాయిలో తీసుకెళ్లారు.
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ నాయకుడు మల్లో జుల కోటేశ్వరరావు అలియాస్ ప్రహ్లాద్ అలియాస్ కిషన్‌జీ ఎన్‌కౌంటర్‌ను పత్రికలు పతాకశీర్షిక చేశాయి. దేశవ్యాప్తంగా కాకపోయినా, బెంగాల్, తెలుగు పత్రి కలు మాత్రం ఎక్కువగానే ప్రాధాన్యతనిచ్చాయి. అయినప్పటికీ ఇది చాలా మందికి సంబంధంలేని విషయంగానే ఉన్నది. ముఖ్యంగా ఈనాటి యువ తరం, ప్రత్యేకించి పట్టణ మధ్యతరగతి ఇటువంటి సంఘటనల పట్ల మాత్రం చాలా ఉదాసీనంగానే వ్యవహరిస్తున్నది. గత పదిహేనేళ్లకుపైగా మావోయిస్టు పార్టీ అయితేనేం, ఇతర నక్సలైట్ పార్టీలు అయితేనేం పెద్దగా ప్రభావాన్ని కలిగించలేకపోయాయి. గత ఇరవై ఏళ్ల నుంచి విద్యార్థులు, యువకులు పెద్ద సంఖ్యలో ఆ పార్టీలలో చేరడం లేదు. ఇంకా చెప్పాలంటే తమకు అంటీముట్టని సమస్యగానే వాళ్లు చూస్తున్నారు. అయితే ముప్పై ఏళ్ల క్రితం ఆ ఉద్యమాలు, ఆ రాజకీయాలు చూపిన ప్రభావం, దాని ద్వారా వచ్చిన మార్పులను తెలుసుకోన వసరం లేదా చాలా మందికి దీని జవాబుపై అంత ఆసక్తి లేదనిపిస్తున్నది. కానీ, ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి పౌరుడు ఇటీవలి చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనల్ని వెంటాడుతున్న మంచి చెడులకు ఆ చరిత్ర కూడా కొంత కారణమే.
ముఖ్యంగా కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం, మెదక్, నల్ల గొండ, మహబూబ్‌నగర్, నిజామాబాద్ ప్రాంతాల్లో ఈ ఉద్యమం తన అడు గులను వదిలి వెళ్లింది. కిషన్‌జీ పుట్టిన గడ్డ కరీంనగర్ జిల్లా మరింత ప్రకం పనలకు లోనైంది. అక్కడి సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాల రూపురేఖలను మార్చివేసింది. ఆ విషయాలను చర్చించకుండా ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకోవడంగానీ, వాటిని మార్చడానికి కృషి చేయడంగానీ సాధ్యపడదు.
1975లో వచ్చిన ఎమర్జెన్సీ, పెనురాజకీయమార్పులకు దోహదం చేసింది. ఆనాటి యువతరం ప్రజాస్వామ్య చైతన్యం వైపు దృష్టి సారించారు. అటునుంచి నక్సల్‌బరీ ఉద్యమం వైపు అడుగులు వేశారు. అటువంటి యువతరానికి ప్రతినిధిగా ముందుకు నడిచిన వారిలో మల్లోజుల కోటేశ్వర రావు అలియాస్ కిషన్‌జీ ఒకరు. 1970-80 ప్రాంతాల్లో పల్లెల్లో పరిస్థితులు చాలా భయానకంగా ఉండేవి. దేవుడి తర్వాత ఊరి దొరదే సర్వం. చీమ చిటుక్కుమనాలన్నా దొర ఆజ్ఞ కావాల్సిందే. పల్లెలో పుట్టిన ప్రతివాడూ చాకిరీ చేయాల్సిందే. అది పూర్తిగా వెట్టిగా మాత్రమే. దానితోపాటు, అడుగడుగునా లంచాలు, మామూళ్లు, వడ్డీకి వడ్డీ లాగి భూములను, ఆస్తులను లాక్కునేవాళ్లు. దొర మాటను కాదంటే గ్రామ బహిష్కారమే మార్గం. బ్యాంకుల అప్పులు రైతుల పేరు మీద తీసుకొని, దొరలు అనుభవించేవాళ్లు. ప్రభుత్వ భూములను దొరలు ఆక్రమించుకొని కబ్జా చేసేవాళ్లు. ప్రజల మధ్య తగాదాలను పంచాయితీలుగా మార్చి, దండుగుల పేరుతో లక్షల రూపాయలు ప్రజల నుంచి గుంజేవాళ్లు. అంతేకాదు. అంటరాని తనాన్ని దొరలు అమానుషంగా అమలు చేసేవాళ్లు. తెల్లబట్టలు కట్టుకోకూడదు. పిల్లలను స్కూలుకు పంప కూడదు, దొరల ముందు చెప్పులు తొడుక్కొని నడవకూడదు. దొర ఎదురైతే పక్కకు తొలగి దారి ఇవ్వాలి, గోడలోకి ఒదిగిపోవాలి. ఎవరైనా ఆర్థికంగా బాగుపడితే దొరలు ఓర్వలేక పోయేవాళ్లు. పాలేరుతనం పేరుతో మాల, మాదిగలను బానిసలకన్నా హీనంగా చూసేవాళ్లు.
ఇక రాజకీయంగా అన్ని పదవులు వాళ్లవే. పటేల్, పట్వారీ పదవులు వెలగ బెడుతూ, రాజుల లాగా చలామణి అయ్యేవాళ్లు. తాలూకాలోను, జిల్లాలోను కూడా బ్యాంకులు, బ్లాకు (సమితి), పార్టీల పదవులు, రిజర్వు స్థానాలు తప్ప ఎమ్మెల్యే, ఎంపీలు అన్నీ వాళ్లకే హక్కుభుక్తమై ఉండేవి. ఈ అణచివేత, అమాను షాలు, దోపిడీ, దౌర్జన్యాలను సహించలేని ప్రజలు ముఖ్యంగా దళితులు, వెనుకబడిన కులాల ప్రజలు దొరలకు వ్యతిరేకంగా మొదలుపెట్టిన పోరాటమే నక్సలైట్ ఉద్యమం. ఎమర్జెన్సీకి ముందు రహస్యంగా ప్రారంభమై, తదనం తరం ఏర్పడిన ప్రజాస్వామిక వాతావరణంలో వెల్లువలాగా ఉద్యమం ఉప్పొం గింది. సిరిసిల్ల, జగిత్యాల తాలూకాల్లో మొదటి దశలో రాజుకున్న పోరాటం క్రమేణా జిల్లా అంతటా పాకింది. పల్లె పల్లె పెనుబల్లెమై దొరలకు వణుకు పుట్టించింది. జగిత్యాల జైత్రయాత్ర పేరుతో 1978లో వేలాది మంది దళితులు, కుల వృత్తుల వాళ్లు, రైతులు వీధుల్లోకి వచ్చి ‘ఊరు మనదిరా ఈ వాడ మనదిరా’ అంటూ, ‘పల్లె కదిలిందిరా జంబాయిరే’ అంటూ కదంతొక్కారు. దీనిలో కూడా కిషన్‌జీ పాత్ర చాలా ఉంది. అయితే 1980లో పెద్దపల్లి ప్రాం తంలో జరిగిన ప్రజాపోరాటాలు కిషన్‌జీని మంచి నాయకునిగా తీర్చిదిద్దాయి. ప్రజల ప్రత్యక్ష పాత్రతో దొరల వెన్నులో చలిపుట్టించిన నాయకుడు కిషన్‌జీ. పెద్దపల్లి తాలూకా రాగినేడు గ్రామంలో జరిగిన ప్రజల తిరుగుబాటు కరీంనగర్ జిల్లా ఉద్యమంలోనే ఒక వీరోచిత ఘట్టంగా చెప్పుకోవచ్చు. ప్రజలు దొరలకు వ్యతిరేకంగా జరుపుతున్న పోరాటాన్ని అణచడానికి పోలీసులను, గూండాలను ఉపయోగించడం మొదలుపెట్టారు. అయితే అప్పటికే సిరిసిల్ల, జగిత్యాల తాలూకాలను కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించి, తీవ్ర నిర్బంధాన్ని అమలు చేస్తున్నారు. పెద్దపల్లి తాలూకాలో అణచివేత తీవ్రంగానే ఉన్నది. అయితే పెద్ద పల్లి తాలూకాలో కిషన్‌జీ నాయకత్వంలో సాగుతున్న పోరాటం ప్రత్యక్ష చర్యకు దిగింది. భూస్వాముల గూండాల దాడులను ఖండిస్తూ, 1979 ఫిబ్రవరి మొదటివారంలో దాదాపు 15 గ్రామాల నుంచి ప్రజలు కదిలి పెద్ద ఊరేగిం పుగా రాగినేడు గ్రామం వెళ్లారు. అయితే, ముందుగా దొరల గూండాలు దాడులకు దిగారు. కానీ, వేలాది మంది ప్రజలను చూసి పారిపోయి, పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే గ్రామం చేరుకొని, ఊరేగింపును చెదరగొట్టడానికి గాలిలోకి కాల్పులు జరిపారు.
అప్పటికే భూస్వామి కొడుకులు ఇద్దరు ప్రజల మధ్యలో చిక్కుకున్నారు. వారితోపాటు మరో ఇద్దరిని ప్రజలు గ్రామం దగ్గరలోని గుట్టకు తీసుకొచ్చి, రెండు రోజులు బంధించారు. ప్రభుత్వాధికారులు, రైతు కూలీ సంఘం నాయ కులతో చర్చలు జరిపి పోలీసు క్యాంపులను ఎత్తివేస్తామని అంగీకరించడంతో దొర కొడుకులిద్దరినీ వదిలిపెట్టారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లాను మాత్రమే కాదు. మొత్తం రాష్ట్రాన్ని ఒక కుదుపు కుదిపింది. అప్పటి వరకు దొరలు సాగిస్తున్న అరాచకాలకు ప్రజలు ప్రత్యక్షంగా జవాబు చెప్పినట్టయింది. ఈ ప్రజా చైతన్యాన్ని కూడగట్టడంలో కిషన్‌జీ పాత్ర కీలకమైనది. అప్పటి నుంచి కిషన్‌జీ జీవితమంతా ప్రజల మధ్యనే గడిచింది. ఆయన పీపుల్స్‌వార్ జిల్లా కార్యదర్శిగా ఉన్న కాలంలోనే దండకారణ్యంలోని బస్తర్, గడ్చిరోలిలకు దళాలు తొలిసారి చేరుకున్నాయి. రాష్ర్ట కార్యదర్శిగా బాధ్యతలను తీసుకున్న తర్వాత ఆయన చూపిన చొరవ మరిన్ని ఫలితాలను ఇచ్చిందని చెప్పాలి. 1985 తర్వాత కిషన్‌జీ కార్యక్షేత్రం ఆంధ్రప్రదేశ్ నుంచి పొరుగున ఉన్న మహారాష్ట్రకు మారింది. బస్తర్, గడ్చిరోలి అడవిని ఉద్యమ కేంద్రంగా మార్చుకున్నారు. ఈ రోజు మనం వింటున్న బస్తర్ ఉద్యమం ఈ స్థితికి చేరుకోవడంలో కిషన్‌జీ పాత్ర కీలకమని చెప్పవచ్చు. బస్తర్‌లో గతంలో పనిచేసిన వాళ్లు గానీ, ఇప్పుడు ఇంకా పోరాటంలో ఉన్న వాళ్లుగాని ఎక్కువ మంది కిషన్‌జీ స్ఫూర్తితో వచ్చిన వాళ్లేనంటే అతిశయోక్తి కాదు. 1985 నుంచి 1993 వరకు బస్తర్‌లో ఉండి, ఆ తర్వాత 1994లో పశ్చిమబెంగాల్ వెళ్లి లాల్‌గఢ్ ప్రాంతాన్ని మరొకసారి ఉద్యమ కేంద్రంగా మార్చారు. 36 ఏళ్ల ఉద్యమ జీవితంలో రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న నాలుగేళ్లు మినహా మిగతా కాలమంతా కార్యక్షేత్రంలోనే ఉండటం కిషన్‌జీ ఉద్యమ జీవితం విశిష్టత.
ఆయనకు ప్రాంతం, భాష, ఏదీ అడ్డురాలేదు. ఆయన ఎన్‌కౌంటర్ అయిన సమయంలో తన కార్యక్షేత్రాన్ని అస్సాంకు మార్చారని తెలుస్తున్నది. ఒక విధంగా నక్సలైట్లందరూ మంథని అడవుల నుంచి మణిపూర్ కొండల దాకా తమ ఉద్యమానికి వ్యూహాత్మక ప్రాంతంగా చెప్పుకున్నవాళ్లే. ఆ ప్రాంతం అంతటినీ తిరిగి, ఆదివాసులను సమీకరించి, నిరంతరం ప్రజల కోసం తపించిన వాడు కిషన్‌జీ. ఆ పార్టీ ప్రతి ముందడుగులో ఆయన ఉన్నట్టు మనకు కనిపిస్తున్నది. మావోయిస్టు పార్టీలో కానీ, మరే ఇతర నక్సలైట్ పార్టీలో కానీ ఇంతటి సుదీర్ఘమైన ప్రత్యక్ష ఉద్యమ అనుభవం ఉన్నవాళ్లు మరొకరు లేరనిపి స్తున్నది. ఒకే ప్రాంతంలో ఉన్నవాళ్లు ఉండవచ్చు. కానీ విశాలమైన ప్రాంతంలో ఇంతటి విశేష అనుభవం మరొకరికి ఉండదనిపిస్తున్నది. ఎక్కడికెళితే ఆ భాష మాట్లాడటం, ఆ ప్రాంత ప్రజలతో మమేకం కావడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని ఆయన సన్నిహితులు చెబుతారు.
ఛత్తీస్‌గఢ్, లాల్‌గఢ్‌లో ఆదివాసులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను మావోయిస్టు ఉద్యమం వెలుగులోకి తెచ్చింది. కరీంనగర్ జిల్లా దళితులు, బడుగు, బలహీన వర్గాల పక్షాన పోరాడిన కిషన్‌జీ, బయటి వ్యక్తులను చూసి పారిపోయే ఆదివాసులకు సర్కార్‌పై తిరగబడే చైతన్యాన్ని అందించడంలో మార్గదర్శకంగా నిలిచారు. అడవి బిడ్డలకు హక్కులను నేర్పి ‘జల్-జంగల్- జమీన్’పై అధికారం మీదేనంటూ ఏకం చేశారు. అదేవిధంగా లాల్‌గఢ్‌లో కూడా ఆదివాసులపై అటవీ సిబ్బంది, పోలీసులు, అధికారులు చేస్తున్న దౌర్జ న్యాలకు వ్యతిరేకంగా సంఘాలు పెట్టి, ఆ పోరాటాన్ని జాతీయస్థాయిలో కనపడే విధంగా చేసిన కృషి కిషన్‌జీది.
ప్రజలతో మమేకం కావడం, ప్రత్యక్షంగా ప్రజలతో నడవడం, త్యాగ నిరతితో, సాహసంతో ఉద్యమంలో నిలబడటం ఎవరికైనా స్ఫూర్తి కావాలి. సాయుధ పోరాటమైనా, శాంతి మార్గమైనా నాయకులకు ఈ లక్షణాలు ప్రాథ మికమైనవి. సమాజంలో దళితులు, ఆదివాసులు, మైనారిటీలు, బలహీన వర్గాల పేదలు తమ హక్కులను పొందకుండా ఈ దేశం అభివృద్ధి చెందడం సాధ్యం కాదు. దేశం శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దూసుకెళుతుందని చంకలు గుద్దుకుంటున్న మధ్యతరగతి వర్గ ప్రజలకు, నగర జీవులకు పోరాడే పేదవాళ్లు పట్టకపోవడమంటే, దేశం పట్టకపోవడమే. శరీరంలోని సగభాగం అనారో గ్యంతో బాధపడే మనిషి ఏ విధంగా ఆరోగ్యవంతుడు కాడో, అవమానం, ఆకలితో బాధపడే ప్రజలు సగానికి ఎక్కువగా ఉన్న దేశం అభివృద్ధి చెందుతు న్నట్లు కాదు. ప్రజల కోసం తపించే మనుషులు, వారి కోసం త్యాగాలు చేసే నాయకుల గురించి తెలుసుకోవడం ద్వారా ఈ దేశాన్ని బాగు చేసే పనిలో మనం భాగస్వాములమవుదాం. ఆలోచించండి.
విశేష రచన- మల్లెపల్లి లక్ష్మయ్య
http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=32339&Categoryid=1&subcatid=18
No comments:
Post a Comment