వివిధ సందర్భాల్లో ఆజాద్ ఉద్ఘాటన
మావోయిస్టు అగ్రనేత, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఆజాద్ బహుముఖ ప్రజ్ఞాశాలి. మావోయిస్టు పార్టీలో ముఖ్యమైన సిద్ధాంతకర్తల్లో ఆయన ఒకరు. వివిధ అంశాలపై పార్టీ అధికార ప్రతినిధి హోదాలో పత్రికా ప్రకటనలు విడుదల చేస్తుండేవారు.
ఆపరేషన్ గ్రీన్‌హంట్ నేపథ్యంలో మావోయిస్టు వ్యతిరేక, అనుకూల శ్రేణుల్లో ఎన్నో ప్రశ్నలు. అనేక సందేహాలు! వాటన్నింటికీ ఆజాద్ తన ప్రకటనలు, ఇంటర్వ్యూల ద్వారా వివరణలు ఇచ్చారు. అవి.. సంక్షిప్తంగా...
ఆపరేషన్ గ్రీన్‌హంట్‌పై..
మావోయిస్టుల ప్రాబల్యంలో ఉన్న ప్రాంతాల్లోని అణగారిన వర్గాల ప్రజల భూమిని గుంజుకునేందుకు కేంద్ర, రాష్ట్ర బలగాలు మొట్టమొదటిసారిగా చేపట్టిన భారీ ఆపరేషన్ ఇది! దేశవ్యాప్తంగా గెరిల్లా జోన్లపై దాడులకు కేంద్రబలగాల రిహార్సిల్ ఇది. ఆత్మరక్షణ కోసం జరుగుతున్న ఈ యుద్ధంలో మా అన్ని రకాల ప్రణాళికలు, వ్యూహా లు, ఎత్తుగడలు పూర్తిగా ప్రజాభాగస్వామ్యంతో ముడిపడినవే.
పూర్తిస్థాయి యుద్ధానికి పాలకులు సాహసిస్తే.. వర్గశక్తుల పొందికలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటాయి. పీడితవర్గాలు మావైపు.. పీడక వర్గాలు శత్రువు వైపు నిలుస్తాయి. చిదంబరం అండ్ కంపెనీ చేసే ప్రయత్నాలన్నీ ఈ ప్రాంతాన్ని అంతర్జాతీయ, జాతీయబందిపోట్లకు అప్పగించేందుకే!
నక్సల్స్ జరుపుతున్న హింసపై...
నక్సల్స్ జరుపుతున్నది హింస కానే కాదు. నక్సల్ వ్యతిరేక పోరాటంలో ప్రభుత్వ బలగాల అమానుష అకృత్యాల వల్లే ఇది జరుగుతోంది. వా రు పేద నిరాయుధులైన గిరిజనులను హింసించకుండా.. వారిని అరెస్టు చేసి చిత్రహింసల పాల్జేయకుండా.. హత్యలకు వారి మహిళలపై అత్యాచారాలకు పాల్పడకుండా, వారి ఆస్తులను ధ్వంసం చేయకుండా, వారి గ్రామాలను తగులబెట్టకుండా, అపహరించిన గిరిజనులను ఎన్‌కౌంటర్ల పేరుతో కాల్చిపారేయకుండా ఉంటే మా దళాలు ఇటువంటి చర్యలకు పాల్పడతాయా
కోబ్రాల ఏకైక కర్తవ్యం నక్సల్స్‌ను, వారి సానుభూతిపరులను తుడిచిపెట్టడమే. వారికి నక్సల్స్ దొరక్కపోతే అసహాయులైన ఆదివాసీలను అరెస్టుచేసి, చిత్రహింసలు పెడుతున్నారు. గడ్చిరోలిలో ప్రజలను భయకంపితులను చేసిన పోలీసులనే హతమార్చాం ''
చర్చల ప్రతిపాదనపై...
ఇది చాలా మూర్ఖపు ప్రతిపాదన. మావోయి స్టు ఉద్యమం ఏ నేపథ్యంలో ఉద్భవించిందన్న చారిత్రక, సామాజిక వాస్తవాలను వీరు పూర్తిగా విస్మరిస్తున్నారని దీని ద్వారా వెల్లడవుతోంది.
మా వోయిస్టుల నాయకత్వంలో కొన్నివర్గాల ప్రజలు ఎందుకు ఆయుధాలు చేతబట్టి ముందు వరుసలో నిలిచారో మన్మోహన్, చిదంబరం, వారి మనుషు లు ఆలోచించుకోవాలి. భారత సమాజం ఎదుర్కొంటున్న సమస్యలకు ఒక పరిష్కారం లభించకుండా మావోయిస్టులు తమ ఆయుధాలను కింద పడేస్తారని ఎవరైనా ఎలా ఊహిస్తారు?
మా సాయుధ పోరాటానికి కారణమైన అంశాలను ప్రస్తావించకుండా.. చర్చలకు పిలవడం ద్వారా మాకు మేలు చేస్తున్నామని మన్మోహన్, చిదంబరం అనుకుంటే వారు పిచ్చివాళ్ల స్వర్గంలో ఉన్నట్లే. ఈ విషయాలు వారికి తెలియక కాదు. తాము శాంతికి కట్టుబడి ఉన్నామని, వారు(మావోయిస్టులు) చర్చలకు సిద్ధంగా లేరని చెప్పుకోడానికే ఈ వంక.''
చర్చలకు మావోయిస్టుల షరతులపై...
మావోయిస్టులు, మావోయిస్టులకు మద్దతుగా నిలిచిన వారి అపహరణలను నిలిపివేయాలి. నిరాయుధులైన ప్రజలపై చిత్రహింసలను, హత్యలను తక్షణం ఆపాలి. వారి ఆస్తుల విధ్వంసాన్ని అడ్డుకోవాలి. సల్వాజుడుం, సేంద్ర, గ్రామ సురక్షా సమి తి, శాంతిసేన వంటి ప్రభుత్వ సాయుధముఠాల ను వదలివేయాలి.
భద్రతాదళాలు జరిపిన అకృత్యాలపై విచారణ జరిపి దోషులను శిక్షించాలి. యూఏపీఏ వంటి దుర్మార్గపు చట్టాలను ఉపసంహరించాలి. గిరిజనులను నిర్వాసితులను చేసే మైనింగ్‌ను నిలిపివేయాలి. మేం ఆయుధాలు కిందపడేసే ప్రసక్తే లేదు. ప్రజల హక్కుల రక్షణ కోసమే ఆయుధాలు చేపట్టాం. ఆయుధాలు కింద పడేయడమంటే ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయడమే.
కేంద్ర హోం మంత్రి చిదంబరంపై..
చిదంబరం భారతదేశపు హిట్లర్. నిజానికి పాలకులే ఉగ్రవాదులు. అమెరికాలో పర్యటించి వచ్చిన తర్వాత చిదంబరం హిట్లర్ అవతారమెత్తి... అమెరికా సామ్రాజ్యవాదులతో కలిసి గిరిజన పోరాటాలను అణచివేసేందుకు నిర్ణయించారు. మావోయిస్టు కేంద్రకమిటీపై దృష్టి సారించిన చిదంబరం, ప్రధాని మన్మోహన్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా, ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్‌లకు గుణపాఠం చెబుతాం
http://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2010/jul/3/main/3main18&more=2010/jul/3/main/main&date=7/3/2010

No comments:
Post a Comment