Monday, 19 December 2011

ఆగమేఘాలపై డీ- కోడింగ్‌

హైదరాబాద్‌, మేజర్‌ న్యూస్‌ పశ్చిమబెంగాల్‌ జంగల్‌మహల్‌ అటవీ ప్రాం తంలో జరిగనట్లుగా చెపుతున్న ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మావోయిస్ట్‌ పార్టీ పొలిట్‌బ్యూరో ప్రతినిధి మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్‌ కిషన్‌జీ వద్ద స్వా ధీనం చేసుకున్న ల్యాప్‌టాప్‌ను డీ కోడింగ్‌ కోసం హైదరాబాద్‌ పంపారు. పూర్తి గా సంకేత నామాలు, అంకెలతో కూడిన ఈ రహస్యాన్ని కచ్చితంగా గుర్తించ గలిగే డీ-కోడింగ్‌ నిపుణులు కేవలం ఆంధ్రప్రదేశ్‌ నిఘావిభాగం పరిధిలోని ఎస్‌ఐబిలోనే ఉన్నారు. కిషన్‌జీ ల్యాప్‌టాప్‌ను గురువారమే తెరిచినప్పటికీ ఒకటి రెండు ఫైళ్లు మినహా ఇతర రహస్య సమాచారం ఏదీ వెల్లడి కావడం లేదని తెలిసింది.

ఎన్‌కౌంటర్‌కు ఒకరోజు ముందు (బుధవారం ఉదయం) కిషన్‌జీ ల్యాప్‌టాప్‌ నుంచి ఇంటర్నెట్‌ ఉపయోగించి ఒక ఇమెయిల్‌ పంపినట్లుగా మా త్రం గుర్తించిన సిఆర్‌పిఎఫ్‌ ఉన్నతాధికారులు అందులోకి సంకేత పదాలను మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నారు. దాంతో తక్షణం దానిని పూర్తిగా డీ-కోడ్‌ చేయాలని కోరుతూ హుటాహుటిన హైదరాబాద్‌ పంపారు. గురువారం రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో ఆ ల్యాప్‌టాప్‌ రాష్ట్ర నిఘా విభాగం పోలీసులకు అందింది. శుక్రవారం ఉదయం నుంచీ దానిని డీ-కోడ్‌ చేసే పనిలో ఇద్దరు అధికారులు, నలుగురు సిబ్బంది నిమగ్నమై ఉన్నారని తెలిసింది. ఈ ల్యాప్‌టాప్‌లోని సంకేతాల వెనుక అసలు విషయాలను తెలుసుకుంటే చాలా కీలకమైన సమాచారం బయటపడుతుందని పోలీసులు ఆశిస్తున్నారు.

సమాచారం ఇచ్చిందీ మనవాళ్లేనా
ఇదిలా ఉండగా కిషన్‌జీ కదలికలకు సంబంధించి రూపొందించిన ఆపరేషన్‌ చీతా అమలు వెనుక రాష్ట్ర పోలీసు అధికారుల ప్రమేయం ఉందా... ఎన్‌కౌంట ర్‌ జరిగిన తీరు, ఆపరేషన్‌ నిర్వహణ పద్దతి పరిశీలిస్తే అవుననే అనుమానాలు కలుగుతున్నాయి, కిషన్‌జీ కదలికలపై నిరంతర నిఘా ఏర్పాటు చేసిన ఎస్‌ఐబి అధికారులే ఆయనకు సంబందించిన సమాచారాన్ని సిఆర్‌పిఎఫ్‌ ఉన్నతాధికా రులకు చేరవేసి ఎన్‌కౌంటర్‌లో కీలకంగా వ్యవహరించారని ఆరోపణలు వస్తు న్నాయి. విప్లవకవి వరవరరావు కూడా ఈ ఎన్‌కౌంటర్‌పై అనేక అనుమానాలు వ్యక్తం చేయడంతో పాటు దీనివెనుక ఆంధ్రాపోలీసుల హస్తం ఉండి ఉండవ చ్చున్న అనుమానం కూడా వ్యక్తం చేయడం గమనార్హం.

అంతేకాకుండా ఎప్పు డూ లేని విధంగా గత మూడు వారాలుగా ఆంధ్రా- ఛత్తీస్‌గఢ్‌, ఒరిస్సా (ఏఓబి) సరిహద్దుల్లో రాష్ట్ర పోలీసులు పూర్తిస్థాయి గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో ఏజెన్సీ ప్రాంతాలలో సాయంత్రం ఐదు గంటల నుంచీ ఉదయం ఏడు గంటల వరకూ అన్నిరకాల వాహనాల రాకపోకలను నిషేధించారు. ముఖ్యంగా తూర్పు, విశాఖ, శ్రీకాకుళం, ఖమ్మం, భద్రాచలం ఏజెన్సీ ప్రాంతాలలో ప్రజలకు లోకల్‌ ఆటోలే ప్రధాన రవాణా సౌకర్యం అయితే కారణాలు చెప్పకుండా గత మూడు వారాలుగా పోలీసులు సాయంత్రం ఆరుగంటల నుంచి ఏజెన్సీ పరిధిలోని గ్రామాలలో తిరిగే ఆటోలను స్థానిక పోలీస్‌ స్టేషన్‌ల వద్ద పార్క్‌ చేయాల్సిందిగా ఆదేశాలు జారీచేసి అమలు పరుస్తున్నారు.రాత్రి సమయాలలో మావోయిస్ట్‌లు స్థానికుల మాదిరి ఈ ఆటోల సహకారంతో సురక్షిత ప్రాం తాలకు తరలి వెళ్తున్నారన్న అనుమానంతోనే ఈ చర్యలు తీసుకున్నట్లు భావిస్తున్నారు. కిషన్‌ జీ కదలికల గురించి రాష్ట్ర పోలీసులకు కచ్చితమైన సమాచారం ఉందన్న అను మానాలు పలువురు వ్యక్తం చేస్తున్నారు.

వరవరరావు అరెస్ట్‌
కాగా కిషన్‌జీ భౌతికకాయాన్ని సందర్శించడంతో పాటు దానిని ఆయన స్వస్థ లం అయిన కరీంనగర్‌ జిల్లా పెద్దపల్లికి తరలించే ఏర్పాట్లు చేయడం కోసం వరవరరావు శుక్రవారం ఉదయం విమానంలో బయలుదేరి వెళ్లారు. అయితే కోల్‌కతా విమానాశ్రయంలో దిగిన వెంటనే స్థానిక పోలీసులు ఆయనను ముందు జాగ్రత్త చర్యగా అరెస్ట్‌ చేశారు.
http://www.suryaa.com/main/showNews.asp?cat=1&subCat=2&ContentId=58355

No comments:

Post a Comment