ఇతర రాష్ట్రాల్లో పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తున్న రాష్ట్ర నేతలు
(హైదరాబాద్) మావోయిస్టు పార్టీ అగ్రనేతలను పోలీసులు వరుసగా టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం కేంద్ర కమిటీలో 13 మంది తెలుగువారు మాత్రమే మిగిలారు. ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు దళపతి గణపతి తర్వాతి స్థానంలో ఉన్న ఆజాద్ నేలకొరిగారు.
మిగిలిన వారిలో మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్‌జీ, మల్లోజుల వేణుగోపాల్, రామకృష్ణ, కటకం సుదర్శన్, నంబాళ్ల కేశవరావు అలియాస్ గంగన్న, జినుగు నర్సింహారెడ్డి అలియాస్ జంపన్న, సత్యనారాయణరెడ్డి అలియాస్ గోపన్న, మల్లా రాజిరెడ్డి, మోడెం బాలకృష్ణ, రాంచంద్రారెడ్డి అలియాస్ విజయ్, పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న, తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీల కోసం ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాలు వేటను కొనసాగిస్తున్నాయి.
వీరంతా రెడ్ కారిడార్‌లోని వివిధ రాష్ట్రాల్లో మావోయిస్టు పార్టీ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. మావోయిస్టు పార్టీలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రానికి చెందిన నేతలు అక్కడి పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుండగా.. రాష్ట్రంలో మాత్రం అగ్రనాయకులు నేలకొరుగుతున్నారు. కేంద్ర కమిటీలో మిగిలిన 13 మంది అగ్రనేతలే లక్ష్యంగా నిఘా వర్గాలు ముమ్మర వేటను కొనసాగిస్తున్నాయి.
http://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2010/jul/3/main/3main14&more=2010/jul/3/main/main&date=7/3/2010

No comments:
Post a Comment