Monday, 19 December 2011

అడవుల్లో అపర చాణక్యుడు

అడవుల్లో అపర చాణక్యుడు

ivory-coast-rainforestహైదరాబాద్‌, మేజర్‌ న్యూస్‌ తాను మకాం వేసి ఉన్న ప్రాంతానికి మూడు కిలో మీటర్ల దూరం వరకూ ఐదంచెల సొంత భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేసుకుని మావోయిస్ట్‌ ఉద్యమంలో సాయుధ పోరాటానికి నాయకత్వం వహిస్తూన్న మల్లో జుల కోటేశ్వరరావు అలియాస్‌ కిషన్‌జీ ఎన్‌కౌంటర్‌ దేశవ్యాప్తంగా మావోయిస్ట్‌ పార్టీకి ఇప్పట్లో కోలుకోలేని తీవ్రమైన ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. 1974 ప్రాం తంలోనే సిపిఐఎమ్‌ఎల్‌ పీపుల్స్‌వార్‌ సెంట్రల్‌ ఆర్గనైజర్‌గా పనిచేసిన కోటేశ్వర రావు అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని గడగడలాడించారు. దట్టమైన అటవీ ప్రాంతంలో శత్రువుల కదలికలు తెలుసుకుని ఊహించని విధంగా వారిపై దాడులు చేసే గెరి ల్లా యుద్ధ తంత్ర వ్యూహరచనలో నిష్ణాతుడిగా పేరుతెచ్చుకున్నారు. ఈ కారణం గానే కెజి సత్యమూర్తి, ముక్కు సుబ్బారెడ్డి, ఐవి సాంబశివరావు వంటి కాకలుతీరిన నేతలున్నప్పటికీ 1980వ దశకంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కీలక బాధ్యతలు చేపట్టే స్థాయికి ఎదిగారు.

అప్పట్లో రాష్ట్ర ప్రజలకు ప్రహ్లాద్‌ పేరుతో పరిచయమైన కోటేశ్వ రరావును తరువాత కేంద్ర కమిటీలోకి, ఆ తరువాత కేంద్ర పార్లమెంటరీ కమిటీ లోకి తీసుకున్న మావోయిస్ట్‌ పార్టీ అధిపతి ముప్పాళ్ళ లక్ష్మణరావు అలియాస్‌ గణపతి ఆయనకు ఈశాన్యరాష్ట్రాలతో పాటు తూర్పుభారతంలోనూ పార్టీని బలో పేతం చేసే బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి పశ్చిమబెంగాల్‌లోని జంగల్‌ మహల్‌ అటవీ ప్రాంతాన్నే కేంద్రంగా చేసుకుని కిషన్‌జీ మావోయిస్ట్‌ ఉద్యమాన్ని ఉధృతం చేశారు. గత రెండు సంవత్సరాలలో కిషన్‌ రెండు పర్యాయాలు సాయుధ బలగా లతో జరిగిన ఎన్‌కౌంటర్‌ల నుంచి తృటిలో తప్పించుకున్నారు.

maoistముఖ్యంగా గత మార్చి నెలలో లఖన్‌పూర్‌ ప్రాంతంలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో కిషన్‌ జీ తీవ్రంగా గాయపడ్డా రు. ఒక దశలో ఆయన మృతిచెందినట్లుగా భద్రతా దళాలు భావించాయి. అయితే జార్ఖండ్‌ పోలీసులకు పట్టుబడిన మావోయిస్ట్‌ పార్టీ కీలక నేత ఒకరు కిషన్‌జీ జీవించే ఉన్నా రని స్పష్టం చేయడంతో పోలీసులు కూడా ఆ విష యం నిర్ధారించుకుని ఆయన బతికే ఉన్నట్లుగా ప్రక టించారు. ఆ ఎన్‌కౌంటర్‌లోనే ఆయనతో పాటు ఉన్న మావోయిస్ట్‌ పార్టీ బెంగాల్‌ రాష్ట్ర కమిటీ కార్యదర్శి సఫా ధర్‌ మెహతా మృతిచెందారు. ఆ తరువాత ఆయన భార్య సుచిత్ర కిషన్‌జీ వెన్నంటే ఉంటున్నారు. గురువారం నాటి ఎదురు కాల్పుల్లో ఆమె కూడా మృతిచెందినట్లు పోలీసులు ప్రకటించారు.

అంతే కాకుండా మావోయిస్ట్‌ పార్టీ నేతల్లో అత్యంత ప్రమాదకరమైన మైండ్‌సెట్‌ కలవాడిగా కూడా కేంద్ర నిఘా విభాగం కిషన్‌జీని అభివర్ణించింది. యుద్ధంలో పాల్గొనే వారు, లేదా దానికి నాయకత్వం వహించిన వారు ఎవరికి వారే సొంత వ్యూహాలు రూపొందించుకోవడం సహజం. అయితే కిషన్‌జీ మాత్రం శత్రువు ఆలోచించే కోణం నుంచి తాను ఆలోచించి అందుకు భిన్నంగా దాడుల వ్యూహం రూపొందిస్తారని మావోయిస్ట్‌ పార్టీ కార్యకలాపాలను దీర్ఘకాలంగా అధ్యయనం చేస్తున్న కొందరు పోలీసు అధికారులే వ్యాఖ్యానించారు. ఈ కారణంగానే కేంద్ర నిఘా విభాగం కూడా ఆయనను వెరీ మోస్ట్‌ వాంటెడ్‌ పర్సన్‌గా ప్రకటించింది.

చుట్టూ ఐదంచెల భద్రత-మూడు కిలోమీటర్ల మేర శత్రు దుర్భేద్యంకాగా మావోయిస్ట్‌ పార్టీలో గణపతి తరువాత అంతటి కీలకమైన వ్యక్తిగా ప్ర ఖ్యాతి గాంచిన కిషన్‌జీకి ఆ పార్టీ అంతేస్థాయిలో భద్రత కూడా కల్పిస్తోంది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆయన ఎక్కడ మకాం వేసి ఉన్నా ఐదంచెల భద్రత ఏర్పాటు చేసుకుంటారు. మకాం వేసిన ప్రాంతానికి మూడు కిలోమీటర్ల చుట్టూ శత్రువుల కదలికలను కనిపెట్టేందుకు సొంత నెట్‌ వర్క్‌తో పాటు ప్రధాన స్థావరానికి అర కిలోమీటర్‌ దూరం నుంచీ అత్యవసర సమయాలలో శత్రువుపై దాడి చేసేందు కోసం మందుపాతరలు కూడా అమర్చు కుంటారు.

ఐదంచెల భద్రతలో ముందుగా మూడు కిలోమీటర్ల దూరంలో ఆయ న మకాం వేసి ఉన్న ప్రాంతానికి దారితీసే మార్గాలలో ఐదుగురు వ్యక్తులు కాపలా ఉంటారు. వారిలో ముగ్గురు మహిళలు కచ్చితంగా ఉంటారు. వారంతా ఆ ప్రాంతానికి చెందిన సాధారణ పౌరుల్లా కనిపిస్తూ ఆ మార్గాన వెళ్తున్న వారిని ఒక కంట కనిపెడుతూ ఉంటారు.అక్కడి నుంచి కిలోమీటర్‌ దూరంలో రెండో దశ భద్రత ఉంటుంది. అక్కడ 8 మంది వ్యక్తులు అడవిలో కట్టెలు ఏరుకునే వారి మాదిరో లేక, పక్కనే ఉన్న పల్లెలోంచి నిత్యావసరాలు తీసుకువెళ్లే వారిగానో, అడవిలో తేనెపట్టులు పట్టుకునే వారి మాదిరో ఉండి ఆ ప్రాంతంలో సంచరిస్తూ పోలీసు బలగాల లేదా పోలీసు ఇన్ఫార్మర్‌ల కదలికలు తెలుసుకుంటారు. ఆ తరువాత మూడవ దశలో 15 మంది సాయుధ దళ సభ్యులుంటారు.

పోలీసు బలగాలు కనుచూపుమేరలో ఎక్కడ కనిపించినా వెంటనే గాలిలోకి కాల్పులు జరుపుతూ, గ్రనేడ్‌లు విసురుతూ పెద్దపెద్ద శబ్దాలు సృష్టిస్తూ, ముందుగా ఎంపిక చేసు కున్న సురక్షిత మార్గంలో సమీపంలోని పల్లెలలోకి వెళ్ళిపోతారు. ఈ హఠాత్‌ పరిణామంతో కంగారుపడే భద్రతా బలగాలు ముందుగా ప్రమాద రహిత ప్రాంతాన్ని చూసుకుని జాగ్రత్తగా కూంబింగ్‌ నిర్వహిం చుకుంటూ ముందుకు సాగుతారు. ఇది జరగడానికి కనీసం రెండు గంటల సమయం అయినా పడుతుంది.

అదే సమయంలో ఆ కాల్పుల శబ్దం, గ్రనేడ్‌ పేలుళ్ళ శబ్దాలు అక్కడకు సమీపంలో మకాం వేసి ఉన్న కిషన్‌జీ స్థావరానికి వినిపిస్తాయి. దాంతో శత్రువుల కదలికలు తెలిసిపోయి ఆయన తన వారితో కలసి సురక్షిత ప్రాంతానికి తరలివెళ్ళిపోతారు.అయితే, ఊహించని విధంగా భద్రతా బలగాలు మరింత దగ్గరగా వచ్చేసినా ఆయన స్థావరానికి అర కిలోమీటర్‌ దూరంలో మార్గం మధ్యలో మందుపాత రలు, క్లేమోర్‌మైన్స్‌, డైరక్షన్‌ మైన్స్‌ ఏర్పాటు చేసుకుంటారు. వాటికి సమీపంలోని అత్యంత ఆధునిక ఆయుధాలు కలిగిన ఆరుగురు మెరికల్లాంటి గెరిల్లాలు నిఘా వేసి కూర్చుంటారు. ఆ తరువాత కిషన్‌ జీ స్థావరం ఉంటుంది. అక్కడ కూడా ముందు జాగ్రత్త చర్యగా నలువైపులా సెంట్రీలు ఉంటారు.

అయితే గురువారం నాటి ఎన్‌కౌంటర్‌ వాస్తవానికి బుధవారమే ప్రారంభం కావడంతో సాయుధ బలగాలు ముందుగా ఈ ఐదంచెల భద్రతా వ్యూహాన్ని వ్యూహాత్మకంగా దెబ్బతీసి ముందుకు సాగిపోయినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని సిఆర్‌పిఎఫ్‌ ఉన్నతాధికారి ఒకరు బుధవారమే ధ్రువీకరించారు కూడా. మొత్తం మీద మావోయిస్ట్‌ పార్టీ అగ్రనేత కిషన్‌జీ ఎన్‌కౌంటర్‌లో వాస్తవాలేమిటి, ఎలా జరిగింది వంటి పూర్తివివరాలు తెలియాలంటే ఈ ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించు కున్న మావోయిస్టు పార్టీ నేతలు ఎవరైనా సురక్షిత ప్రాంతానికి చేరుకున్న తరువాతనే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని ఆ పార్టీ సానుభూతిపరులు, విప్లవోద్యమంలో పాల్గొని ప్రస్తుతం ప్రజా జీవనంలో కొనసాగుతున్న మాజీ నాయకులు అంటున్నారు.

కిషన్‌జీ ప్రొఫైల్‌
dead

పూర్తిపేరు     మల్లోజుల కోటేశ్వరరావు
తండ్రిపేరు     స్వర్గీయ వెంకటయ్య
తల్లిపేరు      మధురమ్మ
పుట్టిన తేదీ    10-10-1953
వయసు      57 సంవత్సరాలు
జన్మస్థలం     పెద్దపల్లి, కరీంనగర్‌జిల్లా


విద్యార్హతలు
హెచ్‌ఎస్‌సీ (ప్రభుత్వ ఉన్నత పాఠశాల పెద్దపల్లి)
- ఇంటర్‌ కరీంనగర్‌ 1969-70 బ్యాచ్‌
- డిగ్రీ (జమ్మికుంట) 1971-73 బ్యాచ్‌
మావోరుుస్టు ప్రస్థానం
- 1976 రాడికల్‌ గ్రూప్‌ ఆర్గనైజర్‌ వరంగల్‌
- 1979 నుండి అజ్ఞాతం
- 1980లో జగిత్యాల జైత్రయాత్రలో కీలకపాత్ర
- 1980లో పీపుల్స్‌వార్‌ రాష్టస్థ్రారుు నేతగా గుర్తింపు
- 1987లో దండకారణ్యానికి మకాం మార్పు
- మావోరుుస్టు ేకంద్ర కమిటీలో రెండవ స్థానం
- ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాల్లో విస్తరణ బాధ్యతలు
అన్నపేరు  ఆంజనేయులు
తమ్ముని పేరు  వేణు (మావోరుుస్టు పార్టీ ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దు కార్యదర్శి )
మెుత్తం ేకసులు  104
జిల్లాలో నమోదైన ేకసులు  20
స్పీకర్‌ శ్రీపాదరావు, జగిత్యాల డీఎస్పీ బుచ్చిరెడ్డి హత్య ేకసుల్లో ప్రధాన నిందితుడు
రివార్డు  12 లక్షలు
పార్టీలో వ్యవహార నామం  మల్లోజుల కోటేశ్వర రావు అలియాస్‌ ప్రహ్లాద్‌ అలియాస్‌ కిషన్‌జీ.

http://www.suryaa.com/main/showNews.asp?cat=1&subCat=2&ContentId=58261

No comments:

Post a Comment