పెద్దపల్లి, నవంబర్ 26 నక్సలైట్ నాయకుడు కిషన్‌జీ (మల్లోజుల కోటేశ్వరరావు) మృతదేహాన్ని శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత పెద్దపల్లికి తరలించారు. శనివారం రాత్రే పశ్చిమబెంగాల్‌నుంచి విమానంలో కిషన్‌జీ భౌతిక కాయం హైదరాబాద్ వచ్చింది. అయితే పౌరహక్కుల సంఘాలు, విరసం నాయకులు, విప్లవ సానుభూతిపరులు, కిషన్‌జీ కుటుంబసభ్యులూ హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌కు ఆయన మృతదేహాన్ని తరలించి ప్రజల సందర్శనార్థం రెండు గంటలు ఉంచి అప్పుడు పెద్దపల్లికి తీసుకువెళ్దామనుకున్నారు.
కిషన్‌జీ మృతదేహాన్ని పశ్చిమబెంగాల్ ప్రభుత్వంనుంచి అందుకుని తీసుకురావడంకోసమే విప్లవ కవి వరవరరావు కలకత్తా వెళ్లారు. ఆయనతో పాటు కిషన్‌జీ సోదరుని కుమార్తె కూడా వెళ్లారు. అయితే వీరు కిషన్‌జీ మృతదేహాన్ని తీసుకుని హైదరాబాద్‌కు వచ్చాక ఆ మృతదేహాన్ని హైదరాబాద్‌లో ఉంచడానికి వీలు లేదని పోలీసులు వీరికి చెప్పినట్టు తెలిసింది. హైదరాబాద్ విమానాశ్రయంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్న అనంతరం పోలీసులు అప్పటికే మూడు అంబులెన్స్‌లలో ఒక వాహనంలో కిషన్‌జీ మృతదేహాన్ని పెద్దపల్లికి తరలించారు.
ఈ విషయం మీడియాకు తెలియడానికి కొంతసమయం పట్టింది. అప్పటికే విమానాశ్రయానికి చేరుకున్న గద్దర్‌ను కూడా పోలీసులు అడ్డుకున్నట్టు తెలుస్తున్నది. కిషన్‌జీ మృతదేహాన్ని చూడడానికి ప్రజలకు హక్కు ఉందంటూ ఆయన పోలీసులతో వాదించారు. విమానాశ్రయం లోపల వరవరరాపు కూడా ఇదే వాదన చేసినట్టు తెలుస్తున్నది. అయితే పోలీసులు అందుకు నిరాకరించడంతో అప్పటికే ట్యాంక్ బండ్ వద్దకు చేరుకున్న నక్సలైట్ సానుభూతిపరులు నిరాశచెందారు. విమానాశ్రయంవద్ద పోలీసులు పెద్ద ఎత్తున మోహరించడంతో పరిస్థితి కొంతసేపు ఉద్రిక్తంగా మారింది.
అనంతరం శనివారం అర్థరాత్రి దాటాక రెండు గంటల ప్రాంతంలో పెద్దపల్లికి అంబులెన్స్‌లో కిషన్‌జీ మృతదేహాన్ని చేర్చారు. అక్కడ వరవరరావు ప్రజాసంఘ నాయకులూ కిషన్‌జీకి నివాళి అర్పించారు. పెద్దపల్లిలో ఆదివారంనాడు అంత్యక్రియలు జరుగుతాయి.
https://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2011/nov/27/main/27main47&more=2011/nov/27/main/main&date=11/27/2011

No comments:
Post a Comment