కోల్‌కతాజార్‌గ్రామ్ మావోయిస్టు అగ్రనేత మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్‌జీది నిజమైన ఎన్‌కౌంటరేనా లేదా బూటకపు ఎన్‌కౌంటరా పశ్చిమ బెంగాల్లోని పశ్చిమ మిడ్నాపూర్ జిల్లా అడవుల్లో గురువారం మృతి చెందిన కిషన్‌జీ మరణంపై ప్రస్తుతం వివాదం చెలరేగుతోంది. ఆయన్ను ముందుగానే అరెస్టు చేసి, హింసించి, బూటకపు ఎన్‌కౌంటర్‌లో మట్టుపెట్టారని మావోయిస్టులు, మద్దతుదారులు, పలు రాజకీయ పక్షాలు ఆరోపిస్తుండగా.. ఇది నిజమైన ఎన్‌కౌంటరేనని సీఆర్పీఎఫ్ వాదిస్తోంది. పోస్టు మార్టం నిర్వహించిన అనంతరం కిషన్‌జీ భౌతికకాయాన్ని ఆంధ్రప్రదేశ్‌కు తరలించనున్నట్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుక్రవారం తెలిపారు.
వారం రోజుల నిరసన కిషన్‌జీ మృతికి దారితీసిన పరిణామాలపై స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని మావోయిస్టులు డిమాండ్ చేశారు. ‘కిషన్‌జీని ముందుగానే అరెస్టు చేశారు. ఆ సమయంలో మా సహచరులు సమీపంలోనే ఉన్నారు. తర్వాత నకిలీ ఎన్‌కౌంటర్‌లో చంపేశారు’ అని మావోయిస్టు బెంగాల్ రాష్ట్ర కమిటీ సభ్యుడు, అధికార ప్రతినిధి ఆకాష్ ‘పీటీఐ’ వార్తాసంస్థకు ఫోన్ ద్వారా తెలిపారు. ఈ బూటకపు ఎన్‌కౌంటర్‌కు నిరసనగా శని, ఆదివారాల్లో రాష్ట్ర బంద్‌కు.. వారం రోజుల నిరసనకు పిలుపునిస్తున్నట్లు చెప్పారు. మావోయిస్టుల వాదనను సీఆర్పీఎఫ్ డీజీ విజయ్‌కుమార్ ఖండించారు. ‘ఇది పారదర్శకమైన, విజయవంతమైన ఆపరేషన్. మా భద్రతా సిబ్బంది ఒక్క నిమిషం కూడా వృథా చేయలేదు’ అని అన్నారు.
శ్వేతపత్రం విడుదల చేయాలి..
పోలీసుల వాదన ఇలా ఉండగా.. మల్లోజుల కోటేశ్వరరావును బుధవారమే అరెస్టు చేసి.. పోలీసు కస్టడీలో ఉంచారని విరసం సభ్యుడు వరవరరావు చెప్పారు. నకిలీ ఎన్‌కౌంటర్‌లో కిషన్‌జీని హతమార్చారని, చంపేముందు ఆయన్ను తీవ్రంగా హింసించారని ఆరోపించారు. ఈ నకిలీ ఎన్‌కౌంటర్‌పై బెంగాల్ సర్కారు శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు.‘ఆయన్ను హింసించారు. కిషన్‌జీ శరీరంపై గాయాల గుర్తులున్నాయి’ బెంగాల్ సెక్రటేరియట్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. కిషన్‌జీ మృతికి కారకులైన వారిపై సెక్షన్ 302 కింద హత్యానేరం నమోదు చేయాలంటూ ఆ రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి జి.డి.గౌతమకు వినతిపత్రం ఇచ్చారు. మరో నలుగురు మావోయిస్టులు ఇంకా పోలీసుల నిర్బంధంలోనే ఉన్నారని ఆరోపించారు. మావోయిస్టు అగ్రనేత భౌతికకాయాన్ని గుర్తించి, రాష్ట్రానికి తీసుకెళ్లేందుకు కిషన్‌జీ సోదరుడు కుమార్తె దీపతో కలిసి కరీంనగర్ పెద్దపల్లి నుంచి ఆయన కోల్‌కతాకు వచ్చారు. వీరితో నక్సల్స్ బంధు మిత్రుల కమిటీ కార్యదర్శి పద్మ, ఏపీసీఎల్‌సీ సభ్యులు చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు. ప్రస్తుత బెంగాల్ సర్కారు నడుస్తున్న తీరు గత లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని తలపిస్తోందని వరవరరావు విమర్శించారు.
వామపక్షాలు తలో మాట కిషన్‌జీది బూటకపు ఎన్‌కౌంటర్‌లా కనిపిస్తోందని.. ఈ విషయంలో ప్రభుత్వం విచారణ జరిపి, వివరణ ఇవ్వాల్సిన అవసరముందని పేర్కొంటూ సీపీఐ నేత గురుదాస్ దాస్‌గుప్తా కేంద్ర హోంమంత్రి చిదంబరానికి లేఖ రాశారు. చిదంబరంతో ఫోన్‌లోనూ మాట్లాడిన దాస్‌గుప్తా.. ‘కిషన్‌జీని ముందే అరెస్టు చేసి.. తర్వాత హతమార్చినట్లు నాకు సమాచారముంది. ఒకవేళ అదే నిజమైతే.. ఇదో పిరికి చర్య. అంతర్జాతీయ, జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే’ అని అన్నారు. సీపీఐ వైఖరిలా ఉండగా.. కిషన్‌జీ మృతికి దారితీసిన పరిస్థితులపై తాము వ్యాఖ్యానించబోమని సీపీఎం పేర్కొనడం గమనార్హం. ‘కేవలం పోలీసులకే పూర్తి సమాచారముం టుంది. ఎన్‌కౌంటర్ ఎలా జరిగిందన్నదన్న విషయాన్ని ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే క్షేతస్తాయిలో ఉన్న బలగాలకే ఆ విషయం తెలుస్తుంది’ అని సీపీఎం నేత సీతారాం ఏచూరి అన్నారు. కిషన్‌జీ ఎన్‌కౌంటర్ ఘటనను ఆయన స్వాగతించారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు ఒక అడుగు ముందుకేశారన్నారు. సమాజ్‌వాదీ పార్టీతోపాటు మానవ హక్కుల సంఘాలు కిషన్‌జీ ఎన్‌కౌంటర్‌పై విచారణ జరపాలని డిమాండ్ చేశాయి. అటు బీహార్‌లో సీపీఐ(ఎం-ఎల్) లిబరేషన్ కిషన్‌జీ మృతిపై న్యాయ విచారణకు ఆదేశించాలనిమమతాబెనర్జీని కోరింది.
నేడు పోస్టుమార్టం.. రేపు స్వగ్రామానికి మల్లోజుల బంధువులతో మాట్లాడిన తర్వాత భౌతికకాయాన్ని ఆంధ్రప్రదేశ్‌కు తరలిస్తామని బెంగాల్ హోంశాఖ కార్యదర్శి జి.డి.గౌతమ తెలిపారు. కిషన్‌జీ మృతదేహానికి శనివారం కోల్‌కతాలో పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు అదనపు డీజీపీ పురకాయస్త తెలిపారు. ఇందుకోసం ఫోరెన్సిక్ బృందాన్ని సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు. అవసరమైతే డీఎన్‌ఏ పరీక్ష కూడా చేసే అవకాశముందన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో నక్సల్స్ హిట్‌లిస్టులో ఉన్న మమతాబెనర్జీతోపాటు మరో పది మంది వీవీఐపీల భద్రతను పెంచినట్లు చెప్పా రు. కాగా, కిషన్‌జీ భౌతికకాయాన్ని తొలుత జార్‌గ్రామ్ ఆస్పత్రి మార్చురీకి.. తర్వాత మిడ్నాపూర్ ఆస్పత్రికి తరలిం చారు. ఆయన మృతదేహాన్ని గుర్తించేందుకు దీప, వరవరరావులు మిడ్నాపూర్ వెళ్లారు. భౌతికకాయాన్ని వారు గుర్తిం చిన అనంతరం పోస్ట్‌మార్టం నిమిత్తం కోల్‌కతాకు తరలిస్తా రు. ఈ పనులన్నిటినీ ముగించుకుని, ఆదివారం సాయంత్రం పెద్దపల్లికి చేరుకుంటామని వరవరరావు తెలిపారు. కిషన్‌జీ అంత్యక్రియలు సోమవారం జరిగే అవకాశముంది.
కిషన్‌జీ సోదరుడి రక్తనమూనా సేకరణ
పెద్దపల్లి(కరీంనగర్), న్యూస్‌లైన్ కిషన్‌జీ భౌతికకాయానికి డీఎన్‌ఏ పరీక్షలను నిర్వహించేందుకు వీలుగా.. పెద్దపల్లిలో ఉంటున్న ఆయన సోదరుడు ఆంజనేయులు రక్తనమూనాలను స్థానిక సీఐ కిరణ్‌కుమార్ సేకరించారు. దీన్ని కోల్‌కతా పంపిస్తారు.
కన్న పేగు కదిలింది..
పెద్దపల్లి (కరీంనగర్), న్యూస్‌లైన్ పోరాట యోధుడైన తన కుమారుడు ఇక లేడని తెలిశాక ఆ తల్లి హృదయం తట్టుకోలేకపోయింది. గురువారం కిషన్‌జీ మరణ వార్త తెలిసినప్పటి నుంచి ఆయన తల్లి మధురమ్మ మెతుకు ముట్టలేదు. నా బిడ్డా.. కోటన్న.. నీకు అడవిలో చలి పుడతలేదా.. నిన్ను శవంగా చేసిన పోలీసులు గదిలో మూటగట్టి పారేశారా.. నిన్ను ఇగ చూడలేనా.. నా గుండెలు పగులుతున్నయిర.. కోటన్న.. పేపర్ల నీ పేరొస్తే తప్పించుకున్నావనుకున్న.. ఎన్ని సార్లు పేరు పేపర్ల రాలె. ఇదీ గంతె అనుకున్న.. కొడుకా కన్న పేగు కదులుతుందిరా.. గరీబోళ్ల కోసం ప్రాణాలిస్తివా.. కొడుకా అంటూ ఏకధాటిగా విలపిస్తోన్న మధురమ్మ శుక్రవారం మధ్యాహ్నం స్పృహ తప్పి పడిపోయింది. మధురమ్మను ఓదార్చడం ఎవరి తరమూ కావడంలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
మమత సర్కారుపై ఆగ్రహం
‘కుంభకోణాలకు పాల్పడి, కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టిన బడా నేతల్లో ఎంత మందిని పోలీసులు కాల్చి చంపారు పేద ప్రజల కోసం అడవి బాట పట్టిన కిషన్‌జీని చిత్ర హింసలు పెట్టి దారుణంగా కాల్చి చంపుతారా’ అంటూ కిషన్‌జీ కుటుంబ సభ్యులు బెంగాల్ సర్కారును ప్రశ్నించారు. మల్లోజులది బూటకపు ఎన్‌కౌంటరేనన్నారు. మల్లోజుల అన్న ఆంజనేయులు, ఆయన కుమారుడు దిలీప్ తదితరులు శుక్రవారం పెద్దపల్లిలో విలేకరులతో మాట్లాడారు. కిషన్‌జీది ముమ్మూటికీ బూటకపు ఎన్‌కౌంటరేనని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఆరోపించారు. దీనిపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని హైదరాబాద్‌లో డిమాండ్ చేశారు.

No comments:
Post a Comment