బాల్యంలో చందమామ కథలు చదువుకున్న ఆ కుర్రవాడు చందమామ కథలు చెప్పే మంచితనం తన చుట్టూ ప్రపంచంలో కనిపించడం లేదని మనసుకు తట్టినప్పుడు సంప్రదాయాలను, బాల్యంలో ఆచరించిన ఆర్.ఎస్.ఎస్ భావాలను కూడా త్యజించి పోరుబాట పట్టాడు. ఒక బ్రాహ్మణ కుర్రాడు -నమ్మిన విశ్వాసం కొరకు నేలకొరిగిన మాన్యుడి కులం గురించి ప్రస్తావిస్తున్నందుకు మన్నించాలి- జన్మతః వచ్చిన సమస్త సంప్రదాయ విలువలను తాను నమ్మిన లోకహితం కోసం వదులుకుని తుపాకి బాట పట్టాడు.
ఇల్లు, తల్లితండ్రులు, రక్తసంబంధాలు, తనదీ అనిపించుకున్న సమస్త వ్యక్తిగత సంబంధాలను ఆ పిల్లవాడు క్షణమాత్రపు నిర్ణయంతో తెంచేసుకున్నాడు. జీవితాన్ని విప్లవం కోసం అంకితం చేసి 35 ఏళ్ల క్రితం భవబంధాలకు దూరమై ప్రజల్లో కలిశాడు. 17 సంవత్సరాల నూనూగు మీసాల లేత వయసులో అతడు చేపట్టిన మార్గం ఇవ్వాళ భద్రసమాజం దృష్టిలో 'హింసా'మార్గంగానే కనబడవచ్చు. రాజకీయ పంధా పేరిట భౌతిక హత్యలను ప్రేరేపిస్తున్న "పెడధోరణి"గా నాగరిక సమాజం తన మార్గాన్ని అభిశంసించవచ్చు.
కానీ, చందమామ కథలతో బాల్యాన్ని పండించుకున్న ఈ అత్యంత సున్నిత హృదయుడు 35 సంవత్సరాల పాటు ప్రజలు వినా మరో మార్గం తనకు లేదనుకున్నాడు. ఎవరు అంగీకరించినా, అంగీకరించకున్నా తెలుగునేలపై, మధ్యభారత దేశంలో లక్షలాది మంది ప్రజలను కదిలించిన ఒక మహోద్యమాన్ని ముందుండి నడిపించాడు.
ఉద్యమ అనివార్యతల్లో భాగంగా అమ్మను చూడలేకపోయినవాడు. కన్నఊరికి, కన్నవారికి, తల్లిపేగుకు దూరంగా గడపవలసివచ్చినవాడు... జీవితమే ఒక పండుగ కావాలని, కోట్లాది మంది తల్లుల కన్నీళ్ళు తుడవాలనీ, పండుగ-పబ్బాలు ఎవరి మత విశ్వాసాల ప్రకారం వారు శాంతియుతంగా జరుపుకోవాలనీ కన్నతల్లులందరి మమకారం కోసం ఎవరు ఛీత్కరించినా, తిరస్కరించినా ప్రాణాలొడ్డి పోరాడుతున్నామని మరణించడానికి రెండేళ్ల క్రితం కూడా కన్నతల్లికి సుదూరం నుంచి ఉత్తరం పంపించిన వాడు....
'నీ రహస్యాన్ని, గుట్టును దాచలేనప్పుడే నీ పతనం ప్రారంభమవుతుంద'ని రెండు వేల సంవత్సరాల క్రితం చాణక్యుడు తెగేసి చెప్పిన దేశంలో పుట్టిన ఈ కుర్రాడు ఆ రహస్యజీవితాన్నే తన ప్రాణవాయువుగా ఎంచుకుని తాను నమ్మిన విశ్వాసం కోసం 35 ఏళ్లు పోరాడుతూనే చివరికి నేలకొరిగాడు. మన దూషణ భూషణలకు అతీతంగా విగతజీవుడై కన్న ఊరిలో ఇవాళే అంతిమ సంస్కారానికి నోచుకుంటున్నాడు.
ఆంధ్ర ప్రదేశ్ నుంచి నేపాల్‌తో దేశ సరిహద్దుల వరకు వందలాది, వేలాది మైళ్లు కాలినడకతో చుట్టిన ఈ మనిషి చాలా మంది దృష్టిలో విప్లవాన్నే కాదు.. ఆరు పదుల జీవితంలో కూడా ఏమీ సాధించలేనివాడిగానే కనపడవచ్చు.
కాని ఒకరన్నట్లు, 'విప్లవం గురించి అట్లా విడిచిపెడదాం. ఒక మనిషి ఎనిమిది రాష్ట్రాల్లో తన పాదముద్రలు వేయడం ఎలా సాధ్యం? ఒక మనిషి ఎనిమిది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఆసోం దాకా విప్లవాల కలలను ఎగజల్లడం ఎలా సాధ్యం? ఆ మనిషి ఎక్కడుంటే అక్కడ ఒక సైన్యం తయారు కావడం ఎలా సాధ్యం? ఆయనేమన్నా... జానపద హీరోనా.. వేయి చేతులు, వేల కాళ్లు, లక్షల ఆలోచనలు ఏకకాలంలో అనేక పనులు చేయగలిగిన మహిమాన్వితుడా కాదు. మల్లోజుల కోటేశ్వరరావు ఒక మనిషి. మామూలు మనిషి. ప్రేమగా మాట్లాడే మనిషి. ప్రేమగా నలుగురితో నవ్వుతూ మాట్లాడే మనిషి.'
ఆర్.ఎస్.ఎస్ నుంచి ఆర్ ఎస్ యు దాకా, కరీనంగర్ పెద్దపల్లి నుంచి లాల్‌గడ్ జంగిల్ మహల్ దాకా పాదరసంలా పరిణమిస్తూ ప్రవహించిన ఈ సామాన్యుడు ఇవ్వాళ దేశంలోని అన్ని ప్రచార, ప్రసార సాధనాలలో ప్రధానవార్తగా మిగిలాడు. మంచిగా, చెడ్డగా కూడా కావచ్చు. కాని ఒకప్పుడు ఈ కుర్రాడిని సంఘంలో చేర్పించి కర్రసాము నేర్పించి క్రమశిక్షణతో మలిచిన నాటి ఆరెసెస్ గురువులు, నాటి ఆరెసెస్ సహచరులు సైతం వ్యక్తిగా అతడి సున్నిత గుణాన్ని, స్పందించే తత్వాన్ని తలుచుకుని మరీ బాధపడుతున్నారు.
కిషన్ జీ అని దేశానికి, ప్రపంచానికి కూడా పరిచయమైన పేరుకు ముందు, ఉద్యమ జీవితంలో తన మరోపేరు రామ్‌జీ. ఆ ఉద్యమంలో 13 సంవత్సరాలు పాలు పంచుకున్న మాలాంటివాళ్లందరికీ విద్యుత్తేజంలాంటి ప్రేరణ కలిగించిన రామ్‌జీ ఇతడు. ఆ కుర్రాడి ఆచరణను, సిద్ధాంతాన్ని నూటికి నూరుపాళ్లు మనలో చాలామంది తోసిపుచ్చవచ్చు. దేన్నయినా తోసిపుచ్చగల, విమర్శించగల, దూషించగల మన హక్కును ఎవరూ కాదనలేరు కూడా.
నిజాయితీగా ఆలోచిస్తే గాంధీజీ తప్ప ఈ దేశంలో ఎవరూ ఏ క్షణంలో కూడా పాటించని గాంధీయ వాదానికి భిన్నంగా మూడున్నర దశాబ్దాలపాటు తిరుగుబాటు మార్గంలోనే తాను నడిచిన మాట వాస్తవం.
మనిషి ఎందుకు తిరగబడుతున్నాడో.. మానవ సమూహాలు వేలాది సంవత్సరాలుగా పోరాట బాటలోనే ఎందుకు నడుస్తూ వచ్చాయో అర్థం కాని బాల్య అమాయకత్వంలో సమాజంలో ఏ ఒక్క వర్గమూ, బృందమూ ప్రస్తుతం లేదు. తిరుగుబాటు ఎందుకు పుడుతుందో అర్థం కావడానికి మనం నేతాజీ, భగత్ సింగ్‌ల వద్దకే పోనవసరం లేదు. మన గడ్డపై పుట్టి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంపైకే అలుగు బాణాలు సంధించిన మన అల్లూరిని తల్చుకుంటే చాలు.
ఒక ప్రజాస్వామిక మేధావి అన్నట్లుగా, 'ఈ దేశ సార్వభౌమత్వాన్ని, దేశ వారసత్వ సంపదల్ని కాపాడుతున్నది వాస్తవంలో ఆదివాసీలే. దేశాన్ని టోకుగా, చిల్లర చిల్లరగా అమ్ముతున్నది రాజకీయ నాయకులు, అవినీతి పరులైన ఉన్నతాధికారులే. దేశానికి చెడుచేస్తున్నవారే నిత్యం మనందరి గౌరవ మర్యాదలు పొందుతున్నారు! లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఈ ఘరానా మనుషులు స్వాయత్తం చేసుకొంటున్నారు. ఈ దేశ సందను విదేశీ పెట్టుబడిదారుల నుంచి కాపాడే ఆదివాసీలు, వాళ్ళకి నాయకత్వం వహిస్తున్న ఆదిరెడ్డి, సంతోష్ రెడ్డి, అజాద్, కిషన్‌జీలు అత్యంత ప్రమాదకారులుగా ముద్రవేయబడి కిరాతకంగా చంపబడుతున్నారు.'
ఆదివాసుల కాళ్లకింది భూమి ఇవ్వాళ మన దేశంలో నిలువునా కరిగిపోతోంది. ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా ఈ దేశంలో పుట్టబోయే వంద తిరుగుబాట్లకు కూడా ఇదే మాతృక. తిరుగుబాటు అవసరం లేనంత ధర్మబద్ధంగా రాజ్యం రెండుపాదాల మీద అయినా నడుస్తూ ఉంటే దేశవ్యాప్తంగా ఇన్ని వేల ప్రాణాలు హరించుకుపోయేవి కాదు. ఇంకా పోతూ ఉండేవి కావు.
వ్యక్తిగత అవసరాలకు, ఉద్యమావసరాలకు, దేశ రక్షణ అవసరాలకు మనిషి తోటి మనిషిని చంపడం, చంపక తప్పని పరిస్థితి రావడం ఉండకూడదని కోరుకోవడం మానవ విలువల్లోనే అత్యున్నతమైన విలువ. ఇది ఏకాలంలోనయినా ఎవరయినా వ్యతిరేకించలేని విలువ. కాని మనిషిని, జీవితాన్ని భౌతికంగా, మానసికంగా, మనుగడ పరంగా చంపని, పీడించని సమాజం కోసం మనిషి అన్వేషణ ఇంకా ఫలించడం లేదు.
ఏ హింసా ఉండకూడదని కోరుకోవడం ఎంత గొప్ప విలువో, సమాజ జీవితమే, మానవ జీవితమే పరమ హింసాయుతంగా అన్ని రకాలుగా మారిపోతున్నప్పుడు కొన్ని రకాల హింసలను ఖండించటమే మన సమాజంలో ఒక పెద్ద అభాసగా మిగిలిపోతోంది. ఒకే ఒక్క ఉదాహరణ.
'అవతార్' సినిమాలోని సాంకేతిక మాయాజాలాన్ని దిగ్భ్రమతో నోరు వెళ్లబెట్టి చూస్తాం. కాని ప్రపంచంలో ఎన్ని అవతార్ పోరాటాలు కొద్దో గొప్పో స్థాయిలో తమ మనుగడ కోసం అనివార్యంగా, అవసరంగా కొనసాగుతున్నాయో, ఇంకా కొనసాగబోతాయో కూడా మనలో చాలామందిమి తెలియనట్లే, చూడనట్లే వ్యవహరిస్తాము.
భిన్న దృక్పథాలు, అవసరాలు ఘర్షిస్తున్న సమాజంలో కిషన్‌జీ కొందరికి దేవుడయితే కొందరికి రాక్షసుడుగానే కనబడవచ్చు. ఆదివాసీలు బతకాలంటే కిషన్ జీ వంటి వ్యక్తులు అవసరం. ఈ కోణంలోనే మనుగడ కోసం పోరాడుతున్న, పోరాడక తప్పని ప్రజలు మాత్రం కిషన్‌జీని "భావి తరాలు వొళ్లు గగుర్పొడిచేలా, నిలువెల్లా విద్యుత్ ప్రవహించేలా, చరిత్ర పొడవునా నిలిచి ఉండే వీరుడిలా, జానపద కథానాయకుడిలా తలపోసుకుంటారు."
కిషన్ జీ అనే మన జనపదాల విద్యాధిక యువకుడు నలుగురు నడిచే బాటలో కాకుండా ఎందుకు మరో మార్గం పట్టాడో అతడి మాటల్లోనే తెలుసుకుందాం. తెలుగు సమాజంలోని ఒక భాగానికి అతడి మరణం పట్ల కలిగిన స్పందనలను కూడా చూద్దాము.
కె.రాజశేఖర రాజు.
http://teluguvartalu.wordpress.com/2011/11/28/%E0%B0%9A%E0%B0%82%E0%B0%A6%E0%B0%AE%E0%B0%BE%E0%B0%AE-%E0%B0%A8%E0%B1%81%E0%B0%82%E0%B0%9A%E0%B0%BF-%E0%B0%9C%E0%B0%82%E0%B0%97%E0%B0%B2%E0%B1%8D-%E0%B0%AE%E0%B0%B9%E0%B0%B2%E0%B1%8D-%E0%B0%A6/
జీవితమే ఒక పండుగ కావాలమ్మా! - కిషన్ జీ
https://www.andhrajyothy.com/EditorialShow.asp?qry=2011/nov/25/edit/25edit3&more=2011/nov/25/edit/editpagemain1&date=11/25/2011
లాల్‌గఢ్ యుద్ధభేరి ‘మల్లోజుల’!
http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=31490&Categoryid=1&subcatid=1
గ్రీన్‌హంట్‌లో భాగమే ఈ హత్య
https://www.andhrajyothy.com/EditorialShow.asp?qry=2011/nov/26/edit/26edit3&more=2011/nov/26/edit/editpagemain1&date=11/26/2011
కులాన్ని త్యజించిన కిషన్‌జీ
https://www.andhrajyothy.com/EditorialShow.asp?qry=2011/nov/27/edit/27edit2&more=2011/nov/27/edit/editpagemain1&date=11/27/2011
మన కాలం వీరుడు...
http://www.namasthetelangaana.com/News/Article.asp?category=1&subCategory=7&ContentId=48280
మావోయిస్టు ఉద్యమం -కిషన్‌జీ...!
http://www.namasthetelangaana.com/News/Article.asp?category=1&subCategory=7&ContentId=48279
చరిత్ర నిర్మాత కిషన్ జీ
http://www.namasthetelangaana.com/News/Article.asp?category=1&subCategory=7&ContentId=48012
ఒక తరం ప్రతినిధి
http://www.namasthetelangaana.com/News/Article.asp?category=1&subCategory=5&ContentId=47744
స్వార్థమా.. వర్ధిల్లు..!
http://www.namasthetelangaana.com/News/Article.asp?category=1&subCategory=7&ContentId=48014
మావోయిస్టులపై అంతటా అదే ‘మమత’
http://www.namasthetelangaana.com/News/Article.asp?category=1&subCategory=7&ContentId=48015
'కిషన్ జీ' నియస్
https://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2011/nov/25/main/25main8&more=2011/nov/25/main/main&date=11/25/2011
బిటెక్ కిషన్
https://www.andhrajyothy.commainnewsshow.asp
qry=2011nov25main25main4&more=2011nov25mainmain&date=11252011
ప్రజల్లోకి వచ్చి పోరాడండి
https://www.andhrajyothy.com/EditorialShow.asp?qry=2011/nov/26/edit/26edit4&more=2011/nov/26/edit/editpagemain1&date=11/26/2011
కాల్చారు.. కోశారు.. కడతేర్చారు!
https://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2011/nov/27/main/27main1&more=2011/nov/27/main/main&date=11/27/2011
ఎన్‌కౌంటర్ లో కాదు, ‘కిషన్ జీ’ ని చిత్ర హింసలు పెట్టి చంపారు -వరవర రావు
http://teluguvartalu.wordpress.com20111125%E0%B0%8E%E0%B0%A8%E0%B1%8D%E2%80%8C%E0%B0%95%E0%B1%8C%E0%B0%82%E0%B0%9F%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%95%E0%B0%BE%E0%B0%A6%E0%B1%81-%E0%B0%95%E0%B0%BF%E0%B0%B7%E0%B0%A8%E0%B1%8D#comment-1454
‘కిషన్ జీ’ ఉరఫ్ ‘మల్లోజుల కోటేశ్వర రావు’ ఎవరు
http://teluguvartalu.wordpress.com20111126%E0%B0%95%E0%B0%BF%E0%B0%B7%E0%B0%A8%E0%B1%8D-%E0%B0%9C%E0%B1%80-%E0%B0%89%E0%B0%B0%E0%B0%AB%E0%B1%8D-%E0%B0%AE%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B1%8B%E0%B0%9C%E0%B1%81%E0%B0%B2-%E0%B0%95%E0%B1%8B
---------------
2 స్పందనలు to “చందమామ నుంచి జంగల్ మహల్ దాకా….”
Provided links are not in the correct format… Please correct it…
Posted by చార్వాక | నవంబరు 28, 2011, 3:02 సాయంత్రము
Reply to this comment
--------------------
అమ్మ నిన్ను కన్నందుకు వందనాలు
విప్లవాలు, సాయుధపోరాటాలు తెలుగు నేలకి కొత్తకాదు. నాగలిపట్టె రైతన్న తుపాకి పట్టాలంటూ 60 ఏళ్ళ క్రితం మొదలైన తెలంగాణ రైతాంగ సాయుధపోరాటం అగిపోయినా, చారుమజుందారు పిలుపునందుకోని తిరిగి అటు శ్రికాకుళంలో ఇటు తెలంగాణలో మళ్ళీ ఉద్యమాలు చెలరేగాయి. నిండు యవ్వన ప్రాయంలో ఈ ఉద్యమంలో దూకి గత ముడున్నర దశాబ్దాలుగా నేలకొరిగిన యువత ఐదు వేలకుపైచిలుకన్నది ఒక అంచనా. కేవలం 20ల సగటు వయసులో సామాజానికి చోదక శక్తి కావలసిన యువతను నష్టపోవడం ఆ సమాజానికే ఒక నష్టం ఐతే వారిని కన్న తల్లులకు అది తీరని గర్భశోకం. రాజకీయాలు తెలియకపోయినా, రహస్య జీవితంలో కన్న బిడ్డ భద్రతకోసం ఆరాటం, వాళ్ళ ఆచూకి కోసం నిర్భందం ఒకే సారి అనుభవించే తల్లులకు వారి మరణవార్త ఆశనిపాతం. ఒక గొప్ప ఆదర్షం కొసం, తను నమ్మిన సిద్దంతం కొసం బంధాలను, అనుబంధాలను వదులుకొని తమ ప్రాణాలను సైతం తృణ ప్రాయంగా వదులుకున్న బిడ్డలు గత మూడున్నర దశాబ్దాలుగా ఈ దేశంలో ఏందరో. అటువంటి అరుదైన వ్యక్తే మల్లొజుల కోటేశ్వర రావ్ ఉరఫ్ కిషన్ జీ. విప్లవాన్ని ఊపిరిగా మలుచుకున్న మనిషి, విప్లవ గడ్డ, పోరుగడ్డ కరీం నగర్ జిలాలో పుట్టి ఎక్కడైతే నక్సల్బరి పురుడుపోసుకుందో అక్కడనే నాయకుడిగా ఎదిగి, ప్రజలలో ఒదిగి కర్కష ప్రభుత్వాల పన్నాగాలకు బలీఇపోయిన వ్యక్తి కిషన్ జీ
ఆయనెవరో నేటి తరానికి తెలియకపోవచ్చు. ఎంతో మంది విద్యార్థులు తెలంగాణ కోసం బలి అయిన రోజులు. ఉద్యమాన్ని రాజ్యం కృరంగా అణచివేస్తూ, న్యాయం అడిగిన యువకెరటాలను పిట్టల్లా కాల్చివేస్తూ ఉంటే ఏదో ఒకటి చేయాలని యువత తపన పడుతున్న రోజు;లవి. ఇటు రాజకీయాల ద్వారా రాని తెలంగాణ, ఏన్నో ఒప్పందాల ద్వారా అందని న్యాయం. ఎన్నో వలసలు, వనరుల విధ్వంసం, సాంసృతిక హింస, మానసికంగా అవమానం. అత్మగౌరవనికి అన్యాయం జరుగుతుంటే ఆపలేని నిరాసక్తత. అప్పుడే కొత్తగా గాలులూ వీస్తూ, ప్రజాపోరాటాలకు నాంది పలుకుతున్న కొత్త రాజకీయాలు. న్యాయం, ధర్మం అడుక్కుతింటే రావని, ప్రశాంత వాతావరణంలో రాజ్యానికి ఎటువంటి నష్తం కలగకుండా పోరాటాలు చేస్తే తమ ప్రాణాలకు ముప్పే కాని దోపిడీ దారులకు కాదని తెలుసుకున్న రోజులవి. అటువంటి వాతావరణంలో గ్రామాలకి తరలండి అన్న పిలుపునందుకున్న కిషన్ జీ ప్రత్యమ్నాయా రాజకీయాలవైపు దృష్టి సారించి భూస్వాముల గుండెల్లో గుబులు పుట్టించాడు. పుట్టింది అగ్రకులాలో ఐనా అందరికి సమన్యాయం అందలనె సిద్ధంతాన్ని నన్ని సబ్బండ కులాలవైపు నిలబడ్డడు. భారత రాజకీయాలల్లో కేవలం కొన్ని వర్గాల వారికి మత్రమే న్యాయం చేకురుతుందని, అధికార దాహం పేద, దళిత, ఆదివాసి ప్రజలని అణిచివేస్తున్నాయని వాటిని ప్రశ్నించేందుకు ఒక ప్రత్యమ్నాయ పోరాట రూపం ఎన్నుకోవడమే ఆయన చేసిన నేరం. ఈ దేశంలో ప్రత్యమ్నాయ రాజకీయాలకు ఒక రంగు ఉంటుంది. ఒక బ్రాండ్ ఉంటుంది. ఒక పోరాట రూపం ఉంటుంది. సాయుధ పోరాటం, పీపుల్స్ వార్, నక్సలైట్, మావోయిస్టు ఇవన్ని వినకూడదు, మాట్లాడకూడదు. మాట్లాడినవాడు కరడుగట్టిన రక్తపిపాసి, మనుషులను ఖండ ఖండాలుగా నరికే కసాయివాడు. ఇది రాజ్యం. రాజ్యానికి కొమ్ము కాసే పార్లమెంటరిదారులు వాడే భాష.
ఇది బూటకపు ఎన్ కౌటర్ల దేశం. ఈ దేశంలో ఆజాదులను వెంటాడి వెంటాడి చంపుతారు. కారణం వారు నక్సలైట్లు. హేమచంద్రపాండేను చంపుతారు కారణం ఆయన ఒక జర్నలిస్టు. ఎందుకంటే ఆయన ఈ వ్యవస్థను ప్రశ్నించాడు. ప్రజలపై జరుగుతున్న హింసను తన కలంతో అక్షర రూపం ఇచ్చాడు కాబట్టి. ఆయనకు ప్రత్యామ్నాయ రాజకీయాలతో సంభందాలు ఉంటాయి కాబట్టి. ఆయన ఇంట్లో నిషిద్ద సాహిత్యం ఉంటుంది కాబట్తి. పొరపాటు పడవద్దు. బూతు సాహిత్యం గురించి కాదు మనం మాట్లాడుతుంది. మార్పును కోరే సాహిత్యం గురించి మాత్రమే. కొన్ని నెలల తర్వాత సుప్రీంకోర్టు ఇది అన్యాయం అంటుంది. అది ఏ పత్రికా రాయదు. రాసినా వాటి గురించి పెద్దగా చర్చ జరగదు. గుజరాత్ లో మోడి ప్రభుత్వం కూడా ఇజ్రత్ జహాన్ నీ మరో ముగ్గురిని ఎన్ కౌటర్ చేస్తుంది. ఉగ్రగాదులు అని వారిపై ముద్ర వేస్తుంది. జాని కొన్ని నెలల తర్వాత ఇవే కోర్టులు వారిది బూటకపు ఎన్ కౌటర్ అంటుంది. షీలాశూద్ అనే సామాజిక కార్యకర్త హక్కును అడిగిన పాపానికి హత్య కావించబడుతుంది. ఐనా ఏ వ్యక్త్తి ప్రశ్నించడు. ఏ పత్రికా పెద్ద వార్తగా వ్రాయదు. పాటలు పాడుకుంటూ, ఇది దోపిడి రాజ్యం, దోంగల రాజ్యం అని తన కళారూపంతో ప్రజలను చైతన్య పరుస్తున్నందుకు జీతెన్ మారాండికి ఉరిశిక్ష. ఇక్కడ వాళ్ళు రాసుకున్న రాజ్యాంగాన్ని, న్యాయ సూత్రాలను తుంగలో తొక్కి, ఎక్కడ పడితే అక్కడ, ఎవ్వరిని పడితే వారిని పట్టుకోని అన్యాయంగా చంపోచ్చు. వారికి మావోయిస్టు అని పేరు పెట్టొచ్చు. నీ చేతిలో తూపాకి ఉంటే దేశ రక్షణ. నాచేతిలో తూపాకి ఉంటే నేనొక నిషిద్దం. అభివృద్ది అనే ముసుగులో ఆదివాసులను. అడవులను, బీదప్రజలను దేశ సార్వభౌమత్వాన్ని కార్పోరేట్ శక్తులకు తాకట్టు పెడుతున్న రాజకీయా పార్టీలను ఎదిరించకూడదు. దీనిని ఎవడైనా ప్రశ్నిస్తే వాడు నిషేదిత సంస్థకు చెందిన వ్యక్తి. ఇది దేశ, రాజ్య, ప్రపంచ సూత్రం.
Posted by david | నవంబరు 28, 2011, 3:50 సాయంత్రము

No comments:
Post a Comment