'జంగల్' నేతకు జన నివాళి
విప్లవ సంప్రదాయంలో మల్లోజుల అంత్యక్రియలు
చితికి నిప్పుపెట్టిన అన్న ఆంజనేయులు
ఎరుపెక్కిన పెద్దపల్లి.. శోకసంద్రమైన పట్టణ వీధులు
నివాళులు అర్పించిన మావోయిస్టులు..
జోహార్లు పలికిన టీఆర్ఎస్ నేతలు
చర్లపల్లి జైల్లో రాజకీయ ఖైదీల నిరాహార దీక్ష
కరీంనగర్, నవంబర్ 27 నూనూగు మీసాల ప్రాయంలో ప్రవహించే విద్యుత్తేజంలా కదలిపోయి, 35 ఏళ్ల తరువాత మహా యోధుడిలా తిరిగొచ్చిన జననేత మల్లోజుల కోటేశ్వరరావుకు 'పెద్దపల్లి' లాల్‌సలాం పలికింది. తుపాకీ భుజాన వేసుకొని యుద్ధ రంగానికి తరలిన కోటన్న విగత జీవై తిరిగి రావడంపై గుడ్లనీరు కుక్కుకుంది. దేశమంతా విప్లవ విత్తులు నాటి అలసిసొలసి అమ్మ ఒడిని వెతుక్కుంటూ వచ్చిన బిడ్డను అక్కున చేర్చుకుంది. తన పేరును దేశ చిత్రపటంలో నిలిపినందుకు పొంగిపోతూనే, ఇక ఆ రూపం కనిపించదు కదా.. అంటూ పొగిలి పొగిలి ఏడ్చింది. ఆదివారం కిషన్‌జీ అంతిమయాత్ర సాగినంత దూరం శోక సంద్రం పరిచింది.
మావోయిస్టు అగ్రనేత మల్లోజుల కోటేశ్వరరావు కడసారి చూపు కోసం ప్రజలు బారులు తీరారు. ఆయన భౌతిక కాయంపై పుష్పగుచ్ఛాలు ఉంచి ఆశయాల సాధనకై కడదాకా పోరాడుతామంటూ నినాదాలు చేశారు. మండే గుండెల దండోరా వినిపిస్తూ విప్లవ గీతాలతో నివాళులర్పించారు. అశ్రు తర్పణల నడుమ నాలుగు గంటల పాటు నాలుగు కిలోమీటర్ల పొడవున కిషన్‌జీ అంతిమయాత్ర సాగింది. అనంతరం గుండం చెరువు కట్ట శ్మశాన వాటికలో విప్లవ సంప్రదాయంలో ఆయన చితికి అన్న ఆంజనేయులు నిప్పుపెట్టారు. అంతకుముందు బ్రాహ్మణవీధిలోని స్వగృహం వద్ద ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు.
పుష్పాలతో అలంకరించిన వాహనంలో భౌతిక కాయాన్ని ఉంచి వేలాది మంది ప్రజలు, విప్లవాభిమానుల నినాదాల మధ్య పట్టణ వీధుల్లో ఊరేగించారు. వేలాది మంది ప్రజలు, విప్లవాభిమానులు, ప్రజా, హక్కుల సంఘాల నేతలు, విరసం నాయకులతో పెద్దపల్లి దారులు ఎరుపెక్కాయి. భౌతిక కాయంపై విప్లవ రచయితలు వరవరరావు, కళ్యాణ రావు, గద్దర్ ఎర్ర జెండా కప్పి నివాళులర్పించారు. ప్రజా, రచయితల సంఘాల నేతలు చలసాని ప్రసాద్, పాణి (విరసం), విమలక్క (అరుణోదయ), గంటి ప్రసాదం, పద్మకుమారి (అమరుల బంధుమిత్రుల సంఘం), చంద్రశేఖర్ (ఏపీసీఎల్పీ), మందకృష్ణ మాదిగ (ఎంఆర్‌పీఎస్), సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి జోహార్లు అర్పించారు.
టీఆర్ఎస్ నుంచి ఈటెల, ఈశ్వర్, నారదాసు లక్ష్మణరావు నివాళి అర్పించారు. కిషన్‌జీకి నివాళిగా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ పంపిన లేఖను వరవరరావు చదివి వినిపించారు. కాగా, శవపేటికను ఎక్కడ ఉంచాలనే దాని నుంచి, అంతిమయాత్ర రోడ్‌మ్యాప్ దాకా ప్రతిదీ పోలీసులే నిర్దేశించారు. ఓఎస్‌డీ దుగ్గల్ నేతృత్వంలో ముగ్గురు డీఎస్పీలు, 10 మంది సీఐలు, 20 మంది ఎస్ఐలు, వెయ్యి మంది పోలీసు బలగాలు పెద్దపల్లిలో మోహరించాయి. కాగా, కిషన్‌జీని హత్య చేశారంటూ చర్లపల్లి జైలులోని మావోయిస్టు, జనశక్తి పార్టీలకు చెందిన రాజకీయ ఖైదీలు నిరసన తెలిపారు. ఆదివారం తుషార్‌కాంత్ భట్టాచార్య, అమర్‌ల నేతృత్వంలో ఖైదీలు నిరాహార దీక్ష చేశారు.
ఆచారాలనూ పక్కన పెట్టి..
మల్లోజుల అంత్యక్రియలను బ్రాహ్మణ సంప్రదాయంలో జరిపించాలా లేక విప్లవ సంప్రదాయం పాటించాలా అనే విషయంలో తర్జనభర్జన పడి.. ఆయన ఆశయాలకే కుటుంబ సభ్యులు తలవొగ్గారు. నిజానికి.. ఆదివారం ఉదయం స్వగృహంలో శాస్త్రోక్తంగా పూజలు చేయాలనుకున్నారు. విప్లవ నేతలు, ఇతర సన్నిహితుల సూచన మేరకు ఆ కార్యక్రమం పక్కన పెట్టారు. అంతిమయాత్రలో ఎవరూ నిప్పుకుండ పట్టుకోలేదు. కాగా, తండ్రి అంత్యక్రియలకు కుమార్తె వచ్చినట్టు భావిస్తున్నారు. ఉద్యమంలో ఉన్న బాబాయి, తల్లి వద్దే ఆమె పెరుగుతున్నట్టు చెబుతున్నారు
https://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2011/nov/28/main/28main3&more=2011/nov/28/main/main&date=11/28/2011.

No comments:
Post a Comment