కొడుకు మరణ వార్త విన్న కిషన్ జీ అమ్మ ఏమని తల్లడిల్లింది కవి ‘అజ్ఞాతి‘ ఇలా ఆవిష్కరించాడు.
(బొమ్మను క్లిక్ చేసి పెద్దది చూస్తూ చదవండి)
కవిత జెపిఇజి ఫార్మాట్లో సేవ్ చేసి పోస్ట్ చేసినందున నోట్‌ప్యాడ్ ఫైల్‌లో సేవ్ చేయడం సాధ్యపడలేదు. పైన లింకును తెరిచి ఒరిజినల్ కవితను చూడగలరు
http://teluguvartalu.com/2011/11/28/%E0%B0%95%E0%B0%B5%E0%B0%BF-%E0%B0%86%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B7%E0%B1%8D%E0%B0%95%E0%B0%B0%E0%B0%BF%E0%B0%82%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%95%E0%B0%BF%E0%B0%B7%E0%B0%A8%E0%B1%8D-%E0%B0%9C/
POSTED BY VISEKHAR ⋅ నవంబరు 28, 2011 ⋅ అభిప్రాయములు
26 స్పందనలు to “కవి ఆవిష్కరించిన ‘కిషన్ జీ’ తల్లి గుండె ముచ్చట”
వింతలలో కెల్ల వింతైన మాట
నక్సలై టెవడైన నేల కొరిగాడొ
తప్పక వినిపించు తప్పుడు మాట
పౌరహక్కులపేర వీరంగమాడే
మానవహక్కుల మాట ట్రిక్కులతొ
కథలు చెప్పేవాళ్ళ కళ్ళ కేనాడు
వీళ్ళ ప్రియమిత్రుల వీర మావోల
మందు పాతరలకు మసియైన వాళ్ళ
యిళ్ళలో తల్లులూ యిల్లాళ్ళు కూడ
ఉండవచ్చన్నదే తోచదేనాడు
ఈ నాడు తనబిడ్డ యైన మావోకు
చావు మూడిందని బావురు మంటు
విలపించు తల్లి ఆ బిడ్డ యిన్నాళ్ళు
ఇతర తల్లుల బిడ్డ లెందర్ని చంపి
విప్లవం పేరుతో విర్రవీగాడొ
యెరుగదో యెరిగియే యిదిచాల గొప్ప
పని యని సంతోష పడినదో గాని
ఆ బిడ్డకే కాలమన్నది మూడి
కూలిపోతే చాల గోల పెడుతోంది
మావోల అమ్మల బాధలే కాని
మావోల చేతిలో మరణించి నట్టి
బిడ్డల్ని తలచుకు విలపించు యితర
అమ్మల్ని చూడలేనట్టి సంఘాలు
కేవలం మావోల కూట సంఘాలు
మావోలకైతేను మనుషుల్ని చంపి
గంతులేసే హక్కు కట్టబెడతారు
యితరులకైతేను వీళ్ళ చేతుల్లొ
చచ్చేందుకే మనిష జన్మయెత్తింది
మీడియా వాళ్ళ సొమ్మేమిపోయింది
హంగుచేసేఛాన్సు నసలొదులుకోరు
ఖాకీలు చస్తేను కల్పించుకోరు
ఒక మావొ చస్తేను ఉరకలేస్తారు
జనులు వార్తలు చూసి చప్పళిస్తారు
మామూలు వార్తలే మనకెందు కంటు
పట్టించుకోకుండ బ్రతుకుతుంటారు
POSTED BY తాడిగడప శ్యామలరావు నవంబరు 28, 2011, 915 సాయంత్రము
శ్యామల రావు గారూ ఇది మీరు రాసినదేనా
కవితలో కొన్ని వాస్తవాలు లేకపోలేదు.
‘వ్యక్తిగతనిర్మూలన’ మావోయిస్టు పార్టీ విధానంలోని అతి పెద్ద లోపం.
అది మనుషుల ప్రాణాలతో సంబంధించింది కనుక కేవలం లోపం గా చెప్పుకుని కొట్టిపడవేయలేం.
కాని కిషన్ జీ అమ్మగారు. ఆవిడేం చేశారు
ఆవిడకి కిషన్ జీ కొడుకు మాత్రమే.
ఆమె దుఃఖం ఓ మాతృ హృదయానిది మాత్రమే.
మాతృ దుఃఖాలని పోల్చడం న్యాయం కాదు.
పోలీసు చావు ఎవరి కోసం అతను సేవ చేసే ధనిక వర్గాల కోసం.
కిషన్ జీ లాంటి వారి చారు ఎవరి కోసం ఈ ప్రశ్న ఒకసారి మీరు వేసుకుని సమాధానం చెప్పుకోవడానికి ప్రయత్నించండి.
పోలీసు దృష్టి నెల తిరిగితే వచ్చే జీతం పైన.
‘కిషన్ జీ’ ల దృష్టి శ్రమ చేస్తున్నా పొట్ట నిండని ఆదివాసీలు, దళితులు, భ్రష్టులు… వీళ్ళే.
బిటెక్ చదువు ఒదిలింది అడవుల్లో సుఖపడదామని కాదు.
అడవుల్లోని ఖనిజవనరుల కోసం అడవి బిడ్డలను అడవినుండే గెంటేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు గెంటేస్తుంది వారే కదా
అడవి దాకా ఎందుకు కాకరాపల్లి, సోంపల్లి జనం ఏం చేశారని పోలీసులు చంపేశారు తమ ఊరు వదలం అన్నందుకేగా
బిలియన్ డాలర్ల డబ్బులు పెట్టి మాయా మహల్ కట్టించుకున్నాడు ముఖేష్ అంబాని. ఆయన నగర చట్టాల్ని అతిక్రమించి భవంతి కట్టాడు.
అతని దగ్గర లంచం మింగి రెగ్యులరైజ్ చేసాయి నగర, రాష్ట్ర ప్రభుత్వాలు.
రోడ్డు పక్క పల్లీలు, బట్టలు.. ఒకటేవిటి, చాలా, అమ్ముకునేవారిని తరిమి తరిమి కొట్టేది పోలీసులు కాదా
ఐనా సరే. పోలీసుల్ని టార్గెట్ చేసి చంపడం నేను సమర్ధించను.
వాళ్ళు ‘వ్యక్తిగత నిర్మూలన’ నిర్మూలన సిద్ధాంతాన్ని వదలవలసిందే.
కాని మావోయిస్టులు లేవనెత్తిన ప్రశ్నలు
చనిపోయిన పోలీసు తల్లి దుఃఖం, తుపాకులు, మరణాలు… ఇవేనా
వాళ్ళింకా ఎన్ని ప్రశ్నలు లేవనెత్తారు!
ఈ దేశంలో బిలియనీర్ల ఆస్తులు పెరుగుతూ పోతున్నాయి. లేనివాడి ఆదాయాలు తగ్గుతూ పోతున్నాయి. ఎందుకని అని వారడిగారు.
ఆదివాసీల్ని, దళితుల్ని, రైతులని వారి భూములనుండి వెళ్లగొట్టి బయటినుండి వచ్చిన కంపెనోళ్లకు ఇస్తున్నారు, ఎందుకని అని అడిగారు.
దేశంలో ఇన్ని కులాలు, వాటి మధ్య తేడాలు ఎందుకు, అవి పోవాలి అన్నారు.
కష్టించి పని చేసేవాళ్ళే ఈ దేశ భవిష్యత్తుని నిర్ణయించాలి అన్నారు.
దేశాన్ని దోచుకు తిని మెక్కేవాళ్ళ చేతిలో అధికారం తగదన్నారు.
జైళ్లలో ఉండాల్సిన దొంగలు, రేపిస్టులు, బందిపోట్లు, ఆయిల్ దొంగలు, స్పెక్ట్రం దొంగలు, ఇనుము దొంగలు పార్లమెంటులో, అసెంబ్లీల్లో ఉండడం తగదు అన్నారు.
స్వాతంత్ర్యం వచ్చి అరవై ఐదేళ్లొచ్చినా ప్రజలకు స్వతంత్రం వచ్చిందా అని అడిగారు.
మావోయిస్టులు లేవనెత్తిన ఈ సమస్యలను ఎవరూ చర్చించరేం
వారు ప్రధానంగా దేనికోసమైతే తుపాకి చేపట్టామని చెబుతున్నారో, ఆ సమస్యల పరిష్కారం గురించి ఎవరూ మాట్లాడరేం
POSTED BY VISEKHAR నవంబరు 28, 2011, 950 సాయంత్రము
అవునండీ, సందేహం లేదు. నేను వ్రాసినదే. కిషన్ జీ అమ్మగారి దుఃఖం ఓ మాతృ హృదయానిది. నిస్సందేహంగా. మాతృ దుఃఖాలని పోల్చడం న్యాయం కాదంటున్నారు, సరే. ఇక్కడ రెండు ప్రశ్నలున్నాయి. ఒక నక్సలైటు మృతికి గోలపెట్టి ఆతడి కుటుంబదుఃఖం అనేది సానుభూతికోసం వాడుకునే మన సంఘాల, టీవీల వాళ్ళకు అటువంటి నక్సలైట్ల చేతుల్లో చనిపోయిన వ్యక్తుల కుటుంబదుఃఖాలు ఎందుకు కనిపించవు; ఈ రోజున కుటుంబసభ్యడి మృతికి విచారంలో ములిగిన కుటుంబానికి అదే సభ్యుడు ఇతరవ్యక్తుల కుటుంబాల్ని చిదుముతుంటే అతడికది తప్పని నచ్చచెప్పాలని తోచలేదా అనేవి.
సగటుపోలీసును నక్సలైటును పోల్చుకోమంటున్నారు. సగటుపోలీసు చేస్తున్నది ఉదరపోషణోద్యోగం. అలాంటి వాళ్ళను చంపటం వలన యేమీ మార్పుతీసుకురాలేరు. సగటునక్సలైటు దారితప్పిన సెమీఇంటలెక్చువల్. అటువంటివాళ్ళలో చాలమంది ఉద్యమంలో ఇరుక్కుపోయినవాళ్ళుకూడా కావచ్చును. వీళ్ళూవాళ్ళూ కాల్చుకు చావటం వలన యేసమస్యకూ యెలాంటి చర్చా – పరిష్కారమూ దొరకవు కదా
సిధ్ధాంతపరంగా ఆలోచిస్తే దోపిడీ యేరూపంలో ఉన్నా అరికట్టవలసినదే. కాని తలలుతరిగి అరికడతామనేది భ్రమ. ఈ దేశంలో అక్షరాస్యత పెరిగి సగటు వ్యక్తి యితరుల చూపుడు వేలు కేసి కాకుండా స్వయంగా తనకుతాను దిశానిర్దేశం చేసుకోగలిగిన నాడు, చాలా సమస్యలు పరిష్కారమౌతాయి. దానికి చాలా చాలా సమయం పడుతుంది. అక్షరాస్యతను వేగవంతం చేయటానికి కృషి చేయటానికి బదులు ఆలోచనాపరులమని చెప్పుకునే వాళ్ళు వ్యక్తినిర్మూలనా ఉద్యమాలు చేపట్టటం సబబు కాదు. వాళ్ళకు మద్దతుగా కొంతమంది మేధావులం అని చెప్పుకునేవాళ్ళు ఒకవైపే తిరిగి చూస్తూ కన్నీళ్ళు కార్చటం క్షమార్హం కాదు
POSTED BY తాడిగడప శ్యామలరావు నవంబరు 29, 2011, 921 ఏ ఎమ్
శ్యామలరావుగారూ, నేను మావోయిస్టులు చేస్తున్న వ్యక్తిగత నిర్మూలన కు వ్యతిరేకం. కనుక నక్సలైట్ ల చేతుల్లో చనిపోయే వారికి సానుభూతి ఎందుకు రాదన్న ప్రశ్నకు నేను సమాధానం ఇవ్వలేను.
మావోయిస్టు పార్టీ, నక్సలైట్ సిద్ధాంత పార్టీల్లో ఒకటి. వ్యక్తిగత నిర్మూలనను వ్యతిరేకించే నక్సలైట్ పార్టీలు కూడా ఉన్నాయి. సి.పి.ఐ(ఎం.ఎల్-న్యూ డెమొక్రసీ), జనశక్తి లాంటి పార్టీలు ‘వ్యక్తిగత నిర్మూలన’ ను వ్యతిరేకిస్తున్నాయి. కాని ఇవి బలహీనంగా ఉన్నాయి.
నేనూ అదే గదా చెప్పాను. పోలీసు కేవలం తన ఉదర పోషణ కోసం ధనికవర్గాలకి సేవచేస్తూ ప్రజలపైన పెత్తనం చెలాయిస్తున్నాడు. ఆందోళన చేసినపుడు లాఠీలు, టియర్ గ్యాస్ లు, వాటర్ కెనాన్ లు వాడేది వారే. ‘కూంబింగ్’ పేరుతో ఏజన్సీలో గ్రామాలపై బడి కోళ్ళు, గొర్రెలు, దొంగిలించి తినడమే కాక గిరిజన మహిళలపైన అత్యాచారాలు చేసేది వారే. వాళ్ళు ఈ సమాజంలో పెత్తందార్ల పెత్తనం యదేచ్ఛగా కొనసాగడానికి ఉపయోగపడే ఊపకరణం. పోలీసు చేతిలో లాఠీ ఎలాంటిదో, పెత్తందార్ల చేతుల్లో పోలీసు అలాంటివాడు.
ఉదర పోషణ కోసం రేప్ లు చెయ్యాలా కోళ్ళు, గొర్రెలు దొంగిలించాలా మామూళ్ల కోసం ప్రజలను పీడించాలా ఇన్ని చేసే పోలీసు చావునీ, నక్సలైటు చావుతో పోల్చలేమనే నేను చెప్పడం. పోలీసుది స్వప్రయోజనం అయితే నక్సలైటు ది ప్రజా ప్రయోజనం (కనీసం వారి దృష్టిలోనైనా. అలా నమ్మే, వాళ్ళు అన్నీ వదులుకుని ఉద్యమం లోకి వస్తున్నారు. మార్గం తప్పా, ఒప్పా అన్నది ఇక్కడ కొంచెంసేపు పక్కన పెట్టాలి)
ముఖేష్ అంబానీకి అక్షరాస్యత లేకనే కె.జి బేసిన్ ఆయిల్ తవ్వకాల్లో ఖర్చులు ఎక్కువ చేసి చూపించాడా ఎ.రాజా స్వయంగా లాయర్. ఐనా ప్రభుత్వ సొమ్ముని ప్రవేటు వాళ్ళకి అప్పజెప్పి లంచాలు దిగమింగాడు.
చదువుకున్న వారిలో ఎంతమంది అన్యాయాల్ని ప్రశ్నిస్తున్నారు తమకెందుకులే అని అంతా తప్పుకుపోతున్నవారంతా నిరక్ష్యరాస్యులేనా
అక్షరాస్యత కావలసిందే. కాని దానికి చైతన్యానికి సంబంధం కనపడ్డం లేదు. ఏ చదువూలేకపోయినా ఒడిషాలో నాలుగు గ్రామాల ప్రజలు పోస్కో ప్రాజెక్టు కోసం తమను గ్రామాలనుండి ఖాళీ చేయడానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. పెద్ద పెద్ద చదువులు చదివి కూడా, అన్యాయం ఎక్కడ జరుగుతున్నదీ తెలిసి కూడా మనమంతా మనపని మనం చేసుకుంటూ సంఘం గురించి పట్టించుకోకుండా ఉన్నాం.
POSTED BY VISEKHAR నవంబరు 29, 2011, 455 సాయంత్రము
ఇంతకూ మీరనేదేమిటి పోలీసు అనేది ప్రజావ్యతిరేక వ్యవస్థ. అందులో పని చేసేవాళ్ళు దుష్షులు. కాబట్టి వాళ్ళకి నక్సలేట్ల చేతిలో (వీళ్ళల్లో అనేక రకాల వర్గాలు ఉన్నాయని కొత్తగా తెలిసింది) చావు ఆమోదయోగ్యం. వ్యక్తిగత నిర్మూలనలకు వ్యతిరేకించే మీరుకూడా, చచ్చేది పోలీసయితే సానుభూతి అవసరం లేదంటున్నారు. నక్సలైటు చచ్చేది ప్రజలకోసం కాబట్టి వాళ్ళలో యెవరైనా చస్తే తప్పకుండా జాతి శోకించవలసిందే అంటారు. పోలీసులే అకృత్యాలు చేస్తారు కాని నక్సలైట్లు మాత్రం నష్కామకర్మయోగులని మీ ప్రగాఢ విశ్వాసం. క్షమించాలి – నేను యేకీభవించలేను. ఇకపోతే అక్షరాస్యత విషయం. ఇది తక్కవగా ఉండటం వలన (అక్షరాస్యత తో సంబందం లేకుండా) స్వార్ధశక్తులను యెదిరచడానికి తగిన చేతన్యం ప్రజల్లో కొరవడుతోంది. దానిని తూటాలతో భర్తీ చేయ గలమని కొందరు, చేయలేమని కొందరు నమ్ముతున్నారు. అక్షరాస్యతకూ చైతన్యానికి సంబంధంలేదనుకుంటే నేను వాదించదలచుకోలేదు. అసలు అక్షరాస్యత అన్నమాటనే తప్పుగా నేడు అర్ధం చేసుకుంటున్నాము. విద్య యొసగును వినయంబు అన్న పద్యం మీకు పరిచయం అనుకుంటాను. విద్యను నేను కేవలం ధనసంపాదనమార్గంగా లెక్కించి ఇక్కడ నేను ప్రస్తావించటం లేదు. విద్య అనేది వినయ వివేకాలకు మూలమని నమ్మి వాడుతున్నాను. నేటి విద్యాబోధనలో నైతికవిలువలగురించి యేమీ నేర్పటంనేర్వటంలేదు కాబట్టి అసమగ్రంగా ఉందని నా బాధ. స్వయంగా ఆలోవించగలగడం పెరిగితే సమాజంలో, అవకాశవాదుల ఆటకట్టటం సులభమౌతుందనే నేననేది. కాదు, మేం కొందరం రాబిన్ హుడ్ అవతారాలెత్తి జనాన్ని రక్షంచటమే దారి. మేం మంచినాయకులం. కాదనే వాళ్ళు చెడ్డ నాయకులు – వాళ్ళకి చావే శిక్ష అనే వ్యవహారం క్రూరమనేది అటుంచి, ఆచరణలో యెప్పటికీ నెగ్గదనేది నా అభిప్రాయం. చదువుకునే పిల్లల్లో ఊహాత్మక హీరోయిజం కలలు నింపి వాళ్ళను తప్పుదారి పట్టించటం మినహా ఈ తుపాకీసిధ్ధాంతకర్తలు సాధిస్తున్నదిసాధించేది యేమీలేదని నా నమ్మకం.
POSTED BY తాడిగడప శ్యామలరావు నవంబరు 29, 2011, 745 సాయంత్రము
మీరు నిర్ధారించుకున్నవి నేను అన్లేదు. అనకుండానే నాకు అంటగట్టకండి శ్యామలరావుగారు.
ఒక లక్ష్యం కోసం ఉద్యమాలకు సిద్ధపడడం మనం ఇక్కడ వ్యతిరేకం, అనుకూలం అని రాసుకున్నంత సులభం కాదు. దానివల్ల పర్యవసానాలు తెలిసి కూడా సిద్ధపడడం నిస్సందేహంగా గొప్పతనమని నా అవగాహన. అయితే, లక్ష్య సాధన కోసం ఎన్నుకున్న మార్గం సరైనదా, కాదా అన్నది చర్చ. వ్యక్తిగత నిర్మూలన పంధాలో లేకపోయినా, ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రజా ఉద్యమాలను ప్రభుత్వాలు నెత్తిన పెట్టుకోవడం లేదు. మావోయిస్టుల లాగా తుపాకులు పట్టనందుకు ‘భేష్’ అనడం లేదు. పైగా వారిని కూడా అదే పద్ధతుల్లో చూస్తోంది.
అంటే ప్రజలు తమ నిరసనను, తమ కోర్కెలను, తమ పరిస్ధితిని ప్రభుత్వాలకు చెప్పుకునే పద్ధతులు ఏమీ లేకుండా ప్రభుత్వమే చేస్తోంది. ప్రభుత్వాలు వద్దు అనుకుంటున్న భావాజాలం సమాజంలో పుట్టకుండా ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు ఏవీ లేవు. వాగ్దానాలు తప్ప. ఇటువంటి అనేక సామాజిక పరిస్ధితుల నేపధ్యంలో పుట్టిన నక్సలైటు సమస్యను సామాజిక పరిస్ధితుల ద్వారానే అర్ధం చేసుకోవాలి.
అంతే తప్ప పోలీసుల చావు అనే ఒక్క చర్య ద్వారానే, లేదా కిషన్ జీ చావు – ఆమె తల్లి దుఃఖం… ఈ పరిధిలోనే ఒదిగిపోయే సమస్య నక్సలైట్ సమస్య కానీ లేదా ఆ సమస్య పుట్టిన సామాజికార్ధిక సమస్య కానీ కాదు. భద్రతా బలగాలను, దోపిడిదార్లను వ్యక్తిగతంగా టార్గెట్ చెయ్యడం నిస్సందేహంగా సమస్య. దాన్ని ఆపాలి. కాని ఆ సమస్య, విశాలమైన సామాజికార్ధిక సమస్య పరిష్కారానికి, సమాజంలోని కొందరు వ్యక్తులు నిస్వార్ధంగా పూనుకున్న ఫలితంగా ఏర్పడిన సమస్యల్లో ఒకటి. దాన్ని అలానే చూడాలి. మీరు వేరేలా చూడాలంటున్నారు. అది మీ అభిప్రాయం.
“పోలీసు అనేది ప్రజావ్యతిరేక వ్యవస్థ. అందులో పని చేసేవాళ్ళు దుష్షులు. కాబట్టి వాళ్ళకి నక్సలేట్ల చేతిలో (వీళ్ళల్లో అనేక రకాల వర్గాలు ఉన్నాయని కొత్తగా తెలిసింది) చావు ఆమోదయోగ్యం. వ్యక్తిగత నిర్మూలనలకు వ్యతిరేకించే మీరుకూడా, చచ్చేది పోలీసయితే సానుభూతి అవసరం లేదంటున్నారు. నక్సలైటు చచ్చేది ప్రజలకోసం కాబట్టి వాళ్ళలో యెవరైనా చస్తే తప్పకుండా జాతి శోకించవలసిందే అంటారు. పోలీసులే అకృత్యాలు చేస్తారు కాని నక్సలైట్లు మాత్రం నష్కామకర్మయోగులని మీ ప్రగాఢ విశ్వాసం.”
ఇవి నా అభిప్రాయాలు కావు. సమస్య ఇదే. సామాజిక ఆర్ధిక సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్న మావోయిస్టులు ఒక చివరికి వెళ్లి తీవ్రవాద ముద్ర సంపాదించుకున్నారు.
మీరేమో, నేను చెప్పిన మాటలకు తీవ్ర అర్ధాలు తీసుకుని వాటిని నాకే అంటగడుతున్నారు. నా అభిప్రాయాలలో మీకు నచ్చని అంశాన్ని గమనించి దాన్ని తులనాత్మకంగా అంచనా వేయడానికి లేదా విశ్లేషించడాని బదులు అసహనంతో ఒక కొసకు పోయి మరొక అభిప్రాయాన్ని మీకు మీరే డిరైవ్ చేసారు. కానీ గమనించాలి మీరు, నేనా కొస దగ్గర లేను.
పోలీసుల గురించి నేను రాసినవి వాస్తవాలు. జరిగినవి. ఆ వాస్తవాలనుండి మీకు వచ్చిన అభిప్రాయాలను నాతో సంబంధం లేకుండానే నా అభిప్రాయం అంటూ నాకు అంటగట్టడమే కాక, నాది కాని ఆ అభిప్రాయలపైన అసహనం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇది న్యాయం కాదు. తీరా చూస్తే పోలీసుల గురించి నేను రాసిన వాస్తవాల ద్వారా మీకు కలిగిన అభిప్రాయాలు మీ నమ్మకానికే వ్యతిరేకంగా రావడంతో ఆ అసహనాన్నీ, కోపాన్ని తిరిగి నావైపే ప్రదర్శిస్తున్నారేమో! ఒకసారి ఆలోచించండి.
అక్షరాస్యతకీ, చైతన్యానికీ సంబంధం కనబడ్డం లేదు అన్నా గానీ, సంబంధం లేదు అని నేను అనలేదు. మళ్ళీ ఒకసారి నేనేమన్నానో చూడండి. నా వ్యాఖ్య ద్వారా మీరు నాకు అపాదించిన అభిప్రాయాలు ఇలానే ఉన్నాయి.
పోతే, మీ వ్యాఖ్యలో ధ్వనించిన వ్యంగ్యం, దయచేసి, మరోసారి రాకుండా చూడగలరని విన్నవించుకుంటున్నాను.
POSTED BY VISEKHAR నవంబరు 29, 2011, 914 సాయంత్రము
మరోమాట శ్యామలరావు గారూ, విద్య నేడు ఎలా ఉందన్న విషయంలో మీరు చెప్పినవి నిజం. అది సరైన చైతన్యాన్ని ప్రజలకు అందించడం లేదు.
POSTED BY VISEKHAR నవంబరు 29, 2011, 929 సాయంత్రము
స్వాతంత్య్రం ప్రకటించిన తర్వాత బ్రిటిష్ వాడొకడు తమ దేశానికి వెళ్ళే ముందు తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఒక్కొక్కరికి ఒక్కో తుపాకీ ఇచ్చి వెళ్లాడు.
తర్వాత కొంత కాలానికి ఆవ్యక్తి తిరిగి వచ్చి, తాను ఇచ్చిన తుపాకీతో ఆ ముగ్గురు ఏమి చేస్తున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నించాడు.
తొలుత తెలంగాణ వ్యక్తిని కలిసి అడగ్గా, మీరిచ్చిన తుపాకీతో రోజూ పిట్టలు కొట్టి కాల్చుకు తింటూ ఎంజాయ్ చేస్తున్నాను అని చెప్పాడు. రాయలసీమకు చెందిన వ్యక్తి మాట్లాడుతూ, తన ప్రత్యర్థులను చంపడానికి ఆ తుపాకీని ఉపయోగించాననీ, తనకిప్పుడు శత్రుశేషం లేదని చెప్పాడు.
ఆంధ్రకు చెందిన వ్యక్తిని ప్రశ్నించగా, మీరిచ్చిన తుపాకీని అమ్మి ఆ డబ్బుతో వ్యాపారం చేసి సంపాదించాను అని చెప్పాడు.
- Krishna Mohan
POSTED BY SIMHAAM నవంబరు 29, 2011, 1032 సాయంత్రము
వ్యంగ్యం నా ఉద్దేశ్యం కాదు. మీకలా అనిపించితే క్షంతవ్యుణ్ణి. హింసతో కూడిన మార్గాలు నాకు ఆమోదయోగ్యం కావు – ఆ మార్గాలు యెన్నుకున్న వాళ్ళ లక్ష్యాలు యెంత ఉదాత్తమైనవైనా సరే. ఆలాగే ప్రభుత్వాలూ అణచి వేత విధానాలు అవలంబించటం కూడా అసమంజసం – వాటి వల్ల సమస్యలు జటిలం కావటమూ, కొత్త సమస్యలు పుట్టుకు రావటం మినహా వాటి వల్ల ప్రయోజనం యేమీ ఉండదు. నక్సలైటు ఉద్యమం సామాజిక ఆర్ధికసమస్యలను ఉద్దేశించినదైతే కావచ్చును కాని తుపాకీని పరిష్కారంగా చూపటం వలన సమస్యకు హింసను జోడించటం మినహా ఒరిగేదేమీలేదని నా ఉద్దేశ్యం. ఇక పోతే పోలీసువ్యవస్థ అనేది దానంతటదే చెడ్డది ప్రభుత్వాంగం కావటం వల్ల అనే అంచనాను అమోదించలేను. అందరు బడుగుజీవుల్లాగా సగటు పోలీసు కూడా దయనీయజీవితం వెళ్ళబుచ్చేవాడే. సమ్యగ్విద్యావ్యాప్తి వలన ప్రజలు చైతన్యవంతులౌతారనీ, అది సమస్య మూలాలు చర్చించబడటానికీ తద్వారా పరిష్కారానికి దోహదమౌతుందనీ నా నమ్మకం. సమాజంలో క్రమశః మార్పు వచ్చే దిశగా ప్రయత్నం ఉండాలిగానీ, మార్పును డిజైన్ చేసి సమాజం
మీద దాన్ని ఆపాదించాలనుకుంటే అది సాధ్యం కాదనీ నా అభిప్రాయం. అందు చేత నేను సమ్యగ్విద్యావ్యాప్తి అంటున్నాను. హింసా మార్గం, దానిని యెంచుకోవటం, దానిని సమర్ధించటం అనేవి యేవీకూడా ప్రజలలో మార్పు తీసుకు రాలేవు, మార్పు పట్ల నమ్మకాన్ని కలిగించ లేవని నా నమ్మకం.
POSTED BY తాడిగడప శ్యామలరావు నవంబరు 30, 2011, 851 ఏ ఎమ్
పెట్టుబడిదారీ వర్గంవాళ్ళు వ్యక్తిగత హింస గురించి మాట్లాడడమంటే బోగం గుడిసెల్లో దూరేవాళ్ళు శ్రీరంగ నీతులు చెప్పడం లాంటిదే. నా కెనడా స్నేహితురాలు మండవ స్వప్న ఇలా అనేది “పెట్టుబడిదారీ వర్గం దృష్టిలో రక్త పాతం మాత్రమే హింస కిందకి వస్తుంది. ఆకలి చావులు & మందులు అందక పేదవాళ్ళు చనిపోయిన చావులు వాళ్ళ దృష్టిలో హింస కిందకి రావు” అని.
POSTED BY PRAVEEN SARMA నవంబరు 30, 2011, 927 ఏ ఎమ్
ప్రవీణ్ శర్మగారూ, మీ భాష నాకు విచారం కలిగిస్తోంది. హింస లేదా అహింస గురించి మాట్లాడటానకి కూడా కమ్యూనిష్టులో తత్సిధ్ధాంతానుయాయల అసంఖ్యాకవర్గాలలో యెవరిదైనా అనుమతి లేదా యోగ్యతాపత్రమో కావాలని మీ అభిప్రాయమేమో నాకు తెలియదు. మీరనుకుంటున్నట్లు నేనేమీ మీరనే పెట్టుబడిదారీ వర్గానికి చెందను. అవునని మీరంటే నేను వాదించను. రక్త పాతం మాత్రమే హింస అని నేననూలేదు, అనుకోవటమూలేదు. ఇంకా మీరుదహరించిన హింసలూ అక్షరాలా హింసక్రిందకే వస్తాయి. విప్రతిపత్తి యేమీ లేదు. అంతేకాదు, మీరు మీరు చేసిన అనవసరమైన ఎత్తిపొడుపులో వాడిన పద భావజాలాలు కూడా హింసక్రిందికే వస్తాయని, అటువంటి ఉద్దేశ్యపూర్వకహింసకు దిగిన అహింసావాదులయిన తమకూ బాగా తెలుసునని నా నమ్మకం.
శ్రీ visekhar గారికి ఒక విన్నపం. దాడిచేసే దృక్పధంతో వచ్చే వ్యాఖ్యలను దయచేసి గమనించండి. చవకబారు భాషను మీరు ప్రచురించటం భావ్యంకాదని నా అభిప్రాయం. మీరు యేకీభవించాలని పట్టుబట్టటం లేదు. వ్యాఖ్యలు నేరుగా కాక, మీ అనుమతితోనే దర్శనముస్తున్నందు వలన నా యీ విజ్ఞప్తి. వ్యాఖ్యను సభ్యభాషలోనికి (అరుదు గానే) అవసరమైతే సరి చేయటానికి మీకు అవకాశం ఉన్నది కదా! ప్రవీణ్ గారి వ్యాఖ్యలో విషయం గురించి కన్నా వారి భాష గురించి నాకు అసంతృప్తి మరియు అసమ్మతి యున్నదని తెలియ జేయటానికి చాలా చింతిస్తున్నాను.
POSTED BY తాడిగడప శ్యామలరావు నవంబరు 30, 2011, 1215 సాయంత్రము
శ్యామలరావు గారూ, మీరు ప్రవీణ్ వ్యాఖ్య గురించి అపార్ధం చేసుకున్నారు. ఆయన మీరు పెట్టుబడిదారీ వర్గం జమకట్టి మిమ్మల్ని ఉద్దేశిస్తూ ఆ వ్యాఖ్య రాయలేదు. ఆయన నేరుగా పెట్టుబడిదారీ వర్గాన్నే ఉద్దేశిస్తూ రాసినవి. ఆ వర్గం అనేక రకాల హింస చేస్తూ కూడా ‘ప్రజాస్వామ్య వ్యవస్ధలో హింసకు తావు లేదు’ అంటూ నీతులు చెబుతారనీ, ‘మావోయిస్టులు హింస చేస్తున్నారు కనుక వారు చెడ్డవాళ్ళ’ని అంటారనీ, నిజానికి అసలు హింస చేసేది పెట్టుబడివర్గాల వారేననీ ప్రవీణ్ చెబుతున్నారు. హింసగా కనపడే హింసే కాకుండా కనపడని రూపాల్లో అనేక రకాలుగా పెట్టుబడిదారీ వర్గం హింసకు పాల్పడుతున్నదనీ, కనుక హింస గురించి మాట్లాడే అర్హత వారికీ లేదనీ చెబుతున్నాడు. ఆయన మిమ్మల్ని పెట్టుబడిదారీ వర్గంగా మిమ్మల్ని జమ కడుతున్నట్లుగా కూడా రాయలేదు. ఆయన ఉద్దేశ్యం కూడా అది కాదనే నాకు అర్ధం అవుతోంది.
ప్రవీణ్ చేసే వ్యాఖ్యలు చాలా వరకూ ఇలానే ఉంటాయి. తరచుగా పోస్టుకి తగ్గట్లుగా సందర్భ సహితంగా లేనట్లుగా అభిప్రాయం కలిగిస్తూ ఆయన వ్యాఖ్యలు ఉంటాయి. కాని నేను గమనించినదాని ప్రకారం అతను కొన్ని వివరణలు మిస్ చేసి నేరుగా రిజల్ట్ లోకి వెళ్ళిపోతాడు. తానివ్వాల్సిన వివరణ అందరికీ తెలిసే ఉంటుంది అని భావిస్తాడు. అలా తెలిసే ఉంటుందని భావిస్తూ కొన్ని స్టెప్స్ మిస్ చేసి చివరి స్టెప్ కి నేరుగా వెళ్ళిపోతుంటాడు. అది అర్ధం కాక కొంతమంది అతన్ని ‘సందర్భం లేకుండా రాస్తున్నాడని’ విసుక్కుంటూనో, ఆటపట్టిస్తూనో, కొంతమంది దూషిస్తూనో వ్యాఖ్యలు రాస్తుంటారు. అప్పుడప్పుడూ సందర్భం లేకుండా కూడా కొన్ని వ్యాఖ్యలు ఉంటాయి. ఆ సందర్భాన్ని సరిగ్గా వివరించగల పరిస్ధితి అతనికి లోపించినట్లు కూడా కొన్ని వ్యాఖ్యలు కనిపిస్తాయి. వీటన్నింటి వలన అతని వ్యాఖ్య మీరు అపార్ధం చేసుకుని ఉండవచ్చు.
నా బ్లాగ్ లో వ్యాఖ్యానం చేసే వారిని దూషిస్తూ కూడా వ్యాఖ్యానాలు పోస్ట్ అవుతుంటాయి. సవరించి ప్రచురించడమో, తీసివెయ్యడమో చేస్తూనే ఉన్నాను. మీ సలహాకి ధన్యవాదాలు.
ప్రవీణ్ శర్మ వ్యాఖ్య గురించి నేను ఇచ్చిన వివరణ నేను అర్ధం చేసుకున్నవరకే తప్ప అది అతను ఆమోదించాలని లేదు. అతని దృష్టిలో అతని వ్యాఖ్యలపైన అతని అభిప్రాయం భిన్నంగా ఉండే అవకాశం ఉంది. భిన్నంగా ఉన్నట్లయితే అదే ఫైనల్ అవుతుంది తప్ప నా అవగాహన ఫైనల్ కాదు.
POSTED BY VISEKHAR నవంబరు 30, 2011, 320 సాయంత్రము
మరొక విషయం. సింహంగారి వ్యాఖ్య గురించి. వారు పంపిన వ్యాఖ్యలో అసంగతమైన హాస్యం ఉంది. అది చర్చా విషయానికి యే విధంగానూ సంబంధిచినది కాదు కాబట్టి దానిని శ్రీ visekhar గారు అనుమతించకుండా ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇలాంటి out of context jokes యేమి ప్రయోజనాన్ని సాధిస్తాయి రాజకీయ కాలుష్యాన్ని వెదజల్లటం తప్ప
POSTED BY తాడిగడప శ్యామలరావు నవంబరు 30, 2011, 222 సాయంత్రము
శ్యామలరావు గారూ, సింహం గారి వ్యాఖ్య అసందర్భమని నాకు అనిపించింది. కాని మీరన్నట్లు రాజకీయ కాలుష్యం నాకు కనిపించలేదు. మూడు ప్రాంతాలకు సంబంధించి ‘తన దృష్టిలో’ ప్రధాన ధోరణులుగా భావించిన అంశాలను హైలైట్ చేస్తూ కొంత సెటైరికల్ గా వ్యాఖ్య రాశాడు గాని అందులో రాజకీయ కాలుష్యం లేదని నాకు అనిపిస్తోంది. వ్యాఖ్యానాని నేరుగా ఏమి అర్ధం అయితే వస్తుందో అదే అర్ధాన్ని స్వీకరిద్ధాం. అలా నేరుగా వచ్చే అర్ధంలో సింహం గారి వ్యాఖ్య అనుమతించదగినదిగానే ఉంది.
నేను తొలగిస్తున్న వ్యాఖ్యానాలు మీరు చూసినట్లయితే మీకు వచ్చే కోపానికి మీ ఎదురుగా ఉన్న కంప్యూటర్ దహించుకుపోతుందేమోనండీ.
POSTED BY VISEKHAR నవంబరు 30, 2011, 330 సాయంత్రము
శ్రీ ప్రవీణ్ శర్మగారి విజ్ఞత పట్ల నాకేమి సందేహం లేదు. వారి వ్యాఖ్యలు కొన్ని యితరత్రా సందర్భాలలో చదివియున్నాను కూడా.
చర్చల్లో విషయంతో పాటుగా క్లుప్తత, స్పష్టత, భాష అనేవి కూడా చాలా ముఖ్యం అని భావిస్తున్నాను.
ఈ చర్చ సందర్భంగా మా యిరువురి మధ్య అగాధం యేమీ యేర్పడే అవకాశం లేదనే భావిస్తున్నాను.
ఏకం సత్, విప్రాః బహుధా వదంతి.
POSTED BY తాడిగడప శ్యామలరావు నవంబరు 30, 2011, 333 సాయంత్రము
Ikkada vyaktigata himsa gurimci prastavimcimdi syamala rao gare kanee nenu kadu kada. It’s called as coming out of the orbit.
POSTED BY PRAVEEN SARMA నవంబరు 30, 2011, 449 సాయంత్రము
శ్యామలరావు గారు వ్యక్తిగత హింస గురించి మాట్లాడారు కాబట్టే సమాధానం చెప్పాను. అడగని వాటికి సమాధానం చెప్పే అలవాటు నాకు లేదు.
POSTED BY PRAVEEN SARMA నవంబరు 30, 2011, 516 సాయంత్రము
నిన్న రాత్రి వార్తల్లో చూసాను. ఒక గిరిజనుడిని మావోలు ఇన్ఫార్మరనే నెపంతో చంపారని. సరే, చంపటానికి ముద్ర వేస్తారుగా; దాని నిజానిజాల సంగతి అటుంచి. అయితే, యధాప్రకారం, మన మానవపౌరహక్కుల సంఘాలవాళ్ళు యేమీ స్పందించలేదు – స్పందిస్తారని అనుకోవటంలేదు కూడా. ఇది హింస కాదా ఇటువంటి హింసను వ్యతిరేకించేవాళ్ళు కూడా మౌనంగా ఉండటం మావోలకు పరోక్షంగా వత్తాసు పలకటం కాదా మరణశిక్షలు వేసే హక్కు మావోలకు యెవరిచ్చారు అది తప్పు కాదా అన్ని రకాల హక్కుల, హింసల గురించి చర్చలు మావోలు మరణించినప్పుడే మనకు గుర్తుకు వస్తాయా నాకైతే ఇది నచ్చలేదని చెప్పటానికి మాత్రం ఇది వ్రాస్తున్నాను.
POSTED BY తాడిగడప శ్యామలరావు డిసెంబరు 01, 2011, 948 ఏ ఎమ్
అవును. నాకూ అది నచ్చలేదు. ఇన్ఫార్మర్ అయినా చంపవలసిన అవసరం లేదు. సాధారణంగా పోలీసులకు భయపడి తెలిసిందీ, తెలియనిదీ చెప్పేస్తుంటారు. దానికి చంపడం కరెక్టు కాదు.
POSTED BY VISEKHAR డిసెంబరు 01, 2011, 1040 ఏ ఎమ్
ప్రవీణ్ గారు నేనే వ్యక్తిగతహింసను గూర్చి మాట్లాడినందు వలననే నాకు జవాబిచ్చానన్నారు. అయితే మేము పొరబడ్డామా “పెట్టుబడిదారీ వర్గంవాళ్ళు వ్యక్తిగత హింస గురించి మాట్లాడడమంటే ….” అంటూ మీరు వ్రాసినది నేనొక పెట్టుబడిదారీ వర్గపువ్యక్తినేన్న అభిప్రాయంతోనేనా మావోలు వ్యక్తిగతహింసకు దిగటం తప్పని నా అభిప్రాయం. అందులో మార్పులేదు. అంతమాత్రానికే పెట్టుబడిదారీ వర్గపువ్యక్తినై పోతానా నా దృష్టిలో హింస అనేది ఒకటే, నేనేమీ అందులో విభజనలు చేయను, ఎవరికీ హింసకు యేకారణంగానైనా లైసెన్సు ఉందని భావించను.
POSTED BY తాడిగడప శ్యామలరావు డిసెంబరు 01, 2011, 1057 ఏ ఎమ్
శేఖరుగారూ, “చంపవలసిన అవసరం” అనేది మంచి పదబంధం కాదని నా విన్నపం. చంపవలసిన అవసరం అంటూ ఒకటి ఉండే అవకాశం ఉండవచ్చని మీరు అభిప్రాయపడుతున్నట్లుగా అది సూచిస్తోంది. మీ ఉద్దేశ్యం అదిగాదనుకుంటాను. “చంపవలసిన అవసరం” అనే పదబంధం ద్వారా యెవరో కొందరికి చంపేహక్కు ఒకటుందనే అభిప్రాయాన్ని మీరు కలిగిలేరని నా నమ్మకం. చంపేహక్కు ప్రభుత్వానికీ లేదు, మావోలకీ లేదు. సిధ్ధాంతాల మధ్య చర్చలు జరిగి ప్రజలకేదైనా ఒరగ వచ్చును కాని సిధ్ధాంతాల మధ్య యుధ్ధాలు జరిగి ప్రజలు నేల కొరగ వచ్చని నేను ఒప్పుకోను. రెండు పక్షాలవాళ్లూ ఆవలి పక్షం నుండే హింస ప్రారంభం అయిందని వాదిస్తారు. రెండు పక్షాలవాళ్లూ ఆవలి పక్షం వాళ్ళే దుష్గులనీ వధార్హులనీ తీర్మానాలు చేస్తారు . రెండు పక్షాలవాళ్లూ ఆవలి పక్షం వాళ్ళే ప్రజలకు చెడు చేస్తున్నారని ప్రచారం చేస్తారు. కాబట్టి, ఒప్పించగలిగే నేర్పుతో కార్యసాధన చేయాలిగాని, నొప్పించగలిగే ఔధ్ధత్యంతో ప్రవర్తించి యేమీ సాధించలేరు.
POSTED BY తాడిగడప శ్యామలరావు డిసెంబరు 01, 2011, 1113 ఏ ఎమ్
శ్యామల్ గారూ, ‘చంపవలసిన అవసరం’ అనేది తప్పనిసరిగా ఉంటుంది. అది చాలా చాలా అరుదుగా ఉంటుంది. ప్రజలను పీడించి బతకడమే జీవన విధానంగా చేసుకున్నవారు కొందరు ఉంటారు. మారే అవకాశాన్ని వారు స్వీకరించరు. అటువంటి వాళ్ళు భౌతికంగా లేకుంటే బాగుండునని ప్రజలంతా భావిస్తుంటారు. కాని చస్తే బాగుండునని ప్రజలు భావించినంత మాత్రాన, ప్రజల తరపున అటువంటి వ్యక్తులను చంపే హక్కు ఏ ఉద్యమ సంస్ధలకు ఉండదు. లేకుండా ఉంటే బాగుండునని ప్రజలు భావిస్తే ప్రజలే ఆపని చేయాలి. దానివల్ల వచ్చే కష్ట నష్టాలను ప్రజలు భరించడానికి సిద్ధంగా ఉండాలి. ప్రజలు ఎటువంటి పరిణామాలనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండి వారు చేయదలుచుకున్న పనిని వారే చేసేపనయితే అందుకు అభ్యంతర పెట్టాల్సిన పని లేదు.
అయితే ప్రజా కోర్టులో శిక్ష పడుతుంది అని హెచ్చరించి ఉద్యమకారులే ఆ పని పూర్తి చేయడం సరైంది కాదు. అది ఏ ఉద్యమానికి లాభపడదు. ప్రజలకు అసలే లాభం ఉండదు. ఇప్పుడు జరుగుతున్నవాటిలో అలా చాలా జరుగుతున్నాయి. అది తగదు.
అదే సమయంలో రాజ్యం చేసే హింసనూ, మావోయిస్టులు లాంటి కొద్ది మంది చేసే హింసను ఒకే గాటన కట్టడం సరి కాదు. రాజ్యం చేతిలో చట్టం ఉంటుంది. ఆ చట్టాన్ని అమలు చేయడానికి న్యాయస్ధానం, పోలీసులు ఉంటారు. పారా మిలట్రీ బలగాలు, సెంట్రల్, స్టేట్ రిజర్వ్‌డ్ ఫోర్స్ ఇవన్నీ రాజ్యానికి అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ పక్కనబెట్టి రాజ్యంలో భాగంగా ఉన్న వ్యక్తులు (ప్రభుత్వంలో భాగంగా ఉన్న ఏ విభాగానికి చెందినవారయినా) తామే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని బూటకపు ఎన్‌కౌంటర్లకు పాల్పడడం, చట్టాతీతంగా అరెస్టులు చేసి మాయం చెయ్యడం, అసలు అరెస్టులు కూడా చూపకపోవడం, గ్రామాలపై బడి ఊళ్ళను తగలబెట్టడం, దోచుకోవడం, హింసించడం… చేస్తే ఇక రాజ్యం తన చట్టాలను గౌరవించాలని ప్రజలకు చెప్పగల నైతికతను కలిగి ఉంటుందా ప్రజలకు సంబంధించిన ఏ రూపమైనా, అంటే ప్రజా సంఘాలు లాంటి సంస్ధలతో సహా ఏ తప్పయినా చేసినపుడు వారిని చట్టానికి బాధ్యులను చేయగల అధికారం రాజ్యానికి ఉంటుంది. కాని ప్రజలకు అటువంటి అధికారం ఉండదు. అందువల్లనే రాజ్య హింసకూ, ప్రజలనుండి ఏర్పడే సంస్ధలు చేసే హింసకూ తేడా చూడవలసి ఉంటుంది. తేడా చూడడమంటే సమర్ధించమని కాదు. పైన చెప్పినట్లు ప్రజలే పూనుకుని తమ బతుకులను నాశనం చేస్తున్నాడని భావించి ఒక ప్రజాకంటకుడిని బలి తీసుకున్నపుడు దానిని హింసగా పరిగణించలేము. అటువంటి అవకాశాన్ని కొన్ని సంస్ధలు తమ చేతుల్లోకి తీసుకుని ప్రజల పేరుతో సమర్ధించుకోవడమే తగదు.
POSTED BY VISEKHAR డిసెంబరు 01, 2011, 309 సాయంత్రము
శ్యామల రావు గారు, మీకు తెలిసితెలియని వ్యక్తిలా నటించొద్దు. సోమ్లా నాయక్ తెలియకుండా ఇన్ఫార్మర్‌గా మారాడని అనుకోవాలా పోలీసులు ఇన్ఫార్మర్లని ఉపయోగించుకున్న ఘటనలు 1970లలోనూ జరిగాయి. httppatrika.teluguwebmedia.in200911dawn-of-blood-elephants-tusks.html
POSTED BY PRAVEEN SARMA డిసెంబరు 01, 2011, 1121 ఏ ఎమ్
ప్రవీణ్ గారు మన్నించాలి. మీ భాషకు మీ ధోరణి పట్ల నాకు తీవ్ర అభ్యంతరం ఉంది. ఈ సోమ్లా నాయక్ యెవరు ఆ చనిపోయిన గిరిజన వ్యక్తియా నేను చూసిన ఛానెల్ వార్తలో చనిపోయిన వ్యక్తి పేరు చూపలేదని అనుకుంటాను -లేదా – పేరు నేనుగమనించక పోయి ఉండవచ్చు. నేను నటించటం దేనికి అటువంటి మాట మీరు వాడటం సబబు కాదు. నా అభిప్రాయం నేను చెప్పాను. అతడు ఇన్ఫార్మర్ అవునా కాదా అన్నది నేను ప్రశ్నించటం లేదు. అయినా కాక పోయినా చంపేందుకు మావోల కేమి హక్కు ఉందని నా ప్రశ్న. చంపేందుకు మావోలకు హక్కు ఉంటే, అటువంటి హక్కు ఆవలి పక్షానికి కూడా ఉంటుంది. అలాంటప్పుడు యెవరన్నా మావోలు పోలీసుల చేతిలో చనిపోయినప్పుడల్లా రగడ దేనికి పోలీసులు మాత్రమే ఇన్ఫార్మర్లని వినియోగించుకుంటున్నారా పోలీసుల కదలికలు మావోలు యెలా గమనిస్తున్నారు – ఇన్ఫార్మర్లని వినియోగించుకునే కదా అలాంటప్పుడు ఒక పక్షం వారిది మాత్రమే తప్పని గోల యేమిటి ఇదంత సరయిన దృక్పధంలా నాకు కనిపించటం లేదు.
ప్రవీణ్ గారూ, దయచేసి గమనించండి. మీరు జవాబిచ్చినా ఇవ్వకపోయినా ఫరవాలేదు. మీ జవాబులో ప్రశ్నలుంటే నేనేమీ చేయలేనని మనవి. ఎందుకంటే, మీ దాడిచేసే ధోరణి, భాషల కారణంగా మీకు జవాబివ్వటానికి మనస్కరించటంలేదు. నా వరకు చర్చలో ఇదే నా నుండి చివరి మాట. మన్నించాలి.
శేఖరుగారు క్షమించండి. ప్రవీణ్ గారి భాష మరియు యెదురు దాడి పధ్దతులు చర్చావాతావరణాన్ని అనవసరంగా వేడెక్కిస్తున్నాయి. చర్చ వేరు కలహం వేరు. శేషం కోపేన పూరయేత్ అన్నట్లు నడిచే చర్చకు దూరంగా ఉండటం మంచిదని భావించి నేను విరమిస్తున్నాను.
POSTED BY తాడిగడప శ్యామలరావు డిసెంబరు 01, 2011, 311 సాయంత్రము
శేఖరుగారు, మీకు కూడా నా చివరి మాటలు చెప్పి విరమించవలసిన బాధ్యత ఒకటుంది నాపై. చంపవలసిన అవసరం’ అనేది తప్పనిసరిగా ఉంటందన్నారు. అటువంటిది లేకుండాలని నా ఆకాంక్ష. రాజ్య హింసకూ, ప్రజలనుండి ఏర్పడే సంస్ధలు చేసే హింసకూ తేడా చూడాలనీ మీరన్నారు. చట్టాన్ని రాజ్యాంగం నడిపించే వ్యక్తులెవరైనా తమ చేతులోకి తీసుకోవటం తప్పే. అది ప్రజలకూ వాళ్ళ పేరు వాడుకొనే సంస్థలకూ వర్తిస్తుంది. ఇరు పక్షాలూ, నేను ముందే మనవి చేసినట్లు ఆవలివేపునుండే అతిక్రమణ జరిగిందని వాదిస్తాయి సహజంగా. ప్రజలే పూనుకుని తమ బతుకులను నాశనం చేస్తున్నాడని భావించి ఒక ప్రజాకంటకుడిని బలి తీసుకున్నపుడు దానిని హింసగా పరిగణించలేమన్నారు. యేమైనా సంస్థలు ప్రజల పేరు చెప్పుకుని చేసిన చేస్తున్న హింస యిలా యీ వంకతో పవిత్రం అయిపోదనీ మీరూ ఒప్పుకుంటున్నారు. ఇదంతా విషవలయం. ప్రజలకు నిజమైన విద్యతో నిజమైన చైతన్యం వస్తుంది. ఎవరో గరాటాపెట్టి పోయాలని చూస్తే కాదు. ఇదంతా జరిగిన చర్చే. అందుచేత మనచర్చ కూడా ముగింపుకు వచ్చిందని భావిస్తున్నాను. శుభం భూయాత్.
POSTED BY తాడిగడప శ్యామలరావు డిసెంబరు 01, 2011, 326 సాయంత్రము
మంచిది శ్యామల్ గారూ, మరో అంశంపై మళ్ళీ కలుద్దాం.
No comments:
Post a Comment