జ్యుడీషియల్ విచారణ జరిపించండి
కలకత్తా హైకోర్టులో త్వరలో కిషన్‌జీ తల్లి పిటిషన్
సుచిత్ర మహతో కోసం ముమ్మర గాలింపు
రెండు రోజుల బంద్‌కు మావోయిస్టుల పిలుపు
కచ్చితంగా ఎన్‌కౌంటరేనన్న సీఆర్పీఎఫ్ డీజీ
విచారణ కోసం చిదంబరానికి దాస్‌గుప్తా లేఖ
ఝార్‌గ్రామ్, నవంబర్ 25 తన కుమారుడి మరణంపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలంటూ దివంగత మావోయిస్టు అగ్రనేత మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్‌జీ తల్లి మధురమ్మ కలకత్తా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. కిషన్‌జీని బూటకపు ఎన్‌కౌంటర్‌లో అంతమొందించారని మావోయిస్టు పార్టీ పశ్చిమబెంగాల్ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆకాష్ ఆరోపించారు. ఆయన మరణంపై స్వతంత్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ.. ఎన్‌కౌంటర్‌కు నిరసనగా రెండు రోజుల రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు.
ఎన్‌కౌంటర్‌లో గురువారం మరణించిన కిషన్‌జీ మృతదేహానికి పంచనామా ఇప్పటికే పూర్తయింది. ఝార్‌గ్రామ్‌లో పోస్టుమార్టం చేయనున్నారు. మరోవైపు.. ఎన్‌కౌంటర్‌లో గాయపడినట్లు భావిస్తున్న మహిళా మావోయిస్టు నేత సుచిత్రా మహతో తదితరుల కోసం పశ్చిమ మిడ్నపూర్ జిల్లాలోని బురిసోల్ అడవుల్లో భద్రతాదళాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. సంఘటన స్థలానికి సమీపంలో ఆమె పర్సు దొరకడంతో, అక్కడకు దగ్గరలోనే ఆమె ఉండే అవకాశం ఉందని భావిస్తూ.. ఆస్పత్రులు, పీహెచ్‌సీలు అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్, కోబ్రా, ఇతర దళాలకు చెందిన 1100 మంది బృందం 'బ్రూనో' అనే స్నిఫర్ డాగ్‌తో సహా గాలింపు చర్యల్లో నిమగ్నమైంది. కిషన్‌జీ మృతదేహాన్ని తొలుత ఝార్‌గ్రామ్ ఆస్పత్రికి, అక్కడినుంచి మిడ్నపూర్ పోలీసు మార్చురీకి తరలించారు. ఆయన కుటుంబసభ్యులు ఇంకా మృతదేహాన్ని గుర్తు పట్టాల్సి ఉందని పశ్చిమబెంగాల్ డీజీపీ నపరాజిత్ ముఖర్జీ సంఘటన స్థలంలో మీడియాకు తెలిపారు. విప్లవ కవి వరవరరావుతో కలిసి కిషన్‌జీ అన్నకూతురు దీప కరీంనగర్ జిల్లా పెద్దపల్లి నుంచి హైదరాబాద్ మీదుగా కోల్‌కతాకు విమానంలో బయల్దేరారు.
కిషన్‌జీ మృతదేహం వద్ద ఒక ఏకే-47, మరో ఏకే-ఎం రైఫిళ్లున్నాయి. వీటిలో ఏకే-47ను కిషన్‌జీ, ఏకే-ఎంను సుచిత్ర ఉపయెగించేవారని భావిస్తున్నట్లు పోలీసువర్గాలు తెలిపాయి. కిషన్‌జీ మృతదేహం సమీపంలో ఉన్న ఓ నల్లటి బ్యాగులో రూ. 82వేల నగదు, 160 జీబీ హార్డ్‌డిస్క్, చాప, దుప్పటి, కొన్ని లేఖలు, పత్రాలు, జంగల్‌మహల్ మ్యాప్, శశిధర్ మహతో ఫొటో ఉన్నాయి. ఒక గ్లాసు, నొప్పి నివారణ మందులు కూడా అందులో ఉన్నాయి. పాత్రికేయులను సంఘటన స్థలం సమీపానికి అనుమతించలేదు.
కిషన్‌జీని రెండు రోజుల క్రితమే అరెస్టు చేసి పోలీసుల అదుపులో ఉంచారని, ఆయనను బూటకపు ఎన్‌కౌంటర్‌లో హతమార్చారని, ఈ హత్యకేసుపై విచారణ జరిపి తీరాల్సిందేనని విప్లవకవి వరవరరావు అన్నారు. మావోయిస్టుల ముప్పు గురించి మమతా బెనర్జీ ఆలస్యంగా కళ్లు తెరిచారని, కిషన్‌జీ మరణం మావోయిస్టులకు ఎదురుదెబ్బ కాగా, జంగల్ మహల్‌లో పరిస్థితి మెరుగవుతుందని లోక్‌సభ మాజీ స్పీకర్ సోమ్‌నాథ్ చటర్జీ అన్నారు.
కిషన్‌జీని బూటకపు ఎన్‌కౌంటర్‌లో హతమార్చినట్లు మావోయిస్టులు ఆరోపిస్తుండగా.. సీఆర్పీఎఫ్ మాత్రం, అది వాస్తవం కాదని, అది చాలా 'స్వచ్ఛమైన' ఆపరేషన్ అని తెలిపింది. సంయుక్త దళాలు జరిపింది చాలా స్వచ్ఛమైన, విజయవంతమైన ఆపరేషన్ అని, తమ వాళ్లు ఒక్క నిమిషం కూడా వృథా చేయలేదని సీఆర్పీఎఫ్ డీజీ విజయ్‌కుమార్ బురసోల్ అడవుల్లో విలేకరులతో అన్నారు.
ఎన్‌కౌంటర్‌పై పోలీసు వర్గాలు చెబుతున్న కథనం అంతా బూటకంలా అనిపిస్తోందని, ప్రభుత్వం దీనిపై విచారణ జరిపి వివరణ ఇవ్వాలని హోం మంత్రి చిదంబరానికి రాసిన లేఖలో సీపీఐ అగ్రనేత గురుదాస్ దాస్‌గుప్తా డిమాండ్ చేశారు. ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టు పార్టీ అగ్రనేత కిషన్‌జీ భౌతికకాయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు అప్పగించాలని టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కిషన్‌జీ భౌతికకాయాన్ని హైదరాబాద్ తరలించే ఏర్పాటు చేయాలని కోరారు.
https://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2011/nov/26/main/26main3&more=2011/nov/26/main/main&date=11/26/2011

No comments:
Post a Comment