Sunday, 18 December 2011

అడవి నేలపై రక్తపు మడుగులో...


అడవి నేలపై రక్తపు మడుగులో...
మృతదేహాన్ని చూపించిన బలగాలు

నేడు మిడ్నపూర్‌లో పోస్టుమార్టం
భౌతికకాయాన్ని పెద్దపల్లికి తరలిస్తాం మమత
'ఉల్ఫా'యే పట్టించిందా
పార్టీలో అంతర్గత విభేదాలూ కారణమా

మిడ్నపూర్‌ , నవంబర్ 25  అడవి చెట్టుకు పూసిన అగ్గి పువ్వు... నిస్తేజంగా నేల వాలింది. విప్లవ గేయమై నినదించిన దేహం నిలువెల్ల గాయాలతో

నిర్జీవమైంది. ఉరకలేసి, ఉడుకెత్తించిన నెత్తురు... నీరులాకారి నేల తల్లిని తడిపింది. ఎన్నో తూటాలను గర్జించిన చరిత్ర ఉన్న తుపాకీ కూడా 'పోరాట

సహచరి'లా పక్కనే కనిపించింది.

అవును... అది, మల్లావఝల కోటేశ్వరరావు అలియాస్ కిషన్‌జీ భౌతిక కాయం! నల్లటి కురులు, నీలి రంగు చొక్కా, రక్తంతో తడిసి ఎర్రబడ్డ కుడిచేయి, చెవి నుంచి రక్తపు ధారలు, ముఖంపైనా రుధిరపు మరకలు, ఒకవైపు కిట్‌బ్యాగ్, మరోవైపు అసాల్ట్ రైఫిల్!... ఇది కిషన్‌జీ మృతదేహం కనిపించిన తీరు! బెంగాల్‌లో పశ్చిమ మిడ్నాపూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన కిషన్‌జీ శరీరాన్ని శుక్రవారం పోలీసులు ప్రపంచానికి చూపించారు.

అనంతరం పోస్టుమార్టం కోసం మిడ్నపూర్‌కు తరలించారు.

శనివారం పోస్టుమార్టం నిర్వహించనున్నారు. ఆయన ఉన్నప్పుడు ఎన్ని సంచలనాలు సృష్టించారో... ఆయన మరణానికి కారణమైన 'ఎన్‌కౌంటర్' కూడా అంతే సంచలనాత్మకంగా మారింది. అది బూటకపు ఎన్‌కౌంటర్ అని మావోయిస్టు, ప్రజా సంఘాలు చెబుతుండగా... కానే కాదు, అక్షరాలా నిజమైన ఎదురు కాల్పులే అని సీఆర్‌పీఎఫ్ బలగాలు తేల్చి చెప్పాయి.

మావోయిస్టు పార్టీ బలోపేతానికి అసోం వెళ్లిన కిషన్‌జీని 'ఉల్ఫా'లోని ఒక వర్గం పట్టించిందనే వాదన బలంగా వినిపిస్తోంది. అదే సమయంలో...

నక్సల్స్‌లోని అంతర్గత విభేదాలే ఆయన పట్టుబడటానికి కారణమని కూడా తెలుస్తోంది.
https://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2011/nov/26/main/26main2&more=2011/nov/26/main/main&date=11/26/2011

No comments:

Post a Comment