Monday, 19 December 2011

కోటన్నకు నిలువెల్ల గాయాలు

-భౌతికకాయాన్ని గుర్తించిన దీప, వీవీ
- శరీరం అంతా గాయాలే
- ఛిద్రమై, విరిగిపోయిన పాదాలు
- పేలిపోయిన దవడ భాగం
- శరీరంలో 20 చోట్ల గాయాలు
- ఆరు బుల్లెట్లు, నాలుగు గ్రెనేడ్ తునకలు
- ఆయన శరీరంలో దొరికినవి ఇవే!
- ఎన్‌కౌంటర్‌పై సీఐడీ విచారణకు ఆదేశం
కోల్‌కతా, నవంబర్ 26 మావోయిస్టు అగ్రనేత మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్‌జీది ముమ్మాటికీ బూటకపు ఎన్‌కౌంటరేనని కిషన్‌జీ అన్న కుమార్తె దీప, విప్లవ కవి వరవరరావు పేర్కొన్నారు. శనివారం మిడ్నాపూర్ మెడికల్ కాలేజ్ ఆస్పవూతిలో కిషన్‌జీ భౌతికకాయాన్ని వారు గుర్తించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ‘‘ఇది బూటకపు ఎన్‌కౌంటరే. శరీరమంతా బుల్లెట్ గాయాలే. ఆయన కాళ్లు కాలిపోయి ఉన్నాయి. 24 గంటల పాటు ఆయనను అదుపులో ఉంచుకుని చిత్రహింసలకు గురి చేసి అనంతరం కాల్చి చంపారు. ఈ ఎన్‌కౌంటర్‌పై సీబీఐ విచారణ జరగాలి. ఎంత చిత్రహింసకు గురి చేసి చంపారో కిషన్‌జీ భౌతికకాయం రాష్ట్రానికి చేరుకున్న తర్వాత ప్రజలే తెలుసుకుంటారు’’ అని వరవరరావు చెప్పారు. ప్రభుత్వం అభీష్టం మేరకే కిషన్‌జీని బూటకపు ఎన్‌కౌంటర్‌లో చంపారని ఆయన పునరుద్ఘాటించారు.

ఈ ఎన్‌కౌంటర్‌కు మమతాబెనర్జీ, హోంమంత్రి చిదంబరమే బాధ్యులని ఆరోపించారు. ‘‘మావోయిస్టు బెంగాల్ నేత ఆకాష్ నెల రోజుల పాటు కాల్పుల విరమణకు ప్రతిపాదిస్తే సీఎం మమత మాత్రం మావోయిస్టులపై పూర్తి స్థాయి దాడులు ప్రారంభించారు’’ అంటూ ఆయన విరుచుకుపడ్డారు. మృతదేహాన్ని గుర్తించే సమయంలో సెల్‌ఫోన్ ద్వారా భౌతికకాయాన్ని తీసిన ఫొటోలను కిషన్‌జీ అన్న కూతురు దీప విలేకరులకు చూపించారు. ‘‘ఇది అమానుషం. ఆయన శరీరంపై కనీసం 20 గాయాలు ఉన్నాయి. దవడ భాగం పేలిపోయి ఉంది. అమానుషంగా చిత్రహింసలకు ఆయనను గురి చేసినట్లు ఈ ఫొటోలు చూస్తే మీకు తెలుస్తుంది’’ అని ఆమె అన్నారు. రాజకీయ, సామాజిక ప్రతినిధులు సైతం కిషన్‌జీది బూటకపు ఎన్‌కౌంటరేనని అన్నారు. కిషన్‌జీ మృతదేహాన్ని గమనిస్తే ఇది నిజమైన ఎన్‌కౌంటర్ అనిపించడం లేదని సమాజ్‌వాది పార్టీ నేత మోహన్‌సింగ్ చెప్పారు.

ఫార్వర్డ్‌బ్లాక్ కూడా కిషన్‌జీది బూటకపు ఎన్‌కౌంటరేనని అనుమానాలు వ్యక్తం చేసింది. కిషన్‌జీ మరణానికి సంబంధించిన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం అనుమానాలు నివృత్తి చేయాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి దేబవూబత బిశ్వాస్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఎప్రముఖ సామాజిక కార్యకర్త, గతంలో మావోయిస్టులకు, ప్రభుత్వానికి మధ్య చర్చల ప్రక్రియ ప్రారంభానికి కృషి చేసిన స్వామి అగ్నివేష్ ఈ ఎన్‌కౌంటర్‌పై న్యాయ విచారణ జరగాలని అన్నారు.‘‘గతంలో చర్చల ప్రక్రియలో భాగస్వామి అయిన ఆజాద్ ఆంధ్రవూపదేశ్‌లో ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. కిషన్‌జీ మరణం శాంతి ప్రక్రియకు తీవ్ర విఘాతం. ఆయన మృతి మావోయిస్టులకు కూడా తీరని లోటు’’ అని ఆయన అన్నారు. కిషన్‌జీ మృతదేహానికి జరిపిన పోస్టుమార్టం నివేదికను బహిర్గతం చేయాలని సీపీఎం డిమాండ్ చేసింది. నివేదిక బయటికి వస్తేనే ఏం జరిగిందనేది తెలుస్తుందని సీపీఎం బెంగాల్ రాష్ట్ర కార్యదర్శి బిమన్‌బోస్ చెప్పారు.

కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు
కిషన్‌జీ మృతదేహాన్ని ఆయన అన్న కుమార్తె దీప గుర్తించిన తర్వాత పోస్టుమార్టం నిర్వహించారు. ఒక చెక్క శవపేటికలో ఆయన భౌతికకాయాన్ని ఉంచి.. ఆస్పవూతికి చెందిన ప్రత్యేక అంబుపూన్స్‌లో భారీ భద్రత నడుమ కోల్‌కతాకు తరలించారు. విమానాక్షిశయంలోకి అంబుపూన్స్ ప్రవేశిస్తున్న సమయంలో కొందరు ఏపీడీఆర్ కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేశారు. డొమెస్టిక్ టెర్మినల్ వద్దకు చేరుకుని బూటకపు ఎన్‌కౌంటర్‌లో కిషన్‌జీని చంపారంటూ నినాదాలు చేశారు. దీంతో పోలీసులు అంబుపూన్సును వీఐపీలు వెళ్లే ఏడవ నెంబర్ గేటు ద్వారా లోపలికి పంపించారు. మధ్యాహ్నం ఒక ప్రైవేటు కార్గో సర్వీసు విమానంలో హైదరాబాద్‌కు తరలించారు. భౌతికకాయాన్ని తమ స్వంత ఖర్చుల మీద తీసుకు దీప, వరవరరావు పట్టుబట్టినా.. బెంగాల్ ప్రభుత్వం అందుకు సమ్మతించలేదని పోలీసు వర్గాలు తెలిపాయి. కిషన్‌జీ భౌతికకాయానికి పోస్టుమార్టం జరిగిన మిడ్నాపూర్ మెడికల్ కాలేజీ ఆస్పత్రి వద్ద పెద్ద సంఖ్యలో చేరుకున్న ఏపీడీఆర్ కార్యకర్తలు ‘కిషన్‌జీ అమర్ రహే’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు.

సుచిత్ర కోసం ఆగని వేట
కిషన్‌జీ ఎన్‌కౌంటర్ తర్వాత తప్పించుకుపోయారని చెబుతున్న మహిళా మావోయిస్టు సుచిత్ర మహతో కోసం సంయుక్త దళాలు వేట కొనసాగిస్తున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో సుచిత్ర కూడా తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. కిషన్‌జీ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా మావోయిస్టులు ఇచ్చిన బంద్ పిలుపునకు మిశ్రమ స్పందన లభించింది. పశ్చిమమిడ్నాపూర్, పురూలియా, బంకురా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మినహా ఇతర చోట్ల పెద్దగా ప్రభావం చూపించలేదు.

బూటకపు ఎన్‌కౌంటర్ కాదన్న నివేదిక!
కిషన్‌జీ బూటకపు ఎన్‌కౌంటర్‌లో చనిపోయారన్న వాదనను పోస్టుమార్టం నివేదిక తిరస్కరించింది. ఆయన శరీరంలో ఆరు బుల్లెట్లు, గ్రెనేడ్‌ల నుంచి విడుదలైన రెండు తునకలు ఉన్నాయని పోస్టుమార్టం నివేదికలో పేర్కొన్నారని తెలిసింది. ఇవన్నీ దూరం నుంచి కాల్చినవేనని పేర్కొన్నట్లు సమాచారం. మరోవైపు కిషన్‌జీ ఎన్‌కౌంటర్‌పై బెంగాల్ ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. ఇప్పటికే సీఐడీ అధికారులు విచారణను మొదలుపెట్టారు. ఈ విషయాన్ని సీఐడీ డీఐజీ కే జయరామన్ ధ్రువీకరించారు.ఇదిలాఉండగా.. ప్రస్తుతం జరుగుతున్న నక్సల్ వ్యతిరేక ఆపరేషన్‌ల నేపథ్యంలో చర్చల ప్రక్రియను నిలిపివేయాలని మావోయిస్టులతో చర్చల కోసం నియమితులైన ఆరుగురు మధ్యవర్తులు ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిసింది.

పీసీపీఏ సమాచారమే కీలకం
తమలో ఎవరో ఒకరు కిషన్‌జీకి సంబంధించిన సమాచారాన్ని బయటికి పంపించి ఉంటారని మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆకాష్ కూడా పేర్కొనడం గమనార్హం. ఆ సమాచారం ఆధారంగానే కిషన్‌జీని భద్రతా దళాలు బూటకపు ఎన్‌కౌంటర్‌లో ముట్టబెట్టాయని ఆయన ఆరోపించారు. మన శత్రువు మన సానుభూతిపరుల్లోకి చొచ్చుకు వస్తున్నాడని తాను కిషన్‌జీతో జరిపిన చివరి చర్చల్లో హెచ్చరించారని తెలిపారు. మొన్నటిదాకా మావోయిస్టులకు అండగా నిలిచిన పీసీపీఏలోని కొందరు సభ్యులు కిషన్‌జీకి సంబంధించిన కీలక సమాచారాన్ని బయటికి చేరవేశారని తెలుస్తోంది.

లాల్‌గఢ్‌లోకి మావోయిస్టులు చొచ్చుకు వచ్చేందుకు గతంలో సహకరించింది పీసీపీఏనే. ఎన్నికలు అయిన తర్వాత వీరిలో అనేక మంది మావోయిస్టులకు బలవంతంగా మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితినో హింసకు విసుగెత్తిపోయిన పరిస్థితినో ఎదుర్కొన్నారు. ఇచ్చిన హామీలను నెరేవేర్చేందుకు కొత్త ప్రభుత్వానికి ఒక అవకాశం ఇవ్వాలన్న వాదన పీసీపీఏలో బయల్దేరింది. ఇటువంటి శక్తులను మచ్చిక చేసుకున్న భద్రతా దళాలు.. కూపీ లాగుతూ కిషన్‌జీని చుట్టుముట్టారు. పీసీపీఏ ఇచ్చిన సమాచారం తమకు ఎంతగానో ఉపకరించిందని ఓ పోలీస్ అధికారి చెప్పారు.
http://www.namasthetelangaana.com/News/Article.asp?category=1&subCategory=2&ContentId=48359

No comments:

Post a Comment