నేల రాలిన అరుణ తార
కిషన్‌జీ కాల్చివేత
బెంగాల్ అడవుల్లో ఎన్‌కౌంటర్
ఒక్కడిని చుట్టుముట్టిన వెయ్యి మంది
హోరా హోరీ పోరులో మరణించారని ప్రకటన
మూడున్నర దశాబ్దాల విప్లవ ప్రస్థానం
పీపుల్స్ వార్ స్థాపనలో కీలక పాత్ర
పొలిట్ బ్యూరో సభ్యుడిగా అగ్రస్థానం
సంచలన దాడులతో సర్కార్లకు ముచ్చెమటలు
కరీంనగర్ నుంచి బెంగాల్‌కు ప్రయాణం
పీపుల్స్ వార్ స్థాపనలో కీలక పాత్ర
పొలిట్ బ్యూరో సభ్యుడిగా అగ్రస్థానం
సంచలన దాడులతో సర్కార్లకు ముచ్చెమటలు
కరీంనగర్ నుంచి బెంగాల్‌కు ప్రయాణం
మావోయిస్టు అగ్రనేత, తొలితరం నాయకుడు, పీపుల్స్‌వార్ గ్రూప్ వ్యవస్థాపకుల్లో ఒకరైన మల్లావఝల (మల్లోజుల) కోటేశ్వరరావు అలియాస్ కిషన్‌జీ (58) శకం ముగిసింది. మూడున్నర దశాబ్దాల అజ్ఞాత పోరాటం... మరణంతోనే ముగిసింది. మావోయిస్టు పార్టీకి పెను దెబ్బ తగిలింది. ఆశ్రయమిచ్చి, అండగా నిలిచిన 'విముక్త ప్రాంతం' జంగల్ మహల్‌లోనే... ఆయన శ్వాస ఆగింది.
బుధవారం నుంచే చుట్టుముట్టిన కేంద్ర, రాష్ట్ర బలగాల చేతిలో కిషన్‌జీ జీవితం ముగిసింది. మావోయిస్టు స్వరమై వినిపించి, తెరవెనుక రూపమై కనిపించిన కిషన్‌జీ పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించారు. విపక్షంలో కురిసిన 'మమత' అధికారంలోకి రాగానే ఆగిపోవడంతో... అధికారంలోకి వచ్చి ఆరు నెలలైనా గడవకముందే, 'ఇక చేతులు ముడుచుకుని కూర్చోలేం' అని ప్రకటించి వారం రోజులైనా కాకముందే.. 'ఫైర్ బ్రాండ్' మమతా బెనర్జీ తన పవర్ చూపించారు.
సీపీఎం తన హయాంలో చేయని పనిని, అచిర కాలంలోనే చేసి చూపించారు. అనేక ఎన్‌కౌంటర్ల నుంచి తప్పించుకుని 'చిక్కడు దొరకడు'గా పేరుపొందిన కిషన్‌జీ ఆచూకీని పోలీసులు కనిపెట్టి మరీ చంపేశారు. బెంగాల్‌లోని పశ్చిమ మిడ్నపూర్ జిల్లా కుష్బోనీ సమీపంలోని సౌరభ్ అడవుల్లో ఉన్న కిషన్‌జీని బుధవారమే సుమారు వెయ్యి మంది సంయుక్త బలగాలు చుట్టుముట్టాయి. 'ఆయన త్రుటిలో తప్పించుకున్నారు' అని పోలీసు అధికారులు ప్రకటించారు. కానీ... గురువారం సాయంత్రం అసలు విషయం బయటపెట్టారు. 'హోరాహోరీ పోరు'లో కిషన్‌జీ మరణించినట్లు ప్రకటించారు.
కోల్‌కతా, నవంబర్ 24: మావోయిస్టు అగ్రనేత, పొలిట్‌బ్యూరో సభ్యుడు మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్‌జీ (58) నేలరాలారు. పశ్చిమబెంగాల్‌లోని పశ్చిమ మిడ్నపూర్ జిల్లా కుష్బోనీ ప్రాంతంలోని బురిసోల్ అడవులలో భద్రతాదళాలతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఆయన మరణించారు. పోలీసుల చేతుల్లోంచి తప్పించుకున్న ఒక్క రోజుకే ఆయన మరణించారని కౌంటర్ ఇన్సర్జెన్సీ దళానికి చెందిన ఉన్నతాధికారి ఒకరు ప్రకటించారు. కిషన్‌తో పాటు మరో దివంగత నేత భార్య సుచిత్రా మహతో, ఇంకొందరు అనుచరులు ఉన్నట్లు సమాచారం అందడంతో వెయ్యిమందితో కూడిన భద్రతాదళాలు అటవీ ప్రాంతాన్ని బుధవారమే చుట్టుముట్టాయి.
సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, కోబ్రా బలగాలతో పాటు పశ్చిమబెంగాల్ పోలీసులు కూడా ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. గ్రామ రక్షణ దళాలతో పాటు నాలుగంచెలుగా ఉన్న కిషన్‌జీ భద్రతా వలయంతో భీకర పోరాటం జరిగిందని, ఇందులో కిషన్‌జీని హతమార్చామని ఆ అధికారి చెప్పారు. జార్ఖండ్ సరిహద్దులకు సమీపంలో ఉన్న జంబోనీ పోలీసుస్టేషన్ పరిధిలోని బురిసోల్ అడవుల్లో బుధవారం నుంచే ఎన్‌కౌంటర్ మొదలైంది.
గురువారం అది ముగిసేసరికి కిషన్‌జీ మృతదేహం.. ఏకే-47 తుపాకితో సహా లభించిందని భద్రతా దళాధికారులు తెలిపారు. సుచిత్ర, ఇతర అనుచరులు తప్పించుకున్నారన్నారు. ఓ ల్యాప్‌టాప్ బ్యాగ్, కిషన్‌జీ, సుచిత్ర రాసిన కొన్ని లేఖలను స్వాధీనం చేసుకున్నారు. నిజానికి బురిసోల్ అడవుల నుంచి జార్ఖండ్‌లోని మలబాల్ అడవుల్లోకి వెళ్లిపోవాలన్నది కిషన్‌జీ వ్యూహమని.. కానీ, అన్ని మార్గాలనూ దిగ్బంధించడంతో అది సాధ్యం కాలేదని అధికారులు అన్నారు.
ఎన్‌కౌంటర్‌లో మరణించింది 99 శాతం కిషన్‌జీయేనని కేంద్ర హోం శాఖ కార్యదర్శి ఆర్‌కే సింగ్ తెలిపారు. పోల్చి చూసుకునేందుకు వీలుగా కిషన్‌జీ తాజా ఫొటోలను బెంగాల్‌కు పంపామని చెప్పారు. మావోయిస్టు అగ్రనేతలలో నెంబర్ త్రీగా ఉన్న కిషన్‌జీ మరణం నక్సలైట్లకు పెద్ద ఎదురుదెబ్బ అని ఆయన అభివర్ణించారు.
కిషన్‌జీ ఎన్‌కౌంటర్‌తో.. నక్సలైట్ల ప్రభావం తీవ్రంగా ఉన్న తొమ్మిది రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరికలు జారీచేసింది. పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్, ఒడిసా, ఛత్తీస్‌గఢ్, బీహార్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో మావోయిస్టులు దాడులకు తెగబడే ప్రమాదం ఉన్నందున ఆయా రాష్ట్రాల డీజీపీలు అప్రమత్తం కావాలని కేంద్ర హోం మంత్రిత్వశాఖ తెలిపింది. ఎన్‌కౌంటర్ నేపథ్యంలో పశ్చిమబెంగాల్ రాష్ట్రవ్యాప్తంగా రెడ్ ఎలర్ట్ ప్రకటించారు. మావోయిస్టుల నుంచి ఎదురయ్యే ఎలాంటి దాడినైనా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాలని ఆ రాష్ట్ర డీజీపీ నపరాజిత్ ముఖర్జీ సూచించారు.
బెంగాల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సమర్‌ఘోష్, హోం శాఖ కార్యదర్శి జీడీ గౌతమ, డీజీపీ, కోల్‌కతా పోలీసు కమిషనర్ రంజిత్ పచ్‌నందా తదితరులు రాష్ట్రంలో పరిస్థితిపై చర్చించేందుకు ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. మమతా బెనర్జీ బెంగాల్ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత మావోయిస్టులకు ఇదే తొలి ఎదురుదెబ్బ. కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే తప్పనిసరి వెయిటింగ్‌లోకి పంపిన పశ్చిమ మిడ్నపూర్ జిల్లా మాజీ ఎస్పీ మనోజ్ వర్మను ఇటీవలే మళ్లీ పిలిపించారు. మావోయిస్టులను అణిచేయాలని మమత నిర్ణయం తీసుకున్న తర్వాత దాని కోసమే ఆయనను తీసుకొచ్చారు.

https://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2011/nov/25/main/25main1&more=2011/nov/25/main/main&date=11/25/2011
No comments:
Post a Comment