-జి.హరగోపాల్
https://www.andhrajyothy.com/EditorialShow.asp?qry=2010/oct/8/edit/8edit2&more=2010/oct/8/edit/editpagemain1&date=10/8/2010
బాలగోపాల్ లేకుండా ఒక సంవత్సరం గడిచింది. ఈ సంవత్సర కాలంలో చాలా సందర్భాల్లో బాలగోపాల్ లేని లోటు చాలా కొట్టవచ్చినట్టుగా కనిపించింది. ఆయన ఈ మొత్తం సంవత్సరంలో ఎన్ని పనులు చేసేవాడో, ఎన్ని రచనలు చేసేవాడో, ప్రపంచాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి ఆ క్రమంలో కొత్త ఆలోచనలను భావాలను ప్రతిపాదించే వాడో ఊహిస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఆయన ఆలోచన 57 ఏళ్ల జీవన ప్రస్థానంలో ఎన్ని మలుపులు తిరిగిందో, ఎన్ని లోతులు తరచిం దో, ఎన్ని ఎత్తులు చూసిందో గమనిస్తే మరింత ఆశ్చర్యం వేస్తుం ది.
ఇంత అరుదైన మేధస్సు గల మనిషి అణగారిన ప్రజల పట్ల నిబద్ధత గలిగుండటం వల్ల ఆయన లేని లోటును పూరించడం సమాజానికి ఒక కష్టమైన సవాలే. అన్నింటికి మించి ఒక మనిషి తాను సమాజానికి ఇచ్చే దానికంటే సమాజం నుంచి ఎక్కువ తీసుకున్నప్పుడు జీవితానికి అర్థంకాని, ప్రయోజనం కాని ఉండదని బలంగా బాలగోపాల్ విశ్వసించేవాడు. అందుకే అహోరాత్రులు విరామం లేకుండా తాను నమ్మిన పనిని తాను చేస్తూ పోయాడు.
బాలగోపాల్ లేని లోటును నేను తీవ్రంగా ఫీల్ అయిన చాలా సందర్భాలున్నాయి. మావోయిస్టు పార్టీకి, సిపిఐ(ఎంఎల్) పార్టీకి ఒరిస్సాలో చాలా విభేదాలు వచ్చాయి. దాని పర్యవసానంగా వాళ్ల ఒక ప్రధాన నాయకుడు అర్జున్‌ను కోల్పోయారు. ఆ పార్టీకి సంబంధించిన నాయకులు నన్ను ఈ ఘర్షణలో జోక్యం చేసుకోమని అడిగినప్పుడు, బాలగోపాల్ ఉంటే ఈ విషయంలో జోక్యం చేసుకోవడం ఎంతో సుళువుగా ఉండేది అనిపించింది.
దీనికి కారణం మన రాష్ట్రంలో జనశక్తి పార్టీకి అప్పటి పీపుల్స్‌వార్ పార్టీకి మధ్య తీవ్రమైన విభేదాలు వచ్చినప్పుడు ఇరువైపులా ప్రాణ నష్టం జరిగింది. ఈ ఘర్షణను ఎలాగైనా నివారించడానికి ప్రయత్నం చేయాలని పౌరహక్కుల సంఘంలో కొందరు బాధ్యులు సంఘం మీద ఒత్తిడి పెట్టారు. అప్పుడు ఇరువైపుల నాయకులతో మాట్లాడినప్పుడు బాలగోపాల్ తీసుకున్న చొరవ వల్ల ఇరువైపుల మధ్య పరస్పర అవగాహన పెరిగి రెండువైపుల నుంచి చంపుకోవడాన్ని నివారించడం లో బాలగోపాల్ చాలా కీలకమైన బాధ్యతను నిర్వహించాడు.
ఆ అనుభవం వల్లే మళ్లీ మరోసారి రెండు విప్లవ పార్టీల మధ్య వచ్చి న విభేదాలలో జోక్యం చేసుకోమని కోరినప్పుడు నేను చాలా ఒంటరిగా ఫీల్ అయ్యాను. ఆయనుంటే ఒరిస్సా వెళ్లి అక్కడ ఏం జరుగుతుందో వాస్తవాలను సేకరించి అవసరమైతే ఇద్దరినీ విమర్శించి, వాళ్ల వాళ్ల తప్పులను పరిమితులను పేర్కొని ఘర్షణ ను నివారించే ప్రయత్నం తప్పకుండా చేసేవాడు.
అలాగే కేంద్ర ప్రభుత్వ స్థాయిలో, మన రాష్ట్రంలో జరిగినట్టు గా శాంతి చర్చలు జరగాలని, ఛత్తీస్‌గఢ్‌లో ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున గిరిజనుల మీద దాడి చేసే ప్రమాదముందని దాన్ని ఎట్లయినా నివారించి ప్రాణ నష్టం జరగకుండా చూడవలసిన బాధ్యత పౌరహక్కుల, మానవహక్కుల సంఘాల మీద ఉన్నద ని గట్టిగా విశ్వసించాడు.
ఢిల్లీ స్థాయిలో ప్రజాసంఘాలు చొరవ తీసుకుని ప్రజాభిప్రాయాన్ని సమీకరించాలని నాతో అంటూ, ఈ ప్రయత్నంలో భాగం పంచుకొనడానికి నన్ను వెళ్లమని అడిగినప్పుడు, నాకు ఇతర ఇబ్బందులు పరిమితుల వల్ల వెళ్లడం సాధ్యం కాదేమోనని అన్నప్పుడు, తానే స్వయంగా వెళ్ళాడు. ఈ 'సిటిజన్స్ ఫర్ పీస్ ఇనీషియేటివ్' చురుకుగా పనిచేయాలని ఆశించాడు. ఆలస్యం చేస్తే చాలా విధ్వంసం జరుగుతుందని ఆందోళనపడ్డాడు. ఈ కమిటి రెండవసారి కలిసే వరకే బాలగోపాల్ లేకపోవడం ఢిల్లీలో చాలా మంది ఫీల్ అయ్యారు.
ఆ మాట చాలా మంది సభలో ప్రస్తావించారు కూడా! ఈ చొరవ తర్వాత కాలంలో ముందుకు సాగలేదు. బాలగోపాల్ ఉంటే అంత త్వరగా ఈ శాంతి చర్చల ప్రతిపాదన దెబ్బతినేది కాదు. అయితే ఈ ఘర్షణలో సామాన్యమైన గిరిజనుల జీవితానికి ముప్పు వాటిల్లుతోందని ఎవరు జోక్యం చేసుకున్నా ఛత్తీస్‌గఢ్ గిరిజనుల పక్షాన మాట్లాడాలని ఆయన భావించాడు.
బాలగోపాల్ ఈ సంవత్సర కాలంలో తప్పనిసరిగా చేసేపని లేదా వ్రాసే రచన కాశ్మీర్ మీద కాశ్మీర్ ప్రజల పట్ల నిబద్ధత కలిగి చేసేవాడు. ఎందుకో బాలగోపాల్‌కి కాశ్మీరు స్వయం నియంత్రాణాధికారం పట్ల ప్రత్యేక శ్రద్ధ ఉండేది. కాశ్మీర్‌కు ఎన్ని సార్లైనా వెళ్ళడానికైనా సంసిద్ధత ఉండేది. కాశ్మీర్ సమస్య మీద వందల మీటింగ్‌లలో మాట్లాడాడు.
నరేంద్రనాథ్ ఆరోగ్యం బాగాలేదని కాశ్మీర్ పర్యటనను వాయిదా వేసుకున్నాడు. ఆయన కాశ్మీర్ వెళ్ళినప్పుడు కాశ్మీర్ నుంచి పాకిస్థాన్ వైపు ప్రవహిస్తున్న నదిని చూసి ఈ నది దేశ సరిహద్దులు, మతాలతో ప్రమేయం లేకుండా ఎంతో శాంతి గా, నిష్పక్షపాతంగా ప్రవహిస్తున్నది అని వ్యాఖ్యానించాడట.
బాలగోపాల్ తెలంగాణ ఉద్యమానికి మొదటినుంచే మద్ద తు పలికాడు. పౌరహక్కుల సంఘం తెలంగాణకు మద్దతు ఇవ్వాలని అది ఒక ప్రజాస్వామ్య ఆకాంక్ష అని పౌరహక్కుల సంఘం గుర్తించడానికి ఆయన కృషి కూడా ఉంది. ఆంధ్ర ప్రాంతం పౌర హక్కుల కార్యకర్తలు ఇప్పటికీ దానికే కట్టుబడి ఉన్నారు. నేను ఈ మధ్యే కడప వేమన విశ్వవిద్యాలయంలో 'ఉన్నత విద్యలో సవాళ్ళు' అనే అంశం మీద మాట్లాడడానికి వెళ్ళాను. కడపలో కొందరు 'నేను తెలంగాణ మీద మాట్లాడితే మేం ఊరుకునేది లేదు' అని అన్నారట.
బాలగోపాల్ ఉంటే తెలంగాణకు ఎందుకు మద్దతు ఇవ్వాలో కడపలో మీటింగ్ పెట్టి మాట్లాడేవాడు, ఆ ప్రాంతంలో ప్రచారం చేసేవాడు. అలాగే కడపకు వై యస్ ఆర్ పేరు పెట్టడం సమంజసం కాదని పబ్లిక్ మీటింగ్ పెట్టడానికి ఒక సంవత్సర కాలం పట్టింది. మీటింగ్ జరిగింది, కొందరం మాట్లాడాం, కాని అక్కడ ఉన్న అందరి మనస్సులో బాలగోపాల్ ఉంటే ఇలా జిల్లాలకు వ్యక్తు ల పేర్లు పెట్టడం ఎందుకు తప్పో చారిత్రక, సాంస్కృతిక, రాజకీయ, చట్టబద్ధ కారణాలను మరింత లోతుగా పరిశీలించి, పరిశోధించి మాట్లాడేవాడు అనిపించింది.
అలాగే గత సంవత్సరంగా తెలంగాణలో ఉధృతమైన ఆత్మహత్యల గురించి విశ్లేషించేవాడు. ఆత్మహత్యల నివారణకు తన వంతు పాత్రను నిర్వహించే వాడు. నేను ఆత్మహత్యల గురించి మాట్లాడినప్పుడు లేదా వ్రాసినప్పుడు వీటిని బాలగోపాల్ ఏ కోణం నుంచి చూసేవాడు ఎలాంటి కార్యకారణ సంబంధాల ను చూపేవాడో అని చాలాసార్లు అనిపించింది. నిజానికి ఆయన లేని ఈ ఒక్క సంవత్సరం రాష్ట్రంలో రాజకీయాలు చాలా మలుపులు తిరిగాయి. రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత, రాజకీయాలు అనూహ్యమైన తీరులో మారాయి. ఆయన చనిపోయినప్పుడు అందరమూ కొన్ని జాగ్రత్తలు తీసుకునే మాట్లాడాం.
ఆ విష యం మానవహక్కుల వేదిక దశాబ్ది సభలో ప్రస్తావిస్తూ, ఎందుకు తెలుగు సమాజం ఇలా భయపడుతున్నది అనే ప్రశ్న అడుగుతూ మన సమాజంలో భయం, అవకాశవాదం రాజ్యమేలుతున్నాయని, ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదమని హెచ్చరించాడు. వైయస్ఆర్ మరణం తర్వాత రాజకీయపార్టీల సంస్కృతి లో వచ్చిన అవకాశవాదాన్ని ప్రజాస్వామ్య వాతావరణంలో వచ్చిన భయానక ధోరణుల నుంచి సమాజాన్ని కాపాడాలని మాట్లాడేవాడు, వ్రాసేవాడు.
వీటన్నిటికిమించి ఆయన తన నోట్స్‌లో సోషలిజాన్ని గురిం చి సోషలిస్టు మౌలికసూత్రాల గురించి మరోసారి పునాదులలోకి వెళ్ళి పరిశీలించడం ప్రారంభించాడు. బహుశా ఆయన మార్క్సి జం మీద సైద్ధాంతికంగా, ఆచరణాత్మకంగా కొన్ని కొత్త ప్రతిపాదనలు చేసేవాడు. నేను ఒక సందర్భంలో విప్లవోద్యమాలకు, మార్క్సిస్టు ప్రాపంచిక దృక్పథానికి ప్రత్యామ్నాయాలు ఏమిటి అని అడిగితే నాకు తెలియదు అని చాలా క్లుప్తంగా జవాబిచ్చా డు. ఈ జవాబులో ఒక నిజాయితీ ఉంది.
ప్రత్యామ్నాయమేమి టి అనే ఒక అన్వేషణ ఆయనలో ఉంది. సమకాలీన అన్ని ఉద్యమాల పట్లా (మావోయిస్టు ఉద్యమంతో సహా) ఆయనకు గౌరవ భావన ఉండేది. అప్పుడప్పుడు వాళ్ళు చేసే చర్యలు మరింత ఆలోచించి, జాగ్రత్తగా, ప్రాణనష్టం లేకుండా చేస్తే బావుండేది అనేవాడు. ఈ గౌరవ భావన వలన మార్క్సిస్టు సిద్ధాంతాన్ని, ఆచరణను మరింత సుసంపన్నం చేయడానికి ఆయన విశ్లేషణ, సూత్రీకరణ, చారిత్రక పరిశీలన, మానవ ప్రవృత్తి పట్ల ఆయన అవగాహన చాలవరకు దోహదపడేవి అని నేను అనుకుంటున్నాను.
పి.ఎస్ ఎస్ఆర్ శంకరన్ గారు కూడా ఇక లేరు. మన సమా జం మరో మహోన్నత వ్యక్తిని కోల్పోవడం చరిత్ర విషాదం.
-జి.హరగోపాల్
(నేడు బాలగోపాల్ ప్రథమ వర్ధంతి)

No comments:
Post a Comment