నిరాడంబరంగా అంత్యక్రియలు
https://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2010/dec/31/main/31main64&more=2010/dec/31/main/main&date=12/31/2010
హక్కుల ఉద్యమం దిక్కు కోల్పోయింది! రాజ్యం అణచివేతను ప్రశ్నించిన కంఠం.. మూగబోయింది. హక్కుల ఉద్యమానికి ఊపిరులూదిన మహా నేత.. తుదిశ్వాస విడిచాడు. నలభై ఏళ్లుగా సాగిన ఉద్యమ ప్రస్థానం ఆగిపోయింది. విరామమెరుగని ఉద్యమకారుడు.. దీర్ఘ విశ్రాంతిలోకి వెళ్లిపోయాడు. ప్రఖ్యాత పౌర హక్కుల నేత, న్యాయవాది, కేజీ కన్నబిరాన్.. అస్తమించారు. మానవ హక్కుల కోసం ఉద్విగ్నంగా పోరాడే న్యాయవాది'' అని ఆమ్నెస్టీ నుంచి ప్రశంసలు పొందిన కన్నబిరాన్ ఉద్యమ చరిత్రలో తనకంటూ విలక్షణమైన అధ్యాయాన్ని రచించుకుని.. వెళ్లిపోయారు.
హైదరాబాద్, డిసెంబర్ 30(ఆన్‌లైన్ సిటీబ్యూరో) హక్కుల ఉద్యమం ఓ యోధుడిని కోల్పోయింది. పదిహేనేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ హక్కుల ఉద్యమంలో, అనంతరం పీయూసీఎల్‌లో మమేకమైన కేజీ కన్నబిరాన్.. గురువారం సాయంత్రం సికింద్రాబాద్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. ఆయన వయసు 82 సంవత్సరాలు. ఆయనకు భార్య వసంత, కుమార్తెలు కల్పన, చిత్ర, కుమారుడు అరవింద్ ఉన్నారు. ఏడాది కాలంగా ఆయన అనారోగ్యంతో ఉన్నారు. గురువారం సాయంత్రం ఐదు గంటలకు మారేడ్‌పల్లిలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన కన్నబిరాన్..రాష్ట్రంలో పౌర హక్కుల ఉద్యమానికి ఊపిరి పోసిన తొలితరం నేత. ఆయన మరణవార్త తెలియగానే పెద్ద సంఖ్యలో హక్కుల సంఘం నేతలు, ప్రజా ప్రతినిధులు ఆయన నివాసానికి చేరుకున్నారు.
కన్నబిరాన్ భౌతిక కాయానికి నివాళులర్పించారు. కన్నబిరాన్ భౌతిక కాయాన్ని సందర్శించిన వారిలో మంత్రులు జానారెడ్డి, మాణిక్య వర ప్రసాద్, ఎంపీ మధు యాష్కీ, ప్రజా గాయకుడు గద్దర్, హక్కుల, విప్లవ సంఘాల నేతలు హరగోపాల్, వరవరరావు, లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్, పీవోడబ్ల్యూ నాయకురాలు సంధ్య, అరుణోదయ విమలక్క, ప్రెస్ అకాడెమీ మాజీ చైర్మన్ దేవులపల్లి అమర్, ఐజేయూ నేత శ్రీనివాసరెడ్డి, హెచ్ఎంటీవీ సీఈవో రామచంద్రమూర్తి, తెలంగాణ జర్నలిస్టుల ఫోరం కన్వీనర్ అల్లం నారాయణ ఉన్నారు.
అనంతరం భౌతిక కాయాన్ని అంబులెన్స్‌లో మారేడ్‌పల్లి శ్మశానవాటికకు తీసుకువెళ్లి అంత్యక్రియలు జరిపారు. కన్నబిరాన్ చితికి.. కుమారుడు అరవింద్ నిప్పటించారు. తన మృతి వార్త ప్రపంచానికి తెలియనివ్వవద్దని, తా ను జీవించి ఉన్నాననే ప్రపంచానికి తెలియాలని కన్నబిరాన్ కో రుకున్నారు. దాంతో నిరాడంబరంగా అంత్యక్రియలు జరిపారు. కన్నబిరాన్ మృతితో మారేడ్‌పల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
రాజ్యాంగం తెలియని ప్రజలకు రాజ్య హక్కుల్ని తెలిపిన మహా నాయకుడు కన్నబిరాన్ అని గద్దర్ నివాళులర్పించారు. మంత్రి జానారెడ్డి మాట్లాడుతూ కన్నబీరన్ మృతితో హక్కుల ఉద్యమంలో ఓ మహా వీరుడు ఒరిగినట్లయిందని చెప్పారు. రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడిన హక్కుల దిక్కు కణ్ణబీరన్ అని వరవరరావు జోహార్లర్పించారు.
కన్నబిరాన్ మృతికి సీపీఐ నేతలు సురవరం, నారాయణ ,ఏపీసీఎల్‌సీ నేతలు ఎస్.శేషయ్య, కె.క్రాంతి చైతన్య, సీఎల్‌పీ నేత పాలడుగు, రైతు కూలీ సంఘం నేతలు ఎస్.ఝాన్సీ, కె.కోటయ్య, చైతన్య మహిళా సంఘం నాయకులు జ్యోతి, దేవేంద్ర, పీడీఎస్‌యూ(పిడికిలి) నేతలు వెంకటేష్, వీరన్న, సామాజిక వేత్తలు ఉ.సా, కొత్తగట్టుమల్లయ్య, వెంకటనారాయణబోయ(తెలంగాణమహాసభ), పాపని నాగరాజు(టీబీఎస్‌యూ), గుండా రవి కురుమ(తెలంగాణ బీసీ మహాజన సమితి) ఏపీయూడబ్యుజే నేతలు కె. శ్రీనివాస్‌రెడ్డి, వై. నరేందర్‌రెడ్డి,, ఐజేయూ నేత కె. అమర్‌నాథ్, టీఎన్జీవో నేతలు స్వామిగౌడ్, శ్రీనివాసగౌడ్, దేవీప్రసాద్, సీపీఐ(ఎంఎల్) చండ్ర పుల్లారెడ్డి వర్గం రాష్ట్ర కమిటీ నేతలు వేర్వేరు ప్రకటకల్లో సంతాపం తెలిపారు

No comments:
Post a Comment