Saturday, 14 July 2012

అడవిని శోధిస్తూ..


అడవిని శోధిస్తూ..
అబూజ్‌మాడ్ గుట్టు విప్పే యత్నంలో విషాదం
మరణించిన ఫొటోగ్రాఫర్

తరుణ్ సెహ్రావత్.. నూనూగు మీసాల యువకుడు. సంచలనాల తెహల్కా వారపత్రికకు ఫొటో జర్నలిస్టు. వృత్తి జీవితం చిన్నదే. ఎంచుకున్న లక్ష్యం..దానికోసం చేసిన సాహసోపేత ప్రయాణం.. వెరసి ఈ చురుకైన కుర్రాడి వైపు లోకం కన్నార్పకుండా చూసేలా చేశాయి. అతడి కెమెరా కన్నులోంచి ఇప్పటిదాకా ఎవరికీ అంతుబట్టని 'అబూజ్‌మాడ్'ను చూసి మీడియా ప్రపంచమే అబ్బురపడుతోంది. అరణ్యగర్భంలో ఆదివాసీ వేస్తున్న పెనుకేకను, పడకేసిన తండాల తంటాలను చూసి నివ్వెరపోతోంది. కానీ, ఇదంతా చూడటానికి, తానెంత అరుదైన ఆవిష్కరణ చేశాననేది చూసేందుకు తరుణ్ సెహ్రావత్ ఇప్పుడు లేడు. ప్రయాణ క్రమంలో తీవ్ర అనారోగ్యానికి గురై గత నెల 15వ తేదీన మరణించాడు. ఈ ఏడాది మే నెలలో వారం పాటు తిరిగి 'అబూజ్‌మాడ్' వ్యథార్థ జీవన చిత్రాన్ని తరుణ్ కళ్లకు కట్టాడు.

ఛత్తీస్‌గఢ్‌లో అనేక ప్రాంతాల్లో మలేరియా విజృంభిస్తోందనీ, సరైన మందులూ, వైద్య సేవలూ లేనందువల్ల వందలాది మంది విషజ్వరాల బారిన పడి ఆస్పత్రుల పాలవుతున్నారనీ పత్రికలు ఎంతగా గగ్గోలు పెట్టినా ప్రభుత్వం చూసీ చూడనట్టే ఊరుకుంది. పైగా..పత్రికలు గోరంతలు కొండంతలు చేస్తున్నాయని ప్రభుత్వం వాదించింది. కానీ, ఛ త్తీస్‌గఢ్‌లో అందులోనూ దంతెవాడ ప్రాంతంలోని అనేక గ్రామాల్లో మలేరియా పలువురిని పొట్టనబెట్టుకున్నట్టు తెహల్కా వారపత్రిక బృందం బయటపెట్టింది. ఆ పత్రిక విలేకరి తుషా మిట్టల్, ఫొటోగ్రాఫర్ తరుణ్ సెహ్రావత్ దిగ్భ్రాంతిపరిచే అనేక విషయాలను తొలిసారిగా ప్రపంచానికి తెలియజేయగలిగారు. ఈ క్రమంలో 'సెరెబ్రల్ మలేరియా'కు గురై తరుణ్ ప్రాణాలు కోల్పోయాడు. అప్పుడుగానీ సర్కారు కళ్లు తెరుచుకోలేదు.

ప్రయాణం మొదలైందిలా..
మలేరియా మీద కంటే రాష్ట్రంలో కార్యకలాపాలను విస్తరిస్తున్న మావోయిస్టుల మీదే ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఎక్కువగా దృష్టి కేంద్రీకరించింది. దంతెవాడ పరిసర ప్రాంతాల్లోని గ్రామాల మీద మావోయిస్టులు తరచూ దాడులు చేసి 'నరమేధం' కొనసాగిస్తుండడాన్ని ప్రభుత్వం తీవ్ర విషయంగా పరిగణించింది. ఈ క్రమంలో మావోయిస్టుల కార్యకలాపాలపై కొన్ని వార్తాకథనాలను సేకరించాల్సిందిగా తెహల్కా ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్ తమ విలేకరి తుషా మిట్టల్ (27), ఫొటోగ్రాఫర్ తరుణ్ సెహ్రావత్ (23)లకు సూచించారు.

వారిద్దరూ ఈ ఏడాది మే రెండో వారంలో ఢిల్లీ నుంచి బయలుదేరి దంతెవాడ మీదుగా అబూజ్‌మాడ్ అడవుల్లోకి ప్రవేశించారు. మావోయిస్టులను స్వయంగా కలిసి మాట్లాడే ఉద్దేశంతో అడవుల్లోకి మరింతగా చొచ్చుకుపోయారు. వాళ్ల దగ్గరున్న మం చి నీళ్ల సీసాలు దారిలోనే ఖాళీ అయిపోయాయి. కొండలు ఎక్కడం, లోయల్లోకి దిగడం కారణంగా.. బరువు తగ్గించుకోవడానికి ఆ సీసాలను కూడా పారేయక తప్పలేదు. తీసుకెళ్లిన ఆహార పదార్థాలు కూడా అయిపోయాయి. అయినా అబూజ్‌మాడ్ రహస్యం ఛేదించాల్సిందేనన్న పట్టుదల వాళ్లను ముందుకే నడిపించింది.

తండాలో తంటాలు..
దారిలో కొన్ని తండాలు, గ్రామాలు ఎదురయ్యాయి. ఆ గ్రామాల్లో సగానికి సగం మంది వ్యాధిగ్రస్తులే ఉండటం కలచివేసింది. వాళ్లకు అక్కడ తెలిసిందేమిటంటే, ఆ ప్రాం తాల్లో ఒక్క మలేరియానే కాక, టైఫాయిడ్, కామెర్లు వంటివీ విజృంభించి ఉన్నాయి. ప్రభుత్వం ఈ వ్యాధుల విషయంలో ఎంతగా మభ్యపెడుతోందో, పత్రికల ముందూ, శాసనసభలోనూ ఎంతగా బుకాయిస్తోందో వాళ్లకు అర్థం కావడానికి ఎంతో సమయం పట్టలేదు. తరుణ్, తుషాలు ఈ పరిస్థితిని ముందుగా ఊహించలేదు.

అడవులనేసరికి ఆరోగ్యవంతమైన గాలి, నీళ్లు, పండ్లు, కూరలు దొరుకుతాయని అనుకున్నారు. మలేరియా, టైఫాయిడ్ వంటి విష జ్వరాలు సోకకుండా వాళ్లు ముందు జాగ్రత్తలేవీ తీసుకోలేదు. ఫలితంగా ఆ అడవుల్లో వాళ్లు పడిన కష్టాలు, ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. వాళ్లకిప్పుడు మావోయిస్టులను కలుసుకోవడం కంటే, గ్రామస్థుల్ని విష జ్వరాల బారి నుంచి కాపాడడమే ప్రధానమైపోయింది. స్థానికులు పెట్టిన అపరిశుభ్ర భోజనాన్ని తినక తప్పలేదు. ఆ పచ్చటి నీళ్లు తాగడం తప్ప మార్గం లేకపోయింది.

- స్పెషల్ డెస్క్

https://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2012/jul/6/main/6main3&more=2012/jul/6/main/main&date=7/6/2012

కిశోర్‌చంద్రదేవ్ పిల్లిమొగ్గ


కేంద్ర గిరిజన మంత్రి కిశోర్ చంద్రదేవ్ ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన మారణకాండకు సరైన సమయంలో, సమస్య లోతుల్లోకి వెళ్లి అడిగిన ప్రశ్నలు, సలహాలను ఆహ్వానిస్తూ నేను వ్యాసం రాశా ను. తర్వాత ఒక బలమైన అనుమానమే కాక కొంత భయం కూడా వేసింది. ఈ విషయం మీద వీవీతో మాట్లాడుతూ ఈ మంత్రి నేను అలా అనలేదు పత్రికలు తప్పుగా రిపోర్టు చేశాయని అంటే రాసిన వ్యాసాన్ని ఎలా సమర్థించుకోవాలో అనే అనుమానం ఉంది అని అంటే, అలా అన్నా మనం ఆశ్చర్యపోవలసిందేమీ లేదు అని వీవీ అన్నారు. మంత్రి తానన్న మాటలను, వ్యాఖ్యలను వెనక్కితీసుకోకపోయినా, ఈమధ్యే ఛత్తీస్‌గఢ్ సంఘటనలో పోలీసుల ప్రవర్తన మీద స్పందిస్తూ, వాళ్లు అలాంటి పొరపాట్లు చేయకుండా ఆంధ్రవూపదేశ్‌లోని గ్రేహౌండ్స్ లాంటి లక్ష్యానికి అంకితమైన బలగాన్ని తయారు చేయాలని సూచన చేశారు. ఇది ఒక రకంగా నాలాంటి వాళ్లను నిరాశకు గురిచేసింది. లేకలేక ఒక మంత్రి ఒక సంఘటనకు ప్రజాస్వామ్యంగా స్పందించాడని కొంత సంతోషపడ్డా తాను అంతకుముందు లేవదీసిన చర్చకు ఈ సలహా ఎట్లా సరిపోతుందో అర్థం కావడం లేదు.ఆయన అడిగిన ప్రశ్న అటవీ ప్రాంతంలో ఉండే గిరిజనులకు అడవి మీద, ఖనిజ సంపద మీద హక్కు ఉంటుందని వాళ్ళ అనుమతి లేకుండా ఖనిజాలను బయటివాళ్లకు అప్పజెప్పకూడదని, అలాగే ఖనిజాలను దేశ ప్రయోజనాలకే ఉపయోగించాలని అంటూ, ‘గ్రేహౌండ్స్’ ఈ లక్ష్యాలను ఎలా సాధిస్తుందో, ఆ బలగాలు ఎలా ఉపయోగపడతాయో చెప్పవలసిన బాధ్యత ఉంది.

ఆంధ్రవూపదేశ్‌లో గ్రేహౌండ్స్ బలగాలు విజయాన్ని సాధించాయని, మావోయిస్టు ఉద్యమాన్ని అణచివేశాయని దేశ వ్యాప్తం గా ప్రచారం జరుగుతోంది. దీంట్లో కొంత నిజమున్నా ఛత్తీస్‌గఢ్‌కు ఆంధ్రవూపదేశ్‌కు చాలా తేడా ఉంది. అయితే మావోయిస్టు పార్టీ ఈ రాష్ట్రంలో వెనక్కి తగ్గిన తర్వాత ఖనిజ సంపద దోపిడీ నిరాఘాటంగా సాగింది. లక్షల కోట్ల ఆస్తుల గురించి రాష్ట్రంలో చాలా చర్చ జరుగుతున్నది. ఈ కోట్ల రూపాయల సంపదలో ఖనిజాల నుంచి వచ్చిన లాభాలు, నల్లధనం, దాని నుంచి రాజ్యం మీద వాళ్లు చేస్తున్న సవారీ మన అనుభవంలోనే ఉంది. గ్రేహౌండ్స్ మావోయిస్టు ఉద్యమాన్ని అణచడానికి కొంతవరకు ఉపయోగపడిందేమో కానీ, ఈ కోట్ల సంపద దోపిడీని అది ఎలా ఆపగలదు ఈ అక్రమ సంపదను రక్షించుకోవడానికి దోపిడీదారులు పెంచి పోషించిన మాఫియాను ఏం చేయగలరు నేను ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చిన తర్వాత దేశ వ్యాప్తం గా పనిచేస్తున్న 160 మంది సీనియర్ పోలీస్ అధికారులకు లెక్చర్ ఇచ్చినప్పుడు మాఫియా పాత్రను, అది పెరిగిన విధానా న్ని విశ్లేషిస్తూ, ఈ మాఫియా దగ్గర ఆయుధాలున్నాయి, ఇది సంపూర్ణంగా చట్ట వ్యతిరేక మూక, వీళ్లకు రాజకీయ విశ్వాసాలులేవు. ఈ మాఫియా దాదాపు అన్ని లాభసాటి రంగాల్లో ఉంది. మహారాష్ట్రలో కిరోసిన్ మాఫియా జిల్లా కలెక్టర్‌ను సజీవంగా అంటుపెట్టింది. (దానికి కిరోసిన్‌నే ఉపయోగించి ఉంటారు) అలాగే మధ్యవూపదేశ్‌లో అనుకుంటా ఒక ఐపీఎస్ ఆఫీసర్‌పై నుంచి ట్రక్కు నడిపించి చం పారు.

అధికారులను బెదిరిస్తూ ఉంటారు. అలాగే దేశ వ్యాప్తంగా సమాచార హక్కు కోసం పోరాడుతున్న చాలామందిని హత్య చేశారు. సమాచార హక్కు కోసం పోరాడే వారు నిరాయుధులు, చట్టం మీద సంపూర్ణ విశ్వాసం ఉన్నవారు. వాళ్లకు ఎలాంటి రక్షణ లేదు. ఇది ఛత్తీస్‌గఢ్‌లో శంకర్‌గుహ నియోగి లాంటి ఒక గొప్ప కార్మిక నాయకుడిని చంపినప్పుడే నియంవూతించవలసిన మూక. ఈ మాఫియాను ఎలా ఎదుర్కోవాలి దానికి గ్రేహౌండ్స్ ఏం చేయగలవు అన్న సవాలు మనముందు ఉన్నది. దీనికి స్పందిస్తూ కొందరు పోలీసు అధికారులు ఈ మాఫియా తో పోరాడవచ్చు కదా అని అన్నారు. అంటే పోలీసు అధికారులకు కూడా మాఫియాను ఎలా నియంవూతించాలో అర్థం కావడంలేదు.

సమస్య మూలాలు ఖనిజ సంపద అక్రమ దోపిడీలో ఉందని, గిరిజనులకు పూర్తి హక్కులను ఇవ్వడమే పరిష్కారమని ఒకవైపు అంటూ రాజ్యహింసను సమర్థించడం, సమస్య ఒకటైతే పరిష్కారం హింసలో చూడడం, అధికారంలో ఉన్న వారికి సహజమేమో అనిపిస్తుంది. నిజానికి ఈరోజు మావోయిస్టు హింసకంటే కూడా వాళ్ల రాజకీయ విశ్వాసాలే వ్యవస్థను చాలా భయపెడుతున్నాయి. రాజకీయ విశ్వాసాలులేని ఏ హింసైనా చాలామందికి అంగీకారంగా ఉంది. నిజానికి గుజరాత్ మాన వ హననంలో హత్యలు, మానభంగాలు, చిన్న చిన్న పిల్లలను నిర్దాక్షిణ్యంగా చంపడానికి వ్యతిరేకంగా మేం పోరాటం చేశాం. పిల్లలను మావన కవచంగా మావోయిస్టులు ఉపయోగిస్తున్నారు అని మీడియా ఎంత ప్రచారం చేసినా, మొన్న ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన హత్యాకాండ సందర్భంలో మావోయిస్టులు లేరని అందరూ అంగీకరిస్తున్నారు. ది హిందూ దిన పత్రిక, ఎన్డీటీవీ ఈ విషయాన్ని కొంత విస్తృతంగానే సమాజ దృష్టికి తీసుకొచ్చాయి. పిల్లలను మానవ కవచంగా వాడుతున్నారన్నది కనీసం ఈ సంఘటనలో లేదని అంటే దీన్ని ప్రచార అస్త్రంగా ఉపయోగించుకున్నారన్నది స్పష్టంగానే కనబడుతుంది.

మావోయిస్టు ఉద్యమం ఒక సైన్యాన్ని కలిగి ఉందని, వాళ్లు రాజ్యాధికారం కోసం పోరాడుతున్నారని, ఇది చాలా భయంకరమైన అంశమని బీజేపీ చాలా పెద్ద ఎత్తున వాదిస్తున్నది. మావోయిస్టు పార్టీ కూడా ఈ అంశం మీద కొంచెం ఎక్కువగా మాట్లాడడం వల్ల విశాల ప్రజానీకంలో కూడా ఆ అభివూపాయం ఉంది. కానీ ఈ సమాజం చాలా అమానుషంగా మారుతున్నదని, మానవీయ విలువలు కాపాడుకోవలసిన ప్రత్యామ్నాయ రాజకీయాలు కావాలని చాలామందే కోరుకుంటున్నారు. సమాజంలోని వ్యవస్థీకృ త హింసను క్రమక్షికమంగా అర్థం చేసుకుంటున్నారు. హింస, ప్రతిహింసలు సామాజిక మార్పులో భాగం కావచ్చు కానీ, సమాజం తనను తాను మానవీ య సమాజంగా నిలుపుకోవడానికి చాలా పోరాటాలే చేయవలసి ఉంది. ఈ మానవీయ పోరాటాలలో మావోయిస్టు ఉద్యమం పాత్ర ఎంత ఉంటుందన్నది ఒక చారివూతక సవాలు. దాంట్లో వాళ్లు అంటున్న ప్రతిహింస పాత్ర గురిం చి చర్చ జరగవలసి ఉంది.

సమాజం హింస, ప్రతిహింస వలయంలో చిక్కుకొని విపరీతమైన ప్రాణనష్టం జరుగుతుందని, దీన్ని ఎలాగైనా నివారించాలనే లక్ష్యంతో మన రాష్ట్రం లో పౌర స్పందన వేదిక శంకరన్ ఆధ్వర్యంలో (మానవత్వం పరిమళించిన మంచి మనిషి) దాదాపు ఆరు, ఏడు సంవత్సరాల కృషి ఫలితంగా మావోయి స్టు పార్టీ, జనశక్తి నాయకులు ప్రభుత్వం తో చర్చించడానికి స్వయాన వచ్చా రు. చర్చల ఫలితమేమిటో తెలుగు సమాజానికి అనుభవపూర్వకంగా తెలుసు. ఈ విషయం కిశోర్ చంద్రదేవ్‌కు తప్పక తెలిసే ఉంటుంది. చర్చల సందర్భంలో ప్రజాస్వామిక హక్కులు, భూసంస్కరణలు వంటి సమస్యలు చర్చకు రావడంతో అక్ర మ సంపాదన అధినేతలు చర్చలను ఒక్క అడుగు ముందుకు పోనీయలేదు. ఇంత అనుభవం ఉండి, ప్రజల నుంచి ఎదిగి వచ్చిన కిశోర్ చంద్రదేవ్ ఆదివాసీల సమస్యకు గ్రేహౌండ్స్‌యే పరిష్కారం అనటం సరైంది కాదు. ఉత్తరాంవూధలో మావోయిస్టు ఉద్యమం ఉంటే లక్షింపేట ఊచకోత జరిగి ఉండేదా ఆయన ఆదివాసీల సమస్యకు పరిష్కారం గ్రేహౌండ్స్‌యే అనడం చారివూతక విషాదం.

ప్రొఫెసర్ జి. హరగోపాల్

http://www.namasthetelangaana.com/Editpage/article.asp?category=1&subCategory=7&ContentId=127429

ఆదివాసులకు న్యాయం దక్కేనా


చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, సుక్మా, కాంకేర్ జిల్లాల్లో జూన్ 28,29 తేదీల్లో పోలీసులు మూడుచోట్ల అమాయకులైన 23మంది ఆదివాసీలను చంపారు. జూన్ 28వ తేదీ అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో బాసగూడెంలో ఎన్‌కౌంటర్‌గా ప్రకటించిన దాంట్లో సీఆర్‌పీఎఫ్ కాల్పుల్లో 20 మంది ఆదివాసులు చనిపోయారు. ఇందులో మహిళలు, పసి పిల్లలు ఉన్నారు. 29వ తేదీ ఉదయం సుక్మా జిల్లా జేగురుగొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో పశువులను, విత్తనాలను తీసుకొని పొలం దగ్గరికి వెళ్తున్న మడ్కం మత్తాలు, మడ్కం లచ్చాలు అనే ఆదివాసీ రైతులను పట్టుకొని కాల్చి చంపి, ఆ శవాలను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. కాంకేర్ జిల్లా జొన్నగూడెంలో చుట్టపు చూపుగా వచ్చిన సోడుం దూలాను మావోయిస్టు అనే అనుమానంతో పట్టుకుని కాల్చి చంపారు. ఈ మూడింటిలో ‘బాసగూడెం ఎన్‌కౌంటర్’ గురించే ఎక్కువగా చర్చ జరుగుతున్నది. బాసగూడెంలో చనిపోయిన 20 మంది పేర్ల ను అక్కడ జూన్ 28వ తేదీ రాత్రి పదకొండు గంటలకు సమావేశమైన కర్కగూడెం, కొత్తగూడెం, రాజుపెంట గ్రామాలకు చెందిన 150 మంది గ్రామస్తులు ఇప్పటికే చాలామందికి చెప్పారు. అక్కడికి స్వయం గా వెళ్లిన రిపోర్టర్ అమన్ సేథీ అక్కడి శవాలపై బుల్లెట్ గాయాలు, కత్తులతో కోసిన, గొడ్డళ్లతో నరికిన గుర్తులు కూడా చూశానని తెలిపాడు. పత్రికలు కూడా ఫొటోలతో సహా వార్తలను ప్రచురించాయి. ఆ గ్రామా ల ప్రజలతో, ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడానని, చనిపోయిన వారెవరూ మావోయిస్టులు కారని వాళ్లు చెప్పారని గాంధేయవాది హిమాంశు కుమార్ ఫేస్‌బుక్‌లో పెట్టాడు.

విత్తనాల పండుగ జరుపుకొని భూమి పూజ చేస్తుండగా పోలీసులు వచ్చి, ఎలాంటి హెచ్చరికలు లేకుండా కాల్పులు జరిపారని గ్రామస్తులు చెప్పినట్టు ఆయన ఫేస్‌బుక్‌లో రాశాడు. స్వామి అగ్నివేశ్, రాజేంద్ర సచార్, వందనా శివ, సక్సేనాలు కూడా ఇది బూటకపు ఎన్‌కౌంటర్ అని చెప్పారు. పోలీసులు ఏకపక్షంగా కాల్పులు జరిపారని, 20 మంది అమాయక ఆదివాసీలను చంపారని ప్రకటించారు. రామచంద్ర గుహ, ఎస్.ఆర్. శర్మ, నందినీ సుందర్ కూడా ఖండించారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అక్కడి పీసీసీ కార్యదర్శి అధ్యక్షతన ఘటనా స్థలానికి వెళ్లి గ్రామాలన్నీ తిరిగి, ఇది బూటకపు ఎన్‌కౌంటర్ అని, హతులందరూ ఆదివాసీ అమాయకులేనని అన్నారు. ఈ ఘటనపై న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఆ రాష్ట్రానికి చెందిన కేంద్ర వ్యవసాయశాఖ సహాయ మంత్రి డాక్ట ర్ చరణ్‌దాస్ మహంతి కూడా ఈ వాదనను బలపరిచాడు. కేంద్ర హోం మంత్రి చిదంబరం ఇది నిజమైన ఎన్‌కౌంటరే అని అన్నాడు కదా, చనిపోయి న వారందరూ మావోయిస్టులే అని అంటున్నారు కదా! అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్‌సింగ్, ఇంటలిజెన్స్ వారు ఆయనకు సరైన సమాచారం ఇవ్వకపోవచ్చునని అన్నారు. ఈ సంఘటన జరిగీ జరగగానే కేంద్ర హోం మంత్రి చిదంబరం ఇది నిజమైన ఎన్‌కౌంటరే అని చెప్పడమే కాకుండా, సీఆర్‌పీఎఫ్ బలగాలు చాలా చొరవతో మావోయిస్టులను ఎదురుకాల్పుల్లో కాల్చి చంపాయని ప్రశంసించారు. అందులో ఏడుగురు సీఆర్‌పీఎఫ్ జవాన్లు గాయపడడమే ఇది నిజమైన ఎన్‌కౌంటర్ అనడానికి తిరుగులేని నిదర్శనమన్నాడు. ముఖ్యమంత్రి రమణ్‌సింగ్, సీఆర్‌పీఎఫ్ డైరెక్టర్ జనరల్ విజయ్‌కుమార్ కూడా ఇదే వైఖరి తీసుకున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, కేంద్ర మంత్రి వర్గంలో గిరిజన శాఖా మంత్రిగా ఉన్న కిశోర్ చంద్రదేవ్ ఈ మొత్తం సంఘటనపై ధ్వజమెత్తిన తీరు ఒక ఎత్తు. ఆయన ‘ఇది బూటకపు ఎన్‌కౌంటర్, హతులందరూ ఆదివాసీలు అంటూనే, ఒకవేళ వాళ్లలో ఎవరైనా మావోయిస్టులు ఉన్నా, అందరికి అందరూ మావోయిస్టులైనా ఆదివాసీలు మావోయిస్టులు కావడానికి గల కారణా లు ఏమిటో ఆలోచించాలి’ అన్నారు.

ఒకవేళ పిల్లలు కూడా మావోయి జం వైపు ఆకర్షింపబడుతుంటే అందు కు ప్రభుత్వ విధానాలే కారణ మా స్వీయ విమర్శ చేసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎవరి ప్రయోజనం కోసం సీఆర్‌పీఎఫ్ బలగాలను కేంద్రం నుంచి కోరిందో చెప్పాలన్నారు. ఇవన్నీ అంటూ.. ‘మౌలికంగా మన ప్రభుత్వాల మైనింగ్ పాలసీనే పునఃపరిశీలించాల’ని అన్నారు. ఇది ప్రభుత్వ వర్గాలలో తీవ్ర కలకలం రేపింది. దీంతో చివరకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణకు ఆదేశించింది. కేంద్ర హోం మంత్రి చిదంబరం ఇంకా తన వాదనలన్నింటికి కట్టుబడి ఉంటూనే ‘హతుల్లో మావోయిస్టులుకాని ఆదివాసులు ఉంటే అందుకు క్షమాపణ చెప్తున్నా’నని అన్నారు. దీంతో అనేక విషయాలు చర్చనీయాంశాలయ్యాయి.
1) ఆదివాసీలు మావోయిస్టులైనా, ఆదివాసుల్లో మావోయిస్టులు న్నా వాళ్లను కాల్చి చంపవచ్చునని అంటున్నారన్నమాట. (జనంలో మావోయిస్టులు ఉన్నప్పుడు జనం కొందరు చావక తప్పదని ఇప్పటికే చిదంబరం, విజయ్‌కుమార్ వంటి వారితో పాటు ఒకరిద్దరు మీడియా లో తేల్చేశారు!)
2)ఆదివాసులు మావోయిస్టులైతే చంపవచ్చునా
3) మావోయిస్టులైతే ఎన్‌కౌంటర్ పేరుతో చంపవచ్చుననేది చిదంబరం, రమణ్‌సింగ్ లాంటి వాళ్లు ఎప్పుడో తేల్చుకున్న న్యాయం. కనుక ఇప్పుడు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ చేసేది.. చనిపోయిన ఆదివాసుల్లో మావోయిస్టులు ఉన్నారా లేక ఆదివాసీలే మావోయిస్టులా అనేది తేల్చడానికి మాత్రమే. ఇది నిజమైన ఎన్‌కౌంటరా బూటకపు ఎన్‌కౌంటరా అనేది తేల్చడానికి కాదు. గులాం రసూల్ ఎన్‌కౌంటర్ విషయం లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జస్టిస్ టీఎల్‌ఎన్ రెడ్డి కమిషన్ విచారణ వేసినప్పుడు ఆయన అది ఎన్‌కౌంటరా కాదా అన్న అంశం కాకుండా, ఆ జర్నలిస్టు నక్సలైటే అని తేల్చేశారు. డాక్టర్ బినాయక్‌సేన్ యావజ్జీవ శిక్ష ,‘వరల్డ్ టూ విన్’ సంపాదకుడు ఆసిత్ సేన్ గుప్తాకు ఎనిమిదేళ్ల శిక్ష, అసెంబ్లీలో కరపవూతాలు పంచారన్న నెపంతో మావోయిస్టు సానుభూతిపరులు మాలతీ మొదలైన వారికి పదేండ్ల శిక్ష వేసిన ఛత్తీస్‌గఢ్ న్యాయవ్యవస్థ నుంచి మనం ఏమి ఆశించగలం!ఎన్‌కౌంటర్లు అన్నీ నిజమా బూటకమా! అన్న విచికిత్స లేకుండా హత్యా నేరంగా నమోదు చేసి విచారించాలని ఆంధ్రవూపదేశ్ హైకోర్టు ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఏకక్షిగీవం గా ఇచ్చిన తీర్పు అమలైనప్పుడు మాత్రమే ఎన్‌కౌంటర్లు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నది. కనీసం బూటకపు ఎన్‌కౌంటర్లు చేయడానికి పోలీసు లు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. చిదంబరం వంటి వారికి ఎన్‌కౌంటర్ల న్నీ నిజమైనవేనని అనడానికీ, మావోయిస్టులైతే కాల్చిచంపేయవచ్చునని అనడానికీ ఆంధ్రవూపదేశ్ హైకోర్టు తీర్పు మార్గదర్శకాలు గుర్తుండే విధంగా చేస్తే కొంత రక్తపాతం తగ్గుతుంది. అలాగే... ప్రభుత్వ విధాన నిర్ణేతలకు అదొక బాధ్యత అని గుర్తుచేస్తుంది. నాగలితో దున్నితో భూమాతకు బాధ కలుగుతుందేమోనని సున్నితంగా కొయ్యముక్కలతో పోడు వ్యవసాయం చేసుకునే ఆదివాసుల గుండెల్లో గుండ్లు దించి, బయోనెట్లతో గుచ్చి హత్యచేసిన పాలకులకు ఆదివాసులు మావోయిస్టులుగా, హింసావాదులుగా కనిపించడం నేటి పాలకుల నీతి. ఇప్పటి చారివూతక విషాదం. ఈ హింసాత్మ దుష్టనీతిలో అమాయక ఆదివాసుల కు న్యాయం జరుగుతుందా

-వరవరరావు

http://www.namasthetelangaana.com/Editpage/article.asp?category=1&subCategory=7&ContentId=125562

అబూజ్‌మాడియాలకు ముప్పు!


మధ్యభారతంలో ప్రస్తుతం నెలకొనివున్న యుద్ధవాతావరణం అబూజ్‌మాడ్‌లో పెనుసంక్షోభాన్ని సృష్టించింది. ఇంతకాలం ప్రకృతి ఒడిలో హాయిగా ఆడుతూ పాడు తూ స్వేచ్ఛగా, దర్జాగా బతికిన మాడియా గోండులు ఏ క్షణం ఏం జరుగుతుం దో, ఎటువైపు నుంచి ఏ ఆపద ముంచుకురానుందో తెలియక భయంభయంగా బతుకుతున్నారు. ఉధృతంగా సాగుతున్న మావోయిస్టుల కార్యకలాపాలు, ఆ కార్యకలాపాల అణచివే త పేరిట కేంద్ర, రాష్ట్ర బలగాల ముప్పేట దాడులు కలిసి వారి సమాజాన్ని అతలాకుతలం చేస్తున్నాయి.శిక్షణ స్కూలు నెపంతో గుట్టల అంచున భారత సైన్యం పాగావేసింది. అనుని త్యం ఆకాశంలో హెలికాప్టర్లు,మానవరహిత విమానాలు ఎగురుతున్నాయి. సరుకుల కోసం సంతకు వెళ్లిన వ్యక్తులు అదృశ్యమవుతున్నారు. సీఆర్‌పీఎఫ్, కోబ్రా దళాలు తరచూ వేల సంఖ్యలో కదిలివచ్చి గ్రామాలపై దండెత్తి గుడిసెలను తగులబెడుతున్నాయి. దొరికిన వారందరినీ చితకబాదడం, పారిపో ప్రయత్నిస్తే విచక్షణారహితంగా కాల్చడం, ఆడవాళ్లపై అత్యాచారాలు సర్వసాధారణమయ్యాయి. ఇంకోవైపు, ఇటీవల బలగాలు నిర్వహించిన ఆపరేషన్ హాకా, ఆపరేషన్ విజయ్‌ల అసలు లక్ష్యం మాడ్‌వాసులను భయపెట్టి గుట్టలపై నుంచి పారదోలడమేనంటున్నారు.

మరో రెండేళ్లలో ఈ ప్రాంతాన్ని నేరుగా సైన్యమే ఆక్రమించుకుని వామపక్ష తీవ్రవాదంపై భవిష్యత్తులో చేయబోయే అంతిమయుద్ధంలో హెడ్‌క్వార్టర్స్‌గా ఉపయోగించుకోనుందన్న వార్తలు కూడా వెలువడుతున్నాయి. ఈనేపథ్యంలో ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన తెగ గా గుర్తింపు పొంది న అబూజ్‌మాడియాల అస్తిత్వానికి ప్రమాదమేర్పడిందని పలువురు మేధావులు, సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు మూలవాసులకు(ఇండియన్లకు) తెల్లజాతి చేసిన అకృత్యాలు, అన్యాయాలకు గాను బేషరతుగా అమెరికా, ఆస్ట్రేలియా తదితర దేశాలు బహిరంగంగా క్షమాపణలు చెబుతున్న కాలంలో భారత పాలకులు ద్రవిడులందరి పూర్వీకులుగా భావిస్తున్న మాడి యా తెగపై యుద్ధం ప్రకటించడమేమిటని ప్రశ్నిస్తున్నారు.

మావోయిస్టులపై నిర్ణయాత్మక యుద్ధం చేయాలని కేంద్రం నిశ్చయించడానికి బలమైన కారణాలున్నాయి. 1990ల తర్వాత ప్రైవేటీకరణ, సరళీకరణ విధానాల నేపథ్యంలో అనేక బహుళజాతి కంపెనీలు మధ్యభారతంలో తిష్ఠ వేశాయి. అక్కడ అపారంగా ఉన్న ఖనిజవనరులపై లెక్కలేనన్ని ఎంఓయూలను కుదుర్చుకున్నాయి. 2009 సెప్టెంబర్ నాటికి ఈ ఎంఓయూల విలువ 8లక్షల 73వేల 896 కోట్లకు చేరింది. 170 చట్టాన్ని అపహాస్యం చేస్తూ గనుల పేరిట, కర్మాగారాల పేరిట, విద్యుత్‌ప్లాంట్ల పేరిట జార్ఖండ్, ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్‌లలో వేలాది ఎకరాల ఆదివాసీ భూములను కార్పొరేట్లకు కట్టబెట్టడం మొదలైంది. అభివృద్ధి పేరిట కొనసాగుతున్న ఈ జీవన విధ్వంసానికి వ్యతిరేకంగా సహజంగానే ఈ ప్రాంతాల్లో ప్రాబల్యశక్తిగా ఉన్న మావోయిస్టు పార్టీ స్థానికులను కూడగట్టింది.పనులు మొదలైన ప్రతిచోటా ప్రతిఘటనా పోరాటాలు చేపట్టింది. కార్పొరేట్ ఆస్తులపై, సిబ్బందిపై దాడులు చేసింది. ఫలితంగా అనేక ప్రాజెక్టులు మధ్యలోనే ఆగిపోయాయి.

ఈ పరిస్థితిని బేరీజు వేసుకున్న కంపెనీలు మావోయిస్టుల మూలంగా తమ పెట్టుబడులకు పొంచివున్న ప్రమాదం గురించి అగ్రరాజ్యం తో, ప్రపంచబ్యాంకుతో, భారతవూపభుత్వంతో మొరపెట్టుకున్నాయి. పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించకుండా దేశ ఆర్థికాభివృద్ధి ఎలా సాధ్యమని నానా యాగీ చేశాయి. దేశ అంతర్గత భద్రతకు అతిపెద్ద ముప్పు వామపక్ష తీవ్రవాదమేనని ప్రకటిస్తున్న ప్రధాని మన్మోహన్, హోంమంత్రి చిదంబరంల వ్యాఖ్యలను మనం ఈ నేపథ్యంలోనే చూడాలి. గ్రీన్‌హంట్ కార్యక్షేత్రం కూడా మధ్యభారతమే కావడం కూడా యాధృచ్ఛికం కాదు. మన ప్రధాని అమెరికా యాత్ర, ఆ తర్వాత మిలిటరీ నిపుణులతో కూడిన అమెరికా బృందం ఇక్కడికి వచ్చి ఢిల్లీ, రాయ్‌పూర్‌లలో మంతనాలు సాగించడం ఫలితంగానే గ్రీన్‌హంట్‌కు రూపకల్పన జరిగిందని మావోయిస్టు పార్టీ ఆరోపించిన విషయాన్ని ఇక్కడ గమనించాలి. మొన్నటి వరకు జమ్మూ-కాశ్మీర్‌లో ఉగ్రవాదులతో, ఈశాన్యంలో వేర్పాటువాదులతో పోరాటంలో తీరిక లేకుండా ఉన్న సైనిక, పారామిలిటరీ బలగాలు ఇటీవల అక్కడ పాక్షికంగా ప్రశాంత పరిస్థితులు ఏర్పడి మరోచోట మోహరించడానికి సిద్ధంగా ఉండడం ఇందుకు అనుకూలించింది.

అలా 2009 సెప్టెంబర్‌లో గ్రీన్‌హంట్ మొదలైంది. జార్ఖండ్, పశ్చిమబెంగాల్, ఆంధ్ర-ఒరిస్సా సరిహద్దుల్లో కూడా బలగాల మోహరింపు జరిగినపప్పటికీ ఈ ఆపరేషన్ ప్రధాన దిశ ను మాత్రం బస్తర్ వైపు, అదీ అబూజ్‌మాడ్ కొండలవైపు కేంద్రీకరించారు. ఈ ప్రాంతాన్ని సర్వే చేయించడంతో పాటు తొలిసారిగా మానవరహిత విమానాలను ప్రవేశపెట్టారు. వాయుసేన హెలికాప్టర్ల సహాయాన్ని తీసుకున్నారు. ఒక్క బస్తర్‌లోనే 60వేల పారామిలిటరీ, పోలీసు బలగాలను మోహరించి కూంబింగ్ ఆపరేషన్లు చేపట్టారు. మావోయిస్టుల ముద్రవేసి అమాయక గిరిజనులను డజన్ల కొలది బలితీసుకున్నారు. సల్వాజుడుం ముసుగులో బీభత్సకాండ సృష్టించారు. అయినప్పటికీ గ్రీన్‌హంట్ అనుకున్న ఫలితాలు సాధించలేకపోయింది.ఉద్యమం బలహీనపడకపోగా, ఏరియా, జిల్లా స్థాయిల్లో జనతన సర్కార్లు ఏర్పడి బస్తర్ సామాజిక, ఆర్థిక కార్యకలాపాలను శాసించే స్థితికి ఎదిగాయి. గెరిల్లాల సంఖ్యతో పోల్చితే ప్రభుత్వ బలగాలకు చెందిన జవాన్లే అధిక సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు.

ముఖ్యంగా, చింతల్నార్ తదితర ఘటనల్లో భారీ సంఖ్యలో జవాన్లను కోల్పోతుండడంతో కేంద్రం ఆలోచనలో పడి ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టింది. చిదంబరం లాంటివాళ్లు నేరుగా సైన్యాన్ని రంగంలోకి దింపాలని వాదించగా, ఆంటోనీ తదితరులు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించారు. అంతా కలిసి మధ్యేమార్గాన్ని ఆమోదించారు. గ్రీన్‌హంట్ రెండవ దశను ప్రకటించారు.మూడేళ్లుగా గ్రీన్‌హంట్ నుంచి నేర్చిన పాఠాలు, కేంద్ర ఇంటెలిజెన్స్ సమాచారం వారిని అబూజ్‌మాడ్‌పైన కేంద్రీకరించేలా చేశాయి. ఈ కొండలను స్వాధీనం చేసుకోవడం ద్వారా బస్తర్ ఉద్యమాన్ని రక్షణలో పడవేయాలని తీర్మానించారు. అయితే, భవిష్యత్తులో అనుసరించేందుకు సైన్యం ప్రధాన పాత్రగా పకడ్బందీ పథకాన్ని రూపొందించారు. బస్తర్ డివిజనల్ కేంద్రం జగ్దల్‌పూర్‌లో 15 వేల సైన్యంతో ఆర్మీ సబ్ ఏరియా కమాండ్ హెడ్‌క్వార్టర్స్‌ను, భిలాయ్ సమీపంలో వాయుసేన స్థావరాన్ని, బిలాస్‌పూర్‌లో బ్రిగేడ్ హెడ్‌క్వార్టర్స్‌ను, అబూజ్‌మాడ్‌పై సైనిక శిక్షణ స్కూలును ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. 2011జూన్‌లో 3వేల మంది సైనికులు స్కూలు ఏర్పాటులో భాగం గా కొండగాంకు వచ్చి మకాం చేశారు. వీరు ఏర్పాటు చేసుకున్న శిబిరానికి అప్పటి ఆర్మీ చీఫ్ వీకే సింగ్ సైతం వచ్చి ఏర్పాట్లను పర్యవేక్షించారు. హెలికాప్టర్ నుంచి మాడ్ టెర్రయిన్‌ను సైతం పరిశీలించారు.

దీన్ని చూస్తే సమీప భవిష్యత్తులో మావోయిస్టులపై సైన్యాన్ని ప్రయోగించే సూచనలు కనబడుతున్నాయని విశ్లేషకులు అభివూపాయపడుతున్నారు. శిక్షణలో ఉన్న సైనికులు మావోయిస్టులపై ఎలాంటి చర్యలూ చేబట్టబోరని సైన్యాధికారులు పదే పదే స్పష్టం చేస్త్తున్నప్పటికీ అది నమ్మశక్యంగా లేదని వారంటున్నారు. సుమారు 800 చ.కి.మీ.ల స్కూలు పరిధిలోని అడవుల్లో సంచరించే సైనికులకు మావోయిస్టులు తారసపడ్డా లేక శిక్షణార్థులు హద్దులను దాటి అవతలకు వెళ్లినా ఇరువర్గాల మధ్య ఘర్షణ తప్పదని వివరిస్తున్నారు. కార్యకలాపాల నిబంధనావళి ప్రకారం ఆర్మీకైనా, వాయుసేనకైనా ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపే వెసులుబాటు ఉంది. కనుక ఏం జరగనుందో ప్రత్యేకించి చెప్పనక్కరలేదంటున్నారు. అబూజ్‌మాడ్ కొండలను భూతలం నుంచి క్షుణ్ణంగా రెక్కీ చేయడం కోసమే ఈ స్కూలును ఏర్పాటు చేశారన్న వాదన కూడా ఉంది. ఈ పరిణామాల ను పరిశీలిస్తే మరో రెండు మూడేళ్లలో మాడ్‌లో పూర్తిస్థాయి సైనికచర్య జరగనుందని అంచనా వేయవచ్చు. అప్పుడు అబూజ్‌మాడియాల భవిష్యత్తు ఏమిటన్నది ఇక్కడ ఆలోచించాల్సిన విషయం. స్కూలు పేరుతో వారి మాతృభూమిలో ఐదవ వంతు భూభాగా న్ని లాక్కోనున్న పాలకులు ఈ లోపే వారిని తమ ఊళ్ల నుంచి తరిమివేసేందుకు పథకాలు రూపొందిస్తున్నారు.

మాడ్ గోండుల అస్తిత్వానికి ముప్పు తెచ్చే పాలకుల కుట్రను ప్రజలు, ప్రజాస్వామికవాదులు వ్యతిరేకించాలి. మావోయిస్టులు అభివృద్ధి నిరోధకులు, ప్రజా వ్యతిరేకులని ప్రభుత్వా లు భావించి, వారిని నిర్మూలించడమే తమ విధానమని ప్రకటించినా ఆ కోపాన్ని అమాయక ఆదివాసులపై, ఓ అరుదైన ప్రాచీన తెగపై చూపించడం అన్యాయం. నక్సలైటు ఉద్యమం శాంతిభవూదతల సమస్య కాదని, సామాజిక, ఆర్థిక కారణాలే ప్రజలను, యువతీ యువకులను మావోయిజం వైపు నెడుతోందని పలు కమిటీలు ఇప్పటికే తేల్చాయి. ప్రధాని సహా పలువురు కేంద్ర మంత్రులు సైతం ఈ విషయాన్ని ఒప్పుకుంటున్నారు. మావోయిస్టు సమస్యకు శాంతిచర్చలే పరిష్కార మార్గమని స్వామి అగ్నివేశ్ లాంటివాళ్లు ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నారు. అయినప్పటికీ పాలకులు కన్ను తెరవకపోవడం దురదృష్టకరం. మావోయిస్టులకు ప్రజల మద్దతే లేకపోతే ఎన్ని వేల బలగాలను దించినా ఉద్యమం బలహీనపడకపోగా కొత్త ప్రాంతాలకు ఎందుకు విస్తరిస్తున్నదో పౌర సమాజం ఆలోచించాలి. అమాయక ఆదివాసీలపై బలగాల దమనకాండను ముక్తకం ఖండించాలి. బాసగూడెం లాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలి.

-డి. మార్కండేయ
dmknamaste@gmail.com

http://www.namasthetelangaana.com/Editpage/article.asp?category=1&subCategory=7&ContentId=127427


అబూజ్‌మాడ్‌లో ఏం జరుగుతోంది


పెరివూబల్ మలేరియాతో తెహెల్కా ఫొటోక్షిగాఫర్ తరుణ్ శెహ్రావత్ మరణించడంతో అబూజ్‌మాడ్ ప్రాంతం మరోసారి వార్తల్లోకెక్కింది. మహిళా జర్నలిస్టు తుషా మిట్టల్‌తో కలిసి గత ఏప్రిల్‌లో శెహ్రావత్ మాడ్ కొండల పైకి వెళ్లారు. వారం రోజుల పాటు తిరిగి అక్కడ జరుగుతున్నదేమిటో తెలుసుకుని బయటకు వచ్చారు. మాడ్ వాసుల జీవన పరిస్థితులు, మావోయిస్టుల నేతృత్వంలో ఏర్పడిన జనతన సర్కార్లు, వారికి పోలీ సు బలగాలకు మధ్య జరుగుతున్న యుద్ధం, తదితర అంశాలకు సంబంధించిన విలువైన సమాచారం మోసుకువచ్చారు. అయితే, శతాబ్దాలుగా మాడ్ గోండులను పట్టిపీడిస్తున్న మలేరియా మహమ్మారి వారిని వెన్నంటి వచ్చింది. ఇద్దరూ మంచం పట్టారు. ఆధునిక వైద్యం శెహ్రావత్‌ను కాపాడలేకపోయింది. మే 15న ఆ కెమెరా యోధుడు అంతిమశ్వాస విడిచాడు. కాగా, తుషా మిట్టల్ ఆస్పత్రి బెడ్‌పై మృత్యువుతో పోరాటం సాగిస్తున్నది. అబూజ్‌మాడ్‌లో జరుగుతున్నదేమిటో, అక్కడి ప్రజల కష్టాలేమిటో లోకానికి తెలియజెప్పిన ఈ ఇద్దరు జర్నలిస్టుల సాహసాన్ని పత్రికా ప్రపంచం కొనియాడింది. మావోయిస్టు పార్టీ సైతం వీరిని ఆదివాసుల మిత్రులుగా పేర్కొంటూ శెహ్రావత్ కుటుంబానికి సంతాపం తెలిపింది. తుషా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది.

ఒకప్పుడు దుర్భేద్యమైన, సర్వే జరగని ప్రాంతంగా వినుతికెక్కిన అబూజ్‌మాడ్‌కు ఇటీవలికాలంలో సందర్శకులు పెరిగారు. 2009 ఆగస్టు నుంచి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ఆపరేషన్ గ్రీన్‌హంట్ పేరిట వేలాది పోలీసు, పారా మిలిటరీ బలగాలను మోహరించి మావోయిస్ట్లులపై అప్రకటిత యుద్ధాన్ని ఆరంభించిన నేపథ్యంలో అందరి దృష్టి బస్తర్‌పై పడింది. మనుగడ కోసం ఒకరు, ఆధిపత్యం కోసం మరొకరన్నట్లు పరస్పరం భారీ దాడులకు పూనుకుంటుండడం, ప్రాణనష్టాలు పెరగడంతో మీడియా కూడా ఈ ప్రాంత పరిణామాలపై కేంద్రీకరించింది. మావోయిస్టు ఉద్యమ ప్రాబల్యం అధికంగా ఉన్న దంతేవాడ, బీజాపూర్, నారాయణ్‌పూర్ జిల్లాలకు జర్నలిస్టుల రాకపోకలు పెరిగా యి. ఈ సందర్భంగా మావోయిస్టులకు తిరుగులేని కోటగా, ప్రధాన స్థావరంగా ఉన్న అబూజ్‌మాడ్ సహజంగానే అందరినీ ఆకర్షించింది. గౌతం నవలఖా, రాహుల్ పండిత, సత్నామ్‌సింగ్ మొదలు తెహెల్కా బృందం వరకు ఎందరో జర్నలిస్టులు అబూజ్‌మాడ్ ను సందర్శించారు. ఎన్నో ఆసక్తికరమైన కథనాలను అందించారు.

అబూజ్‌మాడ్ చరిత్ర ఏమిటి అబూజ్‌మాడియాల జీవన విధానం ఎలా ఉంటుంది సంస్కృతీ సంప్రదాయాల మాటేమిటి మావోయిస్టులు అక్కడ పాగా ఎలా వేయగలిగారు ప్రభుత్వ బలగాలు అక్కడికి ఎందుకు చేరుకోలేకపోతున్నాయి పన్నెండేళ్ల కిందట కొత్తగా ఏర్పడిన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో బస్తర్ అతిముఖ్యమైనది. పూర్తిగా ఆదివాసులు నివసించే ప్రాంతం. అడవులు, నదులు, ఖనిజవనరులు దండిగా ఉన్న ప్రాంతం. ఒకప్పుడు ఒకే జిల్లాగా ఉన్న బస్తర్‌ను ఇప్పుడు ఏడు జిల్లాలుగా విభజించారు. ఈ ఏడు జిల్లాల్లో ఒకటైన నారాయణపూర్‌తో పాటు మహారాష్ట్రలోని గడిచిరోలి జిల్లా భామ్రాగడ్ తాలూకాలో అబూజ్‌మాడ్ కొండలు విస్తరించివున్నాయి. ఉత్తరం నుంచి దక్షిణానికి 80 కి.మీ. లు, పడమటి నుంచి తూర్పునకు 50 కి.మీ.ల మేర వ్యాపించిన మాడ్ ప్రాంతం విస్తీర్ణం 4వేల చదరపు కిలోమీటర్లు. ఇక్కడున్న చిన్నా పెద్ద పల్లెలు 237 కాగా, జనాభా సుమారు 35వేలు. ఒకే ఒక ఇల్లున్న జనావా సం కూడా ఇక్కడ గ్రామం కిందికే వస్తుంది. వంద ఇండ్లుంటే అది పెద్ద గ్రామం.

ఇక్కడ నివసించే ఆదిమ తెగ పేరు మాడియా గోండు లు. వీరి జీవన విధానం, సంస్కృతీ సంప్రదాయాలు విభిన్నమైనవి. వైవిధ్యంతో కూడుకున్నవి. ప్రకృతితో విడదీయరాని సంబంధం కలిగినట్టివి. పోడు వ్యవసాయం, జంతువుల, చేపల వేట, ఆకులు అలములు, పండ్లు ఫలాల సేకరణ వీరి ప్రధాన ఆర్థిక కార్యకలాపాలు. మొన్నమొన్నటి వరకూ వీళ్లు కేవలం ఉప్పు, బాణాలకు వాడే ఇనుపభాగాలు, పంచెల కోసం మాత్రమే గుట్టలు దిగి నారాయణపూర్ అంగడికి వెళ్లేవారు. ఇక వీరి (పోడు)వ్యవసాయం విచివూతంగా సాగుతుంది. కొండవాలు ను ఎంచుకుని అక్కడున్న చెట్లను నరికి తగులబెట్టి వానలు పడగానే కొహ్‌లా అనే ధాన్య పు గింజలను చల్లుతారు. అటుపైన ఎలాంటి మానవక్షిశమ లేకుండానే చేతికి వచ్చిన పంట ను దంచి అన్నంలా వండుకుంటారు. నాగలి దున్నడం వీరికి తెలియదు. బియ్యపన్నంతో పోల్చితే సగం కూడా పోషకవిలువలు లేని కొహ్‌లాను గట్కలా వండుకుంటారు.

కూరగా పచ్చి లేదా ఎండిన మాంసం, చేపలు, అడవిలో విస్తృతంగా దొరికే బొప్పాయి, గోంగూర, ఇతర ఆకుకూరలను ఉపయోగిస్తారు. నూనె వాడకం చాలా తక్కువ. నివాసాలు ఎత్తైన ప్రదేశంలో ఉంటాయి. ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ సమీపంలోనే అన్ని కాలాల్లో ప్రవహించే చిన్నచిన్న సెలయేళ్లు ఉంటాయి. అడవిలో దొరికే వెదురుబొంగులు,కలప, నదీతీరంలో పెరిగే ఒకరకం గడ్డితో ఇళ్లు నిర్మించుకుంటారు. ఇళ్లు సాధారణంగా చిన్నవిగా ఉండి ఒక జంట నివసించడానికి అనువుగా ఉంటాయి. పెళ్లయిన ప్రతి జంటకూ ఓ ఇంటిని నిర్మించి ఇవ్వడం అక్కడ ఆనవాయితీ.

పెళ్లికాని యువతీయువకులు నిద్రించడానికి ఉద్దేశించిన గోటుల్ ఈ తెగలోని మరో ప్రత్యేకత. ప్రతి పల్లెలోనూ గోటుల్ ఉంటుంది. పాలు మరిచిన పిల్లల నుంచి యుక్తవయస్సు అమ్మాయిలు, అబ్బాయిల వరకు గోటుల్‌లో సభ్యులుగా ఉంటారు. సీనియర్ సభ్యుడొకరు గోటుల్ పెద్దగా ఉంటూ ఇక్కడ జరిగే కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంటాడు. పగలంతా తల్లిదంవూడులతో పాటు రకరకాల పనులు చేసే పిల్లలు సాయంత్రం కాగానే గోటుల్ వద్దకు చేరతారు. ఆటపాటల్లో నిమగ్నమవుతారు. గానాబజానా, డ్యాన్సులు మొదలవుతాయి. చివరకు అలసిపోయి ఏ రాత్రికో నిద్రిస్తారు. ఈ ఆటపాటల క్రమంలో యువతీ యువకుల మధ్య ప్రేమ ఏర్పడడం, సన్నిహితం కావడం సహజంగానే జరుగుతుంది. అలా పరస్పరం ఇష్టపడినవారి మధ్య లైంగిక సంబంధాలు వీరి సమాజంలో తప్పు కాదు. ఇలాంటి జంటలు పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుని వేరు కాపురం పెడతాయి.

పెళ్లయిన మరుక్షణం వీరు గోటుల్ సభ్యత్వం కోల్పోతారు. మాడ్ గుట్టల కింద మైదాన అటవీవూపాంతాల్లో నివసించే మాడియాల్లో కూడా గోటుల్ ఆచారం ఉన్నా రాత్రిపూట ఆటపాటల తర్వాత ఎవరి ఇళ్లకు వారు వెళ్లి నిద్రించడంగా పరిణామం చెందింది. వస్త్రధారణ విషయానికి వస్తే, మావోయిస్టులు ప్రవేశించేవరకూ ఇక్కడి స్త్రీలు పంచె లాంటి వస్త్రాన్ని నడుముకు చుట్టుకునేవారు. ఛాతీపైన ఎలాంటి ఆచ్ఛాదనా ఉండేది కాదు. ప్రస్తు తం పెళ్లికాని అమ్మాయిలు బ్లౌజులు ధరిస్తున్నారు. పురుషులు బుడ్డగోచీ పెట్టుకుంటారు. వెనుకబడిన ఆర్థిక విధానం, పురాతన సంస్కృతితో పాటు కనీస సౌకర్యాలు లేని లోటు కొట్టొచ్చినట్లు కనబడుతుంది. ఆస్పవూతులు, రోడ్లు,కరెంటు,పాఠశాలలు లేవు. అన్నింటికంటే ముఖ్యంగా మార్కెట్ లేదు. దోపిడీ లేదు. ప్రపంచీకరణ వాసనలు లేవు. దోపిడీ దారులు లేరు. కారల్ మార్క్స్ చెప్పిన ఆదిమ కమ్యూనిస్టు సమాజం తరహాలో జీవించేవారు.

1947 తర్వాత అబూజ్‌మాడ్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. భారత ప్రభుత్వ ప్రతినిధులుగా అటవీ, పోలీసు సిబ్బంది ఇక్కడి పల్లెల్లోకి రావడం ప్రారంభమైంది. తుపాకులతో వచ్చి, ఆదివాసులు సేకరించుకున్న ఇప్పపువ్వు తదితర అటవీ ఉత్పత్తుల ను,కోళ్లను ఎత్తుకెళ్లడం జరిగేది. 1970లలో అబూజ్‌మాడ్ గుట్టల అంచున ఉత్తరాన దల్లీ-రాజ్హరా ప్రాంతంలో ఇనుప గనుల తవ్వకం మొదలైంది. 80లలో కుతుల్ లాంటి చోట్ల రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో ఆశ్రమపా స్థాపించారు. సోన్‌పూర్, ఛోటాఢోంగర్ వంటి పెద్దక్షిగామాలకు మట్టిరోడ్లను నిర్మించారు. ఈ క్రమంలో 1985లో మాడ్ కొండల పైకి మొదటిసారిగా మావోయిస్టులు అడుగుపెట్టారు. అప్పటినుంచి పీపుల్స్‌వార్ పేరు తో ఉన్న ఆ పార్టీ నాయకత్వంలో గడ్‌చిరోలిలోనూ,బస్తర్‌లోనూ బలమైన విప్లవోద్యమం కొనసాగుతోంది. ప్రజాసంఘాలు చురుగ్గా పనిచేస్తున్నాయి. ఈ నిర్మాణాలే గెరిల్లా దళాలుగా అభివృద్ధిచెందాయి. మనుగడ కోసం ప్రకృతితో పోరాడుతున్న అబూజ్‌మాడియాలకు అండగా నిలి చి వారిని వేధిస్తున్న అటవీ సిబ్బందిని తరిమికొట్టాయి. ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేయ డం ఎలాగో చూపాయి. కూరగాయలు పండించడం నేర్పాయి. గోటుల్ వ్యవస్థలో మహిళకు జరుగుతున్న ఆన్యాయాన్ని అర్థం చేయించాయి. బ్లౌజులు ధరించడాన్ని కేంపెయిన్‌గా కొనసాగించి మహిళల గౌరవాన్ని నిలబెట్టాయి. వారి ఆటల్లో ఆటగా, పాటల్లో పాటగా నిలు స్తూ అభిమానాన్ని చూరగొన్నాయి.

ఈ ఆత్మీయతలే ప్రాతిపదికగా ఇక్కడ మావోయిస్టులు బలపడ్డారు. దట్టమైన అడవులు, ఎత్తైన కొండలతో స్థానికుల అండ లేకుండా అపరిచితుపూవ్వరూ ప్రవేశించ వీలుగాని ఈ ప్రాంతాన్ని సైనిక శిక్షణకు, విశ్రాంతికి, బలగాల సమీకరణకు, నాయకత్వం తలదాచుకోవడానికి మావో యిస్టులు విస్తృతంగా ఉపయోగించుకున్నారు. ఈ విషయాన్ని 1995 నాటికి గాని పోలీసులు పసిగట్టలేదు. ఆ వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అబూజ్‌మాడ్‌పై దృష్టి కేంద్రీకరించాయి. అభివృద్ధి పథకాలు, వ్యవసాయ శిక్షణ పేరుతో, హోంగార్డు ఉద్యోగాల ఎరతో కొంతమంది స్థానిక యువకులను ఇన్ఫార్లర్లుగా మార్చుకోవడానికి ప్రయత్నించాయి. అప్పుడప్పుడు గుట్టల అంచుల్లో ఉన్న గ్రామాలకు పోలీసులు వెళ్లి దాడులు చేయడం, గిరిజనులను నిర్బంధించడం, దళాల గురించి తెలుసుకుని కాల్పులకు దిగడం చేశాయి.

1996లో వేయి మంది బలగాలకు నాయకత్వం వహించిన అప్పటి బస్తర్ ఎస్‌పీ 15రోజుల పాటు ఆపరేషన్ నిర్వహించి మొట్టమొదటిసారిగా మాడ్ లోతట్టుకు ప్రవేశించిన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. కాగా, శత్రు ఎత్తుగడల్లో మార్పును గమనించిన మావోయిస్టులు తర్వాతికాలంలో తమ ఎత్తుగడలనూ మార్చుకున్నారు. అప్పటిదాకా షెల్టర్ జోన్‌గా ఉన్న మాడ్‌ను సంఘటితం చేశారు. గ్రామక్షిగామాన పార్టీ, ప్రజాసంఘాల నిర్మాణంపై కేంద్రీకరించారు. రాజ్యాధికార అంగాలైన జనతన సర్కార్లను ఏర్పరచారు. స్థానిక యువతీయువకులను పెద్దయెత్తున దళాల్లో చేర్చుకున్నారు. పీఎల్‌జీఏ దళాలను ప్లాటూన్లుగా, కంపెనీలుగా ఏర్పాటు చేసి అడవిలోకి చొచ్చుకురావడానికి యత్నించిన పోలీసుబలగాలపై ఎప్పటికప్పుడు దాడులు చేస్తూ వచ్చారు. ఇలా 2008 నాటికి అబూజ్‌మాడ్‌ను శవూతువు ప్రవేశించ వీలుగాని గెరిల్లా స్థావరంగా అభివృద్ధి చేశారు.

-డి మార్కండేయ
dmknamaste@gmail.com
(అబూజ్‌మాడియాలకు ముప్పు గురువారం సంచికలో..)

http://www.namasthetelangaana.com/Editpage/article.asp?category=1&subCategory=7&ContentId=126667

బస్తర్‌లో ఏం జరుగుతోంది


“ఈ దేశంలోని మధ్యతరగతి మనసు ఎంత కరుడుగట్టినా, పసిపిల్లలు అంటే ఎక్కడో కొంచెం మానవ స్పందన మిగిలిందేమోనన్న అనుమానంతో మీడియా మావోయిస్టులు పిల్లలను అడ్డుపెట్టుకోవడం ఎంత వరకు సబబు అనే ప్రశ్నను సంధించడం మొదలుపెట్టారు.”

రెండు నెలల కిందట బస్తర్‌లో జరిగిన కలెక్టర్ అపహరణ సందర్భంలో ఆ ప్రాంతం, అక్కడి ఉద్యమాల గురించి దేశ వ్యాప్తంగా, అలాగే మీడియాలో కూడా చర్చ జరిగింది. కలెక్టర్‌ను కిడ్నాప్ చెయ్యడం ఎంతవరకు సమర్థనీయమని దేశంలోని చాలామంది మధ్యతరగతి విద్యావంతులు ప్రశ్నించారు. మీడియా, హిందూ లాంటి వార్తా పత్రికతో సహా రాజ్యం ఏ పరిస్థితుల్లో రాజీపడకూడదని ‘ఢీలా రాజ్యం’గా (Soft State) ప్రవర్తించకూడదని, ఇది ‘కఠినమైన రాజ్య’మనే సందేశం మావోయిస్టు పార్టీకి, ఇతర ప్రజలకు అర్థమయ్యేలా ప్రవర్తించాలని సలహాలు వచ్చాయి.

ఈ కిడ్నాప్ ఉదంతాన్ని మీడియా తన టీఆర్ పీ రేటింగ్‌ను పెంచుకోవడానికి కొంత రసవత్తరంగానే నడిపించింది. ఇంతకి బస్తర్‌లో పరిస్థితి కిడ్నాప్‌ల దాకా ఎందుకు వచ్చిందని కాని, అక్కడ గిరిజనుల స్థితిగతులు ఎలా ఉన్నాయని కాని, రాజ్యాంగం ఇచ్చిన ప్రత్యేక హక్కులు గిరిజనులు అనుభవిస్తున్నారా లేదా అని కాని చర్చ జరగలేదు. అంతకుమించి మన్మోహన్ (ఇప్పుడు ఆయన ఆర్థిక మంత్రిత్వశాఖను కూడా నిర్వర్తిస్తున్నారు) చిదంబరం, కపిల్‌సిబాల్ ఒక్కొక్కరు అభివృద్ధి నమూనా మహాభిమానులు. వాళ్లు చెప్పే అభివృద్ధి ఎవరి కోసం ఈ అభివృద్ధిలో బస్తర్ గిరిజనుల పాత్ర ఉందా వాళ్ల ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా అనే ప్రశ్న అడగడం మానేశారు.

రాజ్యాంగం గిరిజనులకు ఇచ్చిన హక్కులను పూర్తిగా కాలరాశారు. ఈ పరిస్థితే అందమైన, ఆహ్లాదకరమైన బస్తర్‌ను విపరీత సంక్షోభంలోకి నెట్టడంతో శాంతిని, ప్రకృతిని ప్రేమించే ఆదివాసీలు ఆయుధాలు పట్టుకోవలసి వచ్చింది. ఆయుధాలు పట్టుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది అనే ప్రశ్న అడగడానికి మీడియా సాహసించడం లేదు. ఆ ప్రశ్న అడిగితే ఏ కార్పొరేటు ప్రయోజనాల కోసం పనిచేస్తున్నా రో, ఆ కార్పొరేటు మూలాలు కదులుతాయన్నది మీడియాకు తెలుసు. అందుకే అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రశ్నలను అడగడమే కార్పొరేటు పక్షాన జవాబులు వచ్చేలా తయారు చేస్తారు. ఉదాహరణకు నాలుగు రోజుల కిందట బస్తర్‌లో జరిగిన మానవహననంలో 20మంది అమాయక గిరిజనులు హత్య గావించబడ్డారు. అందులో చిన్న పిల్లలు కూడా ఉన్నా రు. ఈ దేశంలోని మధ్యతరగతి మనసు ఎంత కరుడుగట్టినా,పసిపిల్లలు అంటే ఎక్కడో కొంచెం మానవ స్పందన మిగిలిందేమోనన్న అనుమానంతో మీడియా మావోయిస్టులు పిల్లలను అడ్డుపెట్టుకోవడం ఎంత వరకు సబబు అనే ప్రశ్నను సంధించడం మొదలుపెట్టారు. నిజానికి బస్తర్‌లోని బీజాపూర్‌లో జరిగిన హత్యాకాండలో ఇది కీలకమైన ప్రశ్నేనా మొత్తం సంఘటనలో మావోయిస్టులు అక్కడ లేరని గిరిజను లు భూమిపూజ పండుగ జరుపుకుంటున్నారని, సాయుధ బలగాలు తప్పుడు సమాచారం వలన అక్కడికి అర్ధరాత్రి చేరుకుని కాల్పులు జరిపారని హిందూ పత్రిక మూడు రోజులు వరుసగా వార్తలు రాస్తున్నా, స్వయాన కాంగ్రెస్ పార్టీ సభ్యులే నిజనిర్ధారణ కమిటీ వేసి, చిదంబరం పోలీసు చర్యలను సమర్థిస్తూ చేసిన ప్రకటనను ఖండిస్తూ ఒక ప్రకటన చేసినా, దాని మీద జరగవలసినంత చర్చ జరగడం లేదు.

ఇప్పుడు కేంద్ర గిరిజన శాఖామంత్రి కిశోర్ చంద్రదేవ్ ఇది బూటకపు ఎన్‌కౌం టర్ అని హిందూ పత్రికకు ఇచ్చిన ఒక వివరణాత్మక ఇంటర్వ్యూలో అన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా సమస్యల లోతుకు వెళ్లడానికి సిద్ధంగా లేదు, సరికదా తప్పు డు ప్రశ్నలు, సమాచారాన్ని వక్రీకరించి అందించడంవల్ల ఒక సాధారణ మధ్యతరగతి మనిషి మొత్తం మావోయిస్టు ఉద్యమం పట్ల ముఖ్యంగా గిరిజన పోరాటాల పట్ల ఒక శాస్త్రీయ, లేదా ప్రజాస్వామ్య దృక్పథాన్ని అవలంబించలేకపోతున్నాడు. ఇప్పటికైనా విద్యావంతులు మీడియాలో వచ్చిన వార్తలే కాక సరైన సమాచారం సేకరించడానికి కొంత శ్రమపడాలి. కనీసం మీడియా ఇచ్చిన సమాచారాన్ని విమర్శనాత్మకంగా చూడడం అలవాటు చేసుకోవాలి. తెలంగాణ ఉద్యమకారులకు ఇది చాలా అవసరం.

కారణం ఏదైనా ఈసారి ఛత్తీస్‌గఢ్ సంఘటన పాలకుల మధ్యే తీవ్ర విభేదాలకు దారి తీసింది. అంతకుముందు బస్తర్ గురించి మాట్లాడడానికి కూడా ఇష్టపడని లేదా భయంతో బతుకుతున్న కాంగ్రెస్ సభ్యులు నిజనిర్ధారణ కమిటీ వేసి మొత్తం ఎన్‌కౌంటర్ బూటకమని తేల్చారు. ఈ విషయం మణిశంకర్ అయ్యర్ బాహాటంగానే అంటున్నారు. ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్‌పార్టీ, ఆ పార్టీ సభ్యులు, కేంద్ర గిరిజనమంత్రి, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కేంద్ర వ్యవసాయ సహాయమంత్రి అందరూ ఇది బూటక ఎన్‌కౌంటరని అంటున్నారు. చిదంబరం మాత్రం సంఘటన జరిగిన మరుక్షణమే ఇది నిజమైన ఎన్‌కౌంటర్ అని తేల్చేశారు. కేంద్ర హోంమంవూతి గా తమ బలగాలు ఏది చేసినా సమర్థించడం ఆయన తన బాధ్యతయని అనుకోవచ్చు. కానీ వాస్తవాలకు కూడా కొంత బలముంటుంది. ఈ వాస్తవాల వల్ల అంతిమంగా సాయుధ బలగాల, హోంమంవూతితో సహా మొత్తం ప్రభుత్వ యంత్రాంగం మీదే ప్రజలు విశ్వాసం కోల్పోతే జరిగే ప్రమాదం సామ్రాజ్యవాద పెట్టుబడికి దాసోహం అంటున్న హోంమంత్రికి అర్థమైనా కావడం లేదు, లేదా స్వామి భక్తి ఒక తదాత్మన స్థితికి చేరుకొని ఆదిశంకరుడి భ్రాంతి మధ్యనైనా చిక్కు కుని ఉండాలి.

కిశోర్ చంద్రదేవ్ గిరిజన మంత్రిగా, స్వయాన గిరిజనుడు కావడం వల్ల, నక్సలైట్ ఉద్యమం ఉధృతంగా ఎగిసిపడిన ఉత్తరాంధ్రవాసిగా కొన్ని వాస్తవాలు నిర్భయంగా, నిజాయితీగా ప్రకటించాడు. అంతేకాక కొన్ని మౌలిక ప్రశ్నలు కూడా అడిగారు. సంఘటన తీవ్రవాదులకు పోలీసులకు మధ్యే జరిగి ఉంటే ఆయుధాలులేని వాళ్లు చాలామంది అక్కడ ఎందుకున్నారు నిరాయుధులైన మనుషులపైన సాయుధ బలగాలు కాల్పులు జరపకూడదన్న నియమం ఏమైంది అర్ధరాత్రి కాబట్టి ఏది అగుపించలేదు అని అంటే అర్ధరాత్రి పేరుతో విచ్ఛలవిడిగా సాయుధ బలగాలు కాల్పులు జరపవచ్చునా ఒకవేళ తీవ్రవాదులే గిరిజనులను సమీకరిస్తే గిరిజనులకు తగిన రక్షణ కల్పించలేని రాష్ట్ర ప్రభుత్వమున్నప్పుడు, వారు తమ ప్రాణాలను బలి ఇవ్వవలసిందేనా అయితే కిశోర్ చంద్రదేవ్ చాలామంది అంటున్నట్టే గిరిజనులు ఇటు సాయుధ బలగాల అటు మావోయిస్టుల మధ్య చిక్కుకుపోయారని అంటూ- తాను మొదటి నుంచి కిరాతకమైన సల్వాజుడుంకు వ్యతిరేకమన్నారు.

సల్వాజుడుంను ప్రజల మీదికి వదలడం వల్ల గిరిజనుల మధ్యే ఘర్షణ పెరిగి ఒకరికొకరు చంపుకోవడం వల్ల తీరా ప్రాణాలు కోల్పోతున్నది గిరిజనులే అని అన్నారు. ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంకా కొన్ని మౌలికమైన అంశాలపై కూడా వ్యాఖ్యానించారు. తీవ్రవాదం ఒకరకంగా శాంతి భద్రతల సమస్యే అయినా, దీని మూలాలకు వెళ్లవలసి ఉంటుంద ని, మూలాలకు వెళ్లకుండా సమస్య పరిష్కారం కాదన్నారు. దీని మూలాలు ఖనిజాలలో ఉన్నాయని, ఈ ఖనిజ సంపదను బయటికితీసే క్రమంలో గిరిజనుల జీవితాలను క్రమక్షికమంగా విధ్వంసం చేస్తున్నాయని, పరిష్కారం గిరిజనులకు అడవిపై, అక్కడి భూమిపై హక్కులను పునరుద్ధరించి, ఖనిజాలను ఇతరులకు అప్పగించే ముందు గిరిజనులకు సంపదపై ఉండే హక్కులను గుర్తించాలని, లేకపోతే వాళ్లు నిరాక్షిశయులే కాక రాజ్యపరిధి నుంచి బయటికి నెట్టివేయబడతారని అన్నారు. అంతేకాక ఒక అభివృద్ధి చెందుతున్న దేశం తమ ఖనిజ సంపదను ఇతర దేశాలకు విచ్ఛలవిడిగా అప్పగించడం వల్ల మనదేశ అవసరాలకు ఖనిజాలు ఏవీ మిగలవని, జాతీయ శ్రేయస్సు దృష్ట్యా ఆలోచించడమే కాక వేలాది సంవత్సరాలుగా అక్కడ నివసిస్తున్న గిరిజనులను కాదని మనం ఏంచేసినా అది వాళ్ల సహజ హక్కులను హరించడమవుతుందని అన్నారు.

ప్రపంచీకరణ ప్రారంభమైన తర్వాత, సామ్రాజ్యవాద నీలినీడలు ఈ దేశంలో పరుచుకుంటున్న కాలంలో బహుశా అధికారంలో ఉన్న ఏ మంత్రి కాని, రాజకీ య నాయకుడు కాని ప్రతిపక్షపార్టీ కాని, కొత్తగా ఎదిగిన మాయావతి లాంటి నాయకురాలు కాని ఇంత స్పష్టంగా మాట్లాడడం నేను చూడలేదు. నిజానికి బస్తర్‌లో మావోయిస్టు పార్టీ చేస్తున్నదల్లా అక్కడి గిరిజనుల జీవన్మరణ పోరాటానికి మద్దతునిచ్చి వాళ్ల ఆత్మవిశ్వాసాన్ని కాపాడుతున్నది. ఈ ఒక్క అంశం తప్పించి ఆ ఉద్యమం మీద అన్ని రకాల చర్చలు జరుగుతున్నాయి. అయితే దీంట్లో మావోయిస్టు పార్టీ వైఫల్యం కూడా కొంత ఉంది. ఎంతసేపు మాట్లాడినా, ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా సాయుధ పోరాటం గురించి, తమ సైన్యాన్ని గురించి మాట్లాడినంతగా తమ పార్టీకుండే మానవీయ కోణం గురించి చెప్పకపోవడం వల్ల బయట జరిగే ప్రచారానికి ఎక్కువ స్పందన వస్తున్నది.ఈ దేశసంపద ఈదేశ ప్రజలది. ఈ దేశ అట్టడుగు ప్రజలు ఈ దేశ భవిష్యత్తును నిర్ణయించి,ఒక సుందరమైన సమాజనిర్మాణం స్వప్నమని, మధ్య తరగతి అనుభవిస్తున్న సంక్షోభానికి, మానవ సంబంధాలు కూలిపోతున్న సందర్భానికి ప్రత్యామ్నాయ మానవీయ సమాజం సాధ్యమే అనే విశ్వాసం కలిగించగలగాలి. ఆ ఉద్యమం నిర్వహించవలసిన పాత్ర కూడా అదే. ఈ విషయాన్ని బస్తర్‌లో మావోయిస్టు పార్టీ నాయకులతో కూడా చెప్పడం జరిగింది. బస్తర్ ‘మారణహోమం’ ఏ కారణం వల్లో ఒక లోతైన చర్చకు దారి తీయడం ఒక ఆహ్వానించదగ్గ పరిణామం. ఇలాంటి చర్చే తెలంగాణ ఉద్యమంలో కూడా జరగాల్సిన అవసరం ఉంది.

- ప్రొఫెసర్ జి.హరగోపాల్

http://prajakala.org/mag/2012/07/bastar#more-789
సౌజన్యం
నమస్తే తెలంగాణ దిన పత్రిక
చిత్రం హిందూ దిన పత్రిక

మళ్లీ 'చింతల్నార్'

'నేను ఆ గ్రామాల ప్రజలతో, ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడాను. ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులు ఎవరూ చనిపోలేదు. మేం తొలకరిలో వ్యవసాయం మొదలు పెడుతూ పంట బాగా రావాలని భూమి పూజ చేస్తుండగా పోలీసులు వచ్చి ఎలాంటి హెచ్చరిక లేకుండా మాపై కాల్పులు జరిపారు'... జూన్ 29న ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్ గురించి 'ఫేస్‌బుక్'లో హిమాంసు కుమార్ వ్యాఖ్య అది. చింతల్నార్ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగిందనీ, 20 మంది మావోయిస్టులు మరణించారని బీజాపూర్, సుకుమా జిల్లాల పోలీసు అధికారులు ప్రకటించారు. 

ఛత్తీస్‌గఢ్ పరిణామాలు గమనిస్తున్నవారికి ఈ ఘటన గురించి వినగానే 2011 మార్చి 16న అదే ప్రాంతంలో జరిగిన ఒక ఎన్‌కౌంటర్‌లో 36 మంది మావోయిస్టులు మరణించారనే వార్త గుర్తుకు వచ్చే ఉంటుంది. నిజానికి అప్పుడు అక్కడ ఎన్‌కౌంటర్ జరగలేదని, గ్రామాలపై పారా మిలటరీ బలగాలు ఏక పక్షంగా దాడులు చేసి ఆదివాసులను హత్య చేశాయని వెలుగులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా హక్కుల సంస్థలు, అగ్నివేశ్ లాంటివారు నిజనిర్ధారణలో చింతల్నార్‌లో జరిగిన దుర్మార్గాన్ని ప్రచారం చేశారు. సరిగ్గా జూన్ 29 నాటి ఎన్‌కౌంటర్ కథనం కూడా ఇలాంటిదే. హిమాంసుకుమార్ దీన్నే ధ్రువపరుస్తున్నారు.

ఆ ప్రాంతంలో మూడు ఎన్‌కౌంటర్లు జరిగాయనే కథనాలు పత్రికల్లో వచ్చాయి. అసలు వాస్తవాలు వేరే. జూన్ 28 రాత్రి బీజాపూర్ జిల్లా బాసగూడెం దగ్గర కరకుగూడెం, కొత్తగూడెం, రాజుపెంట గ్రామాలకు చెందిన 150 మంది ప్రజలు తొలకరి మొదలైంది కాబట్టి వ్యవసాయ పనులకు ప్రారంభంగా భూమి పూజ చేసేందుకు, ఇంకా ఆ ప్రాంతంలో జరగాల్సిన భూ పంపకాల గురించి మాట్లాడుకునేందుకు సమావేశమాయ్యరు. ఇది సుకుమా జిల్లాకు 4 కి.మీ. దూరంలో ఉంటుంది. ఆ సమయంలో సీఆర్‌పీఎఫ్, బీఎస్ఎఫ్ బలగాలు వచ్చి కాల్పులు జరిపాయి. ముసలివాళ్లు, పిల్లలతో కలిపి 23 మంది చనిపోయారు. అనేక మంది గాయపడ్డారు. వీరిలో 9 మందిని హెలికాప్టర్‌లో తీసుకెళ్లారు. వారిని రాయపూర్ తీసుకెళ్లి ఉండొచ్చు.

మరోఘటన అదే ప్రాంతంలో మర్నాటి ఉదయం 5.30 గంటలకు జరిగింది. పశువులు కాస్తున్న మడకం ముత్తాలు, మడకం లచ్చాలు అనే ఇద్దరు ఆదివాసీలను చింతల్నార్ పోలీసులు అకారణంగా కాల్చి చంపారు. ఆ శవాలను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అదే ఊళ్లో 9 మంది ఆదివాసీ రైతులను చిత్రహింసలు పెట్టి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ప్రజలు ఆ ఉదయం స్టేషన్ ముందు ధర్నా చేశారు. శవాలను స్వాధీనం చేయమని డిమాండ్ చేశారు. అయితే పోలీసులు బైటికి వచ్చి ఆందోళన కారులపై లాఠీ చార్జి చేశారు

మరో ఘటన సిమేరు గ్రామంలో జరిగింది. ఇక్కడ ఆరుగురిని పట్టుకొని చిత్రహింసలు పెట్టి పట్టుకుపోయారు. ఆ పక్కనే ఉన్న సింగేరు గ్రామంలో 40 మందిని పట్టుకుపోయారు. ఈ రెండు ఊళ్లలో ఇళ్లు కూలగొట్టారు. ధాన్యాగారాలు ధ్వంసం చేశారు. ఈ రెండు ఘటనలు జరిగిన గ్రామాలు సుకుమా జిల్లా జాదుగూడ పోలీస్ స్టేషన్ పరి«ధిలోకి వస్తాయి. జొన్నగూడెం అనే గ్రామంలో గ్రామ రక్షకదళ కమాండర్‌ను పట్టుకొని హింసించి చంపేశారు. ఒక మహిళను పట్టుకెళ్లారు.

మావోయిస్టులతో, సీఆర్‌పీఎఫ్ బలగాలకు జరిగిన మూడు ఎన్‌కౌంటర్ కథనాల వెనుక ఉన్న వాస్తవాలు ఇవి. ప్రత్యక్షసాక్షులు చెప్తున్న నిజాలు ఇవి. భూమిని దున్నితే దేవుడికి కోపం వస్తుందని నమ్మే ఆదివాసులు నూతన చైతన్యంతో ఉత్పత్తిలో భాగమవుతూ ఉంటే కార్పొరేట్ శక్తులకు ఆదివాసీ ప్రాంతాల్లోని సహజ సంపదను కట్టబెట్టడానికి ప్రభుత్వం ఈ యుద్ధం చేస్తున్నది. మావోయిస్టుల నాయకత్వంలో ఆదివాసులు నాలుగైదేళ్లుగా వేల ఎకరాల నేల చదును చేసి పంటలు పండించుకుంటున్నారు. ఉత్పత్తిని, ఆ ఉత్పత్తికి కారకులైన ప్రజలను ధ్వంసం చేస్తున్న ప్రభుత్వం మరో చింతల్నార్ కథనాన్ని వినిపిస్తోంది. తరతరాల వివేకాన్ని విప్లవంలో పదునుబెట్టుకొని ఆదివాసులు నూతన వ్యవస్థను నిర్మిస్తుంటే... జ్ఞానవంతులైన బుద్ధిజీవులు కనీస వివేకంతోనైనా ఎందుకు ఆలోచించకూడదు

- పాణి

https://www.andhrajyothy.com/EditorialShow.asp?qry=2012/jul/6/edit/6edit5&more=2012/jul/6/edit/editpagemain1&date=7/6/2012