Friday, 30 December 2011

అదృశ్యమైన ధృవతార ఆర్ ఎస్ రావు

మనకాలపు మహామేధావి, సునిశితమైన మార్క్సిస్టు విశ్లేషకుడు ఆర్ ఎస్ రావు కన్నుమూశారు. ముప్పై సంవత్సరాలుగా ఆయనతో సాగిన అనుబంధంలో కలిసి చేసిన ఆలోచనలు, పనులు, ప్రయాణాలు, కలిసి కన్న కలలు, పొందిన విజయాలు, వైఫల్యాలు అన్నీ ముగింపుకు వచ్చినట్టు గుండె పగిలే మౌనం. మహానిశ్శబ్దం. ‘చలనం మాత్రమే ఉంది. విశ్రాంతి, విరామం లేవు, విశ్రాంతి, విరామాల గురించి ఉన్న తాత్విక ప్రత్యయం కేవలం మన ఆలోచనా సౌలభ్యానికే తప్ప, సాపేక్షికంగానే తప్ప ప్రకృతిలో, సమాజంలో, మానవ మేధలో దానికి అవకాశమే లేదు’ అని ఎప్పుడూ చెపుతుండే ఆయన మేధ విరామానికి చేరింది. బహుశా అది ఆ ఆలోచనలకు విరామం కాదేమో. ఆ చలనం కొనసాగుతూనే ఉంటుందేమో.

నిజంగా ఆయనతో మాట్లాడడం అంటే ఒక చలనం, ఒక చైతన్యం, ఒక వెలుగు. అప్పటిదాకా మనకు తట్టని ప్రశ్నను మన మెదడులో ప్రవేశపెట్టి అల్లకల్లోలం చేసేవారాయన. ఇక ఇది అంతిమ నిర్ణయం, ఆలోచించవలసిందేమీ లేదు అనుకున్న దాని మీద కందిరీగల తుట్టెను రేపేవారాయన. అప్పటిదాకా ఎన్నో వైపుల ఆలోచించిన విషయానికే మరొక కొత్త కోణాన్ని చూపెట్టేవారాయన. గ్రామీణ వ్యవసాయ సమాజంలో చీకటి రాత్రి దిక్కు చూపడానికి ప్రతి మనిషీ వాడుకునే ధృవనక్షత్రం లాంటి వారాయన. ముసిముసి చీకటి తొలగిపోకముందే వెలుగుదారి పరిచే వేగుచుక్క ఆయన. తెలుగు సమాజమూ, భారత విప్లవోద్యమమూ అతి కీలక దశలో ఉన్నప్పుడు, ఎన్నెన్నో కొత్త, సంక్లిష్ట సమస్యలకు జవాబులు వెతకవలసిన తరుణంలో ఆ ధృవతార అదృశ్యమయింది.

ఎప్పుడో 1990లో పర్ స్పెక్టివ్స్ ప్రచురణగా చిన్నపుస్తకంగా వచ్చిన ‘అభివృద్ధి – వెలుగు నీడలు’ వ్యాసం మినహా ఈ ఇరవై ఏళ్ళలో ఆయన రచనలు పుస్తకరూపంలో రాలేదు. అంతకు ముందూ ఆ తర్వాతా కలిపి అరవై దాకా వ్యాసాలు రాశారు. దాదాపు అన్ని ప్రజాసంఘాల సభలలో, సమావేశాలలో వందకు పైగా ఉపన్యాసాలు ఇచ్చారు. ఆ కృషినంతా ఎప్పటికైనా ఒక్కచోటికి తీసుకురావాలనే కలలో భాగంగా వీక్షణం ప్రచురణల తరఫున ఆర్ ఎస్ రావు తెలుగు రచనల సమగ్ర సంపుటం ‘కొత్తచూపు’ 2010 నవంబర్ లో వెలువరించాం. దానికి రాసిన ముందుమాటలో ఆయనతో వ్యక్తిగత సాన్నిహిత్యం ఎక్కువ రాశానని, ఆయన మీద నా భక్తిని బహిరంగంగా వ్యక్తీకరించానని నాకే అనుమానం వచ్చింది. ప్రచురణకు కొద్దిరోజుల ముందు ఆ ముందుమాట ఆయన చేతికిస్తూ బెరుకుగా “సబ్జెక్టివ్ గా వచ్చినట్టుంది” అన్నాను. “నువ్వు సబ్జెక్టివ్ అనుకునేది మరొకరికి ఆబ్జెక్టివ్ కావచ్చు. మరొకరికి సబ్జెక్టివ్ అనిపించినది నీకు ఆబ్జెక్టివ్ కావచ్చు. అది రిలేటివ్. అసలింతకీ ఆబ్జెక్టివ్ లేని సబ్జెక్టివ్ ఉండదు, సబ్జెక్టివ్ లేని ఆబ్జెక్టివ్ ఉండదు. వాటిమధ్య విభజన రేఖ మనం గీసిందే. చాలసార్లు అనవసరమైనదే” అన్నారు ఆయనకు సహజమైన ఒక కొంటె చిరునవ్వుతో. ఆయనతో చర్చలలో వందలసార్లు ఈ సాపేక్షికత గురించీ, అందులోని గతితార్కికత గురించీ ప్రస్తావన వచ్చింది. భారత కమ్యూనిస్టు సంప్రదాయంలో అలవాటయిన తప్పుడు వాదనాపద్ధతుల గురించి మాట్లాడేటప్పుడు చాల సందర్భాలలో ఆయన ముఖం మీద ఇటువంటి కొంటె చిరునవ్వు విరిసేది.

ముప్పై ఏళ్లుగా చూస్తున్న ఆ చిరునవ్వు ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రిలో జూన్ 17 మధ్యాహ్నం చెరిగిపోయింది. నిజం చెప్పాలంటే మరణం తర్వాత ఆ స్ఫటికం లాంటి స్పష్టమైన, కత్తి అంచులాంటి నిశితమైన వాదన ఆగిపోయింది గాని ఆయన ముఖం మీద ఆ పెదాల ముడి అట్లాగే కొంటె చిరునవ్వుగా నిలిచిపోయే ఉంది. మరణానికి కొద్ది గంటల ముందు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో వెంటిలేటర్ మీద, ముఖం మీద గాజు మాస్క్ తో, వళ్లంతా గొట్టాలతో, యంత్ర పరికరాలతో ఉన్న ఆయన చెయ్యి పట్టుకుని “సార్, సార్” అని పిలిస్తే మూసిన కనురెప్పలు విప్పి చూశారు. చాల రోజులుగా మాట లేదు గాని, గాజు మాస్క్ కింది నుంచి పెదవి కదల్చడానికి ప్రయత్నించారు. అప్పటికి ఇరవై రోజులుగా ఊపిరి తిత్తులు పని చేయడం లేదు, గుండె పని చేయడం లేదు. మూడు రోజులుగా మూత్ర పిండాలు పని చేయడం లేదు. కాని ఆ సునిశితమైన మేధ ఇంకా సున్నితంగా ప్రతిస్పందిస్తూనే ఉంది.

నలభై సంవత్సరాలుగా మార్క్సిస్టు రాజకీయార్థిక, తాత్విక దృక్పథాన్ని అత్యంత ప్రతిభావంతంగా, సృజనాత్మకంగా అన్వయిస్తూ, వివరిస్తూ, విశ్లేషిస్తూ ఆయన సాగించిన అనితరసాధ్యమైన కృషిని ఒక వ్యాసంలో, అదీ సంస్మరణ సందర్భంలో రాయడం సాధ్యం కాదు. కాని స్థూలంగానైనా ఆయన అనుసరించిన సంవిధానపు విశిష్టతలు ఏమిటో, ఆయన నుంచి నేర్చుకోవలసినదేమిటో తెలుసుకోవలసి ఉంది.

విశాఖపట్నం జిల్లా చోడవరంకు చెందిన ఆచార పరాయణులైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన రేగులగడ్డ సోమేశ్వరరావు అర్థశాస్త్రం, గణాంకశాస్త్రం చదువుకుని, సంగీతం మీద, పూలమీద, నాటకాల మీద ఆసక్తితో జీవితం ప్రారంభించి, మార్క్సిజం అధ్యయనంతో మార్క్సియన్ ఆలోచనాపరుడిగా మారి, మొత్తంగా భారత సమాజంలోని, ప్రత్యేకంగా ఒరియా, తెలుగు సమాజాలలోని అట్టడుగు ప్రజలను అధ్యయనం చేసి, నక్సల్బరీ విప్లవోద్యమంతో సన్నిహితంగా నడిచి మనకాలపు గొప్ప మార్క్సిస్టు విశ్లేషకుడిగా మారిన పరిణామ క్రమం, ఆయన మిగిల్చి పోయిన తార్కిక, తాత్విక చింతన అత్యద్భుతమైనవి. వాటినుంచి అర్థం చేసుకోవలసినదీ, నేర్చుకోవలసినదీ, ఆచరించవలసినదీ ఎంతో ఉంది.

మార్క్స్ నూ మావో నూ ఆయన తన ఆలోచనల్లో, ప్రవర్తనలో జీర్ణం చేసుకున్నారు. ముఖ్యంగా మార్క్స్ తన ఆదర్శాలుగా ప్రకటించిన రెండు మాటలు (‘ప్రతిదాన్నీ ప్రశ్నించు’, ‘మానవీయమైనదేదీ నాకు పరాయిది కాదు’) ఆర్ ఎస్ రావు గారికి కూడ ఆదర్శాలుగా ఉన్నాయి. దేన్నీ ప్రశ్నించకుండా, ఆలోచించకుండా, పరిశోధించకుండా, సొంత వాదనతో విశ్వాసం కుదుర్చుకోకుండా విశ్వసించగూడదు అనేదే ఆయన నేర్పిన పాఠం. ఇలా ప్రతిదాన్నీ ప్రశ్నించి, తర్కించి, పరిశోధించి, తనకు తానుగా నిర్ధారించుకున్న తర్వాతనే నమ్మారు గనుకనే ఆయనకు తాను చెప్పే విషయాలపట్ల అసాధారణమైన స్పష్టత ఉండేది. అపారమైన ఆత్మవిశ్వాసం ఉండేది. ఆ లక్షణం వల్లనే ఆయన కొత్త ప్రశ్నలు లేవదీసేవారు. కొత్త జవాబులు అన్వేషించేవారు. కొత్త ఆలోచనలు చేయడానికి ప్రోత్సహించేవారు. ‘గాలిపటాలు ఎగరేయాలి’ అనే అలంకారంతో ఆయన ఆలోచనలను గాలిపటాలుగా చూశారు. ఎటువంటి గాలిలోనైనా, ఎంత ఎదురుగాలిలోనైనా గాలిపటాన్ని ఎగరేయాలి. దాన్ని గాలిలో స్వేచ్ఛగా తిరగనివ్వాలి. కొత్త గాలి తెమ్మరలను ఆస్వాదించనివ్వాలి. కొత్త రంగాలలోకి ప్రవేశించనివ్వాలి. అయితే ఆ గాలిపటం ఎంత దూరం వెళ్లినా విశృంఖలంగా, గాలివాటుగా, నేలతో, మనిషితో సంబంధం వదిలి కాదు. ఎగరేయడం చేసేది మనిషి మాత్రమే. ఆ గాలిపటాన్ని స్వేచ్ఛగా వదిలేలా సూత్రం పట్టుకున్న మనిషి, నేల మీద స్థిరంగా నిలబడ్డ మనిషి మాత్రమే. ఆ స్వేచ్ఛ, ఈ స్థిరత్వం రెండూ అవసరమే. సరిగ్గా అట్లాగే గత నలభై సంవత్సరాలలో ఆయన చేసిన కృషిలో మార్కిజం పట్ల అచంచల విశ్వాసం అనే స్థిరత్వమూ ఉంది, దేన్నయినా పరిశీలించాలి, ఎక్కడికైనా వెళ్ళాలి, ఎన్ని ప్రశ్నలైనా ఎదుర్కోవాలి అనే స్వేచ్ఛా ఉంది.

మళ్లీ ‘మానవీయమైనదేదీ నాకు పరాయిది కాదు’ అని మార్క్స్ ఉటంకించిన సూక్తినీ ఆర్ ఎస్ రావు గారు ఆలోచించిన, రచించిన, వ్యాఖ్యానించిన విషయాల విస్తృతినీ చూస్తే ఇక్కడ కూడ ఆయన మార్క్స్ అడుగుజాడల్లో నడిచారని అర్థమవుతుంది. భారత సామాజిక సంబంధాలు, భూస్వామ్యం, సామ్రాజ్యవాదం, భారత ఆర్థిక వ్యవస్థ చరిత్ర, ప్రణాళికాబద్ధ ఆర్థిక విధానం, పాలనా విధానాలు, భూసంస్కరణలు, ప్రజా సాంకేతిక పరిజ్ఞానం, మార్కెట్ భావజాలం, అభివృద్ధి, విస్థాపన, పర్యావరణం, చరిత్ర నిర్మాణంలో ప్రజల పాత్ర, భారత సామాజిక ఆర్థిక వ్యవస్థల సంక్షోభం, నక్సల్బరీ వెలుగులో భారత విప్లవోద్యమం నిర్మిస్తున్న చరిత్ర, సామ్యవాద ప్రయోగాలు, ప్రత్యామ్నాయ సంస్కృతి, పౌరహక్కుల ఉద్యమం, సామ్రాజ్యవాద ప్రభావానికీ కుల, మత వాదాలకూ సంబంధం, స్త్రీవాదం, తెలుగు సాహిత్యం వంటి అనేక విషయాల మీద ఆయన అద్భుతమైన రచనలెన్నో చేశారు.

అప్పటికే మార్క్సిజం చదువుకుని, విశ్వసిస్తున్న ఆర్ ఎస్ రావు నక్సల్బరీ ఉద్యమ ప్రజ్వలనంతో క్రియాశీల మార్క్సిస్టు మేధావిగా మారారు. నక్సల్బరీ పంథా దేశాన్ని అర్ధవలస, అర్ధ భూస్వామ్య సమాజంగా అభివర్ణించినప్పుడు, ఆ సూత్రీకరణ ఎంత వాస్తవికమైనదో చూపడానికి 1970లో ఎకనమిక్ అండ్ పొలిటికల్ వీక్లీ లో ఒక చిన్న ప్రశ్నావ్యాసంతో ప్రవేశించిన ఆర్ ఎస్ రావు చనిపోయే సమయానికి ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో అర్ధవలస అర్ధ భూస్వామ్య సూత్రీకరణను సమర్థించే పత్రం తయారుచేసే పనిలో ఉన్నారు.

1970లోనే ఆయన వేసిన రెండు ప్రశ్నలు ఆయన దృష్టి నైశిత్యానికీ, ప్రజల పట్ల ప్రేమకూ, విప్లవోద్యమ నిబద్ధతకూ అద్దం పడతాయి. భారత వ్యవసాయంలోకి పెట్టుబడిదారీ విధానం ప్రవేశించిందని సిపిఐ, సిపిఎంలకు చెందిన సిద్ధాంతవేత్తలు, స్వతంత్ర అర్థశాస్త్రవేత్తలు సిద్ధాంతాలు చేస్తున్నపుడు ఆయన “పెట్టుబడిదారీ రైతును వెతుకుతూ…” అని ఆ వాదనలను ఖండించే చిన్న వ్యాసం రాశారు. వ్యవసాయంలోకి “ఆధునిక” పరికరాలు రావడమే పెట్టుబడిదారీ విధానానికి నిదర్శనమనే వాదనకు జవాబు చెపుతూ “ఆధునిక అనేది సాపేక్షిక పదం. కర్రనాగలి కన్న ఇనుపనాగలి ఆధునికం. ట్రాక్టర్ ఇంకా ఆధునికం. ఒకానొక సమయంలో మూడూ సహజీవనం చేస్తూ ఉండవచ్చు కూడ. సాధనం పాతదా, కొత్తదా అని కాదు, పెట్టుబడి సంచయనం అంతకంతకూ ఎక్కువగా జరుగుతూ ఉండడమే పెట్టుబడిదారీ విధానాన్ని నిర్ణయిస్తుంది” అని మౌలిక ప్రశ్న సంధించారు. ఈ వ్యాసంలోనే “చూడవలసింది ఏది ఉన్నది అని కాదు, అది ఎలా మారుతున్నది అని” అని సూత్రీకరించారు. చలనంలో ఉన్న వస్తువును అధ్యయనం చేయడం, చలనాన్ని అధ్యయనం చేయడం అనే మౌలిక భావనలకు ఆయన అప్పటినుంచీ నలభై సంవత్సరాలపాటు స్థిరంగా అంటిపెట్టుకుని ఉన్నారు.

అలాగే 1969-70లలో ఇందిరా గాంధీ ప్రవేశపెట్టిన బ్యాంకుల జాతీయకరణ ప్రగతిశీల విధానమని పార్లమెంటరీ కమ్యూనిస్టు నాయకులు, అర్థశాస్త్రవేత్తలు పొగుడుతున్నప్పుడు, నాగపూర్ లో ఒక సదస్సులో “బ్యాంకుల జాతీయకరణ సరే, పాలన జాతీయకరణ ఎప్పుడు” అనే మౌలిక ప్రశ్న వేసి ఆయన కందిరీగల తుట్టెను కదల్చారు.

లోలోపల ఆలోచన, మిత్రులతో చర్చలో, సంభాషణలో ఆలోచన, గాలిపటాలు ఎగరేయడం వల్ల ఆయన చేయవలసినంత రచన చేయలేదని, ఆయన అద్భుత అన్వేషణలన్నీ మౌఖిక సంప్రదాయంలోనే మిగిలిపోయాయని అనిపిస్తుంది. అత్యవసరమనుకుంటే తప్ప, ఎవరైనా అడిగితే తప్ప ఆయన రాయలేదు. సభలకు, సమావేశాలకు పిలిస్తే తప్పనిసరిగా లిఖిత పత్రంతోనో, నోట్స్ తోనో వచ్చేవారు.

తెలుగులో వార్త దినపత్రికకు తప్ప ప్రధానస్రవంతి పత్రికలలో ఆయన దాదాపుగా ఎప్పుడూ రాయలేదు. టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక తన 150 ఏళ్ల సందర్భంగా 1990లో ఆయనతో ఒక వ్యాసం రాయించుకుని దాన్ని అచ్చువేయలేదు. ఆ సందర్భంగా ఆయన రాసిన అద్భుతమైన వ్యాసం అచారిత్రక ప్రజల చరిత్ర రచన. ప్రజలు, ప్రజల శ్రమ, ప్రజల ఆకాంక్షలు, ప్రజల సాంకేతిక పరిజ్ఞానం, ప్రజల సంస్కృతి – ఈ అంశాలు ఆయనకు అన్నిటికన్న ముఖ్యమైనవి. ఏ చర్చనైనా ఆయన ఈ మౌలిక అంశాలవైపు మళ్లించేవారు. టైమ్స్ ఆఫ్ ఇండియా కోసం రాసిన వ్యాసానికి కూడ ఈ ఆలోచనలే పునాది.

ప్రజల గురించి ఇంత లోతుగా ఆలోచించే క్రమంలోనే ఆయన ప్రజల అభివృద్ధి ఆకాంక్షలకూ పాలకుల అభివృద్ధి భావజాలానికీ మధ్య అంతరం గురించి చెప్పడం ప్రారంభించారు. అసలు పాలకులు అభివృద్ధిగా భ్రమలు కల్పిస్తున్నది అభివృద్ధి కానేకాదని, అభివృద్ధి పథకాలనే అభివృద్ధిగా పాలకులు ప్రచారం చేస్తున్నారని, మధ్యతరగతి ఆ ప్రచారానికి లొంగిపోతున్నదని ఆయన విస్తారంగా రాశారు.

ఈ విశ్లేషణ వల్లనే ఆయన నక్సల్బరీ వెలుగులో నడుస్తున్న భారత విప్లవోద్యమాన్ని ఒక ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాగా చూశారు. దాదాపు గత ఇరవై సంవత్సరాలుగా ఆయన రచనలు, ఉపన్యాసాలు అన్నిటిలోనూ, ఇతర అంశాలకన్న ఎక్కువగా ఈ ప్రజా, ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనా విశిష్టత గురించి వివరించడానికి, దాన్ని విస్తరించడానికి ప్రయత్నించారు. “నక్సలైట్లు ఇంకా విజయం సాధించి ఉండకపోవచ్చు. కాని భారత ఆర్థిక వ్యవస్థలో పేదరైతులకూ, వ్యవసాయ కూలీలలకూ ప్రధాన స్థానం ఉంటుందని వాళ్ళు లేవనెత్తిన అంశాలు, పేదరికం గురించీ, మార్కెట్ సమస్య గురించీ లేవనెత్తిన అంశాలు ఒకవైపు, విదేశీ సాంకేతిక పరిజ్ఞానం మీద, సహాయం మీద ఆధారపడడం గురించిన ప్రశ్నలు మరొకవైపు ఒక చట్రాన్ని ప్రతిపాదించే ఇతివృత్తాలవుతాయి. ఆ చట్రం పకడ్బందీ చట్రం కాకపోయినప్పటికీ, భారత వాస్తవికతను అర్థం చేసుకునే చట్రం ఇదే” అని 1984లో ఒక సదస్సులో ఆయన అన్నారు. ఈ దేశంలో ప్రజా ఉద్యమాలలో నక్సల్బరీ ప్రవేశపెట్టిన ఆ చట్రాన్ని అర్థం చేసుకోవడం, వివరించడం, విశ్లేషించడం, విస్తరించడం, ఇంకా పకడ్బందీగా మార్చడానికి ప్రయత్నించడం, ఈ చట్రం వైపు ఇతర ఆలోచనాపరులను ఆకర్షించడం ఆర్ ఎస్ రావు గత నలభై సంవత్సరాలు నిరంతరంగా చేసిన పని. ఆ పనిని కొనసాగించడమే ఆయనకు నివాళి.

ఆయన నుంచి అన్నిటికన్న ఎక్కువగా నేర్చుకోవలసినది ఆశావాదం. ప్రకృతి, సమాజం, మానవమేధలలో నిరంతరం సాగే చలనాన్ని విశ్లేషించే వ్యక్తిగా ఆయన “ఇవాళ తెలియకపోతే రేపు తెలుసుకుంటాం. ఇవాళ తప్పు చేస్తే రేపు సరి చేయడానికి ప్రయత్నిస్తాం. ఎప్పటికైనా మనిషే సాధించగలడు” అనేవారు. అపజయాలు, వైఫల్యాలు, తప్పులు, అనుకున్న పనులు కాకపోవడం ఎన్ని జరిగినా ఆయన ఆ తాత్విక దృక్పథం వల్లనే కుంగిపోలేదు, బెంబేలు పడలేదు. గత ఎనిమిది సంవత్సరాలుగా వీక్షణంతో, సెంటర్ ఫర్ డాక్యుమెంటేషన్, రిసర్చ్ అండ్ కమ్యూనికేషన్ తో ఆయన సంబంధంలో, మార్గదర్శకత్వంలో కూడ పదే పదే ఈ ఆశావహ దృక్పథమే వ్యక్తమయింది. దాదాపు ఇరవై సంవత్సరాలుగా ఆలోచిస్తున్న పరిశోధనా కేంద్రం ఆరు సంవత్సరాల కింద వాస్తవరూపం ధరించి, ఇబ్బందులను ఎదుర్కొన్నప్పుడు విమర్శనాత్మకంగానైనా సెంటర్ తో కొనసాగారు. ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో అనేక రచనలతో ఏకీభావం లేకపోయినా, పని జరగాలని వెన్నుతట్టారు. భువనేశ్వర్ లో మరొక పరిశోధనా కేంద్రం ప్రారంభమై పనిచేస్తుందనే ఆశతో అక్కడికి వెళ్లి, అక్కడా అనుకున్న పని జరగక వెనక్కి తిరిగి వచ్చి, “నేనూ భారతి గారూ ఏమి రాసినా, ఏమి చేసినా వీక్షణం, సి డి ఆర్ సి ప్రచురణలుగానే రావాలి” అని వీక్షణం – సి డి ఆర్ సి బృందంపై తన విశ్వాసాన్ని ప్రకటించారు. వ్యక్తిగతంగా నాకు గీటురాయిగా నిలిచారు. రాంకినీ, రామునూ ఆలోచన, రచన, వ్యక్తీకరణల వైపు ప్రోత్సహించారు. సారు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎటువంటి పరిస్థితిలోనయినా వమ్ము చేయబోమని ఆయన చివరి క్షణాలలో హామీ ఇచ్చాను. నేత్రదానం వల్ల ఇంకా జీవిస్తున్న ఆయన కళ్లు మమ్మల్ని చూస్తూనే ఉంటాయి. ఆయన వదిలివెళ్లిన అసంపూర్ణ కర్తవ్యాలు మమ్మల్ని నడుపుతూనే ఉంటాయి.

Filed under Telugu by ఎన్.వేణుగోపాల్ — Leave a comment
July 25, 2011

http://kadalitaraga.wordpress.com/2011/07/25/%E0%B0%85%E0%B0%A6%E0%B1%83%E0%B0%B6%E0%B1%8D%E0%B0%AF%E0%B0%AE%E0%B1%88%E0%B0%A8-%E0%B0%A7%E0%B1%83%E0%B0%B5%E0%B0%A4%E0%B0%BE%E0%B0%B0-%E0%B0%86%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%8E%E0%B0%B8%E0%B1%8D/


Remembering R S Rao and His Critical Marxist Tradition

Prof. R S Rao (74), retired professor from Sambalpur University, a long time intellectual of radical politics in India passed away on 17 June 2011 in New Delhi. He had suffered a stroke and was in the ventilator for around twenty days. The inevitability of death takes away from us his lively and jovial company and the sharp intellect combined with unswerving commitment to the cause of the common people.

Remembering the critical Marxist tradition of R S Rao, we would like to argue herein that it would not be appropriate to portray him as an uncritical loyalist of Maoist politics in India. On the other hand, it would be more appropriate to view him as someone who upheld the critical tradition of questioning and debates within the movement, something which is not commonplace in the Communist movement in India today. 

It was a rare combination that R S Rao was a teacher of quantitative economics who taught econometric techniques in the class room and was a theoretician of Marxist political economy outside the class room. Quite uncharacteristic of economists in general, he was an economist who used to speak a lot about people and people’s agency. He used to say, Stalin hardly spoke about people but about material goods. He had a strong historical sense and was optimistic to the core. He believed that systematic application of methodology, as while doing a Ph.D., hampered creativity. He himself never did a Ph.D. He was not overwhelmed by scholarly papers in national and international journals. Rather he attached greater value to articles in activist publications because ‘they have a sense of purpose’, as he put it. He seldom contributed to the mainstream press. 

Prof. Rao used to say that in order to understand, we need to focus not on the aspect of light but on the aspect of shade. In life too, he had moved from the light of the Gokhale Institute in Pune to the shade of Sambalpur university located in a backward region. During the hype of developmentalism in the early Nehruvian period, when there were many who praised the building of big dams, he focused on the shady aspects of displacement and misery caused by the Hirakud dam project which he considered as a symbol of exploitation. He had said that even in the ‘modern temples’, those who built them have no entry. Prof. Rao was steadfast in his commitment to the cause of the people until his last days. It may be recalled that he was one of the mediators in the case of the abduction of Collector, Vineel Krishna by Maoists in February 2011.

Although my personal encounters with him were limited to those in late 1990s, they were memorable and intellectually enriching. I would miss Prof. R S Rao, especially since I could not meet him for so many years now. As it is said, Prof. Rao had an ability to leave a strong impression on some people even in one meeting or two.  About his person, I remember not only his personal habit of continuous smoking but also his non-hierarchical attitude and the hearty laugh he had, showing his toothless gum. He had a Socratic quality of intellectually guiding the youth through sharp and timely questions. This was very important about his personality since it is said that he still operated mainly within the oral tradition since his writings are few and far between.

His first collection of essays, Towards Understanding Semi-Feudal, Semi-Colonial Society was published in 1995 with a famous essay, ‘In Search of the Capitalist Farmer’. He has also co-edited with Venugopal Rao a collection on 50 years of the History and Development in Andhra Pradesh. Of late, five books and some essays by him have been published in Telugu. In his socio-economic analysis, he had an ingenious way of drawing insights from Telugu literature.

In March and April 1998, he had taken a few parallel classes for some interested students at Jawaharlal Nehru University. His analysis of Marxian dialectics and his observations on how the semi-colonial relations related to the semi-feudal ones in the Indian context were insightful. It still resounds in my memory how he summarised Marxian dialectics in three terms totality, contradiction, change or movement in time. He used to say that among Marx, Lenin and Mao, Mao was the closest to our social reality.

During those days, once he chanced to find me with a book of P J James (1995), Non-Governmental Voluntary Organizations The True Mission. He asked me to review this book for him. So I wrote a review of this book. The main idea of the book was that NGOs were serving the cause of imperialism by diverting people away from the path of class struggle. R S Rao guided me by posing mainly one question ‘In what specific way(s) do the NGOs turn diversionary’ He guided me into thinking that they turn diversionary by having no sense of primacy among social contradictions. For example, they would not address the land question but would rather address social contradictions as related to caste, community and gender i.e., those relating to social liberation movements, not directly counterpoised against the State but against one or the other dominant section in society. He had approved my book review, saying it required only some editorial corrections. But unexpectedly, I had to get into a heated argument with a prominent mass leader of the Maoist movement, specifically on the political line of this review. He was very angry and became very personal in his criticism because he felt that I was being too generous towards the NGOs in spite of recognising the neo-colonial agenda many of them were promoting. After this argument, I lost my confidence and did not send the article for publication anywhere. But I could not help wondering how much divergence of views can be there within the same political movement, among those with the same ideological persuasion.

Probably, Tariq Ali was right in pointing out in a recent book review in New Left Review (2010, Nov.-Dec.) that it was something tragic that happened to Communist Parties across the world that they became established mass-based parties in the 1930s and ‘40s during the high tide of Stalinism. The organisational methods they adopted, influenced as they were by Stalinism, stifled dissent and suppressed debate. Probably, this explains how the Communist movements the world over moved away from the early Bolshevik tradition of vibrant debates within the party and in the Indian case, from the vibrant intellectual tradition that characterised Bhagat Singh and his comrades. 

It is worth recalling an exchange of views in late 1990s between Prof. Rao and a trade union activist working in the industrial areas in and around Delhi. This comrade-activist had left CPI-ML (Red Flag) in Kerala and joined the stream of Andhra Naxalites. He had left the Red Flag group specifically on the question of this group giving up the policy of armed struggle. Prof. Rao asked him what were the differences which led him to leave Red Flag. He listened to him very carefully and at the end of it, he asked quite emphatically, ‘Is your line a political line or a military line’ Probably, what he meant was that the political line needs to have primacy over the military line. This is a question worth repeating over and over again today in the context of a neo-liberal State on the one hand, hell-bent on wiping out the Maoists, who are branded as ‘the greatest internal security threat’ and the Maoists on the other, confining their resistance mainly to the military realm rather than on primarily engaging in mass mobilisation around their political line, focusing on the question of people-oriented development. Maoists could be better off if they had primary focus on the political line involving mass movement wherever possible since the State has much less legitimacy in this respect although it is immensely more powerful militarily.

It is ironical that one has to speak about bureaucracy within the Maoist movement because it is a far cry from the Mao’s own ideas of party as a contradiction and party developing through contradictions. But whenever I did talk to Prof. Rao about the problem of bureaucracy within the movement, he was kind enough to tell me not to get discouraged since there are many sincere persons in the movement who are quite self-critical about the movement. He pointed out how (late) Shyam, one of the Central Committee members of CPI-ML (People’s War) was such an honest person who during the peace talks, was willing to accept criticisms about mistakes committed by the movement.

It is not to be missed out that from within the stream of radical politics, Prof. Rao had also come under criticism for not focusing sufficiently on the ‘semi-colonial’ which was gaining increasing ascendency over the ‘semi-feudal’ under ‘liberalisation’. But he seemed to have been more concerned about how one is related to the other. It was not easy to brush aside his argument about a process of ‘re-feudalisation’ in culture and institutions, including the State with the increasing incursions of capital.  We could also justify his position from an entirely different angle Even if the ‘semi-colonial’ or imperialism is considered as the principal contradiction, the struggle for fixed productive assetsnatural resources – land, forest and water resources – could constitute the principal task of social transformation in a crisis-ridden and highly unpredictable world order of today.  

There would have been times when the movement imposed blinders upon his process of thinking even as it must have enabled him other ways. Although there are those both within and outside the Maoist movement who would like to appropriate Prof. Rao as an uncritical loyalist of the movement, I would like to remember him as someone who belonged to the stream of critical thinking within the movement – an early Bolshevik legacy in the international communist movement and also a legacy left behind by Bhagat Singh in India.








by Gilbert Sebastian on Tuesday, June 21, 2011 at 616am

http://www.facebook.com/notes/gilbert-sebastian/remembering-r-s-rao-and-his-critical-marxist-tradition/194932003891817


Share
Sreejith Kalandy likes this.

Sreejith Kalandy A well-deserved tribute to a man who, in a trend no longer fashionable, combined activism with academic pursuits. I’m sure his death went unnoticed in the mainstream press.
Do you know the whereabouts of the trade union activist you referred to. Last time I heard, he was running a business somewhere in his home state.
I’ll be coming to Delhi in the first week of August. Hope to see you then.
Thursday at 1141pm ·  1 person

ప్రజా మేధావి ప్రొ.ఆర్ఎస్ రావు మృతి

మూత్రపిండాల వ్యాధితో ఢిల్లీలో కన్నుమూత
అక్కడే పూర్తయిన అంత్యక్రియలు

కలెక్టర్ వినీల్ విడుదలలో కీలక భూమిక
'అభివృద్ధి' గుట్టును ఎప్పుడో రట్టు చేసిన రాజకీయ అర్థ శాస్త్రవేత్త

న్యూఢిల్లీ, జూన్ 17 ప్రముఖ ఆర్థిక వేత్త, రచయిత, మార్క్సిస్టు మేధావి ప్రొఫెసర్ రేగులగడ్డ సోమేశ్వరరావు (74) (ఆర్ఎస్ రావు) శుక్రవారమిక్కడ మరణించారు. గత కొంత కాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆర్ఎస్‌రావు స్థానిక గ ంగారామ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన అభిమానులు, మిత్రుల కన్నీటి నివాళుల మధ్య స్థానిక లోధీ రోడ్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు పూర్తయ్యాయి. మార్క్సిస్టు-లెనినిస్టు అధ్యాపకునిగా, రాజకీయ అర్థ శాస్త్ర బోధకునిగా ప్రగతిశీల శిబిరానికి ఆర్ఎస్ రావు అత్యంత సన్నిహితుడు. స్వస్థలం విశాఖపట్నం జిల్లా చోడవరం.

ఆయనకు కుమార్తె, కుమారుడు. ఇద్దరూ ఆర్థిక శాస్త్రంలో ప్రొఫెసర్లే. భార్య భారతి భౌతిక శాస్త్రంతో పాటు రాజనీతి శాస్త్రంలో ఉన్నత పట్టాలు పొందారు. ఒడిసాలోని సంబాల్‌పూర్ యూనివర్సిటీలో దాదాపు 35 సంవత్సరాల పాటు ఆర్ఎస్ రావు పని చేశారు. ప్రజల దృక్కోణం నుంచి ఆర్థిక శాస్త్రాన్ని విశ్లేషించిన మేధావిగా ఘనత వహించారు. కోల్‌కతాలో గణాంక విభాగం పరిశోధకునిగా ఆయన వృత్తి జీవితం ప్రారంభించారు. ఆ సమయంలో బెంగాల్ మేధావులతో ఏర్పడిన పరిచయం ఆయనను మార్క్సిస్టు-లెనినిస్టుగా తీర్చిదిద్దింది.

అభివృద్ధిపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చకు 20 ఏళ్ల క్రితమే ఆర్ఎస్ రావు శ్రీకారం చుట్టారు. భార్యతో కలిసి ఇటీవలే ఏడు పుస్తకాలు వెలువరించిన ఆర్ఎస్ రావు కొన్ని వందలాది రచనలు చేశారు. ఒడిసా రాష్ట్రం మల్కన్‌గిరి కలెక్టర్ వినీల్ కృష్ణ కిడ్నాప్ ఉదంతంలో మావోయిస్టుల ప్రతినిధిగా ఒడిసా ప్రభుత్వంతో చర్చల్లో పాల్గొని..వినీల్ విడుదలకు దోహదపడ్డారు. ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యవస్థ నిర్మాణంకోసం ఆర్ఎస్ రావు తపించారు.

ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధిలోని ప్రజా వ్యతిరేక స్వభావాన్ని వెలుగులోకి తెచ్చారు. ఆయన లేని లోటును భర్తీ చేయలేం'' అని విరసం నేత వరవరరావు గుర్తు చేశారు. చివరి ఘడియల్లో ఆయన ఆర్ఎస్‌రావు చెంతనే ఉన్నారు. హక్కుల నేత ప్రొ. హరగోపాల్, ప్రగతిశీల రచయిత వేణుగోపాల్‌తో పాటు ఢిల్లీకి చెందిన మేధావులు, ప్రజాసంఘాల కార్యకర్తలు రావుకు నివాళులు అర్పించారు.

ఆర్ఎస్ రావుకు విరసం నివాళి
హైదరాబాద్,  ప్రగతిశీల మేధావి ప్రొఫెసర్ ఆర్ఎస్ రావు మృతి పట్ల విరసం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. మార్క్సిస్టు-లెనినిస్టు అవగాహన, రాజకీయ అర్థ శాస్త్రాలను సరళమైన పద్ధతుల్లో తెలుగు సమాజానికి పరిచయం చేసిన కొద్ది మంది బుద్ధిజీవుల్లో ఆర్ఎస్్ రావు ఒకరని సంఘం కార్యదర్శి పినాక పాణి శుక్రవారమిక్కడ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జీవితాంతం విప్ల వోద్యమానికి, విప్లవ సాంస్కృతికోద్యమానికి సన్ని హితం గా ఉండి..పీడిత ప్రజానీకానికి విముక్తి పాఠాలు బోధిం చారన్నారు. నెహ్రూ నుంచి నేటి పాలకుల దాకా అనుసరిస్తున్న అభివృద్ధి నమూనా నిజ రూపాన్ని అత్యంత విశ్లేషణాత్మకంగా విప్పి చెప్పారని కొనియాడారు.

https://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2011/jun/18/main/18main21&more=2011/jun/18/main/main&date=6/18/2011

అబివృద్ధి - వెలుగు నీడలు - ప్రొ.ఆర్.ఎస్.రావు

ఇటీవల అమరులైన ప్రొఫెసర్ ఆర్.ఎస్.రావు గారి ఈ వ్యాసం తొంభైల ప్రాంతంలో రాసినది. కానీ అది నేటి అభివృద్ధి వెనక దాగిన నీడలను అర్థం చేసుకొని మన ప్రాపంచిక దృక్పథాన్ని సరిచేసుకునేందుకు ఎంతగానో దోహదపడుతుంది. ఈ వ్యాసం రాసే సమయానికి ఆయన సంబల్ పూర్ యూనివర్శిటీలో పనిచేస్తున్నారు.

నాటి ఒరిస్సాలోను, ఇటు ఆంధ్రలోని ఆనకట్టల వలన జరిగిన అభివృద్ధి తీరుతెన్నులను అర్థం చేసుకోవడానికి నేడు ఆంధ్రలో నిర్మితమవుతున్న పోలవరంవంటి భారీ ప్రాజెక్టులు, అలాగే ఒరిస్సాలో నేడు నిర్మితమవుతున్న పోస్కో, వేదాంత పరిశ్రమల అభివృద్ధి నమూనాల వెనక దాగివున్న వెలుగునీడల పర్యవసానాన్ని గ్రహించడానికి ఈ వ్యాసం ఎంతో దోహదం చేస్తుందన్నది నిర్వివాదాంశం అనొచ్చు.

ఇటీవల తెలుగు వారిలో వేళ్ళపై లెక్కపెట్టగలిగిన అతి కొద్ది మంది పీడిత జన పక్షపాత మేధావులను వరుసగా కోల్పోవడం తీరని లోటు.

http://sahacharudu.blogspot.com/2011/06/blog-post_24.html

అభివృద్ధి - వెలుగు నీడలు - ప్రొ.ఆర్.ఎస్.రావు
మా యూనివర్శిటీ పక్కనే హీరాకుడ్ డామ్ వుంది. మహానది మీద కట్టిన ఈ ఆనకట్ట స్వాతంత్ర్యానంతర భారత దేశంలో మొట్టమొదటి బహుళార్థ సాధక ప్రాజెక్టు. కొన్ని వేల ఎకరాలకి నీటి సరఫరా నుండి అనేక ప్రాంతాలకు విద్యుత్ శక్తి సరఫరా దాకా వివిధ ప్రయోజనాలు నిర్వర్తించే ఈ ప్రాజెక్టు మన అభివృద్ధికి ఒక ప్రతీక. అయితే దీని చుట్టు పక్కల గ్రామాలకు ఇంకా కరెంటు రాలేదు. ఈ గ్రామాలలోని ఓ గ్రామంలో ఒక గిరిజనుణ్ణి ఈ ఆనకట్ట మీద అభిప్రాయం అడిగితే "దీపపు సమ్మె చుట్టు వెలుతురు ఉన్నా దాని క్రింద కొంత భాగం అది సృష్టించే నీడ కింద ఉండాల్సిందే కదా" అని ఎంతో తాత్వికంగా చెప్పాడు. అతని వ్యాఖ్య మన దేశంలో ’అభివృద్ధి’ పై ఒక ఎక్స్-రే రిపోర్టులా అనిపించింది..

’అభివృద్ధి’ అనే భావన ఏకకాలంలో క్లిష్టమయినదీ, సులభంగా అర్థమయ్యేదీ కూడా. సులభంగా ఎందుకు అర్థమవుతుందంటే ’అభివృద్ధి’ కున్న స్పష్టమైన దర్శనీయత (visibility) వల్ల క్లిష్టమయింది. ఎందుకంటే దాని వెలుతురుని అనుభవించి అర్థం చేసుకోగలిగినంత సులభంగా, అది సృష్టించే నీడల్ని అర్థం చేసుకోలేం కాబట్టి. ఆ వెలుగులో నీడల గురించే ఈ వ్యాసం.

మన దైనందిన జీవితానుభవాలను, మన మెరిగిన ప్రాజెక్టుకు, ఫ్యాక్టరీలు, సంస్థలు (institutions), విద్యాలయాలు మొ.న వాటి కార్యకలాపాలను, మన చుట్టూ జరిగే సంఘటనల నేపథ్యాన్ని -వీటన్నిటి సారాన్ని పోగుచేసి పరిశీలిస్తే ఈ ’అభివృద్ధి’ విశ్వరూపం, దాని ఫలితాలు చాలా వరకు అవగాహన అవుతాయి. ఇవన్నీ మనకు ’అభివృద్ధి’ లోని వేర్వేరు అంశాల్ని విడమర్చి చెప్తాయి. ఈ వివిధాంశాల మధ్య వైరుద్యాలు నీడల్ని వెలుగులోకి తీసుకొచ్చి మన మధ్య ’అభివృద్ధి’ అనే భావనని చర్చనీయాంశం చేస్తున్నాయి. హీరాకుడ్ చుట్టుపక్కల కరెంటు లేని గ్రామాలలొ గిరిజనుల జీవితం కానివ్వండి, కారంచేడు ఘర్షణ కానివ్వండి, విజయవాడ అల్లర్లు కానివ్వండి - అన్నీ ఈ ’అభివృద్ధి’ వెలుగునీడల్ని విశదరిచేవే. మన రాష్ట్రంలో కాటన్ దొర చలువవల్ల వందేళ్ళకు పైగానే చరిత్రను నిర్మించుకున్న ఈ ’అభివృద్ధి’ పర్యవసానాలు ఇప్పుడు ఒక రూపధారణ చేసుకుంటున్నాయి.

ఆనకట్ట కానివ్వండి, ఫ్యాక్టరీ కానివ్వండి, ఆ మాటకొస్తే యూనివర్శిటీ కానివ్వండి, సాధారణంగా చూస్తే ఓ పెద్ద శక్తిగా కనిపిస్తుంది. దాని వెనుక తప్పనిసరిగా ఎంతో జ్నానం దాగి వుంటుంది. ఈ ఘనీభవించిన మానవ జ్ఞానం మానవుడి ఉత్పత్తి శక్తుల పెరుగుదలకి ఒక సూచిక.

హీరాకుడ్ ప్రాజెక్టుకాని, కాటన్ దొర కట్టిన ఆనకట్టలు కాని తీసుకుందాం. ఒకానొక నదీజలాల ప్రవాహాన్ని ఆపి, లేదా కుదించి, ఆ నీటిని ఇతర అవసరాలకు మళ్ళించేందుకు కావలసిన పరిజ్ఞానం సంపాదించి, సిమెంటు, ఇనుము, ఇతర పదార్థాలను సృష్టించి, వాటిని అవసరమైన స్థలానికి అవసరమైనంత మేరకు మళ్ళించి, ఆ నీటి వేగాన్ని అడ్డుకోవడానికి అవసరమైనంత శక్తిగల ఓ అడ్డుగోడను లేపటం వెనక ఎంతో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వుంది. ప్రకృతి చలన సూత్రాలను ఉపయోగించి ఒక విశాల మానవ హస్తం అనంత జల ప్రవాహాన్ని అడ్డుకుని మానవ ప్రయోజనాలకు మళ్ళించడం మనల్ని అప్రతిభుల్ని చేస్తుంది. అందుకే ఎంతో మానవ జ్ఞానం ప్రోగుపడిన ఫలితంగా పెరిగిన మానవుడి ఉత్పత్తి శక్తులకు ఈ ఆనకట్ట ఒక సూచిక అవుతుంది.

ఇలా ఏ అభివృద్ధి పథకం తీసుకున్న దానివెనుక అనంతమైన జ్ఞానం కనిపిస్తుంది. ఈ జ్ఞానం మానవ మేధస్సు నుండి క్రమానుగతంగా పెరుగుతుంటుంది. ఈ పెరుగుదల ఫలితంగా ఉత్పత్తి శక్తులు వికసిస్తాయి. వాటి వికాసపు ఫలితంగా ’అభివృద్ధి’ జరుగుతుంది. ఈ ’అభివృద్ధి’ కారణంగా ’అభివృద్ధి’ పథకాలు వివిధ రూపాలలో ముందుకు వచ్చాయి. మున్ముందు వస్తుంటాయి. ఆనకట్టలు, గనులు, కార్ఖానాలు, ఎత్తైన మేడలు, ఆ మేడల మీద ఎగురుతు వెళ్ళిపోయే విమానాలు, కంప్యూటర్లు, ఆ కంప్యూటర్లు చేయగల ఎన్నొ విచిత్రమైన పనులు - ఈ ’అభివృద్ధి’కి గల అనేకానేక రూపాలు (forms) మనకు సుపరిచితాలే. ఐతే వాటి సారం (essence) ఏమిటి?

ఏ ఉత్పత్తి శక్తుల పెరుగుదలైనా దాని వెనక నిబిఢమైన మానవ శ్రమ విజ్ఞానాల ఫలితమే. ఆ విజ్ఞానం ఒకానొక ప్రాపంచిక దృక్పధం కారణంగా పెంపొందుతుంది. అంటే అంతిమ పరిశీలనలో ఏ రూపంలో కనిపించే ’అభివృద్ధి’ పథకమైనా ఒకానొక ప్రాపంచిక దృక్పథం నుండి జనిస్తుందని తేల్చి చెప్పవచ్చు, ఆ రకంగా ఆయా ’అభివృద్ధి’ పథకాల సారం వాటికి కారణమైన ప్రాపంచిక దృక్పధమే. అందుచేత ఏదైనా పథకాన్ని తీసుకొని ఇది ప్రాపంచిక దృక్పధం "అభివృద్ధి’ అవునా కాదా అన్నది తేల్చుకోవాలన్నప్పుడు ఆ ’అభివృద్ధి’ పధకం ప్రాపంచిక దృక్పధంలో ఏమైనా మార్పులు తీసుకు వచ్చిందా లేదా అప్పటికే బలంగా వున్న వేరొక ప్రాపంచిక దృక్పధంలో తానే ఒక భాగమైపోతుందా అనే అంశాన్ని జాగ్రత్తగా గమనించాలి.

ఒక్కమాటలో చెప్పాలంటే ఒకానొక దేశ కాల పరిస్థితులలో మనిషికి ప్రకృతికి మధ్య గల సంబంధాన్ని లేక వైరుధ్యాన్ని గురించి తెలియజేసే ఒకానొక దృక్పధాన్ని ఒక నిర్థిష్టమైన ప్రాపంచిక దృక్పథంగా చెప్పుకోవచ్చు. మనిషికి ప్రకృతికి మధ్య వుండే సంబంధంలో ఐక్యత ప్రధానంగా ఉందా లేక ఘర్షణ ఎక్కువగా వుందా అనే అంశం అతడి ప్రాపంచిక దృక్పధాన్ని నిర్వచిస్తుంది. మనిషికి ప్రకృతితో ఐక్యత అనేది ఘర్షణ కంటే ప్రధానమైనదిగా వుంటే అప్పుడు అతని జ్నానం పెరగడానికి తద్వారా అతడి ఉత్పత్తి శక్తులు పెరుగుదలకి దాని మూలంగా సాధ్యమయ్యే అభివృద్ధికి అవకాశముండదు. ఇది ఫ్యూడల్ ప్రాపంచిక దృక్పధం. అంటే ప్రకృతి అందించే వనరులని యదాతథంగా వాడుకోవడం తప్ప. దాని చలన సూత్రాలని పరిశీలించి వాటిలో దాగిన రహస్యాలను ప్రశ్నించి, అంతకు ముందు సేకరించిన జ్నానాన్ని మెరుగుపరచడం, ఈ ఫ్యూడల్ ప్రాపంచిక దృక్పధం లో వుండదు. ప్రకృతితో మమేకమవ్వడం లేదా సర్దుకుపోవడం దీని ప్రధాన లక్షణం. ఈ ఫ్యూడల్ ప్రాపంచిక దృక్పధంలో వుండే జ్ఞానమంతా ప్రకృతి అందించే కానుకగా, వున్నదున్నట్టుగా ప్రకృతి వనరులని వినియోగించుకోవడంగా వుంటుంది. అంతిమ పరిశీలనలో అది నిరంతర పరిణామానికి గురయ్యే పరిశోధనా స్రవంతిగా కాకా, ఎల్లప్పుడూ యదాతథంగా కొనసాగుతు ముందు తరాలకు పవిత్రంగా అందించబడే నమ్మకాల ప్రవాహంగా వుంటుంది. చివరికి జ్నానమనేది కొంత అనుభవం ప్రాతిపదికగా ఏర్పడిన ఓ తిరుగులేని విశ్వాశంగా మారిపోతుంది.

ఐతే నిజమైన "అభివృద్ధి ఉత్పత్తి శక్తుల పెరుగుదలకు దోహదపడుతుందని మనకు తెలుసు. ఆ ఉత్పత్తి శక్తుల పెరుగుదల వివిధ రంగాలలో మానవ జ్ఞానం వికసించడం మూలంగా జరుగుతుందని తెలుసు. ఈ జ్ఞానవికాశం ప్రకృతి కరుణ కోసం ఎదురుచూస్తూ కూచోదు. అది ప్రకృతి నియమాలను శోధించి, బేధించి అనేక అడ్డంకులను అధిగమించే నిరంతర సంఘర్శణల ఫలితం. ఇలా నిర్విరామంగా ప్రకితితో మనిషి సాగించిన ఘర్షణనుండే అనేక ఆవిష్కరణలు జనించాయి. ఊహకందని "అభివృద్ధి’ సాధ్యపడింది. ప్రకృతితో ఐక్యత కంటే ఘర్షణ ప్రధానమైన ఒకానొక ప్రాపంచిక దృక్పథం వున్నప్పుడే ఇలాంటి జ్నాన వికాసం సాధ్యమవుతుంది. దీనిని ప్రస్తుతానికి పెట్టుబడిదారీ ప్రాపంచిక దృక్పధమని చెప్పవచ్చును.

ఆనకట్టల విషయాన్నే తీసుకుందాం. సింధులోయ నాగరికతా కాలంనుండే మనిషి కాలువలు త్రవ్వడం, నీటిపారుదల సదుపాయాలు మెరుగుపరుచుకోవడంలాంటివి చేస్తూ వచ్చాడు. అయితే అది ప్రకృతి అనుగ్రహించిన మేరకు తప్ప, ప్రకృతిలో నిబిడమై వున్న సూత్రాల ఆధారంగా దానితో ఘర్షణపడి, మరింత మెరుగైన సౌకర్యాలను సృష్టించుకోవడం కాని, అది ఫ్యూడల్ ప్రాపంచిక దృక్పథంలో సాధ్యంకాదు. అలా జరగాలంటే ప్రకృతితో ఘర్షణలో భాగంగా, ప్రకృతి నియమాలను గ్రహించి ఆర్జించిన జ్నానంతోనే సాధ్యపడుతుంది. కోస్తా ఆంధ్రలో విజయవాడ లోని "అభివృద్ధి’ కూడా ఈ రకం జ్ఞానం వల్లే సాధ్యమైంది. కాటన్ దొర కట్టిన ఆనకట్టలు, తద్వారా వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులు, ఆ రంగం నుండి అదనపు విలువ ఇతర రంగాలలోకి రావడం అనే క్రమం వల్లే ఈ "అభివృద్ధి’ సాధ్యమయింది. మన దేశంలో ఈ అభివృద్ధి ఏ ప్రాపంచిక దృక్పధాన్ని జనరేట్ చేస్తుందనేదే మనముందున్న ఏకైక ప్రశ్న. వంద సంవత్సరాల "అభివృద్ధి మిగిల్చిన శేష ప్రశ్న.

ఈ ప్రశ్నకి సమాధానం మన రోజువారి జీవితంలో అంతర్లీనంగా మెసులుతూనే వుంటుంది. ఉదాహరణకి ఇంట్లో ఎవడైనా కుర్రవాడు టేబుల్ మీద వున్న పెన్నును తీసుకున్నాడనుకోండి. వాడిలో అనేక ప్రశ్నలుంటాయి. దానిని వాడు రకరకాలుగా పరీక్షిస్తాడు. అటూ, ఇటూ తిప్పుతాడు. దాని భాగాలను విడదీస్తాడు, వాటిని మళ్ళీ కలుపుతాడు. ఏదో ఒక కొత్త విషయం తెలుసుకున్న విచిత్రానుభవానికి గురి అవుతాడు. వాడిలో ఈ కుతూహలం ప్రకృతితో ఘర్షణ లాంటిది. కానీ ఈ లోగా పెద్దవాళ్ళెవరో వస్తారు. ఈ పెన్ను ఎందుకు ముట్టుకున్నావని కసిరి దానిని జాగ్రత్తగా వాడుకోవాలని హెచ్చరిస్తారు. వాళ్ళ హెచ్చరిక ప్రకృతితో ఐక్యతను ప్రతిపాదిస్తుంది. పెన్ను గురించి ఎన్నో ప్రశ్నలున్న పిల్లవాడు "పెన్నుని విప్పడం తప్పు దానిని పదిలంగా భద్రపరుచుకోవాలి " అనే భావజాలాన్ని ఒక నమ్మకంగా స్వీకరిస్తాడు. ప్రశ్నించే మానవుడి ప్రాపంచిక దృక్పధం వలన, జ్ఞానం వలన తయారైన పెన్ను, సాంప్రదాయంగా వస్తున్న నమ్మకాలని మరింత బలోపేతం చేసే సాధనమవుతుంది.

హిరాకుడ్ ఆనకట్ట కట్టాక నిజంగా ఉత్పత్తి శక్తులు పెరిగి, అది ఆ రకం ఆనకట్టల్ని విదేశీ సహాయం లేకుండా కట్టగలిగే జ్నానాన్ని మనకిచ్చి అభివృద్ధి కారకమై ప్రాపంచిక దృక్పధంలో మార్పులు తీసుకుని వచ్చి ఉంటే ఈ ఆనకట్టల వలన, "అభివృద్ధి’ వలన పురోగమనం సాధ్యమవుతుందనే స్పృహ వచ్చి ఉండేది. అయితే ఈ ఆనకట్ట ప్రక్కనే కొత్తగా కడుతున్న రేంగాలి ఆనకట్టాకి వ్యతిరేకంగానూ, ఇదే జిల్లాలో ప్రభుత్వం చేపట్టిన ఓ పెద్ద అల్యూమినియం ఫ్యాక్టరీ (BALCO) కి వ్యతిరేకంగానూ ప్రజలు పోరాడుతున్నారు. ఈ ప్రజాందోళన ఏమిటి సూచిస్తున్నట్లు? అలాగే వంద సంవత్సరాల కోస్తా ప్రాంత అభివృద్ధి క్రమం ప్రాపంచిక దృక్పథంలో మార్పు తెచ్చి వుంటే విజయవాడలో ఒక హత్య, అంత పెద్ద ఎత్తున కుల తగాదాలకు దారితీసి వుండేది కాదు. ఈ భీభత్సకాండ, ముదిరిపోతున్న కులతత్వం విధ్వంసక ప్రవృత్తి, విశృంఖలంగా పెరుగుతున్న రాజ్య హింస దేనిని సూచిస్తున్నట్లు?

ప్రకృతితో మానవుడు జరిపే నిరంతర సంఘర్షణ ఫలితంగా వచ్చిన జ్ఞానం ఆ జ్ఞాన వికాస ఫలితంగా మనకు సాధ్యమయిన అభివృద్ధి, ఆ సంఘర్షణను నిరాకరించే (Tegate) ప్రాపంచిక దృక్పథానికి మరింతగా బలాన్ని చేకూరుస్తున్నాయి. మరో భాషలో చెప్పాలంటే మన దేశంలో ఎంతగా అభివృద్ధి జరిగితే అంతగా ఫ్యూడల్ ప్రాపంచిక దృక్పథం బలపడుతూ వస్తోంది. ఎంత పెద్ద వెలుగు వెనక అంత పెద్ద నీడలా, హిరాకుడ్ లో ఆనకట్టనీ, బీసెంటు రోడ్డులో భవనాన్ని, అభివృద్ధి భౌతిక రూపాలను "అభివృద్ధి’గా మనం పరిగణిస్తూ వస్తున్నాం. కాని అభివృద్ధి అంటే ప్రాపంచిక దృక్పథంలో మార్పు అని మనం గుర్తించగలిగిన నాడు "అభివృద్ధి’ మన జీవితాల్లో సృష్టిస్తున్న విధ్వంసకాండని, మన మనస్సులో సృష్టిస్తున్న గందరగోళాన్ని అర్థం చేసుకోగలిగిన వాళ్ళమవుతాం. అప్పుడు బహుళ హిరాకుడ్ ప్రక్కన కరెంటు లేని గ్రామంలో గిరిజనుడు చెప్పిన దీపపు సెమ్మ క్రింద చీకట్లలో పోరాడుతున్న ప్రజలను నడిపించే ప్రాపంచిక దృక్పథమే "అభివృద్ధి’గా ఆవిష్కరించుకుంటాం.

(ఈ వ్యాసం విశాఖపట్నం సాగరగ్రంథమాల వారి ప్రచురణ అయిన మనలో మనం (1990 సెప్టెంబరు ప్రచురణ) వ్యాస సంకలనం నుండి గ్రహించడమైనది)

ఈ వ్యాసం లింకు పంపిన కెక్యూబ్ వర్మ గారికి కృతజ్ఞతలు
 http://sahacharudu.blogspot.com/2011/06/blog-post_24.html

బతుకును ప్రేమిస్తే మరణమే బహుమతి

రెండు దశాబ్దాల తరువాత కొత్త రూపు దిద్దుకుని విడుదలైన కొమురం భీమ్ సిని మా, నిర్మాణ ప్రమాణాలలో ఎన్ని పరిమితులున్నప్పటికీ, చెప్పవలసింది మాత్రం చెప్పగలిగింది. త్యాగానికీ సంకల్ప బలానికీ సాహసానికీ ఉండే శాశ్వత గౌరవాన్ని చాటి చెప్పింది. తన గురించి తాను మాట్లాడకుండా పక్కవాళ్ల గురించి మాట్లాడతావెందుకని నిజాము ప్రభుత్వాధికారి కొమరం భీమ్‌ను అడుగుతాడు. ముప్పై ఎకరాలు పట్టా ఇస్తానన్నా భీమ్ ఎందుకు పోరాటం విరమించడో అసిఫాబాద్ అవ్వల్ తాలూక్‌దార్ ఆశ్చర్యపోతాడు.

అధికారబలం ఉన్నవాడికి ప్రపంచమంతా బానిసల్లాగే కనిపిస్తారు. అర్థబలం ఉన్నవాడికి ప్రతీదీ అమ్ముడుపోయే సరుకుగానే కనిపిస్తుంది. ఆశ, ప్రలోభం, స్వార్థం, లాభం- ఇవి తప్ప మనుషుల్ని నడిపించేవేవీ ఉండవని వాళ్లకు గట్టి నమ్మకం ఉంటుంది. పైవాడికి మోకరిల్లడం, కిందివాడిని అణగదొక్కడం తప్ప మరో విలువ వాళ్లకు తెలియదు. ఏటికి ఎదురీదే ఉలిపికట్టెలను చూస్తే వారికి నిరసన. ఎవరైనా సరే, గెలవలేని యుద్ధాలు ఎందుకు చేస్తారన్నది వారికి కొరుకుడు పడని ప్రశ్న.

సమస్కంధులైనవారో, కాస్త అటూ ఇటూగా ఉన్న బలాల వారో ప్రత్యక్ష యుద్ధం ద్వారా విజేతలు కావడానికి ప్రయత్నిస్తారు. పాలకవర్గాల మధ్య, రాజుల మధ్య జరిగే దండయాత్రలూ ఆక్రమణలూ అటువంటి కోవలోకి వస్తాయి. కానీ, చరిత్రలో అన్ని యుద్ధాలూ అట్లా సమానస్థాయి పక్షాల మధ్య జరగవు. కొండలను ఢీకొనే పొట్టేళ్లూ, మహాశక్తులతో తలపడే అల్పప్రాణులూ మానవజాతి చరిత్ర నిండా తారసపడుతూనే ఉంటాయి.

ధర్మం పక్షానో, న్యాయం పక్షానో పోరాడేవాళ్లు, అవమానానికి వ్యతిరేకం గా, అభిమానాన్ని కాపాడుకోవడానికి యుద్ధం చేసేవాళ్లు జనగాథల్లో చిరస్మరణీయులుగా మిగిలిపోతారు. భౌతిక యుద్ధంలో మరణించీ, పరాజయం పొందీ కూడా వాళ్లు మరేదో యుద్ధంలో వాళ్లు విజేతలుగా మిగిలిపోతారు. ఏ యుద్ధంలో అయినా మోహరించిన బలాలూ బలగాలకు తోడు ఒక అదృశ్యపక్షం కూడా రంగంలో ఉంటుంది. అదే న్యాయం. లేదా నైతికత, లేదా సూనృతం.

బ్రిటిష్ సేనల బలం ఎంతటిదో తిరగబడ్డ రాంజీగోండుకు తెలియదా, విల్లుపట్టిన అల్లూరి సీతారామరాజుకు తెలియదా,తూటా పేల్చిన భగత్‌సింగ్‌కు తెలియదా, నిజాము పోలీసుల శక్తి ఏమిటో కొమరం భీముకు తెలియదా- తెలుసు. ఓడిపోవడం కాదు, లొంగిపోవడం నేరమని కూడా తెలుసును. వారి మొక్కవోని సంకల్పం వారి విజేతలకు మూర్ఖత్వంగా కనిపించి ఉండవచ్చు. తమను తాము ధ్వంసం చేసుకుని ఎడతెగని నిర్బంధంలో, మృత్యువులో నిటారుగా నిలబడడం ఎందుకో దండధారుల కు అర్థం కాకపోవచ్చు. అడ్డదారుల్లో వ్యక్తిగత లబ్ధి కోసం లోభపడకుండా మెరుగైన ఉమ్మడి మనుగడ కోసం ఎందుకు తాపత్రయపడతారో వారి ఊహకే అందకపోవచ్చు. అర్థరహితమైన, తాము విసర్జించిన నైతికత ఎదుటిపక్షానికి అంతటి శక్తి నెట్లా ఇస్తున్నదో అర్థం కాకపోవచ్చు.

ఏ రాజ్యానికైనా చతురంగబలగాలో, ఆర్థిక వ్యవస్థో సుస్థిరతను ఇస్తాయనుకుంటారు కానీ, పాలించడానికి పాలకుల కు ఉండే నైతికహక్కే సిసలైన స్థైర్యాన్ని ఇస్తుంది. ఒక్కోసారి ప్రజలు అమాయకత్వం నుంచి, అజ్ఞానం నుంచి, వెనుకబాటుతనం నుంచి పాలకుల రాజ్యార్హతను మదింపువేయవచ్చు, క్రూరులకూ దుష్టులకూ కూడా జైజైలు కొట్టవచ్చు. అట్లా జయజయధ్వానాలు రప్పించుకోవడానికి ప్రజలకు ఏదో విదిలింపో చదివింపో ప్రభువులు చేస్తారు, అన్నదానా లు చేస్తారు, గుడులూ గోపురాలూ కడతారు, మడులూ మాన్యాలూ ఇస్తారు.

ఏదో ఒక చిన్న అనుబంధాన్ని పోషిస్తూ, దాని ఆధారంగా సమస్త ప్రజానీకాన్ని రాజదండం కింద అణచిపెడతారు. ఆ చిన్న బంధం కూడా, చిన్న పాటి నీతిపీలిక కూడా లేకుండా జనాన్ని పాలించాలనుకున్నప్పుడు అది నిరంకుశత్వమో నియంతృత్వమో అవుతుంది, దాని పీఠానికి నాలుగుకాళ్లూ విరిగిపోయి ఉంటాయి, ఎప్పుడు కుంగిపోతుందో తెలియని మట్టికాళ్ల రాక్షషి అవుతుంది. కణ్ణగి కన్నెర్ర చేస్తే కాలిపోయిన మధురానగరం వలె రాజ్యం ధర్మాగ్రహం ముందు కుప్పకూలిపోతుంది.

బహుశా ఇప్పుడు భారత ప్రభుత్వం అటువంటి అనైతిక పునాదుల మీద నిలబడి ఉన్నది. తనలోనుంచి తాను పిగిలిపోతున్న దుస్థితిలో ఉన్నది. తూటాలు తప్ప మాటలు తెలియని నిస్సహాయ స్థితిలో ఉన్నది. ఎంవోయూలు తప్ప చర్చలు అక్కరలేని ప్రలోభంలో ఉన్నది. దేశాన్నంతా తెగనమ్మి నాలుగు కమిషన్‌రాళ్లు తెచ్చుకోవాలనుకునే అమాత్యుల నీడలో, జాతిజాతిన ంతా నిర్వాసితను చేసే దుర్మార్గం పీడలో, వేదనలన్నీ అరణ్యరోదనలయ్యే ఏలుబడిలో - జనజీవనమం తా తడిసె నెత్తుటితో, కాకుంటే కన్నీళులతో.. అరవయ్యేళ్లుగా ఆరనికాష్టంలా ఉన్న ఈశాన్యం.

తుపాకుల మోతలే కాదు, ఏళ్ల తరబడి నిరశనదీక్షలూ వారాల తరబడి దిగ్బంధాలు కూడా దున్నపోతు మీది వానలే. వేర్పాటో స్వాతంత్య్రమో ఎడతెగని విషాదం కాశ్మీర్. జీవితమంతా నిత్య అంతిమయాత్ర. ఉగ్రవాదానికే కాదు, రాళ్లవానకు కూడా తుపాకులు తప్ప మరో సమాధానంలేదు. భోపాల్ హంతకుడిని దేశం దాటించిన నేతలే, ఆకుపచ్చని అణచివేతలో ఆదివాసుల నరమేధం నిర్వహిస్తారు. కార్బైడ్ న్యాయంజరగనేలేదు, దేశమంతా అణు కుంపట్లు. అడుగడుగునా ఆధునిక సంస్థానాలు, ఆదాయాల మధ్య అగాధాలు. విద్యాలయాలు న్యాయస్థానాలు ఆరోగ్యనిలయాలు అన్నీ- ప్రపంచీకరణ పూసలో ఒదిగిన దారాలు.

చెప్పుకోవడానికి ఒక్క న్యాయమూ లేని, రాజ్యంతో ఒక్క పేగుబంధమూ లేని దేశంలో- బతుకును ప్రేమించేవారంతా మరణించడమే రాజధర్మం. కొమురం భీమ్ సినిమా విడుదలైన రోజునే, ఆతను నమ్మిన సత్యాన్ని సాధనచేసిన నేలలోనే చెరుకూరి రాజకుమార్ నేలకొరిగాడు. అతనిమార్గం ఈ దేశానికి, ఆదివాసులకు విముక్తి సాధిస్తుందో లేదో తెలియదు. కానీ, త్యాగమూ సంకల్పమూ సాహసమూ అన్న శాశ్వతవిలువలను సాధనచేస్తున్న మార్గం అతనిది. ఓడిపోయే యుద్ధంచేసి, గెలిచిన మార్గం అతనిది.

యంత్రాంగాలూ రాజ్యాంగాలూ ధర్మశాస్త్రాలూ సాధనాలన్నీ అంతరించి, హత్యలు తప్ప మరో ఆయుధం లేని బలహీనతలోకి దిగజారిన అనైతిక వ్యవస్థ కొన వూపిరి మూలుగు ఇప్పుడు స్పష్టంగా వినిపిస్తున్నది. ప్రజాస్వామ్యపు అవశేషాలన్నీ సర్వశక్తులూ కూడదీసుకుని మరో భ్రమనో ప్రయత్నాన్నో అందించకపోతే ఈ శైథిల్యం శ్మశానమై విస్తరిస్తుంది.

-కె. శ్రీనివాస్
http://www.andhrajyothy.com/editorial.asp?qry=dailyupdates/editpagemain

ప్రజల హక్కుల రక్షణ కోసమే ఆయుధాలు చేపట్టాం

వివిధ సందర్భాల్లో ఆజాద్ ఉద్ఘాటన
మావోయిస్టు అగ్రనేత, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఆజాద్ బహుముఖ ప్రజ్ఞాశాలి. మావోయిస్టు పార్టీలో ముఖ్యమైన సిద్ధాంతకర్తల్లో ఆయన ఒకరు. వివిధ అంశాలపై పార్టీ అధికార ప్రతినిధి హోదాలో పత్రికా ప్రకటనలు విడుదల చేస్తుండేవారు.

ఆపరేషన్ గ్రీన్‌హంట్ నేపథ్యంలో మావోయిస్టు వ్యతిరేక, అనుకూల శ్రేణుల్లో ఎన్నో ప్రశ్నలు. అనేక సందేహాలు! వాటన్నింటికీ ఆజాద్ తన ప్రకటనలు, ఇంటర్వ్యూల ద్వారా వివరణలు ఇచ్చారు. అవి.. సంక్షిప్తంగా...

ఆపరేషన్ గ్రీన్‌హంట్‌పై..
మావోయిస్టుల ప్రాబల్యంలో ఉన్న ప్రాంతాల్లోని అణగారిన వర్గాల ప్రజల భూమిని గుంజుకునేందుకు కేంద్ర, రాష్ట్ర బలగాలు మొట్టమొదటిసారిగా చేపట్టిన భారీ ఆపరేషన్ ఇది! దేశవ్యాప్తంగా గెరిల్లా జోన్లపై దాడులకు కేంద్రబలగాల రిహార్సిల్ ఇది. ఆత్మరక్షణ కోసం జరుగుతున్న ఈ యుద్ధంలో మా అన్ని రకాల ప్రణాళికలు, వ్యూహా లు, ఎత్తుగడలు పూర్తిగా ప్రజాభాగస్వామ్యంతో ముడిపడినవే.

పూర్తిస్థాయి యుద్ధానికి పాలకులు సాహసిస్తే.. వర్గశక్తుల పొందికలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటాయి. పీడితవర్గాలు మావైపు.. పీడక వర్గాలు శత్రువు వైపు నిలుస్తాయి. చిదంబరం అండ్ కంపెనీ చేసే ప్రయత్నాలన్నీ ఈ ప్రాంతాన్ని అంతర్జాతీయ, జాతీయబందిపోట్లకు అప్పగించేందుకే!

నక్సల్స్ జరుపుతున్న హింసపై...
నక్సల్స్ జరుపుతున్నది హింస కానే కాదు. నక్సల్ వ్యతిరేక పోరాటంలో ప్రభుత్వ బలగాల అమానుష అకృత్యాల వల్లే ఇది జరుగుతోంది. వా రు పేద నిరాయుధులైన గిరిజనులను హింసించకుండా.. వారిని అరెస్టు చేసి చిత్రహింసల పాల్జేయకుండా.. హత్యలకు వారి మహిళలపై అత్యాచారాలకు పాల్పడకుండా, వారి ఆస్తులను ధ్వంసం చేయకుండా, వారి గ్రామాలను తగులబెట్టకుండా, అపహరించిన గిరిజనులను ఎన్‌కౌంటర్ల పేరుతో కాల్చిపారేయకుండా ఉంటే మా దళాలు ఇటువంటి చర్యలకు పాల్పడతాయా

కోబ్రాల ఏకైక కర్తవ్యం నక్సల్స్‌ను, వారి సానుభూతిపరులను తుడిచిపెట్టడమే. వారికి నక్సల్స్ దొరక్కపోతే అసహాయులైన ఆదివాసీలను అరెస్టుచేసి, చిత్రహింసలు పెడుతున్నారు. గడ్చిరోలిలో ప్రజలను భయకంపితులను చేసిన పోలీసులనే హతమార్చాం ''

చర్చల ప్రతిపాదనపై...
ఇది చాలా మూర్ఖపు ప్రతిపాదన. మావోయి స్టు ఉద్యమం ఏ నేపథ్యంలో ఉద్భవించిందన్న చారిత్రక, సామాజిక వాస్తవాలను వీరు పూర్తిగా విస్మరిస్తున్నారని దీని ద్వారా వెల్లడవుతోంది.

మా వోయిస్టుల నాయకత్వంలో కొన్నివర్గాల ప్రజలు ఎందుకు ఆయుధాలు చేతబట్టి ముందు వరుసలో నిలిచారో మన్మోహన్, చిదంబరం, వారి మనుషు లు ఆలోచించుకోవాలి. భారత సమాజం ఎదుర్కొంటున్న సమస్యలకు ఒక పరిష్కారం లభించకుండా మావోయిస్టులు తమ ఆయుధాలను కింద పడేస్తారని ఎవరైనా ఎలా ఊహిస్తారు?

మా సాయుధ పోరాటానికి కారణమైన అంశాలను ప్రస్తావించకుండా.. చర్చలకు పిలవడం ద్వారా మాకు మేలు చేస్తున్నామని మన్మోహన్, చిదంబరం అనుకుంటే వారు పిచ్చివాళ్ల స్వర్గంలో ఉన్నట్లే. ఈ విషయాలు వారికి తెలియక కాదు. తాము శాంతికి కట్టుబడి ఉన్నామని, వారు(మావోయిస్టులు) చర్చలకు సిద్ధంగా లేరని చెప్పుకోడానికే ఈ వంక.''

చర్చలకు మావోయిస్టుల షరతులపై...
మావోయిస్టులు, మావోయిస్టులకు మద్దతుగా నిలిచిన వారి అపహరణలను నిలిపివేయాలి. నిరాయుధులైన ప్రజలపై చిత్రహింసలను, హత్యలను తక్షణం ఆపాలి. వారి ఆస్తుల విధ్వంసాన్ని అడ్డుకోవాలి. సల్వాజుడుం, సేంద్ర, గ్రామ సురక్షా సమి తి, శాంతిసేన వంటి ప్రభుత్వ సాయుధముఠాల ను వదలివేయాలి.

భద్రతాదళాలు జరిపిన అకృత్యాలపై విచారణ జరిపి దోషులను శిక్షించాలి. యూఏపీఏ వంటి దుర్మార్గపు చట్టాలను ఉపసంహరించాలి. గిరిజనులను నిర్వాసితులను చేసే మైనింగ్‌ను నిలిపివేయాలి. మేం ఆయుధాలు కిందపడేసే ప్రసక్తే లేదు. ప్రజల హక్కుల రక్షణ కోసమే ఆయుధాలు చేపట్టాం. ఆయుధాలు కింద పడేయడమంటే ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయడమే.

కేంద్ర హోం మంత్రి చిదంబరంపై..
చిదంబరం భారతదేశపు హిట్లర్. నిజానికి పాలకులే ఉగ్రవాదులు. అమెరికాలో పర్యటించి వచ్చిన తర్వాత చిదంబరం హిట్లర్ అవతారమెత్తి... అమెరికా సామ్రాజ్యవాదులతో కలిసి గిరిజన పోరాటాలను అణచివేసేందుకు నిర్ణయించారు. మావోయిస్టు కేంద్రకమిటీపై దృష్టి సారించిన చిదంబరం, ప్రధాని మన్మోహన్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా, ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్‌లకు గుణపాఠం చెబుతాం
http://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2010/jul/3/main/3main18&more=2010/jul/3/main/main&date=7/3/2010

10 భాషలపై పట్టు

రోజూ 14 పత్రికల పఠనం
బ్రెజిల్ సభలో ప్రసంగం
అజాద్ నేపధ్యమిదీ

ఎన్‌కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి చెరుకూరి రాజ్‌కుమార్ అలియాస్ అజాద్‌కు విద్యార్థి దశ నుంచే ఆంగ్లంపై మంచి పట్టు ఉండేది. ఈ కారణం గానే పార్టీ కార్యక్రమాల్లో ఆయన ప్రాముఖ్యం ఎక్కువగా ఉండేది. సిద్ధాంత రీత్యా పార్టీ నిర్ణయాలు, అదేశాలు అమలు కావాలంటే ఆయన ఆమోదముద్ర ఉండాల్సిందే నని సమాచారం. కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరో స్థాయిలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అజాద్ అనుమతితోనే బయటకు వచ్చేదని తెలుస్తోంది. ఆయనకు దాదాపు 10 భాషలపై పట్టు ఉండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఆంగ్లంపై విశేష పరిజ్ఞానం సంపాదించిన అజాద్, తెలుగు, తమిళం, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, ఇతర ఉత్తరాది భాషల్లోనూ చదవగలిగేంత పట్టు సాధించారు. అందుకే పార్టీకి చెందిన దాదాపు 14 పత్రికలను ఆయన చూసేవారని సమాచారం. ఆంగ్లంలో అనర్ఘళంగా మాట్లాడగలిగే సామర్థ్యం ఉన్నందునే ఆయనకు అంతర్జాతీయ వేదికలపై మాట్లాడే అవకాశం దక్కింది.

1991లో బ్రెజిల్‌లో కమ్యూనిస్టు పార్టీల ప్రపంచ స్థాయి సమావేశాలు జరిగినప్పుడు మావోయిస్టుల (అప్పట్లో పీపుల్స్ వార్ గ్రూప్-పీడబ్ల్యూజీ) తరపున భారత దేశం నుంచి చెరుకూరి రాజ్‌కుమార్ పాల్గొన్నారు.ఒక్కో పార్టీనుంచి పాల్గొన్న ప్రతినిధికి సుమారు 5 నిమిషాల పాటు ఆ వేదికపై మాట్లాడే అవకాశం దక్కగా, ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడటం, సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను విశ్లేషించడం, పార్టీ సిద్ధాంతాలను వివరించడంలో ఆయన వాగ్దాటికి సభికులు ఆసక్తి చూపి, దాదాపు 10 నిమిషాల పాటు మాట్లాడే అవకాశం కల్పించారు. భారత దేశ విప్లవ పార్టీల తరపున అంతర్జాతీయ వేదికలపై మాట్లాడిన ఘనత చెరుకూరిదేనని చెప్పుకుంటుంటారు.

ఎడమన గాజు కన్ను? 
అజాద్ ఎడమ కన్ను గాజు కన్ను అని తెలిసింది ఆయనతో పాటు పార్టీలో ఉండి అతి సన్నిహితంగా చూసిన మాజీ నేతలు కొందరు ఈ విషయాన్ని చెప్పారు. ఆయన ప్రతి జిల్లానూ ప్రతి దళాన్ని సందర్శించారు. ఆయన జిల్లాకు వచ్చినప్పుడు కనీసం 15 రోజుల పాటు జిల్లా మొత్తం పర్యటించేవారు. సిద్ధాంతాలు,రాజకీయ, ఆర్థిక, సామాజిక విశ్లేషణతో క్యాడర్‌ను ప్రజలను ఆకట్టుకునే వారు. ఈ సమయాల్లోనే మేం అతి సన్నిహితంగా చూసినప్పుడు ఎడమకన్ను గాజు కన్ను అని తెలిసింది. ఎలా ఎప్పుడు జరిగిందో తెలియదు కాని, మొహం కడుక్కునేటప్పుడు గాజు కన్ను తీసి నీటితో కడుక్కుని మళ్లీ పెట్టుకునే వారు." అంటూ మాజీ మావోయిస్టు నేత ఒకరు వెల్లడించారు. ఒకట్రెండు సంవత్సరాలనుంచే చెరుకూరి రాజ్‌కుమార్ పేరు అజాద్‌గా వినపడుతోంది. అంతకుమందు ఉద్యమంలో ఎక్కువగా గంగాధర్, ఉదయ్ పేర్లతోనే ఆయన తిరిగేవ వారని తెలుస్తోంది.

Eenadu.net
04-07-2010
వరంగల్, న్యూస్ టుడే. 04-07-2010

అగ్రనేతలే టార్గెట్ చర్చల తరువాత మారిన పోలీసుల వైఖరి

అరెస్టులు, లొంగుబాట్లు కోవర్టులు

రాష్ట్రంలో మావోయిస్టు పార్టీకి వరుస ఎదురు దెబ్బలు

ఐదేళ్లలో నేలకొరిగిన కీలక నేతలు
(హైదరాబాద్ ) అగ్రనేతలే టార్గెట్.. 'ఎన్‌కౌంటరే' లక్ష్యం! మావోయిస్టు పార్టీ అగ్ర నాయకుల విషయంలో కొన్నాళ్లుగా పోలీసులు అనుసరిస్తున్న వ్యూహమిది. ఒకరి తర్వాత మరొకరుగా మావోయిస్టు అగ్రనేతలను వ్యూహాత్మకంగా మట్టుబెడుతున్నారు.

వివిధ ఎన్‌కౌంటర్లలో మాధవ్ నుంచి శాఖమూరి అప్పారావు, పటేల్ సుధాకర్‌రెడ్డి, ఎంఆర్, టెక్ రమణ, జయకుమార్, సందే రాజమౌళి తదితర అగ్రనేతలను పోలీసులు కాల్చి వేశారు. శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు దళపతి గణపతి తర్వాతి స్థానంలో ఉన్న ఆజాద్ నేలకొరిగారు. వరుస ఎన్‌కౌంటర్లతో కీలక నేతలను కోల్పోతున్న మావోయిస్టు పార్టీకి ఆజాద్ మరణం శరాఘాతమే.

ప్రభుత్వంతో 2005లో జరిపిన చర్చలు విఫలమైనప్పటి నుంచీ మావోయిస్టు పార్టీ రాష్ట్రంలో పలువురు కీలక నేతలను పోగొట్టుకుంది. అనేకమంది ముఖ్య నేతలు ఎన్‌కౌంటర్లలో నేలకొరిగారు. పదుల సంఖ్యలో మావోయిస్టు నేతలు లొంగిపోయారు.

చర్చల ప్రతినిధులుగా వచ్చిన వారినీ పోలీసులు వదిలిపెట్టలేదు. చర్చలు విఫలమైన తర్వాత పోలీసుల వ్యూహం మారింది. చిన్నాచితకా మావోయిస్టులను వదిలేసి.. వారిలో కొందరిని తమకు అనుకూలంగా మార్చుకుని లొంగుబాట్లను ప్రోత్సహించారు. మరికొందరిని అరెస్టులతో కట్టడి చేశారు. పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న అగ్రనేతల కదలికలపై కన్నేశారు.

వారి కదలికలను నిత్యం గమనిస్తుండే ఎస్ఐబీలోని సిబ్బంది నెలల తరబడి గాలింపులు జరిపారు. కేంద్ర, రాష్ట్ర స్థాయి నాయకుల సమాచారం అందిన వెంటనే అప్రమత్తమై.. తమకు దొరికిన వారిని అదుపులోకి తీసుకుని.. పార్టీ సమాచారం కోసం చిత్రహింసలకు గురిచేసి ఆ తర్వాత కాల్చి చంపుతున్నారని ప్రజా సంఘాలు విమర్శిస్తున్నాయి.

గత ఐదేళ్లలో నేలకొరిగిన అగ్రనేతలు
2005: వరంగల్ జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు పార్టీ నార్త్ తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు డీవీకే స్వామి అలియాస్ యాదన్న మరణించారు.

2006: మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి మాధవ్ అలియాస్ బుర్ర చిన్నయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు ఓబులేసు అలియాస్ సాగర్, మట్టం రవికుమార్, సుదర్శన్ అలియాస్ సామల వెంకటేశం, ఖమ్మం డివిజనల్ కమిటీ కార్యదర్శి జగదీష్, కడప, అనంతపురం డివిజనల్ కమిటీ కార్యదర్శి సాధు రమేశ్‌రెడ్డి అలియాస్ రమేశ్, దండకారణ్య డివిజనల్ కమిటీ కార్యదర్శి ఇ.మల్లయ్య, కరీంనగర్ ఈస్ట్ డివిజన్ కార్యదర్శి అల్వాల సారయ్యలు వివిధ ఎన్‌కౌంటర్లలో మరణించారు.

2007: అనంతపురం జిల్లా ధర్మవరం రైల్వే స్టేషన్ వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో కేంద్ర కమిటీ సభ్యుడు, కర్ణాటక వ్యవహారాల ఇన్‌చార్జి సందే రాజమౌళి అలియాస్ మోగిలి, మేడారం అటవీ ప్రాంతంలోని తాడ్వాయి వద్ద జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో రాష్ట్ర కమిటీ సభ్యుడైన చిట్టిరాజ పాపయ్య అలియాస్ సోమన్న మరణించారు.

2008: ఈ ఏడాది పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవ హరించి ఐదుగురు అగ్రనేతలను ఒకేచోట పట్టుకుని వేర్వేరు ప్రాంతాల్లో ఎన్‌కౌంటర్లలో మట్టుబెట్టారు. మావోయిస్టు పార్టీ ప్రకటనలను పత్రికలకు విడుదల చేయడంలో కీలక పాత్ర పోషించిన ఏపీ స్పెషల్ కమిటీ సభ్యుడు మస్తాన్‌రావు అలియాస్ ఎంఆర్, రాష్ట్ర కమిటీ కొరియర్ జయకుమార్‌లను విజయనగరంలో, ఇదే కమిటీకి సంబంధించి రాష్ట్ర స్థాయి సభ్యులైన తోట గంగాధర్, టెక్ జయమ్మలను గుంటూరు జిల్లాలో కాల్చివేశారు.

వీరితోపాటు పోలీసులకు పట్టుబడ్డాడని ప్రజాసంఘాలు ఆరోపించిన మీసాల ప్రభాకర్‌ను వారం తర్వాత గుంటూరు జిల్లాలో జరిపిన మరో ఎన్‌కౌంటర్‌లో కాల్చేశారు. ఛత్తీస్‌గడ్ సమీపంలోని పామేడు వద్ద మూడు రోజులపాటు జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఖమ్మం జిల్లా కార్యదర్శి మాటూరి యాదగిరితోపాటు మొత్తం 17 మంది చనిపోయారు.

వరంగల్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ మిలటరీ వ్యవహారాల నిపుణుడు, మహారాష్ట్ర కమిటీ సభ్యుడైన గాజర్ల సారయ్య, మిలటరీ ప్లటూన్ కమాండర్ అరుణ ప్రాణాలు వదిలారు.

విశాఖపట్నం జిల్లాలో జరిగిన మరో కీలక ఎన్‌కౌంటర్‌లో ఆంధ్ర ఒడిషా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి సంతోష్, కంపెనీ కమాండర్ కామరాజు అలియాస్ రణదేవ్, సెక్షన్ కమాండర్ కోర్రా చిన్నమణి, మరో కంపెనీ కమాండర్ అశోక్ మరణించారు.

2009: వరంగల్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో రాష్ట్ర కమిటీ సభ్యుడు పటేల్ సుధాకర్‌రెడ్డి, టెక్ నిపుణుడు, రాష్ట్ర కమిటీ సభ్యుడు కనుగుల వెంకటయ్యలను మట్టుబెట్టారు. ప్రకాశం జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో యాక్షన్ కమిటీ సభ్యుడైన గోవిందనాయక్ అలియాస్ సంజీవ్ మరణించారు.

2010: ఈ ఏడాది మార్చిలో ప్రకాశం, వరంగల్ జిల్లాల్లో జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో రాష్ట్ర కమిటీ సభ్యుడైన శాఖమూరి అప్పారావు, టెక్ రమణ అలియాస్ సోలిపేట కొండల్‌రెడ్డిలను మట్టుబెట్టారు. ఈ ఎన్‌కౌంటర్ జరిగిన వారం రోజులకే చెరుకూరి రాజ్‌కుమార్ అలియాస్ ఆజాద్‌ను పోలీసులు పట్టుకున్నట్లు ప్రచారం జరిగింది. రాజ్‌కుమార్ తల్లి కరుణ చివరకు హైకోర్టును ఆశ్రయించారు కూడా. 

విప్లవాల బాటసారి

విద్యార్ధి దశ నుంచే ఉద్యమంలోకి
ఆర్ఎన్‌యూ వ్యవస్థాపకుల్లో ఒకరు
31 సంవత్సరాలుగా అజ్ఞాత జీవితం
మావోయిస్టు పార్టీలో అగ్రస్థానం
ఓరుగల్లులో ఉద్యమ పాఠాలు
కొండపల్లితో సాహచర్యం
ఇదీ ఆజాద్ ప్రస్థానం

మూడు దశాబ్దాల అజ్ఞాత జీవితం, మూడు వందలకుపైగా కేసులు, సంచలనాత్మక దాడులకు వ్యూహం, తలపై 12 లక్షల రూపాయల వెల! అన్నీ కలిపితే ఒక ఆజాద్! ఆయనే చెరుకూరి రాజ్ కుమార్!

ప్రధాని మన్మోహన్ సింగ్‌కు గుణపాఠం చెబుతామని హెచ్చరించినా, హోంమంత్రి చిదంబరాన్ని భారత హిట్లర్‌గా అభివర్ణించినా, పాలకులే అసలైన టెర్రరిస్టులంటూ తెగనాడినా... ఆ ప్రకటన చివర్లో 'ఆజాద్' సంతకం కనిపిస్తుంది.

కేంద్ర కమిటీ సభ్యుడైన ఆయన మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి. మావోయిస్టు దళపతి గణపతికంటే ముందుగా ఆజాద్ కేంద్ర కమిటీ సభ్యుడు! ఇప్పుడు... గణపతి తర్వాత ఆయనే అగ్రనాయకుడు. ఆజాద్ జీవితం ఉద్యమానికి అంకితం. ఆయన మరణం మావోయిస్టు పార్టీకి శరాఘాతం.

( న్యూస్‌నెట్‌వర్క్) కృష్ణా జిల్లాకు చెందిన చెరుకూరి లక్ష్మయ్య చౌదరి, కరుణ దంపతుల కుమారుడు రాజ్ కుమార్. కోస్తాలో పుట్టిన ఆయన చదువుల కోసం తెలంగాణ వచ్చారు. కోరుకొండ సైనిక స్కూల్‌లో చదువు అనంతరం... వరంగల్‌లోని రీజినల్ ఇంజనీరింగ్ కాలేజీ (ఆర్ఈసీ)లో బీటెక్‌లో చేరారు. అక్కడ ఆయన ఉద్యమ పాఠాలూ నేర్చారు.

సౌమ్యుడిగా కనిపించినప్పటికీ... అన్యాయాలపై తీవ్రంగా స్పందించేవారు. ఆజాద్ ఆర్ఈసీలో చదువుతున్న సమయంలోనే కొండపల్లి సీతారామయ్య కాజీపేటలోని ఫాతిమా స్కూల్‌లో హిందీ పండిట్‌గా, కేజీ సత్యమూర్తి సెయింట్ గ్యాబ్రిల్ స్కూలులో ఇంగ్లీష్ మాస్టర్‌గా పని చేసేవారు. వీరితో ఆజాద్‌కు సాన్నిహిత్యం పెరిగింది. మరో నక్సల్ నేత సూరపనేని జనార్దన్ అందించిన స్ఫూర్తి తోడైంది.

ఈ క్రమంలోనే 1974లో రాడికల్ విద్యార్థి సంఘం (ఆర్ఎస్ యూ) ఏర్పాటయింది. దాని వ్యవస్థాపక సభ్యుల్లో రాజ్ కుమార్ ఒకరు. చదువుకుంటూనే జిల్లాలో ఆర్ఎస్‌యూ విస్తరణకు కృషి చేశారు. మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచనా విధానాలకు సంబంధించిన అత్యంత క్లిష్టమైన అంశాలను సహ విద్యార్థులకు సులువుగా వివరించేవారు. 1975లో ఎమర్జెన్సీ సమయంలో పోలీసులు రాజ్‌కుమార్‌ను అరెస్టు చేశారు.

కొన్నాళ్లకు బెయిల్‌పై విడుదలైన తర్వాత ఆయన తన ఉద్యమ ప్రణాళికను ముమ్మరం చేశారు. పోలీసులు 1978లో మరోమారు ఆయనను అరెస్టు చేశారు. ఆయన 1979లో జైలు నుంచి విడుదలయ్యారు. అప్పటికి ఆయన ఆర్ఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు. అప్పుడే... అజ్ఞాతంలోకి వెళ్లారు. పీపుల్స్‌వార్‌లో భాగస్వామి అయ్యారు.

కొండపల్లి సీతారామయ్య, ముక్కు సుబ్బారెడ్డి తదితర నాయకులతో సమానంగా పార్టీ కోసం పని చేశారు. 'ఆజాద్'గా మారారు. దళ కమాండర్‌గా, రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, మిలటరీ కమిటీ సభ్యుడిగా, కర్ణాటక ఇన్‌చార్జిగా వ్యవహరించారు. మరణించే నాటికి ఆయన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు. సిద్ధాంత వ్యూహకర్తగా ఆజాద్ అగ్రస్థానంలో ఉన్నారు. కోబాడ్ గాంధీ అరెస్టు తర్వాత ఆయనే కీలకమయ్యారు.

పార్టీకి సంబంధించిన రచనలు, సిద్ధాంతాల రూపకల్పనలోనే నిమగ్నమయ్యేవారు. అధికార ప్రతినిధిగా పార్టీ భావ జాలాన్ని మీడియాకు అందజేసేవారు. రెడ్ కారిడార్‌లోని తొమ్మిది రాష్ట్రాల కమిటీలను సమన్వయపరుస్తూ, పార్టీలో జరుగుతున్న పరిణామాలను, ఇతర విషయాలను కేంద్ర కమిటీ దృష్టికి తీసుకెళ్లేవారు. ఆజాద్ భార్య పద్మ కూడా మావోయిస్టులో పార్టీలోనే ఉన్నారు.

విశాఖతో బంధం...
వరంగల్‌లో బీటెక్ అనంతరం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంటెక్ చేయడానికి 1978లో ఆజాద్ విశాఖ వచ్చారు. అక్కడ కూడా విద్యార్థి ఉద్యమం బలోపేతంపైనే ప్రధానంగా దృష్టి సారించారు. అజ్ఞాతంలో ఉంటూనే 1980 నుంచి 1983వ సంవత్సరం వరకు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో విస్తృతంగా పర్యటించారు. ఉత్తరాంధ్రలో విద్యార్థి ఉద్యమం బలపడటానికి ఆజాద్ కృషే కారణమని చెబుతారు.

విశాఖ ఉక్కు ఉద్యమం, సిటీ బస్సుల జాతీయికరణ కోసం సాగిన పోరాటంలో ఆజాద్ చురుకుగా పాల్గొన్నారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోనూ ఆర్ఎస్‌యూ విస్తరణలో ఆజాద్ పాత్ర ఉంది. రాడికల్ విద్యార్థి సంఘం తొలి తరం నాయకులే ఇప్పుడు మావోయిస్టు కేంద్ర స్థాయి నాయకులుగా కొనసాగుతుండటం గమనార్హం. ఇది ఆర్ఎస్‌యూను ఆజాద్ ఎంత బలంగా నడిపారో చెప్పేందుకు నిదర్శనమని అంటారు.

కుటుంబ ప్రస్థానం...
రాజ్‌కుమార్ కుటుంబానికి కృష్ణా జిల్లా పెద్దపారుపూడి మండలం యలపర్రు, మొవ్వ మండలం పెడసనగల్లు, పమిడిముక్కల మండలం పెనుమత్స, కృష్ణాపురం, నూజివీడు పట్టణాలతో సంబంధాలున్నాయి. ఆజాద్ కృష్ణాపురంలోగానీ, నూజివీడులోగానీ జన్మించి ఉండవచ్చని చెబుతారు. ఆజాద్ తండ్రి మిలిటరీలో పని చేశారు.

లక్ష్మయ్య తండ్రి వెంకటరత్నం హోటల్ నడిపారు. ఆ తర్వాత ఈ హోటల్ బాధ్యతలను లక్ష్మయ్య చేపట్టారు. 1959లో ఆ హోటల్‌ను బావమరిది యలమంచిలి సుబ్బారావుకు అప్పగించి హైదరాబాద్‌కు వచ్చేశారు. కాచిగూడ పోలీస్ స్టేషన్ ఎదుట త్రివేణి హోటల్ అండ్ లాడ్జిని ఏర్పాటు చేశాడు. ప్రస్తుతం వారి కుటుంబం మూసారాంబాగ్‌లో స్థిరపడింది.

ఆజాద్ అజ్ఞాతంలో ఉండగా... 1977 నుంచి మూడేళ్లపాటు విజయవాడలోని మాచవరంలోని జమీందార్ హాస్టల్‌లో ఉన్నట్లు సమాచారం. సాగర్ అలియాస్ చలం, బాలశౌరితో కలిసి ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ కాలేజీలో ఆర్ఎస్‌యూను స్థాపించారు.
http://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2010/jul/3/main/3main16&more=2010/jul/3/main/main&date=7/3/2010

మార్క్సిజం పుట్టుక పరిణామం, మానవ స్వభావం, సోషలిజం అనివార్యత

మానవ స్వభావంలో మార్క్సిజం లో ఇమడని లక్షణాలు ఉన్నాయని’, ‘మార్క్సిజం లో ఖాళీలున్నాయనీ‘, “మార్క్సు చూడనిది మానవ స్వభావంలో ఏదో ఉందని ఇలాంటిభావాలు మానవ హక్కుల సంఘం నేత బాలగోపాల్ గారు ఒక ధీసిస్ లాంటిది రాశారు. అప్పటివరకూ ఆయన పౌరహక్కుల సంఘం నాయకుడుగా ఉంటూ పీపుల్స్ వార్ పార్టీతోసంబంధాలు కలిగి ఉన్నారు. దానినుండి బైటికి వచ్చి ఆయన మానవ హక్కుల సంఘం పెట్టారు. పౌర హక్కుల…” నుండి మానవ హక్కుల…” అనే కాన్సెప్ట్ కి మారడం వెనక ఆయన మారిన అవగాహన ఉంది. అదొక సంగతి.

బాల గోపాల్ గారు రాసిన ధీసిస్ పైన రంగనాయకమ్మ గారు విమర్శ లేదా మార్క్సిస్టు దృక్పధంతో సమాధానం రాశారు. ఆవిడ రాసిన పుస్తకం పేరు కొండను తవ్వి ఎలకను కూడా పట్టనట్లు. బాలగోపాల్ గారు మార్క్సిజంలో తాను కనిపెట్టానని రాసిన ఖాళీలు నిజానికి ఎప్పుడో చర్చించబడ్డ అంశాలేననీ, వాటినే కొత్తగా బాలగోపాల్ తెచ్చారనీ సవివరంగా చర్చించి ఆయన వాదనలోని ఖాళితనాన్ని ఆవిడ తన పుస్తకంలో రుజువు చేశారు. దానికి బాలగోపాల్ గారు సమాధానం ఇవ్వలేదు. ఇవ్వడానికి కూడా ప్రయత్నించలేదు. నేను ఒకసారి ఓ చోట కలిసినపుడు (పరిచయం లేదు లెండి) రంగనాయకమ్మగారి విమర్శకి సమాధానం రాస్తున్నారా అని అడిగాను. దానికాయన ఎందుకు లెండి. నేను రాస్తే ఆవిడ ఇంకొకటి రాస్తుంది. ఎందుకదంతా?” అని కొట్టిపారేశారు. మార్క్సిజంలో ఆయన కనిపెట్టిన ఖాళీల ఖాళీతనం అలా ఉంది. బాలగోపాల్ గారు తనకు తట్టింది అలా పుస్తకాలుగా రాయడం, దానిపైన విమర్శలు రావడం, విమర్శలకు ఆయన జవాబులు ఇవ్వకపోవడం అప్పట్లో మామూలు సంగతి.
ఒక ధీసిస్ లాంటిది ఆయన రాసి పడేశాక దానిపైన విమర్శలు వస్తే సమాధానం తప్పనిసరిగా ఇవ్వలని ఆయన భావించకపోవడం విచిత్రం. ధీసిస్ లాంటిది అనిఎందుకంటున్నానంటే, మార్క్సిజం గురించి పైపైన తెలిసినవారికి, లేదా పూర్తిగా అవగాహన లేక పోయినా బాగా తెలుసు అనుకుంటున్నవారికి అది ధీసిస్ లాగా కనిపిస్తుంది. కాని మార్క్సిజం ని సరిగ్గా అర్ధం చేసుకున్నవారికి అది ధీసిస్ కాదని, తలా తోకా లేని ఆలోచనల కలబోత అని అర్ధం అవుతుంది. లేదా ఆ విమర్శలో మార్క్సిజంలోనే సమాధానం ఉందన్న విషయం అర్ధం అవుతుంది. నేను గతంలో రాసినట్లు మార్క్సిజం తమకు తెలుసునని భావిస్తూ నిజానికి దానిగురించి సరైన అవగాహన లేనివారు చాలామంది ఉన్నారు. వారికి బాలగోపాల్ వాదనలు గొప్ప ధీసిస్ లాగా అనిపించేవి. మార్క్సిజాన్ని సరిగా అర్ధం చేసుకోవడంలో వైఫల్యం జరిగినపుడు సహజంగానే అందులో ఏదో ఖాళీ ఉన్నట్లు కనిపిస్తుంది. ఆ ఖాళీని ఖాళీ కాదని చూపిస్తూ, మార్క్సిజం మాటల్లొ చెప్పినపుడు దానికి తిరిగి సమాధానం రాయాల్సిన బాధ్యత బాలగోపాల్ పైన ఉన్నా ఆయనా పనికి పూనుకోలేదు.
మార్క్సిజం అద్దాలతో సమాజాన్ని, అందులోని సమస్యలను చూడడం అంటే ఏమిటి? ఏది ముందు? ఏది వెనక?
సమాజాలు మారుతూ వచ్చాయి. విఫ్లవాల ద్వారా ఆ మార్పులు జరుగుతూ వచ్చాయి. మరోపక్క శాస్ర సాంకేతిక రంగంలో జివ శాస్త్రంలో డార్విన్ జీవపరిణామ సిద్ధాంతం,భౌతిక శాస్త్రంలొ శక్తి నిత్యత్వ సూత్రం, సామాజిక శాస్త్రంలొ ఫ్రెంచి ఫ్యూయర్ బా సోషలిస్టు భావాలు, తత్వ శాస్త్రంలో జర్మన్ హెగెల్ గతి తర్కం ఇవన్నీ అప్పటికీ అభివృద్ధి చెంది ఉన్నాయి. వీటిలో వేటినీ మార్క్సు కనిపెట్టలేదు. కాని అవన్నీ మార్క్సిజానికి ప్రాణవాయువులుగా ఉపయోగపడ్దాయి. ఎంతగా ఉపయోగపడ్డాయంటే అవి లేకుండా మార్క్సిజం లేదు. ఏంగెల్స్ మార్క్సిజం పుట్టుకను గురించి వ్యాఖ్యానిస్తూ కాలం గర్భంతో ఉండి మార్క్సుని కన్నది అని అంటాడు. అంటే అప్పటికి మార్క్సిజం పుట్టడానికి కావలసిన పరిస్ధితులన్నీ మానవ సమాజంలో ఏర్పడి ఉన్నాయని అర్ధం. ఆ పరిస్ధితులు ఏర్పడకపోయినట్లయితే మార్క్స్ మిగతా మనుషుల్లాగే పుట్టి గిట్టేవాడు. కాకపోతే తత్వ శాస్త్రంలోమరొక పుస్తకం రాసి ఉండేవాడు కాని మార్క్సిజం పుట్టి ఉండేది కాదు.
క్కడ చెప్పదలుచుకున్నది మార్క్సిజం, మార్క్సిజం కోసమో లేక అప్పటికి చాలా సిద్ధాంతాలు ఉన్నాయి కనుక తానూ ఒక సిద్ధాంతం సృష్టించాలని మార్క్స్ కి ఉన్న ఉబలాటం వల్లనో పుట్టలేదు. మార్క్సిజం జన్మించడానికి అప్పటికి ఒక చారిత్రక అవసరం ఏర్పడి ఉంది. ఆదిమ కమ్యూనిస్టు వ్యవస్ధ, బానిస వ్యవస్ధగానూ, బానిస వ్యవస్ధ ఫ్యూడల్ వ్యవస్ధగానూ, ఫ్యూడల్ వ్యవస్ధ పెట్టుబడిదారీ వ్యవస్ధగానూ అభివృద్ధి చెందింది. పెట్టుబడిదారీ వ్యవస్ధ లో వైరుధ్యాలు తీవ్రమై సంఘర్షణ జరుగుతున్న కాలం అది. అటువంటి ఒక సంఘర్షణ ఫలితంగా పారిస్ కమ్యూన్ పుట్టింది (పారిస్ ని కార్మికులు సాయుధంగా వశం చేసుకుని రెండు నెలలకు పైగా తమను తాము పాలించుకున్నారు. అది పారిస్ కమ్యూన్ గా చరిత్రలో రికార్డయ్యింది). పారిస్ కమ్యూన్ కూడా మార్క్సిజం లోని ఒక అంశాన్ని అభివృద్ధి చేయడానికి తోడ్పడింది.
అంటే మార్క్సిజం అనేది కేవల కారల్ మార్క్స్ బుర్రలో మాత్రమే పుట్టింది కాదు. అది అప్పటి సమాజంలో పరిపక్వానికి వచ్చిన సామాజిక, ఆర్ధిక, రాజకీయ పరిస్ధితులనుండి పుట్టింది. అప్పటి సామాజిక, రాజకీయ, ఆర్ధిక పరిస్ధితుల ఉమ్మడి ప్రభావం, కారల్ మార్క్స్ మెదడు లో ప్రతిబింబించి మార్క్సిజంగా జనించింది. (భావాలు ఎలా పుడతాయి? అని ప్రశ్నించుకుంటే, మనిషి చుట్టూ ఉన్న సామాజిక పరిస్ధితుల ప్రతిబింబాలే మెదడులో భావాలుగా జనిస్తాయి అని సమాధానం చెప్పుకుంటాము. అదే నేనిక్కడ చెబుతున్నాను. నా సొంత సిద్ధాంతం కాదిది.) కానీ మార్క్స్ కే ఎందుకు తట్టింది? మరో పుల్లయ్యకి ఎందుకు తట్టలేదు? ఎందుకంటే, కారల్ మార్క్స్ అప్పటికి తత్వశాస్త్ర పరంగా హెగెల్ అనుచరుడుగా ఉన్నాడు. హెగెల్ నిజానికి భావవాది. కాని మార్క్సు ఫ్యూయర్ బా నుండి సోషలిస్టు భావాజాలం అందిపుచ్చుకున్నాక హెగెల్ తత్వంలోని గతి తర్కాన్ని దానికి జోడించగలిగాడు. హెగెల్ తత్వ శాస్త్రం లేనట్లయితే మార్క్సుకి ఫ్యూయర్ బా భౌతిక వాద సోషలిజం అందినా వృధా అయి ఉండేది. పద్దెనిమిది సంవత్సరాల వయసులోనే మార్క్సు హెగెల్ కి శిష్యుడు. తన చుట్టూ అభివృద్ధి చెందిన వివిధ శాస్త్రాల సిద్ధాంతాలను ఫ్యూయర్ బా భౌతికవాదానికి అన్వయించినపుడు హెగెల్ గతి తర్కం తలకిందులుగా ఉన్న అంశాన్ని మార్క్సు గ్రహించాడు. ఈ గమనింపు అత్యంత ముఖ్యమైనది. తలకిందులుగా ఉన్న హెగెల్ గతి తర్కాన్ని యధాస్ధానానికి తెచ్చి ఫ్యూయర్ బా బౌతికవాదానికి అన్వయించి, అప్పటికి అభివృద్ధి చెందిన శక్తి నిత్యత్వ సూత్రమూ, డార్విన్ పరిణామ సిద్ధాంతమూ తదితర శాస్త్ర ఆవిష్కరణలను, తన చుట్టూ ఉన్న సామాజికార్ధిక రాజకీయ పరిస్ధితుల వెలుగులో పరిశీలించిన మార్క్సు గతితార్కిక భౌతికవాద తత్వ శాస్త్రాన్ని ఆవిష్కరించాడు.
ఈ ఆవిష్కరణ జరిగాక మార్క్సు ఇక ఎంత మాత్రమూ హెగెల్ శిష్యుడిగా లేడు. పైగా హెగెల్స్ తత్వ శాస్త్రానికి పూర్తిగా భిన్న ధృవమైన అత్యంత మౌలికమైన, ఆధునిక తత్వ శాస్త్రానికి పరమ మూలమైన గతితార్కిక భౌతిక వాద తత్వ శాస్త్రానికి సృష్టికర్తగా నిలిచాడు. గతితార్కిక భౌతికవాద సిద్ధాంతాన్ని సామాజిక పరిణామాలకి అన్వయించి చారిత్రక భౌతికవాద సిద్దాంతాన్ని ఆవిష్కరించాడు. తన తాత్విక చింతనను ఆర్ధిక వ్యవస్ధ పునాదులకి అన్వయించి “దాస్ కేపిటల్” రచించాడు. దాస్ కేపిటల్ రచించడానికి మార్క్సుకి తోడ్పడిన ముఖ్యమైన అంశం మరొకటుంది. అది బ్రిటన్ పెట్టుబడిదారీ విధానం. బ్రిటన్‌లో పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి చెందకపోయినట్లయితే కారల్ మార్క్స్ చేతి నుండి “దాస్ కేపిటల్” మనకి అంది ఉండేది కాదు. దాస్ కేపిటల్ లో కారల్ మార్క్సు కనిపెట్టిన అతి ముఖ్యమైన అంశం అదనపు విలువ‘. పెట్టుబడిదారీ వ్యవస్ధ ఇలా ఉంది ఇతర ఆర్ధికవేత్తలు కూడా కొంత తేడాలతో చెప్పినా, మార్క్స్ దర్శించిన అదనపు విలువను మిగిలిన వారు చూడలేకపోయారు. ఎందుకంటే వారికి గతితార్కిక భౌతికవాద తాత్విక భూమిక లేదు గనక.
అప్పటివరకూ తత్వవేత్తలు తత్వశాస్త్రాన్ని పండితులకే పరిమితమైన శాస్త్రంగా భావించేవారు. జీవిత కాలమంతా కాచివడపోసి ఉన్న మహా పండితులు మాత్రమే చర్చించుకునే శాస్త్రంగా భావించేవారు. కాని కారల్ మార్క్సు ఆ తత్వ శాస్త్రం మెడపట్టి లాక్కొచ్చి కార్మికవర్గానికి పాదాక్రాంతం చేశాడు. తత్వ శాస్త్రాన్ని కార్మిక వర్గానికి పాదాక్రాంతం చేయడం అంటే మాటలు కాదు. సమాజంలో తొంభైతొమ్మిది మందికి అర్ధం కాని శాస్త్రంగా, పడక్కుర్చీ పండితులకే పరిమితమైన శాస్త్రంగా మన్ననలందుకుంటున్న తత్వ శాస్త్రాన్ని అసలు ఉపయోగపెట్టవలసింది తొంభైతొమ్మిది మంది కష్టించి పనిచేసే వారి కోసమని కారల్ మార్క్స్ నిర్ద్వంద్వంగా నిరూపించాడు. తత్వశాస్త్రానికి ఉన్న పండిత, మేధో బంధనాలని ఒక్క ఉదుటున తెంచి కార్మిక వర్గ కాళ్ళపై పడవేసిన కారల్ మార్క్స్ బహుధా అభినందనీయుడు. సర్వకాల సర్వావస్ధలందు కూడా స్మరణీయుడు. మానవ సమాజం ఉన్నంత కాలం మనిషి శ్రమ చేయవలసిందే. శ్రమ చేయకుండా ఈ ప్రపంచంలో ఒక్క పూచిక పుల్ల కూడా నడిచిరాదు. అటువంటి శ్రామికులని ఈసడించుకుంటూ, శాస్త్రాల పరిజ్ఞానాన్ని తమ సొత్తుగా భావిస్తూ వచ్చిన కులీన వర్గ పండితుల విశ్వాసాలను మార్క్సు బదాబదులు చేస్తూ శ్రమకి అగ్రపీఠాన్ని అందించాడు.
మధ్య యుగాలలొ కులవ్యవస్ధ బలిష్టంగా ఉన్న కాలంలో మెడకు ముంత, మొలకు తాటాకు కడితే తప్ప రోడ్డు మీదకి పంచములని రానీయని వ్యవస్ధ ఉన్న కాలంలో ఒక పంచముడికి, దేశ దేశాల రాజులు వశం చేసుకోవాలని పోటీపడుతున్న ఒక అందమైన సుకుమారమైన బ్రాహ్మణ యువతిని (దురుద్దేశం ధ్వనిస్తే అది నాది కాదని విన్నవించుకుంటున్నాను) ఇచ్చి పెళ్ళి చేయడం సాధ్యమవుతుందేమో ఒక్క సారి ఊహించండి! అటు సూర్యుడు ఇటు పొడవచ్చు గాక! మన్నూ మిన్నూ ఏకం కావచ్చుగాక! సాగరములన్నియు ఏకము కావచ్చును గాక! అది మాత్రం సాధ్యం అయి ఉండేది కాదు. కానీ కారల్ మార్క్సు దాన్ని సుసాధ్యం చేశాడు. కులీనుల పడక్కుర్చీ మేధావుల చర్చలలో ఓలలాడే తత్వశాస్త్ర సామ్రాజ్యానికి కార్మికవర్గాన్ని పట్టాభిషిక్తుడిని చేయడం దానితో సమానంగా భావించవలసి ఉంది.
సరే, ఈ క్రమాన్ని బట్టి మనకు అర్ధమవుతున్నదేమిటి? కారల్ మార్క్స్ తన సిద్ధాంతాన్ని ప్రకటించేనాటికి సామాజిక, ఆర్ధిక, రాజకీయ వ్యవస్ధ లో ఉన్న పరిస్ధుతులనుండే మార్క్సిజం పుట్టింది. ఇక్కడ ఏది ముందు? సమాజం ముందు. దాని తర్వాతే మార్క్సిజం. కారల్ మార్క్సు ఒక ఆదర్శవంతమైన సమాజాన్ని ఊహించుకుని దానికి అనుగుణంగా తన సిద్దాంతాన్ని తయారు చేయలేదు. సామాజిక వ్యవస్ధల పరిణామాన్ని ఆయన పరిశీలించాడు. ఒక వ్యవస్ధ నుండి మరొక వ్యవస్ధ మారిన క్రమాన్ని పరిశీలించాడు వ్యవస్ధలు విప్లవాల ద్వారా మారుతున్న క్రమాన్ని పరిశీలించాడు. ఏయే విప్లవాలకు ఏయే ఆర్ధిక వర్గాలు నాయకత్వం వహించాయో, ఏయే ఆర్ధిక వర్గాలు వారికి సహకరించాయో పరిశీలించాడు. విప్లవాల అనంతరం ఏర్పడిన నూతన సమాజాల గతిని పరిశీలించాడు. ఆ గతి వెళ్తున్న మార్గాన్ని గమనించాడు. వ్యవస్ధలను పైపైన మాత్రమే చూడకుండా వ్యవస్ధ నిలబడడానికి మూలకారకులైన వర్గాలెవరో గమనించాడు. వ్యవస్ధ నిలబడడానికి మూలమైన వర్గాల పరిస్ధితినీ, మూలంగా లేకపోయినా వ్యవస్ధనంతటినీ గుప్పెట్లో పెట్టుకున్న వర్గాలేవిటో గ్రహించాడు. విప్లవాలలో వారి పాత్రను చూశాడు. బానిస వ్యవస్ధల నుండి పారిస్ కమ్యూన్ వరకూ ప్రతి విప్లవాన్నీ, ప్రతి సామాజిక పరిణామానికి ఆద్యులెవరో, చివరికి పై స్ధానానికి చేరిందెవరూ చూశాడు. ఈ పరిణామాలన్నింటిలోనూ దండలో దారంలాగా ఒక క్రమాన్ని గమనించాడు కారల్ మార్క్సు. అ క్రమంలోనే తానున్న వ్యవస్ధ తదుపరి ఏ రూపంలోకి మారుతుందో అంచనా వేశాడు. అలా వేసిన అంచనాయే సామ్యవాద వ్యవస్ధ.
ముందు వెళ్ళినవారు ఎటువైపు వెళ్లారో కనుక్కొవడానికి వెనక వచ్చేవారు ఏం చేస్తారు? వారి కాలి జాడలను చూస్తారు. అవి ఏదిక్కుకి వెళుతున్నాయో చూస్తారు. ఆ దిక్కువైపే వెళ్ళి ముందు వెళ్ళినవారితో కలుస్తారు. కారల్ మార్క్స్ చేసిందిదే. ఆదిమ కమ్యూనిస్టు సమాజం నుండి పెట్టుబడిదారి వ్యవస్ధ వరకూ జరిగిన పరిణామక్రమాన్నీ, ఆ పరిణామాల క్రమాన్ని శాస్త్ర బద్ధంగా, జీవ, బౌతిక, రసాయన, సామాజిక, ఆర్ధిక, రాజకీయ, శాస్త్రాల ఆధారంగా గత సమాజాల అడుగుజాడల్ని పసిగట్టాడు. ఆ అడుగుజాడల ఆధారంగా సామాజిక పయనాన్ని గమనించి దాని భవిష్యత్తు గమనాన్ని చూశాడు కారల్ మార్క్సు. ఊహాలతో కాదు సుమా! పెట్టుబడిదారీ వ్యవస్ధ అభివృద్ధి క్రమంలోనే దాని తదుపరి వ్యవస్ధల తీరుతెన్నులను కూడా చూశాడు. తదుపరి వ్యవస్ధ మూలాలు పెట్టుబడిదారీ వ్యవస్ధలోనే ఉన్నాయని ఎత్తి చూపించి, దాని ప్రకారమే సామ్యవాద వ్యవస్ధ ఏర్పడుతుందని నిరూపించాడు.
అంటే సామ్యవాద వ్యవస్ధ యుటోపియా ఎంత మాత్రమూ కాదు. సామ్యవాద యుటోపియా కారల్ మార్క్స్ పుట్టక ముందరి సంగతి. దానికీ కారల్ మార్క్స్ నిరూపించిన సామ్యవాద వ్యవస్ధకే పొంతనే లేదు. సామ్యవాదం అనగానే మార్క్సుకి ముందరి యుటోపియా భావజాలాన్ని గుర్తు తెచ్చుకుని అదొక ఆదర్శవంతమైన సమాజం. అది ఊహలలోనిదే అని ఆలోచనలను అంతటితో ముగించడం మార్క్సిజం కాదు. మార్క్సిజం చెప్పిన సామ్యవాద వ్యవస్ధ, సామాజిక వ్యవస్ధలు తాము నడుస్తున్న దారిలో పయనమై వెళుతూ ఉన్న క్రమంలో ఏర్పడే అనివార్య సామాజిక పరిణామం. దానికి ఒకరి ఇష్టాఇష్టాలతో సంబంధం లేదు. ఒకరి ఊహలు ఆదర్శాలతో సంబంధం లేదు. ఒకరి చావు పుట్టుకలతో సంబంధం లేదు. మరొకరి సిద్ధాంత రాద్ధాంతాలతో అసలే సంబంధం లేదు. తూర్పున పొడిచే సూర్యుడు ఎటు అసమిస్తాడు? ప్రతి రోజూ లేచి ఈరోజు ఉత్తరాన అస్తమిస్తాడా, దక్షిణాన అస్తమిస్తాడా, లేక ఎప్పటిలా పడమట అస్తమిస్తాడా అని చర్చిస్తూ కూచుంటే, ఆ చర్చల ఫలితం కోసం సూర్యాస్తమయం ఆగదు. అది తన దారిన తాను పోతుంది.
హాలీవుడ్ దర్శకుడొకరు ఒక పరిస్ధితిని ఊహించి ది క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజిమెన్ అని సినిమా తీశాడు. అందులో హీరో  ముసలోడిగా పుట్టి పసివాడిగా చనిపోయినట్లుచూపిస్తాడు. ఆయన అది ఊహించి తీసిన సినిమా. అది చూసి ఏ జంటయినా అదెలాగొ ఉంటుందో చూద్దామను కుంటే సాధ్యమేనా? పెట్టుబడిదారీ వ్యవస్ధ శాశ్వతమని భావించడం అలాంటిదే. వ్యవస్ధలో సమస్యలు, వైరుధ్యాలన్నీ పరిష్కారం అయ్యేంతవరకూ అది ముందుకు పోతూ ఉంటుంది. ఆ గమనంలో కొన్ని సార్లు వెనకడుగులుండవచ్చు, మానవ సమాజం గనక. కాని అవి తాత్కాలికమే.
మనం ధరించే ఫ్యాంట్ ఎన్ని రూపాలు మార్చుకుందో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందాం! 1970 ల ప్రారంభ కాలంలో పురుషులు ధరించిన ఫ్యాంట్ బాగా narrow గా ఉండేది. కాలికి అంటుకు పోయినట్లుండేది. ఫ్యాంట్ విడవాలంటే ఎవరైనా కింద కూర్చుని చివర్ల పట్టుకుని లాగవలసి ఉండేది. కొన్నాళ్ళకి అది అసౌకర్యంగా తోచింది. కిందినుండి తేలికగా విడవడానికి వీలు కలిగేటట్లుగా రూపం మార్చుకుని బెల్ బాటమ్ అయింది. 70 ల దశాబ్దం రెండో అర్ధభాగానికి వచ్చేసరికి ఈ బెల్ బాటం విస్తృతంగా వాడకంలోకి వచ్చింది. కానీ అది కూడా అసౌకర్యంగా మారింది. వెడల్పైన  బెల్ బాటం నేలమీదికి రాసుకుని చినిగిపోయి అసహ్యంగా ఉండేవి. మళ్ళీ narrow వైపుకి మార్పు జరిగింది. ఈ సారిఅంతకుముందరి narrow కాకుండా మరికొంత సౌకర్యవంతంగా మారింది. పైన లూజుగా, కిందికి వచ్చేసరికి పాదాలలో సగం వరకు ఉండేలా మారింది. అంటే పాత నేరో లోని అసౌకర్యాన్ని తొలగించుకుని బెల్ బాటంగా మారిన సౌకర్యాన్ని నిలుపుకుంది. కానీ అదీ తర్వాత అసౌకర్యంగా మారి మొత్తం లూజుగా ఉండేలా పార్లల్ వచ్చింది. అది గొట్టం ఫ్యాంటులా ఉండేసరికి అది కొద్ది కాలం మాత్రమే మనగలిగింది. ఇప్పుడది బ్యాగీగా స్ధిరపడింది. పైనుండి కిందివరకూ ఏ స్ధానంలో ఎంత లూజు ఉండాలో అంతే ఉండేలా దర్జీలు ఫ్యాంటులు కుడుతున్నారు. ఈ పయనానికి ఎవరు మార్గదర్శకం? ఎవరిది పధకరచన? ఏ ఒక్కరిదీ కాదు. వస్త్రధారణకి ఒక వ్యవస్ధ మనకి తెలియకుండానే ఏర్పడిపోయింది. అదిcomfortability వైపుగా రూపం మార్చుకుంటూ వచ్చింది. సౌకర్యవంతంగా ఉండేలా రూపం మార్చుకుంటూ వచ్చింది. ఏ వ్యవస్ధకి సంబంధించిన పరిణామ క్రమాన్నైనా చూడండి మనకొక క్రమం కనిపిస్తుంది. అది సౌకర్యవంత మైన స్ధితికి దారితీస్తూ ఉంటుంది. మన హెయిర్ స్టైల్ కూడా ఇలాగే మారుతూ వచ్చిన క్రమాన్ని మనం గమనించవచ్చు.
మానవ సమాజం కూడా అంతే. సౌకర్యవంతమైన వ్యవస్ధ స్ధిరపడేదాకా వ్యవస్ధ మారుతూ ఉంటుంది. మానవ సమాజానికి సౌకర్యవంతమైనది ఏమిటి? వైరుధ్యాలు లేకపోవడమే సౌకర్యవంతం. పేద, ధనిక వ్యత్యాసాలు, పాలకుడు పాలితుదు వ్యత్యాసాలు, పట్టణం గ్రామం వ్యత్యాసాలు, శారీరక శ్రమకూ, మేధో శ్రమకీ వ్యత్యాసాలూ, మతం, కులం, ప్రాంతం,ఇలా సమస్త వ్యత్యాసాలు పరిష్కరించబడే వరకూ సమాజం మారుతూనె ఉంటుంది. కారల్ మార్క్సు ఈ మార్పులను శాస్త్ర బద్దం చేశాడు. అది మార్క్సు రచించాడు కనక మార్క్సిజం అయ్యింది. పుల్లయ్య గమనించి రచించినట్లయితే పుల్లయ్యిజం అయి ఉండేది. మార్క్సిజం అనగానే జర్మనీకి చెందిన ఒక గడ్డపాయన రాస్తే, ఎక్కడో రష్యాలో, చైనాలో విప్లవాలు వస్తే, వారిని చూసి భారతీయులు అనుకరించేది కాదు. ధామస్ ఎడిసన్ బల్బు కనిపిడితే అమెరికా వాడు విదేశీయుడు కనిపెట్టాడని వాడడం మానేస్తున్నామా? శాస్త్ర బద్ద ఆవిష్కరణ ఎవరు చేసిన ప్రపంచం అంతా దానిని వినియోగిస్తుంది. మార్క్సిజం అంతే. సామాజిక, రాజకీయ, ఆర్ధిక వ్యవస్ధ పరిణామ క్రమానికి చెందిన నియమాల సమాహారమే మార్క్సిజం. ఒక క్రమంలో పెట్టిన విజ్ఞానం, శాస్త్రంగా మారుతుంది. అలా మారిన సామాజికార్దిక రాజకీయ శాస్త్రమే మార్క్సిజం. ఆయన కాలంలో సామ్రాజ్యవాదం అభివృద్ధి చెందలేదు. అందుకని మొదటి విప్లవం బ్రిటన్ లో వస్తుందని మార్క్సు ఊహించాడు. ప్రపంచంలో పరిపక్వ దశకు వచ్చిన పెట్టుబడిదారీ వ్యవస్ధ బ్రిటన్ లోనే ఉంది గనక అక్కడే మొదటిసారి సోషలిస్టు విప్లవం సంభవిస్తుందని ఆయన భావించాడు. కాని అలా జరగలేదు. కారణం?
మార్క్సు కాలంనాటికి పూర్తిగా అభివృద్ధి చెందని సామ్రాజ్యవాద వ్యవస్ధ (ఫైనాన్సియల్ పెట్టుబడిని ఎగుమతి చేసి దానిపై పట్టుద్వారా మూడవ ప్రపంచ దేశాలని అదుపులో పెట్టుకోవడం) లెనిన్ కాలానికి అభివృద్ధి చెందింది. ప్రపంచంలో ఉన్న సామ్రాజ్యవాద దేశాలు ఒకరినొకరు సహకరించుకుంటూ గొలుసుకట్టుగా ఏర్పడ్డారనీ, ఆ గొలుసుకట్టులో ఎక్కడ లింకు బలహీనంగా ఉంటే అక్కడ మొదట సోషలిస్టు విప్లవం సంభవిస్తుందని లెనిన్ సూత్రీకరించాడు. ఆయన చెప్పినట్లే మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో రష్యా సామ్రాజ్యవాదం బలహీనపడి అక్కడ విప్లవం బద్దలైంది. చైనాకి వచ్చేసరికి అక్కడ కార్మికవర్గం సరిగా అభివృద్ధి చెందలేదు. రైతాంగం ప్రధానంగా ఉండి భూములు వారి చేతిలో కాక భూస్వాముల చేతిలో కేంద్రీకరించబడి రైతులపై దోపిడీ సాగింది. కార్మికవర్గం అభివృద్ధి చెందని వ్యవసాయక దేశాల్లో కార్మికులు రైతులు ఉమ్మడిగా నూతన ప్రజాస్వామిక విప్లవం తేవాలని మావో సూత్రీకరించి ఆ మేరకు కృషి చేసి విజయం సాదించాడు.
అంటే మార్క్సిజం మార్క్సు సూత్రీకరణల దగ్గరే ఆగిపోలేదు. వ్యవస్ధలలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అభివృద్ధి చెందింది. మార్క్సిజం, మార్క్సిజం-లెనినిజం అయ్యింది. అది మార్క్సిజం-లెనినిజం-మావో ధాట్ గా అభివృద్ధి చెందింది. మార్క్సిజం పిడివాదం అనేవారికి ఇది సమాధానం.
కనుక మార్క్సిస్టు సూత్రాలు సామాజిక పరిణామక్రమాలనుండి గ్రహించిన క్రమానుగత నియమాల సారాంశం. ఎవరు ఏ యిస్టు లైనా, ఈ సామాజిక నియమాలకి కట్టుబడి ఉండవలసిందే. నేనుండను అన్నా అది ఆచరణలో వీలు కాదు. హోళీ పండగరోజే రంగులు చల్లడానికి జనం పరిచయం లేకపోయినా అనుమతిస్తారు. కాని రోజు వచ్చి నేనీరోజు హోళీ జరుపుకుంటున్నా, రంగులు జల్లుతా అంటే జనం నాలుగిచ్చుకుంటారు. అంటే సామాజిక నియమాలకు ఒకరి ఇష్టాఇస్టాలతో నిమిత్తం లేదు. అవి జరిగిపోతుంటాయి. అయితే మనిషి చేయగల పని ఏమిటి? ఆ నియమాలను కనుగొని, పరిణామాలు ముందుకు సాగే క్రమంలో వాటిని వేగవంతం చేయడానికి తగిన చర్యలను మనిషి తీసుకోగలడు. ఏమిటా చర్యలు? విప్లవ సిద్ధికి ఒక వ్యవస్ధను ఏర్పరుచుకుని అందుకోసం కృషి చేయడం. ఆ కృషే కమ్యూనిస్టు పార్టీల ఏర్పాటు. ఆందోళనలు, ప్రజల సమీకరణ, వారి సహకారంతో సామాజిక మార్పుకు కృషి చేయడం. చేయకపోతే? ఆ పరిస్ధితి ఉండదు. మనిషి చేస్తాడు. ఎంతటి నిరాశామయ పరిస్ధితిలోనయినా మనిషి ప్రయత్నిస్తూనే ఉంటాడు. లేకుంటే సౌకర్యవంతమైన స్ధితి రాదు.
ఇప్పటి సామాజిక మార్పులు ఒక జీవిత కాలంలో సాద్యం కాకపోవచ్చు. ఇపుడున్నవారు తమ కృషితాము చేస్తే తరువాతివారు అక్కడినుండి కృషిని అందుకుంటారు. ప్రజలు పూనుకోవడానికి కొన్ని సామాజిక పరిస్ధితులు కూడ అవసరమే. ఇప్పటి పరిస్ధితులు అందుకు పూర్తిగా అనుకూలంగా ఉన్నాయని మార్క్సిస్టు లెనినిస్టులు భావిస్తున్నారు. కాని స్వీయాత్మక పరిస్ధితులు సిద్ధంగా లేవు. అంటే మార్పుని తలపెట్టాల్సిన కార్మిక వర్గం ఐక్యంగా లేదు. రైతులు కూడా తమ సమస్యలపై ఉద్యమిస్తున్నారు గానీ వారికి నాయకత్వం వహించవలసినవారు సిద్ధంగా లేరు. రైతాంగం, కార్మికవర్గం కూడా ఐక్యం కాలేదు. పెట్టుబడిదారీ వర్గం, వారు ఒకటికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నందున ఉద్యమాలు కూడా దూరం జరుగుతున్నాయి. కాని మనిషి అది తలపెడతాడు. ఎప్పుడన్నదే సమస్య తప్ప వస్తుందాలేదా అన్నది సమస్య కాదు.
చివరిగా చెప్పేది మానవ స్వభావం అనేది తనంతట తానే ఎక్కడా ఉండదు. మనిషి చుట్టూ ఉన్న సామాజిక పరిస్ధితుల భావాలు మనిషి జ్ఞానేంద్రియాల ద్వారా మెదడుపై ప్రతిబింబించినప్పుడు పుట్టేవే భావాలు. సమాజం నుండి పుట్టే భావాలు సామాజిక సూత్రాలకు అతీతంగా ఉంటాయనడం సరైంది కాదు. రాముడి కాలంలో పుష్పక విమానం అంటే ఆర్టిస్టులు ఎలా గీస్తారు? బోయింగ్ విమానం బొమ్మని గీయరు. నాలుగు స్తంభాలు గల మందిరం గీసి రెక్కలు తొడుగుతారు. రాముడి కాలానికి మనిషి ఊహించగల విమానం అదే. గాల్లొ ఎగిరేవాటికి రెక్కలుండాలి. రాజులు ప్రయాణించేది కనుక రాజమందిరం ఊహించి దానికి రెక్కలు తొడిగారు. మనిషి మెదడుకి తమ చుట్టూ ఉన్న పరిస్ధితులకు అతీతంగా ఊహలు, భావాలు సాధ్యం కాదని చెప్పడానికి ఇది. అలాగే ఒక మనిషి ఇస్టా ఇష్టాలు, అతని భావాలు, ఊహలు, ఆశలు అన్నీ సమాజ పరిదులకి లోబడే ఉండాలి ఉంటాయి కూడా. మనిషి భౌతిక పరిస్ధితికి అతీతంగా అతని ఊహలు, భావాలు ఉంటాయని భావిస్తే చాలా శాస్త్రాలని తిరగరాయాల్సి ఉంటుంది.
అందువలన మనిషి స్వభావం ఊహాతీతంగా, సామాజిక నియామలకు అతీతంతా ఉండదని గ్రహించాలి. అది గ్రహించాక ఇతర అనుమానాలన్నీ దూదిపింజల్లా తేలిపోవలసిందే.
POSTED BY   ఆగష్టు 12, 2011  అభిప్రాయములు

 

చర్చ

10 స్పందనలు to “మార్క్సిజం పుట్టుక పరిణామం, మానవ స్వభావం, సోషలిజం అనివార్యత”

  1. 0
    0

    Rate This
    Great write up Visekhar Gaaru…Great explanation.You writings need to reach more and more people..I wish some one publish all your posts as a book..Good work..I am Proud that you are from our Tatikonda,Great Guturian..
    POSTED BY INDRASENA GANGASANI | ఆగష్టు 13, 2011, 10:08 ఏ ఎమ్
  2. 0
    0

    Rate This
    శేఖర్ గారు,
    ఎన్నాళ్ల తర్వాత ఇంత మంచి వ్యాసం చదివానండీ..ఏ సిద్ధాంతం పైన అయినా గుడ్డి ద్వేషం తగదనే సూక్తిని విశ్వసించే భావజాల నిజాయితీ కలిగిన ఎవరయినా సరే ఈ సైద్ధాంతిక పరిచయాన్ని, మీ వ్యాఖ్యలను తప్పనిసరిగా చదవాలి. నా ఉద్దేశంలో మార్క్సిజం సానుభూతిపరులు, విశ్వసించేవారి కంటే మార్క్సిస్ట్ వ్యతిరేకులు చదివితీరవలసిన గొప్ప రచన ఇది.
    సైద్ధాంతికంగా మార్క్సిజాన్ని వ్యతిరేకించడం కంటే సోషలిస్టు ఆచరణలో గత 80 ఏళ్లుగా జరుగుతూ వచ్చిన ఘోరమైన పొరపాట్ల కారణంగా కమ్యూనిస్టులంటేనే గుడ్డి వ్యతిరేకత మేధోప్రపంచంలో ప్రబలి ఉన్న పరిస్థితి ఇప్పుడు ప్రపంచమంతటా చాలా తీవ్రంగా ఉడటం వాస్తవమే.
    కాని, మానవ ఆలోచనా పరిణామ క్రమంలో ఆవిర్భవించిన మార్కిస్ట్ ప్రాపంచిక దృక్పధాన్ని ఇంత నచ్చచెప్పే రీతిలో మీరు రాయడం హృద్యంగా ఉంది. ఈ నచ్చచెప్పే ధోరణి మీ ప్రతి వ్యాసంలోనూ ఉండాలని, మార్క్సిజాన్ని గుడ్డిగా వ్యతిరేకించేవాళ్లను కూడా ఇలాగే కన్విన్స్ చేయడానికి ప్రయత్నించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
    ‘కాలం గర్భంతో ఉండి మార్క్సుని కన్నది” ఎంగెల్స్ వ్యాఖ్య మనస్సును ఉర్రూతలూగిస్తోంది. మార్క్సిజాన్ని మనిషి భౌతిక, బౌద్ధిక పరిమాణక్రమంలో ఆవిర్భవించిన సరికొత్త ఆవిష్కరణగా ఎంగెల్స్ ఎంత గొప్ప వ్యాఖ్య చూశాడో.
    “మార్క్సు రచించాడు కనక మార్క్సిజం అయ్యింది. పుల్లయ్య గమనించి రచించినట్లయితే పుల్లయ్యిజం అయి ఉండేది. ధామస్ ఎడిసన్ బల్బు కనిపెడితే అమెరికా వాడు విదేశీయుడు కనిపెట్టాడని వాడడం మానేస్తున్నామా? శాస్త్ర బద్ద ఆవిష్కరణ ఎవరు చేసిన ప్రపంచం అంతా దానిని వినియోగిస్తుంది. మార్క్సిజం అంతే.”
    మార్క్సిజం రూపంలోని విదేశీయ సిద్ధాంతాన్ని భారతీయ కమ్యూనిస్టులు కౌగలించుకుని అంటకాగుతున్నారంటూ గత అయిదు దశాబ్దాలుగా విద్వేష ప్రకటనలు చేస్తున్న పిదపబుద్దులు గుండు సూది నుంచి మొదలుకుని ఆధునిక విమానాల వరకు పాశ్చాత్య మేథస్సు శతాబ్దం పైగా ఆవిష్కరిస్తున్న ప్రతి వస్తువును, భౌతిక సౌకర్యాలను ఒక్కటంటే ఒక్కదాన్ని కూడా వదులుకోకుండా అనుభవిస్తునే ఉన్నారు. తమ బ్యాంకు బ్లాలెన్సులూ, ఆస్తులూ, వడ్డీ వ్యాపారాలు, సమాజ వనరులను కొల్లగొట్టడాలు ఇలాగే కొనసాగుతుంటాయనీ, ఈ ప్రపంచం ఇలాగే ఉంటుంది.. ఉండాలనీ తమకే సాధ్యమైన గుడ్డి విశ్వాసంతో ఉంటున్న వారు మీ పై వ్యాఖ్యను తమ జీవితంలో ఎన్నటికీ అర్థం చేసుకోలేరు.
    “ఆదిమ కమ్యూనిస్టు సమాజం నుండి పెట్టుబడిదారి వ్యవస్ధ వరకూ జరిగిన పరిణామక్రమాన్నీ, ఆ పరిణామాల క్రమాన్ని శాస్త్ర బద్ధంగా, జీవ, బౌతిక, రసాయన, సామాజిక, ఆర్ధిక, రాజకీయ, శాస్త్రాల ఆధారంగా గత సమాజాల అడుగుజాడల్ని పసిగట్టాడు. ఆ అడుగుజాడల ఆధారంగా సామాజిక పయనాన్ని గమనించి దాని భవిష్యత్తు గమనాన్ని చూశాడు కారల్ మార్క్సు.
    మానవ సమాజానికి సౌకర్యవంతమైనది ఏమిటి? వైరుధ్యాలు లేకపోవడమే సౌకర్యవంతం. పేద, ధనిక వ్యత్యాసాలు, పాలకుడు పాలితుదు వ్యత్యాసాలు, పట్టణం గ్రామం వ్యత్యాసాలు, శారీరక శ్రమకూ, మేధో శ్రమకీ వ్యత్యాసాలూ, మతం, కులం, ప్రాంతం, ఇలా సమస్త వ్యత్యాసాలు పరిష్కరించబడే వరకూ సమాజం మారుతూనే ఉంటుంది. కారల్ మార్క్సు ఈ మార్పులను శాస్త్ర బద్దం చేశాడు.”
    “రాముడి కాలంలో పుష్పక విమానం అంటే ఆర్టిస్టులు ఎలా గీస్తారు? బోయింగ్ విమానం బొమ్మని గీయరు. నాలుగు స్తంభాలు గల మందిరం గీసి రెక్కలు తొడుగుతారు. రాముడి కాలానికి మనిషి ఊహించగల విమానం అదే. గాల్లొ ఎగిరేవాటికి రెక్కలుండాలి. రాజులు ప్రయాణించేది కనుక రాజమందిరం ఊహించి దానికి రెక్కలు తొడిగారు. మనిషి మెదడుకి తమ చుట్టూ ఉన్న పరిస్ధితులకు అతీతంగా ఊహలు, భావాలు సాధ్యం కాదని చెప్పడానికి ఇది. అలాగే ఒక మనిషి ఇస్టా ఇష్టాలు, అతని భావాలు, ఊహలు, ఆశలు అన్నీ సమాజ పరిదులకి లోబడే ఉండాలి ఉంటాయి కూడా. మనిషి భౌతిక పరిస్ధితికి అతీతంగా అతని ఊహలు, భావాలు ఉంటాయని భావిస్తే చాలా శాస్త్రాలని తిరగరాయాల్సి ఉంటుంది.”
    “మానవ సమాజం ఉన్నంత కాలం మనిషి శ్రమ చేయవలసిందే. శ్రమ చేయకుండా ఈ ప్రపంచంలో ఒక్క పూచిక పుల్ల కూడా నడిచిరాదు. అటువంటి శ్రామికులని ఈసడించుకుంటూ, శాస్త్రాల పరిజ్ఞానాన్ని తమ సొత్తుగా భావిస్తూ వచ్చిన కులీన వర్గ పండితుల విశ్వాసాలను మార్క్సు బదాబదులు చేస్తూ శ్రమకి అగ్రపీఠాన్ని అందించాడు.”
    పై మీ వ్యాఖ్యలనే మళ్లీ ఇక్కడా పొందుపరుస్తున్నాను.
    పాతికేళ్ల క్రితం ఎస్వీ యూనివర్శిటీ ఎంఎ తెలుగు చదువుతున్నప్పుడు తెలుగు విభాగంలో ప్రొఫెసర్ మద్దూరి సుబ్బారెడ్డి గారు పదే పదే ఒక విషయాన్ని నొక్కి చెప్పేవారు. మార్క్సిజం ప్రభావానికి గురికాని శాస్త్రం నేటి ప్రపంచంలో లేదని గుడ్డివ్యతిరేకులు కూడా సామాజిక, తాత్విక, శాస్త్ర రంగాల్లో మార్క్సిజం ప్రపంచ వ్యాప్త ప్రభావాన్ని విస్మరించడం సాధ్యం కాదని, మార్క్సిజం బద్ధ వ్యతిరేకులు కూడా దాని సైద్ధాంతిక ప్రభావాన్ని, ప్రాంసంగికతను అంగీకరించక తప్పని పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆయన ఆ రెండేళ్ల కాలంలో కొన్ని డజన్ల సార్లు తెలుగు క్లాసు రూములో చెప్పగా చెవులు రిక్కించుకుని విన్నాను.
    నాకు అన్నిటికంటే ఆశ్చర్యం గొల్పిన విషయం ఏమిటంటే మా ప్రొఫెసర్ గారు పక్కా కాంగ్రెస్ మనిషి. జాతీయ వాది కూడా. ఆయన చేసిన పీహెచ్‌డీ పరిశోధన కూడా జాతీయోద్యమ కవిత్వంపైనే కొనసాగింది. ఈయన..అప్పట్లో ఎస్వీయూ వీసీగా పనిచేసిన తెలుగు ప్రొపెసర్, ప్రముఖ భాషా శాస్త్రవేత్త జీఎన్‌రెడ్డి గారు కూడా తమ విశ్వాసాలు ఏవైనా సరే సృజన, అరుణతార, ప్రజాసాహితి వంటి సామ్యవాద ప్రబోధ సాహిత్య పత్రికలను క్రమం తప్పకుండా కొని తీసుకునేవారు.
    ఈరోజంటే తమకు నచ్చని, తాము విశ్వసించని సిద్ధాంతాలపట్ల, ముఖ్యంగా మార్క్సిజం పట్ల తీవ్రమైన గుడ్డి వ్యతిరేకతను ప్రదర్శిస్తున్న కొంతమంది మధ్యతరగతి ‘బుద్ధి’ జీవులు కాదు కాదు “భద్ర”జీవులు ద్వేషమే పునాదిగా మార్కిస్టు వ్యతిరేక సైద్ధాంతిక వ్యక్తీకరణలను తీవ్రస్థాయిలో ప్రకటిస్తున్నారు. ముఖ్యంగా నేను గమనించినంతవరకు తెలుగు బ్లాగుల్లో ఈ ధోరణి విపరీతంగా కనబడుతోంది.
    ఒక సిద్ధాంతాన్ని చదివి, ఆకళింపు చేసుకుని దానిపై విమర్శలు గుప్పించడం వేరు.. హిట్లర్‌ని, నాజీయిజాన్ని మనం వ్యతిరేకించవచ్చు కాని దాని గురించి ఓనమాలు తెలుసుకోకుండా ద్వేషిస్తే మన విచక్షణకు అర్థం ఉంటుందా.
    పుట్టపర్తి నారాయణాచార్యుల వంటి సరస్వతీ పుత్రులు, శుద్ధ సాంప్రదాయ వాది తన జీవితం పొడవునా వేదాధ్యయనానికి ఎంత ప్రాముఖ్యత నిచ్చారో, మార్క్సిజం అధ్యయనానికి అంత ప్రాముఖ్యతనిచ్చారు. మార్క్సిజాన్ని ఆయన ‘అంటరానిదిగా’ చూడలేదు. జీవితం చివరి రోజుల్లో కూడా తనకు అవసరమనిపిస్తే న్యూక్లియర్ ఫిజిక్స్ ని ఈ వయసులో తెలుసుకోవడానికి వ్యతిరేకించను అంటూ వల్లంపాటి వెంకటసుబ్బయ్య గారితోటే వాదించారాయన. సిద్ధాంతాన్ని సిద్ధాంతంగా, భావజాలాన్ని భావజాలంగా అధ్యయనాంశంగా మాత్రమే చూడగల విచక్షణ ఉంటే తప్ప ఇంతటి సమ్యక్ దృక్పథం మనుషులలో ఏర్పడదు.
    శేఖర్ గారు నాకు మీతో కొద్ది రోజుల పరిచయం మాత్రమే ఉంది. మనసు మూలల్ని కదిలించే రచనలతో ఒక నిబద్ధతతో మీరు రాస్తున్నారు. సంయమనం, నచ్చచెప్పడం అనే లక్షణాలు పునాదిగా మీరిలా రాస్తూనే ఉండాలని అద్భుతమైన మీ శైలిని ఇలాగే కొనసాగించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
    మీరు చందమామ బ్లాగులో ఆర్ట్‌బుక్‌ కథనంపై చక్కటి వ్యాఖ్య చేశారు. ఇప్పుడనిపిస్తోంది. నిజం చెప్పనా.. చందమామను సంవత్సరాలపాటు చదివారు కదా. మీది నిజంగా చందమామ శైలి. సిద్ధాంత వ్యతిరేకులు రెచ్చగొట్టినా మీరు రెచ్చిపోవద్దు. ఈ ఒక్క జాగ్రత్తను మీరు పాటించండి. మార్క్సిజాన్ని ప్రచారం చేస్తున్న, ప్రకటిస్తున్న బ్లాగర్లపై తెలుగు బ్లాగర్లు, అంతర్జాల పాఠకులు బాగా వ్యతిరేకత ప్రదర్శిస్తున్నట్లున్నారు. ప్రతిరోజూ మీరు రాస్తున్న వార్తలు, విశ్లేషణలు ఎంతోమందిని కన్విన్స్ చేస్తున్నట్లున్నాయి.
    మీరిలాగే కొనసాగండి…
    కమ్యూనిస్టు మేనిఫెస్టో.. భూమ్మీద మనిషి రచించిన మహాకావ్యాల్లో అగ్రగామిగా నిలబడే రచన. పెట్టుబడి దారీ వ్యవస్థలోని ప్రగతి శీలత్వాన్ని, నూతన ఆవిష్కరణల పరంగా దాని మహా విజయాన్ని అనితర సాధ్యంగా కీర్తించిన అతి గొప్ప రచన ఇది. కారల్ మార్క్స్ రచించిన ఈ పరమ ప్రామాణిక రచనను, మహాకావ్యాన్ని తెలుగు పాఠకులకోసం, బ్లాగర్ల కోసం మరోసారి పరిచయం చేయకూడదూ. పాతికేళ్ల క్రితం అరుణాతారలో త్రిపురనేని మధుసూధనరావు గారు మార్క్స్ రచనలను పరిచయం చేసి మావంటి వారిని అప్పట్లో ఉర్రూతలూగించారు.
    తప్పకుండా ఇందుకు కాస్త సమయాన్ని వినియోగించండి. సమకాలీన ఘటనలపై వార్తలు, విశ్లేషణలతో పాటు తరచుగా సైద్ధాంతిక పరిచయం కూడా అవసరమే అనుకుంటున్నాను.
    ఆంధ్రజ్యోతిలో జాహ్నవి అనే పేరుతో పుంఖానుపుంఖాలుగా వస్తున్న ఆ పోలీసు అధికారి స్వేచ్ఛా వ్యాపార అనుకూల వ్యాసాలను మీరేమైనా తడిమారా చెప్పండి. ప్రధాన స్రవంతి పత్రికలో మార్క్సిజానికి వ్యతిరేకంగా అంత చక్కటి శైలితో వరుస విమర్శలు రావడం చాలామందిని ఆకర్షించిందనుకుంటున్నాను. సిద్ధాంతాన్ని సిద్ధాంతంతోనే ఎదుర్కొవాలి. ఈ కోణంలో జాహ్నవి పేరు పెట్టుకున్న-లేదా ఆంధ్రజ్యోతి యాజమాన్యం దాచిపెట్టిన- ఆ ముసుగు పోలీసు అధికారి మార్క్సిజం సానుభూతిపరులకు, సమర్థకులకు బాగానే పని పెట్టారనుకుంటున్నాను.
    చందమామలో పనిచేస్తున్న కారణంగా చందమామ బ్లాగులో నా రచనలకు చాలా పరిమితి ఉంటోంది. మీ బ్లాగు చూసిన తర్వాత నేను కూడా నా స్వేచ్ఛకోసం, నా స్వేచ్ఛా వ్యక్తీకరణ కోసం మరొక కొత్త బ్లాగు రూపొందించుకోవాలనిపిస్తోంది.
    వీలైతే మీ మెయిల్ ఐడీ, మొబైల్ ఇవ్వండి. ఒకసారి మాట్లాడాలని ఉంది.
    నా ఈమెయిల్, మొబైల్ ఇక్కడ ఇస్తున్నాను చూడండి.
    krajasekhara@gmail.com
    9884612596
    చెన్నయ్.
    POSTED BY రాజశేఖర రాజు | ఆగష్టు 13, 2011, 7:02 సాయంత్రము
  3. 0
    0

    Rate This
    రాజశేఖర రాజు గారికి
    మీ సుదీర్ఘ వ్యాఖ్య నాకు సంతోషం కలిగించింది. పొగడ్తకు కాదు సుమా! తెలుగు బ్లాగర్లలో మరొక సైద్ధాంతిక తోడు దొరికినందుకు. మీరు కోరినట్లు కమ్యూనిస్టు మేనిఫెస్టో పరిచయం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.
    జాహ్నవి వ్యాసాలు నాకు తల తోక లేకుండా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. వాటికి సమాధానంగా ఒక వ్యాసం రాయాలని ఒక సారి ప్రయత్నించాను గాని, ఆయన వ్యాసాలు ఏదో ఒక క్రమాన్ని పాటిస్తే విమర్శ రాయవచ్చు. కాని ఎన్ని వ్యాసాలు చదివినా ఆయన రాతల్లో నాకు క్రమ పద్ధతి కనిపించడం లేదు.
    అసలాయన సోషలిజం గురించి అర్ధం చేసుకున్నదానిలో చాలా తప్పులున్నాయి. నెహ్రూ దగ్గర్నుండి చైనా, రష్యా ల సోషలిజాల వరకూ ఒకే గాటన కడుతుంటే దేనికి స్పందించాలో తెలియడం లేదు. పోనీ పెట్టుబడిదారీ విధానంపైన అయినా సరైన అభిప్రాయాలు ఉన్నాయా అంటే అదీ లేదు. అమెరికా, యూరప్ లలో పెట్టుబడిదారీ వ్యవస్ధలు అమలు చేస్తున్నవి సరైన పెట్టుబడిదారీ విధానాలు కావంటాడు, అదేమి చిత్రమో. ఆయన దేన్ని విమర్శిస్తున్నాడొ, దేన్ని సమర్ధిస్తున్నాడో తెలియన కలగాపులగంగా ఆయన వ్యాసాలు ఉన్నాయి.
    అప్పటికీ రంగనాయకమ్మ గారు కొంత విమర్శ రాశారు గానీ దానికాయన సమాధానం ఇచ్చినట్లు లేదు.
    మీ వ్యాఖ్య ద్వారా మరికొన్ని విషయాలు నేను తెలుసుకున్నాను. నా ఐడి మీకు ఈ మెయిల్ ఇస్తాను.
    కృతజ్ఞతలు.
    POSTED BY VISEKHAR | ఆగష్టు 13, 2011, 10:27 సాయంత్రము
  4. 0
    0

    Rate This
    విజయ శేఖర్ గారు,
    తెలుగు బ్లాగర్లలో మరొక సైద్ధాంతిక తోడు దొరికినందుకు అన్నారు. చాలా సంతోషం. కమ్యూనిస్టు పార్టీ మేనిఫెస్టో తప్పక పరిచయం చేయండి. కాస్త ఆలస్యం అయినా సరే… వీలైనంత గాఢతతో -డెప్త్- పరిచయం చేయండి. ఈ తరానికి అది చాలా అవసరం. మార్క్సిజం సిద్ధాంతం గురించిన సమాచారం ఇంగ్లీషు మార్క్సిస్ట్ వెబ్‌సైట్లలో చాలా ఎక్కువగానే లభ్యమవుతోంది కాని తెలుగు పాఠకులకు తెలుగులో దాన్ని అందించడం చాలా అవసరం.
    నిత్యం కొత్త విషయాలు, వార్తలు ప్రచురితమవుతున్న మీ బ్లాగ్ ఈ కోణంలో మంచి ప్రభావం వేయనుంది. వామపక్ష పదజాలం ఎక్కువగా ఉపయోగించకుండానే తేలికపాటి శైలే అయినా ఆకర్షణీయమైన శైలిలో మీరు రచనలు చేస్తున్నారు. ఇది సరిగ్గా కొడవటిగంటి కుటుంబరావు గారి శైలి. పడికట్టు పదాలు, జార్గాన్‌తో సంబంధం లేకుండానే విషయాన్ని వివరించడం చిన్న విషయం కాదు. ఇంకా చెప్పాలంటే చాలా కష్టమైన విషయం. దాన్ని మీరు సాధించారు.
    “జాహ్నవి వ్యాసాలు నాకు తల తోక లేకుండా ఉన్నట్లు కనిపిస్తున్నాయి… నెహ్రూ దగ్గర్నుండి చైనా, రష్యా ల సోషలిజాల వరకూ ఒకే గాటన కడుతుంటే దేనికి స్పందించాలో తెలియడం లేదు…. ఆయన దేన్ని విమర్శిస్తున్నాడొ, దేన్ని సమర్ధిస్తున్నాడో తెలియన కలగాపులగంగా ఆయన వ్యాసాలు ఉన్నాయి..”
    జాహ్నవి పేరు పెట్టుకున్న ఆ ఇంటెలిజెన్స్ అధికారి నెహ్రూ సోషలిజం, రష్యా, చైనాల సోషలిజం గురించి తెలియనితనంతో ఆంధ్రజ్యోతిలో ఆలా పుంఖానుపుంఖాలుగా రాస్తున్నాడని నేననుకోవడం లేదు. స్వేచ్ఛా వ్యాపారం సామ్రాజ్యవాదంగా పరిణమించిన విషయాన్ని కూడా చాలా తెలివిగా తను దాచిపెడుతున్నట్లుంది. పోలీసు బుర్రకే సాధ్యమైన తెలివితో అన్ని విషయాలను కలగాపులగం చేసి గందరగోళం సృష్టించడంలో తాను ఆరితేరిపోయినట్లుంది. సామాజిక రాజకీయ ఉద్యమాలనే పూర్తిగా నెగేట్ చేయడం ద్వారా తాను అంతిమంగా ఏం చెప్పుతున్నాడో సులభంగా అర్థం చేసుకోవచ్చు.
    రంగనాయకమ్మ గారి విమర్శకు తాను సమాధానం ఇవ్వడమా…. అంత స్థాయి తనకు ఉందంటారా?
    ధన్యవాదాలతో
    రాజు.
    POSTED BY రాజశేఖర | ఆగష్టు 14, 2011, 11:46 సాయంత్రము
    • 0
      0

      Rate This
      “నెహ్రూ సోషలిజం, రష్యా, చైనాల సోషలిజం గురించి తెలియనితనంతో ఆంధ్రజ్యోతిలో ఆలా పుంఖానుపుంఖాలుగా రాస్తున్నాడని నేననుకోవడం లేదు. స్వేచ్ఛా వ్యాపారం సామ్రాజ్యవాదంగా పరిణమించిన విషయాన్ని కూడా చాలా తెలివిగా తను దాచిపెడుతున్నట్లుంది.”
      అవును. మీరన్నది నిజమే. కొంతమంది అటువంటి తెలివిని ఉపయోగించడం నాకూ అనుభవమే. జ్యోతి ఇన్నాళ్లూ ఆయన రాతలను ప్రచురించుకోవడమే ఆశ్చర్యకరం. ఆ పత్రిక నిజమైన ఆసక్తి అదేనేమో! ఆయన రాసే పద్దతి ప్రతి విమర్శ రాయడానికి వీలు లేకుండా ఉంది. ఒక అంశాన్ని కేంద్రంగా పెట్టుకుని వివరమైన విమర్శ చేయడం గాకుండా గందరగోళంగా విమర్శ చేయడం ఆయన ధోరణిగా ఉంది. ఆ గందరగోళంలో మార్క్సిజం చెప్పింది చెప్పనట్లుగా, చెప్పనది చెప్పినట్లుగా చెబుతూ తప్పుదారి పట్టిస్తున్నాడు. మార్క్సిజాన్ని తనదైన పద్ధతిలో అర్ధం చేసుకుని అదే సరైన పద్దతిగా తనకు తాను తేల్చేసుకుని దానిపై ఆధారపడి విమర్శ సాగిస్తున్నాడు. దానితో ప్రతి విమర్శని ఒక క్రమంలో పెట్టడానికి కావలసిన మార్గాన్ని ముళ్ళ కంచెలతో మూసినట్లయ్యింది. ఆయన రాతలపై విమర్శ చేసే ముందుగా, ఆ ముళ్ళ కంచెలను తొలగించుకోవలసి ఉంది. అలా తొలగించడం ఒకింత శ్రమ కలిగించేదని చెప్పుకోవచ్చు. ఇదీ నేను చెప్పదలుచుకున్నది.
      మీకు ఈ మెయిల్ ఇచ్చాను.
      విశేఖర్.
      POSTED BY VISEKHAR | ఆగష్టు 15, 2011, 12:49 ఏ ఎమ్
  5. 1
    0

    Rate This
    మార్క్సిజం ఆర్టికల్ బాగుంది. కమ్యూనిస్టు పార్టీల కేడర్ చేత చదివించవలసిన అవసరం ఉంది. …చిట్టిపాటి
    POSTED BY CHITTIPATI | ఆగష్టు 16, 2011, 9:54 సాయంత్రము
  6. 1
    0

    Rate This
    ya definitely Marxism came 4m on that social conditions but social conditions r not formed bcoz of Marxism. i clearly understood this point. thanq 4 a great explanation n discussion. thanq very much.
    POSTED BY UJWAL | ఆగష్టు 17, 2011, 7:43 సాయంత్రము